ప్రియా ప్రేమ్ వైపు చూసి ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా" పొద్దునుంచి ఏమైనా తిన్నావా నువ్వు?" అని అడుగుతుంది.ప్రేమ్ ప్రియా వైపే చూసి కళ్ళు ఎగరేస్తూ " ఏంటి బంగారం మన ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందో లేదో అప్పుడే నా గురించి కేర్ తీసుకోవడం మొదలు పెట్టావా గుడ్ గుడ్ ఐ లవ్ ఇట్" అని అంటాడు." నోరు మూసుకొని నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. పొద్దున్నే వచ్చారు కదా అత్తయ్య వాళ్ళ టిఫిన్ చేశారా లేదా" అని అడుగుతుంది." నోరు మూసుకుంటే సమాధానం ఎలా చెప్పను బంగారం" అని అంటాడు నవ్వుతూ ప్రేమ్.ప్రియా అసహనంగా " ప్రేమ్..." అని కొంచెం గట్టిగా అంటుంది." సరే సరే కోప్పడకు .లేదు ఏమి తినలేదు పొద్దున్నే అమ్మ ఇక్కడికి హడావిడిగా రావాలి అనడంతో ఆ హడావిడిలో టిఫిన్ చేయలేదు. వదిన మాత్రం పాలు తాగింది అండ్ ఇక్కడికి వచ్చిన