3‘అందమైన జీవితం…అందుకుంటే ఓ వరం…లోకం అంతా ఆనందాలు నిండేలాగా నే చేస్తాను…’పొద్దున్నే టిఫిన్ తింటూ పిల్లలతో కలిసి డోరేమాన్ చూస్తుంది శృతి…“అక్క… ఇంకో దోస కావాలి…” టీవీ చూస్తూ వంటింట్లో ఉన్న సంజనని అడిగింది…“శృతి…” పక్కన కూర్చుని పిలిచారునాన్న…“ఈ అబ్బాయి బెంగళూరులోనే జాబ్ చేస్తున్నాడు అంట…”“చాలా…”“మంచి కుటుంబం… ఒకసారి మాట్లాడి చూద్దామా?” భయం భయంగా అడుగుతున్నారు నాన్న…‘వినిపించనట్టు టీవీ చూస్తూ ఉండిపోయింది’“రమ్మనండి మావయ్య… ఒకసారి చూసిమాట్లాడితే అప్పుడు ఆలోచిద్దాం…” అన్నాడు కన్విన్సింగ్‌గా…“బావ…” పళ్ళు బిగిస్తూ అంది కోపంగా చూస్తూ…“పెళ్లి చేసుకోవడానికి కాదు లే… ఏదో వాళ్ల తృప్తి కోసం ఒకసారి మాట్లాడి చూడు… నచ్చకపోతే నచ్చలేదు అని చెప్దాం… మనకి అలవాటేగా...” వెటకారంగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు…“హా అంతే నాన్న… మీరు పిలవండి తర్వాత చూద్దాం…” ఏం ఉంది లే అన్నట్టు ఒక చిలిపి సైగ చేసి ప్లేట్‌లో దోస వేసి వెళ్లిపోయింది సంజన…‘వీళ్ళు ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు’