యూ ఆర్ మై డెస్టినీ - 24

  • 240
  • 90

ప్రియా అలా ప్రేమ్ కి ఐ లవ్ యు చెప్తుంది అని ఎవరు ఊహించలేదు . ఇన్ఫాక్ట్ ప్రియా కూడా అలా చెప్తానని తను ఎప్పుడు అనుకోలేదు కూడా.వాళ్ళిద్దరిని అలా చూసినా నితిన్ తట్టుకోలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బాధ ఇంకా కోపంగా,  అరుణ్ కూడా నితిన్ ఏం చేస్తాడో అనే భయంతో నితిన్ వెనకాలే వెళ్తాడు.ప్రియా అలా చెప్పగానే హ్యాపీనేస్ తట్టుకోలేని అక్షయ అక్కడ గట్టిగా విజిల్ వేస్తుంది,  ఆది చూసి ఆదిత్య షాక్ అవుతాడు '  ఏంటిది మొగరాయుడు లాగా ఇలా విజిల్ వేస్తుంది. అయినా దీనికి విజిల్ వేయడం కూడా వచ్చా' అని తన మనసులో అనుకొని చుట్టూ చూస్తూ ఉంటాడు. చుట్టూ అన్న వాళ్ళు అక్షయ వైపు చూడడంతో  'చుట్టూ ఎవరున్నారు , అసలు ఎక్కడున్నాము అని కూడా మర్చిపోయి ఇది, అసలే నాకంటూ బిజినెస్ లో ఒక పేరు ఉంది ఇప్పుడు దీనివల్ల మొత్తం పోయేలాగుంది'