ప్రణయ గీతిక - 39

  • 1.9k
  • 711

గత జ్ఞాపకాలు గీతిక మనసును కలచివేస్తున్నాయి. తనను ‘అనాథ’ అని అవమానించిన మాటలు, కోపంతో నాన్న తనకు దూరమైన క్షణాలు ఒక్కొక్కటిగా కళ్లముందు కదలాడాయి. ఆ బాధను భరించలేక, జీవితంపై ఆశ కోల్పోయి రోడ్డుపైకి పరుగెత్తింది. అంబులెన్స్‌ వేగంగా వస్తూ ఉండడంతో అటువైపు కదిలిన ఆమెను గౌరీ సకాలంలో కాపాడి గార్డెన్ హౌస్‌కు తీసుకొచ్చింది.“గీతికా! ఏడవకు తల్లీ. కష్టాలు శాశ్వతం కాదు. చీకటి ఎంత గాఢంగా ఉన్నా, ఏదో ఒక మూల వెలుగు కనిపించకమానదు. మనసుకు ధైర్యం చెప్పుకుని, జీవితాన్ని కొత్త ఆశలతో ఆహ్వానించాలి. ధైర్యమే దేవుడని నమ్ము. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.” అంటూ గౌరీ ఆప్యాయంగా ధైర్యం చెప్పి ఇంటికి వెళతానని బయటికి అడుగుపెడుతుంది..కానీ గీతిక మనసులోని బాధ అంత త్వరగా కరగలేదు. ‘నేను నిజంగానే ఒంటరినేనా? నాకంటూ ఎవరూ లేరా?’ అన్న ఆలోచనలు ఆమె గుండెను మౌనంగా తొలిచేస్తున్నాయి., గీతిక గదిలో కాళ్లు ముడుచుకుని కూర్చుని వెక్కివెక్కి