ప్రణయ గీతిక - 40

(66)
  • 1.7k
  • 606

గార్డెన్ హౌస్‌లో ఇక ఉండకూడదని గీతిక నిర్ణయించుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి తన వస్తువులను సర్దుకుని, ఒకసారి గార్డెన్ హౌస్ వైపు చూసి  వస్తున్న  కంటతడిని కటిన హృదయంతో ఆరనిస్తూ  ఎన్నో ఆలోచనలతో అడుగు ముందుకు వేయబోయింది.అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ వెళ్లిపోవడానికి సిద్ధమైన కూతురిని చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు.ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతూ, గలగలా మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకే నవ్వులతో ఇల్లంతా సందడి చేసే తన బుజ్జి... ఈరోజు తనను కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. తన ఉనికే ఆమెకు ఇష్టం లేనట్టుగా ముఖం తిప్పుకుని నిలబడింది.ఆమెను అలా చూసిన నారాయణ మనసు చివుక్కుమంది.'పాపం! తను నాన్న అన్న ఆ కఠినమైన మాటల్ని ఇంకా మరిచిపోలేదేమో! అయినా ఎలా మరిచిపోతుంది? అవి ఏవో మామూలు మాటలు కావు కదా! తనను ఎంతగానో ప్రేమించే తండ్రే తనను అనుమానిస్తూ మాట్లాడితే, ఆ బాధ ఎంత లోతుగా ఉంటుందో!