ఆదిత్య ఫ్రెష్ గా స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటికి రాగానే అక్షయ బెడ్ మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది . అతను స్నానానికి వెళ్లే ముందు వరకు బాగానే ఉంది .అతను స్నానం చేసి బయటకి రాగానే తన మొహం ఎందుకో వాడిపోయినట్టు కనిపించింది. అతను స్నానానికి వెళ్లి వచ్చిన ఈ కాస్త సమయంలో ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు.వాళ్ల అమ్మ ఎలాగో ఈరోజు బయటికి వెళ్ళాలి అని ముందుగానే చెప్పడంతో పొద్దున్నే లేచి రెడీ అయింది అక్షయ. ఆదిత్య కూడా స్నానం చేసి వచ్చాడు .ముందుగానే సిద్ధం చేసుకున్న బట్టలు తీసుకుని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్ వేసుకొని మెల్లగా వెళ్లి తన పక్కన కూర్చుని తన భుజం చుట్టూ చేతులు వేసి " ఏం జరిగింది బంగారం అలా ఉన్నావు ? ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా