" అమ్మమ్మ చిన్నప్పటి నుంచి నీ చేతి గోరుముద్దలు అది ఎన్నో తిని ఉంటుంది , ఇకపై ఇది నా టర్న్ , నాకు పెట్టు " అని అడుగుతాడు ప్రేమ్." కావాలంటే నీకు విడిగా గోరుముద్దలు పెడుతుందిలే ఈ రోటి పచ్చడి ముద్ద నాకే కావాలి, నానమ్మ నాకు పెట్టు" అని అంటుంది ప్రియ." నో , విడిగా తినే దానికన్నా ఈ రోటిలో కలిపిన ముద్ద తింటుంటే చాలా రుచిగా ఉంది, నాకు ఇదే కావాలి " అని అంటాడు ప్రేమ్.ప్రియా ఏడుపు మొహం పెట్టుకొని " నో నాకు ఇలా తింటేనే చాలా ఇష్టం" అని అని ఊర్మిళాదేవి గారి వైపు చూసి " నానమ్మ నువ్వే చెప్పు, నువ్వు ఎప్పుడు చివరి ముద్ద ఇంట్లో చిన్న వాళ్లకే కదా పెడతావు ,సో ఇంట్లో అందరికన్నా చిన్నదాని నేనే కదా సో ఈ ముద్ద నాకే పెట్టు"