The Circle of Bonding - 3

  • 3.3k
  • 1.4k

**బ్లెస్స్ మీ**హోటల్ రెస్టారెంట్‌లో అంజు తినకుండా వెళ్ళిపోతుండటం చూసి రుద్ర ఆమె చేతిని గమనించాడు. అక్కడ చిన్న గాయం నుండి రక్తం కారుతుండటం చూసి అతని మనసులో ఏదో తెలియని ఒక వింత బాధ కలిగింది. వెంటనే ఆమె చేయి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. "ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? ఆకలిని అస్సలు దాచుకోకూడదు. నీకు ఇబ్బంది లేదంటే.. నేను తినిపించనా? నేను ఇలాంటి విషయాల్లో పెద్దగా ఫీల్ అవ్వను" అంటూ కొంచెం సంకోచిస్తూనే ముద్ద కలిపి ఆమె నోటి దగ్గరకు తీసుకెళ్లాడు. అంజు షాక్‌లో అతని వైపు చూస్తూ, కళ్లలో నీళ్లు తిరుగుతుండగా ఆ ముద్దను తిని, "చాలా బాగుంది.. వంట చాలా బాగుంది" అని ముద్గల్ మింగుతూ అంది. ఆమె కళ్లలో ఒక వింతైన వెలుగు కనిపించింది. రుద్ర ఆమె వైపు చూస్తూ నవ్వి, "సరే వెళ్దామా? అన్నట్టు.. నీ పేరు చెప్పలేదు?" అని అడిగాడు. అప్పుడు ఆమె చిన్నగా