" వాట్ ? నువ్వు ప్రియా ని ప్రేమిస్తున్నావా? " అని వినిపించిన మాటలకి అటువైపు చూస్తారు అరుణ్ ఇంకా నితిన్. అక్కడ శైలు నీ చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. " ఇది ఎప్పుడు వచ్చింది ఇక్కడికి ? మన మాటలను అని వినేసి ఉంటుంది అంటావా? " అని అడుగుతాడు అరుణ్ , నితిన్ వైపు చూస్తూ." ఒరేయ్ దీని నోట్లో ఏది ఆగదు ఇప్పుడు గాని ఇది వెళ్లి ప్రియా కి చెప్తే మొత్తం పెంట పెంట అవుతుంది, ఏదో ఒకటి చేయరా " అని టెన్షన్ పడతాడు నితిన్. " చెప్పనివ్వరా ఈ రకంగా అయినా ప్రియా కి నీ ప్రేమ విషయం తెలుస్తుంది" అని అంటాడు అరుణ్ చిన్నగా." ఒరేయ్ ఎవడి ప్రేమ వాడు చెప్పుకోవాలి ఇలా పక్కన వాడితో రాయబారం పంపకూడదు, ఇదంతా కాదు ముందు ఏం చేయాలో అది చెప్పు " అని అంటాడు నితిన్ కోపంగా."