రుద్ర తన హుడ్డి హాండ్స్ పైకి లేపి , తన కృత్రిమ చెయ్యి వైపు చూపించి " ఇప్పుడు చెప్పగలవా తనని పెళ్లి చేసుకోమని" అని అంటాడు.రుద్రా కృత్రిమ చేయి చూసి అందరూ షాక్ అవుతారు.అతను ఫుల్ హాండ్స్ హుడ్డి వేసుకోవడంతో అంతగా గమనించలేదు అందరూ , అందులోనూ అతని కృత్రిమ చెయ్యి రియల్ హ్యాండ్ లాగా ఉంది. రుద్ర క్లియర్ గా చూపించే వరకు అది కృత్రిమ చెయ్యి అని ఎవరో తెలుసుకోలేకపోయారు" అన్నయ్య నీ చెయ్యి ఏమైంది" ప్రియా కంగారుగా అడుగుతుంది. తన కళ్ళల్లో నుంచి కన్నీరు.రుద్ర ప్రియా కన్నీరు తుడుస్తూ " ఒక ఆక్సిడెంట్ లో నా చెయ్యి కోల్పోయాను" అని చెప్పి అరుణ్ వైపు తిరిగి "ఇప్పుడు చెప్పగలవారా అంజలి ని పెళ్లి చేసుకోమని" అని అంటాడు.అరుణ్ కి ఏమి మాట్లాడాలో అర్థం కాదు, అంజలి ఇంకా అరుణ్ ట్విన్స్ , అంజలి అంటే అరుణ్