ప్రియా కి చిరాకు వచ్చి " అసలు నేనేం చేశానో నాకు కొంచెం చెప్తారా" అని అడుగుతుంది ." ఇలా నా తమ్ముడి నీ అమాయకుడిని చేసి వాడి శీలం దోచుకోవడం తప్పుకథ, ఏ ఆడవాళ్లదే శీలం మగవాడిది కాదా" అని అడుగుతాడు.ఆ మాటకి ప్రియా కి ఫీజులు ఎగిరిపోతాయి, ఉన్న కాస్త నిద్ర మత్తు కూడా వదిలిపోతుంది." వాట్?"ప్రియా ,ప్రేమ్, అక్షయ ముగ్గురు ఒకేసారి అరుస్తారు" నేను దేని గురించి మాట్లాడుతున్నాను, వీడు దేని గురించి చెప్తున్నాడు. " అని అనుకోని ఏదో అర్థం అయ్యి " ఏంటి నా మాటలు ఈ రకంగా కన్వే అయినాయా వీడికి ." అని మనసులో అనుకొని వెంటనే ప్రియా వైపు చూస్తాడు. ఎస్ ఎక్స్పెక్టెడ్ ప్రియా ప్రేమ్ వైపు కోపంగా చూస్తుంది.’ ఓరి దేవుడోయ్ ఇప్పుడు నేనేం చేయాలి నా బంగారం చేతిలో ఇప్పుడు నేను చచ్చాను, దీనికి కోపం వస్తే