ప్రేమ్ మాత్రం ప్రియా వైపు నవ్వుతూ చూస్తూ " ఆ ఉంగరం తీయాల్సిన అవసరం లేదు అమ్మమ్మ" అని అంటాడు." అదేంటి రా ఆ రింగ్ తీయకపోతే నువ్వు దానికి ఉంగరం ఎలా తొడుకుతావు?" అని అడుగుతుంది ఊర్మిళాదేవి. ఊర్మిళ దేవి గారు ప్రియా వైప చూసి " ప్రియా చుట్టూ అందరూ ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మీ నాన్నగారికి మన ఇంటికి ఉన్న పరువు తీయకు వెంటనే ఆ రింగ్ తీసి నాకు ఇవ్వు తర్వాత పెట్టుకుందువు గాని " అని ప్రియా కి వినిపించేలాగా చిన్నగా చెప్తుంది.ప్రియా ఆ రింగ్ ఉన్న చేతిని తన గుండెకి అదుముకుంటూ " లేదు నానమ్మ నేను తీయలేను , నావల్ల కాదు , ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు " అని కంట్లో నీరుతో చెప్తుంది.ఊర్మిళాదేవి గారు ఎలాగైనా ఆ రింగ్ ప్రియా చేతి వేళ్ళ నుంచి తీయాలి అని