సీత గారు తన రామ్ వైపు ఒక చూపు చూస్తూ.. "నిజమే మావయ్య! అందరూ మీలా ఉండరులే.."అన్నారు....
ఆ చూపులోని పరమార్థం గ్రహించిన రామ్ గారు . "ఏంటి
సీత, నా ముఖం చూసి చెప్తావు? అంటే నేను నీతో ప్రేమగా ఉండటం లేదా?" అని అమాయకంగా, కాస్త నిలదీస్తున్నట్టు అడిగారు......
దానికి సీత గారు ఎంతో క్యూట్‌గా బదులిస్తూ.. "ప్రేమగా ఉండటం ఏంటండీ.. నన్ను ప్రాణంగా చూసుకుంటారు! కానీ.. అప్పుడప్పుడూ ఇలాగే పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉంటారు కదా," అని ఆటపట్టించారు. ఆ మాటతో అక్కడ ఒక్కసారిగా నవ్వేశారు.....
"చాల్లేరా.. రోజంతా ఇలాగే మాట్లాడుకుంటూ ఉండిపోదామా ఏంటి? పూజ టైమ్ అవుతోంది.. పంతులుగారికి ఫోన్ చేశావా?" అని జానకిగారు అడగగానే....
"చేశానమ్మా, దారిలో ఉన్నారంట,"...అని రామ్ గారు సమాధానం చెప్పగానే.... అందరూ త్వరగా రెడీ అవ్వడనైకి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు....
💞💖💞💖💞💖💞💖💞💖💞💖💞💖
మనాలి చలి గాలిని ఎంజాయ్ చేస్తూ,ఫ్యామిలీ అంతా కలిసి హిడింబి దేవి ఆలయానికి చేరుకున్నారు. అది శుక్రవారం కావడంతో భక్తుల రద్ది మామూలుగా లేదు. క్యూ లైన్‌లో కాసేపు ఓపికగా నిలపడి , చివరికి ఆ తల్లి దర్శనం ముగించుకుని ప్రశాంతంగా బయటకి వచ్చారు....
బయట ఉన్న పచ్చని చెట్లు, ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తూ రఘు గారు, పవిత్ర గారు కూర్చుని ఉండగా... పక్కనే ఉన్న రంగురంగుల షాపింగ్ స్టాల్స్ మీద మన మేఘ కళ్ళు పడ్డాయి. అంతే! సెకనులో పాపలో ఉన్న 'షాపింగ్ కోతి' నిద్రలేచింది.....
వెంటనే రఘు గారి దగ్గరికి వెళ్లి, ఆయన భుజం చుట్టూ చేతులు వేసి, ముఖం చిన్నగా పెట్టి, "డాడీ... ప్లీజ్ డాడీ! నేను ఒక్కసారి అలా వెళ్లి షాపింగ్ చేసి వస్తాను..." అంటూ క్యూట్ గా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది.....
కూతురు అలా అడిగితే రఘు గారు కాదనగలరా? వెంటనే నవ్వుతూ పర్స్ తీసి డబ్బులు చేతిలో పెట్టారు.
కానీ, పక్కనే ఉన్న పవిత్ర గారు మాత్రం "అబ్బే.. వద్దంటే వద్దు! నువ్వు ఒక్కదానివి వెళ్తే అక్కడ ఎవరితో గొడవ పెట్టుకుంటావో అని మాకు టెన్షన్. అసలే గయ్యాళివి.. కాసేపు ఆగితే అందరం కలిసి వెళ్దాం" అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు....
అమ్మ మాటకి మేఘ వెంటనే , కళ్ళలో నీళ్లు తెచ్చేసుకున్నంత పని చేస్తూ.. "చూడండి డాడీ.. అమ్మ నన్ను ఏమంటుందో! నేనేమైనా కావాలని గొడవ పడతానా? వాళ్లు తప్పు చేస్తే ఊరుకోవాలా చెప్పండి?" అంటూ తండ్రికి కంప్లైంట్ ఇచ్చింది...
రఘు గారు తన గారాబాల పట్టిని వెనకేసుకొస్తూ, "పాపం పవి.. నా కన్నగాడు చిన్నపిల్ల కదా, వెళ్ళనివ్వు" అనేసరికి, మేఘ మళ్ళీ అమ్మ వైపు తిరిగి "ప్లీజ్ అమ్మ..మ్మ...మ్మ..." అంటూ బుంగమూతి పెట్టింది.....
ఇక మేఘ పట్టుదల ముందు తన ఆటలు సాగవని అర్థం చేసుకున్న పవిత్ర గారు.. "సరే తల్లి జాగ్రత్త.. వెళ్లు" అనక తప్పలేదు. అంతే! మేఘ మొహంలో వెయ్యి వాట్ల బల్బ్ వెలిగినంత ఆనందం. వెంటనే అమ్మ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసి, గాలిలో తేలుతున్నట్టు ఎగురుకుంటూ షాపుల వైపు పరుగు తీసింది....
తన అల్లరిని, ఆ ఉత్సాహాన్ని చూస్తూ రఘు, పవిత్ర దంపతులు ఒకరినొకరు చూసుకుని మురిపెంగా నవ్వుకున్నారు......
💞💖💞💖💞💖💞💖💞💖💞💖💞💖
అప్పుడే పూజారి గారు రావడంతో హాల్లో సందడి మొదలైంది.
"రండి పూజారి గారు, బాగున్నారా?" అంటూ చిరునవ్వుతో ఆహ్వానించారు జానకి గారు.....
"బాగున్నానమ్మా.. మీరంతా ఎలా ఉన్నారు?" అని ఆయన అడుగుతుంటే...
ఆ దేవుడి దయ వల్ల అందరం చాలా క్షేమంగా ఉన్నామండి అని వినయంగా సమాధానమిచ్చారు.....
పూజారి గారు సామాగ్రి సర్దుకుంటూ, "సరేనమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. మీరు త్వరగా సిద్ధమై వస్తే పూజ మొదలుపెడదాం" అనగానే, జానకి గారు పిల్లల్ని పిలవడానికి లోపలికి వెళ్లబోయారు.....
అప్పుడే అక్కడకు వచ్చిన రామ్ గారు అటూ ఇటూ చూసి, తన భార్య సీతతో.. "ఏమ్మా సీత! పిల్లలెక్కడ? ఇంకా రెడీ అవ్వలేదా?" అని అడిగారు.....
"పెద్దోడు లేచాడండి.. చిన్నోడు ఇంకా పడుకున్నట్టున్నాడు" అని సీత గారు మెల్లగా చెప్పారు.....
"వాడెందుకు లేస్తాడులే? రాత్రంతా పార్టీ అంటూ తిరిగాడు కదా 'దొరగారు'. ఆయనకి ఇంకా తెల్లవారినట్టు లేదు" అని రామ్ గారు కాస్త వ్యంగ్యంగా అంటే.. సీత గారికి కోపం వచ్చేసింది.....
"చాల్లేండి.. ఎప్పుడూ వాడిని ఏదో ఒకటి అనకపోతే మీకు నిద్ర రాదు కదా?" అని కసురుకున్నారు.....
"అవును మరి.. మీ వాడు పెద్ద తోపు హీరో కదా! వాడిని అనకపోతే నాకు ముద్ద దిగదు" అని ఆయన వెక్కిరిస్తుండగానే ప్రతాప గారు ఎంట్రీ ఇచ్చారు....
"ఆపుతారా మీ ఇద్దరూ? సీతమ్మ.. నువ్వు వెళ్లి పిల్లల్ని తీసుకురామ్మా" అని ఆయన ఆజ్ఞాపించడంతో, రామ్ గారి వైపు ఒక లుక్ ఇచ్చి, మూతి తిప్పుకుని లోపలికి వెళ్లారు సీత గారు...
సీత గారు ముందుగా పెద్ద కొడుకు రూమ్ వైపు వెళ్లారు. అక్కడ అద్దం ముందు నిలబడి.... తన జుట్టును సరి చేసుకుంటున్నాడు. ఎర్రటి షేర్వానీలో ఆరడుగుల ఆజానుబాహుడు, కసరత్తులు చేసి చెక్కినట్టున్న శరీరం, ఆకర్షణీయమైన ఛాయ..తనను చూడగానే సీత గారి కళ్లలో ఒక రకమైన మెరుపు, గర్వం కనిపిస్తాయి....
తనను అలాగే చూస్తున్న అమ్మను గమనించి, నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేసి, "ఏంటమ్మా.. అలా చూస్తున్నావ్?" అని అడిగాడు...
"నా కన్నయ్యకు ఎవరి దిష్టి తగలకూడదు నాన్న" అంటూ తన కంటి కాటుక తీసి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టారావిడ.....
"అమ్మా.. ఈ కాలంలో కూడా ఇవన్నీనా?" అని నవ్వుతుంటే.. "తల్లి మనసు నాన్న.. నా బిడ్డలు బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. అయినా మీ నాన్న కింద పిలుస్తున్నారు, త్వరగా రా" అని చెప్పారు....
"సరే మా.. విన్ను లేచాడా?" అని అడిగాడు...
"వాడి దగ్గరకే వెళ్తున్నా నాన్న" అంటున్న సీత గారితో..
"నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అమ్మా, పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నావు కదా. నేను వాడిని లేపి తీసుకువస్తాను"...
సరే నాన్న త్వరగా రా అని సీతగారు కిందకి వెళ్లిపోయారు....
తమ్ముడు రూమ్ కి వెళ్లేసరికి,తను దుప్పటి ముసుగుతన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.నీటుర్చి ఒక్క ఉదుటన దుప్పటి లాగేసి, "రేయ్ విన్నీ! లే.. పూజకు టైం అవుతోంది" అని గద్దించాడు....
"నిద్రొస్తోంది అన్నయ్య.." అంటూ విన్ను బద్ధకంగా అటు ఇటు దొర్లుతుంటే.. "రాత్రి ఎందుకురా అంత లేటుగా రావడం?" అని అడిగాడు....
"అన్నయ్య.. నువ్వు కూడా ఆ హిట్లర్ (నాన్న) లాగా క్లాస్ పీకకు ప్లీజ్" అన్నాడు విన్ను కళ్లు తెరవకుండానే...
"రేయ్.. ఆ హిట్లర్ కిందనే ఉన్నాడు. పిలుస్తున్నారు, త్వరగా
రా" అని బెడ్ షీట్ మడుస్తూ చెప్పగానే.. 'హిట్లర్' అన్న పేరు వినగానే విన్ను లో ఎక్కడి లేని నీరసం వచ్చేసింది...
ఒక్కసారిగా లేచి కూర్చుని, "అమ్మో! నాన్న కింద ఉన్నారా? ఇంకేం చేస్తాం.. వెళ్లక తప్పదు" అని తల గీక్కున్నాడు.....
తమ్ముడిని చూసి నవ్వుతూ, "త్వరగా రెడీ అవ్వు, అమ్మ డ్రెస్ తీసి పెట్టింది" అనగానే.. "వచ్చేస్తున్నా అన్నయ్య" అంటూ బాత్‌రూమ్‌లోకి దూరాడు విన్ను ....
విన్ను ఎంత అల్లరి చేసినా, నాన్నతో ఎన్ని తిట్లు తిన్నా.. అన్నయ్య అంటే ప్రాణం. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నారు...
పూజ గదిలో అందరూ సిద్ధమవుతుండగా, కృష్ణ సోదరులు కిందకు రావడానికి రెడీ అవుతున్నారు.....
ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే.....
ఇంటి పెద్ద ప్రతాప్ గారు అయన వైఫ్ జానకిగారు... వాళ్లకు ఒక కొడుకు రామ్ గారు (బిజినెస్ చేస్తారు).... వైఫ్ సీతగారు.....(హౌస్ వైఫ్)..వీళ్లకు ముగ్గురు పిల్లలు...
నీల్ కృష్ణ (పెద్ద కొడుకు... మన హీరో)...
వినయ్ కృష్ణ (చిన్న కొడుకు.. అన్నయ్య అంటే ప్రాణం )...
విషితా (హీరో గారి చెల్లలు...)....
మన హీరో హీరోయిన్ ఎలా కలుసుకుంటారో ముందు ముందు తెలుసుకుందాం.....
ఇంకా ఉంది.... 💞💞