సాక్షి సాక్షాత్తుఅధ్యాయం — ఉదయం ఎదురైన గతంరాత్రంతా రుద్ర అంజును బుజ్జగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.ఒక్కసారి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు.మరోసారి ఆమెను నవ్వించడానికి ప్రయత్నించాడు.“అంజూ... ముందు నేను చెప్పేది విను.”అని ఎన్నిసార్లు చెప్పినా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు.ముఖం తిప్పుకుని పడుకుంది.ఆమె కోపం వెనుక ఉన్న భయాన్ని రుద్రకు అర్థమవుతోంది.కానీ ఇప్పుడే నిజం చెప్పే సమయం కాదని అతని మనసు చెబుతోంది.చివరికి చేసేది లేక అతను కూడా మరోవైపు తిరిగి పడుకున్నాడు.రాత్రి ఎప్పుడు గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు.ఉదయం ఐదు గంటలు.గడియారం మోగకముందే రుద్ర కళ్ళు తెరిచాడు.ఆయన నిద్ర నుంచి లేచిన తీరు చూస్తే, ఈ రోజు తన జీవితంలో ఏదో ముఖ్యమైన రోజు అనిపిస్తోంది.నెమ్మదిగా లేచి స్నానం చేశాడు.తెల్లటి చొక్కా.నల్లటి ప్యాంట్.చేతికి వాచ్.పర్ఫ్యూమ్.అద్దంలో తనను తాను ఒకసారి చూసుకున్నాడు.రుద్ర ఎప్పటిలాగే ఆకర్షణీయంగానే ఉన్నాడు.కానీ ఈరోజు అతని ముఖంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం అంజుకు మాత్రం నచ్చలేదు.అతను బయటికి వెళ్లడానికి తలుపు వైపు