రఘువరన్ శరీరం ఒక్కసారిగా వణికింది.తన గదిలో నేలపై నిలబడేందుకు ప్రయత్నించిన అతని చేతులు కుర్చీ అంచును పట్టుకున్నాయి.కానీ శరీరం మాట వినలేదు.కళ్ల ముందు చీకటి కమ్ముకుంది.తల ఒక్కసారిగా భారంగా మారింది.తర్వాత—ధమ్!రఘువరన్ నేలపై పడిపోయాడు.అతని శ్వాస నెమ్మదించింది.గది మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది.అయితే...అదే క్షణంలో...ఎక్కడో చాలా దూరంలో ఉన్న ఒక పాత ల్యాబ్‌లో, ఎన్నో సంవత్సరాలుగా వెలగని ఒక నల్లటి స్క్రీన్‌పై చిన్న తెల్లటి బిందువు వెలిగింది.ఒక సెకను...రెండు సెకన్లు...ఆ బిందువు నెమ్మదిగా విస్తరించింది.తర్వాత స్క్రీన్ మొత్తం ఒక్కసారిగా వెలిగిపోయింది.ఎరుపు, తెలుపు, నీలం రంగుల సిగ్నల్స్ వరుసగా స్క్రీన్ మీద పరుగులు తీశాయి.SIGNAL DETECTEDNEURAL FREQUENCY MATCHEDUNKNOWN USER DETECTEDకొన్ని క్షణాల తర్వాత...స్క్రీన్ మధ్యలో ఒక భారీ మెదడు చిహ్నం ప్రత్యక్షమైంది.దాని చుట్టూ ఉన్న డిజిటల్ వలయం వేగంగా తిరగడం మొదలుపెట్టింది.అప్పుడు...SUPER BRAIN ACTIVATEDఅనే పదాలు మెరిపించాయి.ల్యాబ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా కదలకుండా నిలబడిపోయారు.ముసలివాళ్లు...యువ శాస్త్రవేత్తలు...కొంతమంది చిన్న వయసు పరిశోధకులు...అందరి కళ్లూ స్క్రీన్‌పైనే.అయితే