సన్నివేశం 31 కొనసాగింపు“పెద్దయ్యాక తెలుస్తుందిలే రా... ఇలాంటి పనులు చేయడం ఎంత కష్టమో!”రుద్ర నవ్వుతూ సాక్షాత్ వైపు చూశాడు.ఆ చిన్నారి మాత్రం అప్పటికే మళ్లీ నిద్రలోకి జారిపోయాడు.---సన్నివేశం 32లొకేషన్: బట్టల షాప్ — వెయిటింగ్ ఏరియాసమయం: సాయంత్రం 6:00ఉదయం నుంచి షాపులో తిరుగుతూనే ఉన్న రుద్రకు చివరికి కాసేపు ప్రశాంతంగా కూర్చునే అవకాశం దొరికింది.ఒక బెంచ్ మీద కూర్చుని ఫోన్‌లో ఏదో చదువుకుంటున్నాడు. పక్కనే సాక్షాత్ తన చిన్న ప్రపంచంలో తానే ఆడుకుంటున్నాడు.సమయం మాత్రం ఆగలేదు.గడియారం ముల్లు నెమ్మదిగా సాయంత్రం ఆరు దాటింది.అప్పుడే దూరం నుంచి అంజు, పార్వతి కనిపించారు.వాళ్లిద్దరి చేతుల్లో నాలుగు బ్యాగులు మాత్రమే ఉన్నాయి.రుద్ర ఫోన్ నుంచి తలెత్తి గడియారం వైపు చూశాడు.మళ్లీ వాళ్ల చేతుల్లోని బ్యాగుల వైపు చూశాడు.అతని కళ్లలో నమ్మశక్యం కాని భావం.“ఒసేయ్!”అని లేచి నిలబడ్డాడు.“కేవలం ఈ నాలుగు బ్యాగుల కోసమా... నాలుగు జతల బట్టల కోసమా ఉదయం నుంచి ఇప్పటిదాకా నా ప్రాణాలు తీశారు?