ప్రణయ గీతిక - 46

  • 342
  • 90

ప్రభ, నారాయణ ఇద్దరూ ఒకరి కాలర్ మరొకరు పట్టుకుని ఆవేశంగా వాదించుకుంటుండగా అక్కడికి వచ్చిన గీతిక ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది. ఆరోజు తనను ప్రమాదం నుంచి రక్షించింది ప్రభేనని ఆమెకు తెలుసు. అయితే, తనను అనుసరిస్తూ ఉండటం వల్లే అతను అలా చేశాడని భావించింది. పైగా, ఏ ఆడపిల్లకు అలాంటి పరిస్థితి ఎదురైనా తాను ఇలాగే స్పందించేవాడినని ప్రభ చెప్పడంతో, అతడిపై మరేదైనా ఆలోచన పెట్టుకోవడం మానేసింది.కానీ ఇప్పుడు తన తండ్రి కాలర్ పట్టుకుని నిలబడిన ప్రభను చూసేసరికి ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది.వెంటనే ముందుకొచ్చి, ప్రభ తన తండ్రి కాలర్ పట్టుకున్న చేతులవైపు చూస్తూ ఆగ్రహంగా అంది.“ఏమిటిది? ఏం చేస్తున్నావ్? ఏదో ఒక చిన్న సాయం చేశానని ఇంతలా సాధిస్తున్నావా? ఆరోజు నన్ను కాపాడినంత మాత్రాన మా నాన్నను అవమానించే హక్కు నీకు ఎవరిచ్చారు? సాయం చేసినంత మాత్రాన ఎదుటివారిని ఎంత మాటైనా అనొచ్చా? ఎంత అవమానమైనా చేయొచ్చా?” అంటూ