లెటర్‌ను ముక్కలు ముక్కలుగా చింపి డస్ట్‌బిన్‌లో వేసింది కీర్తి. దొరికిందే ఛాన్స్ అనుకుని బయటికి వెళ్లిపోవడానికి అడుగు వేస్తుండగా...“ఓయ్... ఆగు! ఎక్కడికి వెళ్తున్నావ్?” అని విరాట్ గొంతు వినిపించడంతో అక్కడే ఆగిపోయింది.చూసేశాడా? అంటే సార్ లెటర్ చదవడం అయిపోయింది కదా! అందుకే వెళ్తున్నా... అని మనసులో అనుకుంటూ,“సార్... లెటర్ చదవడం అయిపోయింది కదా! అందుకే...” అంటూ నీళ్లు నమిలింది కీర్తి.“నేను వెళ్లమని చెప్పానా?”“లేదు సార్...” అన్నట్టుగా తల ఊపింది.“మరి?”విరాట్ వెనక్కి పిలవడంతో చేసేదేమీ లేక అతని దగ్గరికి వెళ్లింది కీర్తి.“అసలు నువ్వు కాలేజ్‌కి దేనికి వస్తున్నావ్?”“సార్...”“చెప్పు! కాలేజ్‌కి దేనికి వస్తున్నావ్? ఒక్క క్లాస్ కూడా సరిగ్గా వినవు. ఎప్పుడూ చూసినా బయట తిరుగుతూనే ఉంటావ్. క్లాస్ చెప్తున్నప్పుడు పడుకుంటావ్... క్లాస్ మధ్యలో తింటావ్... అసలు నీకు డిసిప్లిన్ అనేది లేదు! బయట నిలబెట్టినా పాటలు పాడుకుంటూ ఉంటావ్. మరి ఏం చేయడానికి వస్తున్నావ్ కాలేజ్‌కి? ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రాయబారం కూడా మొదలుపెట్టావ్!”విరాట్