యూ ఆర్ మై డెస్టినీ - 5

(67)
  • 2.8k
  • 1.4k

ప్రియా ఫ్రెష్ గా స్నానం చేసి బయటికి రాగా వాళ్ళ అమ్మ సునంద ఎదురుగా నవ్వుతూ కనిపించింది ఆవిడ చేతిలో సాంబ్రాణి ధూపం పట్టుకొని ఉంది .ఆవిడని చూస్తూ నవ్వుతూ" మామ్ ఈరోజు నువ్వు వచ్చావ్ ఏంటి నానమ్మ  ఎక్కడ,  రోజు తానే కదా నా తలకి సాంబ్రాణి ధూపం వేయడానికి వస్తుంది " అని అడిగింది."  మీ నానమ్మ,.. వాళ్ళ కూతురు వస్తుందన్న ఆనందంలో కింద సర్వెంట్స్ కి ఆర్డర్స్ ఇస్తూ ఉంది , అది ఎలా చేయాలి ఇది అలా చేయాలి అంటూ , సో ఆవిడ పని ఈరోజు నాకు  అప్పగించింది"  అని నవ్వుతూ చెప్పింది సునంద. " సరే మమ్మీ త్వరగా కానివ్వవా? నా కృష్ణయ్య నాకోసం వెయిట్ చేస్తున్నాడు " అని అంటూ బెడ్ మీద పడుకొని తల కిందకి వేలాడేసింది.సునంద వచ్చి తన కూతురి జుట్టుకి దూపం వేస్తూ ఉంది."అమ్ము.."  అని సునంద  పిలుస్తుంటే