రామాపురంలోపెద్దాయన ఏదో ముఖ్యమైన పని ఉందని టౌన్ కి వెళ్లడంతో ఆరోజు లీవ్ పెట్టమని చెప్పిన ప్రభ ఎంతసేపైనా రాలేదు. ఎందుకు లీవ్ పెట్టమన్నాడో అర్థం కాలేదు అనుకుంటూ ఎలాగూ లీవ్ పెట్టాను కాబట్టి ఇల్లంతా సర్దుదామని చెప్పేసి లోపల రూములన్నీ సర్ది హాలు శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసి సింపుల్ డ్రెస్ వేసుకొని బయటికి వస్తూ ఉండగా ఏదో కారు వచ్చిన శబ్దం కావడంతో పతంగి వెళ్లి వచ్చిన వారిని లోపలికి తీసుకొచ్చాడు.వచ్చిన వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి 'అరణ్య 'అంటూ లోపలికి వెళ్ళగా తను కిచెన్ లో ఉండడం చూసి "అరణ్య కొంచెం స్ట్రాంగ్ గా నీ చేతులతో కాఫీ చెయమ్మ" అని పతంగి చెప్పడంతో ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాలేదు అరణ్యకి."అన్నయ్య ఇదేంటి కొత్తగా అడుగుతున్నావు ఉన్నది మనిద్దరమే కదా నాలుగు గ్లాసులు కాఫీ ఎందుకు ?" అన్నది అరణ్య ప్రశ్న.'అరణ్య, కాఫీ తీసుకుని ఒక్కసారి హాల్