శ్రీహరి మరణంతో చాలా కృంగిపోయాడు భుజంగం. అసలేం జరిగింది. వాడక్కడ మరణించడం ఏంటి. పెద్దవాడు చూస్తే బతికి ఉన్నా వంశాన్ని ఇచ్చే స్థితిలో లేడు .ఆశలన్నీ చిన్నవాడి పై ఉంటే వాడేమో ఆశ నిరాశని చేసి వెళ్లిపోయాడు. వాడి చావుకి కారకులు ఎవరైనా సరే సహించేది లేదు.నా మనషులతో నిఘా పెట్టించి వాళ్ళని చంపి పాతేస్తాను. అనుకొని తన మనుషులతో అలర్ట్ గా ఉండమని చెప్పి పంపించాడు. కృష్ణ మురళి తనకు అనుమానం వచ్చిన అమ్మాయిని అనుసరిస్తూ వెళ్ళగా హోటల్ ముందు కూర్చుని ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టుంది. తన ఫోన్ తీసి ఏదో నెంబర్ నొక్కి ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో విసుగుతో టేబుల్ మీద ఉంచి అటు ఇటు చూడ సాగింది.అంతలో కృష్ణకు గీతిక ఫోన్ చేయడంతో అఫీషియల్ గా ఉపయోగించే ఫోన్ కాకుండా తన సీక్రెట్ ఫోన్ ను ప్యాంటు జేబులో నుండి తీసి లిఫ్ట్ చేసాడు. హలో !గీతిక అంటూ