ప్రణయ గీతిక - 47

ప్రభ మీదకు చేయి ఎత్తబోయిన నారాయణను గుణేష్ అడ్డుకుని, ప్రభ చదువు, అతని వ్యక్తిత్వం గురించి వివరంగా చెప్పాడు. అయినప్పటికీ నారాయణ మనసులోని అసంతృప్తి పూర్తిగా తొలగిపోలేదు. చివరకు గుణేష్ ప్రభను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లిపోయాడు.వాళ్లు వెళ్లిపోయాక నారాయణను చూస్తూ గీతిక మనసులో ఆవేదన ఉప్పొంగింది.‘మా నాన్న కాలర్ పట్టుకునేంత ధైర్యమా వాడికి? పెద్దవాళ్లని కూడా గౌరవించకుండా అంత అహంకారమా?’ అని మనసులోనే రగిలిపోయింది. ఆ అసహనం మాటల రూపంలో బయటపడుతుండగానే, దేవి వస్తున్న అలికిడి వినిపించింది.“బుజ్జీ! జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు దీని గురించి ఎక్కువగా మాట్లాడకు. మీ అమ్మకు తెలిస్తే లేనిపోని సమస్యలు మొదలవుతాయి. ఇప్పటికే నీ మనసు ఎన్నో బాధలతో నిండిపోయింది. నా మాట విని లోపలికి వెళ్లు” అని నారాయణ నచ్చజెప్పడంతో గీతిక మౌనంగా లోపలికి వెళ్లిపోయింది.దేవి ఇంట్లోకి వచ్చిన తర్వాత నారాయణ ఏమీ తెలియనట్టు తన గదిలోకి వెళ్లిపోయాడు. జరిగిన విషయం