శైలు, గీతిక ఇంటికి వచ్చి వెళ్ళగా గీతిక ప్లానింగ్ రెడీ చేసుకుని ఆఫీసులో డెమో ఇవ్వడానికి రెడీగా ఉండగా ఒక ఆరడుగుల వ్యక్తి సూట్ బూటు వేసి చక్కటి శారీరక దారుధ్యం, ఓ మోస్తారు అందం కలిగిన వ్యక్తి గంభీరంగా డెమో రూమ్ వైపుకు వెళుతుండగా ఇతనే బహుశా మన సార్ అయి ఉంటారు అనుకుంది గీతిక. గీతిక పక్కన కూర్చున్న లవ్లీ, మాలతి,ఇంకా ఇద్దరు అబ్బాయిలు కూడా తమ తమ ప్లానింగ్ పేపర్స్ ని తీసుకుని వచ్చి ఆ రూమ్ లో కూర్చున్నారు. గీతిక ఏదో మరచి వచ్చానని లాప్టాప్ తో తీసుకొని బయటికి వెళుతూ ఉండగా బయటనుంచి మరో వ్యక్తి లోపలికి అడుగు పెడుతుంటే అతనికి డాష్ కొట్టే స్థితి నుండి జస్ట్ తప్పించుకుని గీతిక పక్కకు జరగడంతో ఆమె చేతిలోని పెన్ కింద పడింది. తను వంగి తీసుకొని అటు చూస్తుంటే అతను ఆమె వైపు తిరిగి కళ్ళు అర్పకుండా