అయాన్ అలా తన వైపే తదేకంగా చూస్తుండిపోయేసరికి నీల గుండె వేగం మరింత ఎక్కువైంది. ఒక యంత్రానికి మానవ భావోద్వేగాలు తెలియవని ఆమెకు తెలుసు, కానీ అతని కళ్లలో కనిపిస్తున్న ఆ నిశ్శబ్దం, ఆ కొత్త చూపు ఆమెకు ఏదో తెలియని సిగ్గును, హాయిని ఇస్తున్నాయి.అదే సమయంలో, అక్కడే భోజనం తింటున్న ఒక వృద్ధ తాత నీల దగ్గరకు వచ్చి, కళ్లల్లో నీళ్ల, ఈ రోజు నీ పేరు చెప్పుకుని మేము కడుపునిండా తింటున్నవమ్మ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని చాలా చల్లగా చూడాలి తల్లి! తల్లి ఇలా అంటున్నాను అని అనుకోపోతే మా మీద దయ ఉంచి ఇలాగే మీ ఇంట్లో ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా, అన్నం మిగిలిపోతే మమ్మల్ని గుర్తుతెచ్చుకోండమ్మ" అంటూ ఏడవడం మొదలుపెట్టాడు.ఆ తాత ఆకలి గోడును, కన్నీళ్లను చూడగానే నీల మనసు ద్రవించిపోయింది. ఆమె వెంటనే ఆ వృద్ధుడి చేతులు పట్టుకుని, "తాతా, నువ్వు