సంతోష్... ఒక 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. చాలా అతి మంచివాడు. ఎవరైనా సహాయం అడిగితే కాదనలేడు వెంటనే చేసేస్తాడు. అందుకే చాలామంది అతని మంచితనాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు.సంతోష్‌కి కథలు రాయడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా psychological thrillers, murder mysteries రాయడంలో మంచి ఆసక్తి ఉంది.అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు.1) ప్రదీప్ (తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు.)సంతోష్ వాళ్ల నాన్న పేరు రాము. ప్రదీప్ వాళ్ల నాన్న పేరు సూర్య.రాము, సూర్య ఇద్దరూ చిన్ననాటి ప్రాణ స్నేహితులు. వాళ్ల స్నేహమే వాళ్ల కొడుకులైన సంతోష్, ప్రదీప్లకు కూడా వచ్చింది.ఇద్దరూ కలిసి పెరిగారు.ఒకే స్కూల్.ఒకే కాలేజ్.ఒకేసారి ఒకే కంపెనీలో జాబ్ కొట్టారుఇప్పుడు హైదరాబాద్‌లో ఒకే 2BHK ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నారు.2) స్వాతిసంతోష్ జీవితంలోని రెండో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.తను సంతోష్ లవర్. కాలేజీలో తనకంటే ఒక సంవత్సరం జూనియర్. ఇద్దరి ప్రేమ