శైలు, గీతిక ఇంటికి వచ్చి వెళ్ళగా గీతిక ప్లానింగ్ రెడీ చేసుకుని ఆఫీసులో డెమో ఇవ్వడానికి రెడీగా ఉండగా ఒక ఆరడుగుల వ్యక్తి సూట్ బూటు వేసి చక్కటి శారీరక దారుధ్యం, ఓ మోస్తారు అందం కలిగిన వ్యక్తి గంభీరంగా డెమో రూమ్ వైపుకు వెళుతుండగా ఇతనే బహుశా మన సార్ అయి ఉంటారు అనుకుంది గీతిక. గీతిక పక్కన కూర్చున్న లవ్లీ, మాలతి,ఇంకా ఇద్దరు అబ్బాయిలు కూడా తమ తమ ప్లానింగ్ పేపర్స్ ని తీసుకుని వచ్చి ఆ రూమ్ లో కూర్చున్నారు.
గీతిక ఏదో మరచి వచ్చానని లాప్టాప్ తో తీసుకొని బయటికి వెళుతూ ఉండగా బయటనుంచి మరో వ్యక్తి లోపలికి అడుగు పెడుతుంటే అతనికి డాష్ కొట్టే స్థితి నుండి జస్ట్ తప్పించుకుని గీతిక పక్కకు జరగడంతో ఆమె చేతిలోని పెన్ కింద పడింది.
తను వంగి తీసుకొని అటు చూస్తుంటే అతను ఆమె వైపు తిరిగి కళ్ళు అర్పకుండా తనవైపే చూస్తూ ఉండడం చూసి" ఇతనేంటి అలా చూస్తున్నాడు దరిద్రపు వెధవ "అనుకొని తను మరిచిపోయిన వస్తువుని తీసుకొని మళ్ళీ అదే రూమ్ కి వచ్చి చూడగా నాలుగో వాడు అబ్బాయి లోపలికి వెళ్ళాడు.
అమ్మో ! ఇంకొక క్షణం రాకపోయి ఉంటే నాకు పనిష్మెంట్ తప్పనిసరి. పైగా మొదటి వెళ్లిన వ్యక్తి చాలా గంభీరంగా స్ట్రిక్టుగా ఉన్నట్టు నాకనిపిస్తున్నాడు అనుకుంటూ ఉండగా గీతిక వంతు రావడంతో విష్ చేసి లోపలికి వెళ్ళగా మొదట వెళ్లిన వ్యక్తి లోపల లేడు రెండో వ్యక్తి ని చూసి గుండెలో దడ మొదలైంది. అయినా చేతిలో ఉన్న పెన్నున్ని నొక్కుతూ తన భయాన్ని నియంత్రించుకుంటుంది గీతిక.
అది గమనించిన వ్యక్తి ఎందుకలా భయపడుతున్నావ్? ఇలా భయపడుతూ నువ్వేం సాధిస్తావ్ ? అసలు ఇలాంటి పిరికి వాళ్ళని జాబ్ కి సెలెక్ట్ చేసింది ఎవరు? అని గట్టిగానే మాట్లాడేసరికి "లేదు సార్ నాకు భయమేం లేదు కొంచెం.."అని ఇంకా ఏదో అంటూ ఉండగా ఆ కొంచమే ఉండకూడదు.ధైర్యంగా ఉండాలి సక్సెస్ అవుతావు.చూడు, నీకు మంచి తెలివి ఉంది కానీ ఇదే భయం ఆందోళనతో ప్రిపరేషన్ లో కొన్ని అవకతవకలు వచ్చి కాస్త రాంగ్ ఉంది " యువర్ థాట్ ఈజ్ ఓకే బట్ యువర్ ప్రిపరేషన్ ఇస్ నాట్ ఓకే. దెన్ వాట్ డు యు డు? "అని కనుబొమ్మలు ఎగిరేస్తూ సార్ ప్రశ్న వేసేసరికి లేని ధైర్యం కూడా కట్టుకున్న గీతిక "సారీ సార్, జస్ట్ మిస్టేక్ ."అనబోతుంటే "వాట్ జస్ట్ , జస్ట్ ఈజ్ నాట్ జస్ట్. థిస్ ఇస్ ట్వల్ క్రోర్స్ ప్రాజెక్ట్ ! అండర్స్టాండ్. " అని గట్టిగా చెప్పేసరికి 'ఎస్ సార్' అంది మెల్లగా గీతిక.
నౌ వాట్ డు యు డు ? అడిగాడు సర్.
'ఐ విల్ కరెక్ట్ ఇట్ సర్ 'అంది చిన్నగా గీతిక.
' ఇట్స్ ఓకే టేక్ ఇట్ 'అని అతను చేతికి ఇవ్వగా తీసుకొని రూం నుండి బయటపడింది గీతిక.
గీతిక సక్సెసా? అడిగింది లవ్లీ.
లేదన్నట్టు ముఖం తిప్పేసరికి, ' డోంట్ వర్రీ గీతిక దిస్ ఇస్ ఫస్ట్ టైం, యు విల్ డూ పర్ఫెక్ట్ ఇన్ నెక్స్ట్ టైం ' అంది భుజం తడుతూ లవ్లీ.
గీతిక ! బాధపడొద్దు. మళ్లీ ట్రై చేస్తే అదే వస్తుంది అంది మాలతి.
' థాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, ఐ విల్ ట్రై' అని చెప్పి' వీళ్ళిద్దరూ నన్ను బాగా నాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నట్టున్నారు' అనుకొని నవ్వుతూ కి గీతిక బయటికి వెళుతుంటే వచ్చారు గుండు, జున్నులు.
గీతిక ! ఏంటి డల్ గా ఉన్నావ్? అడిగింది జున్ను.
జరిగింది చెప్పిన గీతికతో " గీతిక ! నీ ప్రాజెక్టు ప్లాన్ని చెక్ చేసింది ఎవరనుకున్నావు ? రాణి మేడమ్ భర్త. సర్ చాలా బ్రిలియంట్ అండ్ స్టాండర్డ్ పర్సన్. అతను క్వాలిటీ కి మాత్రమే విలువ ఇస్తాడు. నీకు రెండోసారి పర్మిషన్ ఇచ్చాడు అంటే నీ ప్లానింగ్ తనకి నచ్చి ఉంటుంది అయితే ఎక్కడో కొంచెం సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని అర్థం అన్నమాట అన్నాడు గుండు.
అది విన్న గీతికకి కాస్త మైండ్ రిలీఫ్ అనిపించగా జున్ను మాత్రం నోటి మీద వేలు పెట్టి "గుండు బావ! నీ ఎడ్వైస్ కి క్లాప్స్ కొట్టాల్సిందేరా. నీకు తెలివి లేదనుకున్నాను కానీ టెక్నిక్ చాలా బాగుందని నాకు ఇప్పుడు అర్థమైంది "నా సెలక్షన్ బాగుందనిపిస్తుంది అంది జున్ను.
గీతిక నవ్వుతుంది.
చూడు ఇలా చిరునవ్వుతో పని చేయి. రెండు రోజులు కాదు ఒక్కరోజు మాత్రమే టైముంది అనుకో ముందు ఇంటికి వెళ్లి అదేదో చూడు అని గుండు అంటుంటే అవును గీతిక వెళ్లి ఈసారి చక్కగా ప్లాన్ చెయ్ అని జున్ను కూడా చెప్పడంతో వెళ్ళింది గీతిక
ఇంటికెళ్లిన గీతిక లాప్టాప్ పక్కన పెట్టి 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని బెడ్ పై పడుకొని లేస్తూ ఉండగా జేజి స్ట్రాంగ్ కాఫీ తెచ్చి ఇవ్వడంతో, "జేజి! మీరెoదుకు తెచ్చారు ? నేనే వచ్చేదానిగా " అని గీతిక అంటుంటే పర్లేదు లేమ్మా అలసిపోయి ఉన్నావుగా తాగి అలా వెళ్లి ఫ్రూట్స్ తీసుకొద్దాం అంది జేజి.
అలాగే జేజి.నాకు కూడా కాస్త మైండ్ ఫ్రెష్ అవ్వాలి వెళ్దాం పద అని చెప్పి ఇద్దరూ ఫ్రూట్స్ ఉన్న బండి కోసం వస్తుంటే జ్యూస్ షాప్ కనిపించడంతో అక్కడికి వెళ్లారు.
ఫ్రూట్ జ్యూస్ షాప్ పెద్దది . రెండు భాగాలుగా ఉంది. మధ్యలో తిరగడానికి కస్టమర్స్ అలా వెళ్లి రావడానికి కాళీ ప్రదేశం కూడా ఉంది
చేసి మీరు ఇక్కడ కూర్చోండి నేను ఆర్డర్ ఇస్తానని చెప్పి రెండు గ్లాసులు పైన్ ఆపిల్ జ్యూస్ అని ఆర్డర్ ఇచ్చి కూర్చుంది గీతిక.
జ్యూస్ అంగడి అబ్బాయి రెండు గ్లాసులు తెచ్చి ఇవ్వడంతో గ్లాసు చేతిలో పట్టుకుని ఉన్న గీతికతో, ఎందుకు నువ్వు ఆఫీస్ నుండి వచ్చినప్పటినుండి డల్గా కనిపిస్తున్నావు అంది జేజి.
ఏముంది జేజి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ ఏదైనా అలాగే ఉంటుంది ఏం చేయలేం అంది గీతిక.
మీ సార్ నువ్వు కష్టపడి తయారు చేసిన ప్లాన్ని సరిగ్గా లేదని, మళ్లీ ప్రయత్నించమని చెప్పాడని నువ్వు శైలుకి చెబుతుంటే విన్నాను అదేదో ఇంకొంచెం ఆసక్తితో చేసి ఉంటే బాగుండేది కదమ్మా అంది జేజి.
నేను చాలా శ్రద్ధతోనే చేశాను జేజి కానీ ఎక్కడ తప్పు చేశానో అర్థం కాలేదు అదే నా బుర్రను తినేస్తోంది.
' సరేలే ముందు జ్యూస్ తాగు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరికగా ఆలోచిద్దువు గాని ' అని జేజి చెప్పడంతో జ్యూస్ గ్లాస్ ని నోటి దగ్గర పెట్టి తాగాలని చూస్తుండగా అవతలి టేబుల్ నుండి ఎవరో తొంగిచూసినట్టు గమనించిన గీతిక అలా వంగి చూడంగా అబ్బా " వీడా ఎందుకు చూశానో ఏంటో అనుకుని మళ్ళీ జ్యూస్ తాగాలని చూస్తే ప్రభా తనవైపు చూడడంతో" జేజి! నాకు జూసొద్దు ఏమీ వద్దు "అని పర్సులోనే డబ్బు తీస్తుండగా" ఏం జరిగింది? అంటూ జేజి వెనక్కి తిరిగి చూస్తే తాతయ్య, ప్రభలు కనిపిస్తారు.
" ఓహో! మేటర్ ఇదన్నమాట" అనుకొని "గీతిక ఎవర్నో చూసి నీ జ్యూస్ తాగాలి అన్న ఆశను చంపుకుంటావా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు వేస్ట్ చేస్తావా, వాళ్ళిద్దరినీ చూడు ఒక్క బొట్టు జూస్ కూడా వదలట్లేదు. ముందు కూర్చో వాళ్ళు ఏమైనా నీ తలనొప్పిని మాయం చేస్తారా ఏంటి" అని అంటుంది జేజి ప్రభాను చూస్తూ.
ఆ మనిషే నాకు తలనొప్పి ఇక నాకు ఇంకా ఎక్కువవుతుందే కానీ తగ్గదు ముందు ఇక్కడి నుంచి బయట పడాలని అనుకుంటూ జ్యూస్ ని గటగట తాగేస్తుండగా, " జేజి మెల్లగా తాగమని చెప్పండి పొలమారేను మళ్ళీ ప్రాజెక్ట్ ప్లానింగ్ కి మూడు లేకుండా అయిపోతుంది. " అన్న ప్రభ మాటలకి "నా ప్రాజెక్టు గురించి వాడికి ఎవరు చెప్పారు?" అని తాతయ్య వైపు తిరిగేసరికి 'నేను కాదు అంటూ తలతిప్పుతూ జేజే వైపు చూడడంతో అవునన్నట్టు తలూపింది జేజి.
ఏం చేయను గీతిక నువ్వు డల్ గా ఉంటే నీ బాధని నేను చూడలేను.నువ్వు ఎలా రాశావో చదువుకుంటుంటే ప్రభ కి వినిపించాను అంది జేజే మెల్లగా.
రెంట్ ఇంట్లో ఉంటూ ఫ్యాక్టరీలో పని చేసే వాళ్ళకి ఏం తెలుసు ప్రాజెక్టు గురించి అంది గీతిక.
"జేజి, పోనీ ఒక పని చేయమను తను చేసిన ప్లాన్ ని కొంచెం రివర్స్ గా ప్లాన్ చేస్తే కచ్చితంగా ఫలితం ఉండొచ్చు" అని సలహా చెబుతాడు ప్రభ అలా ఒకసారి గీతికని చూసి కళ్ళు దించుతూ.
" జేజి ! ఒకరు చెప్పినట్టు నేనెందుకు చేస్తాను ఒకరిని ఎప్పుడు ఫాలో కాను నాకు ఇష్టం వచ్చినట్టే నేను చేస్తాను". అని చెప్పి అక్కడ నుంచి జేజి తో పాటు వెళుతూ ఉండగా గీతిక ఎందుకమ్మా అంత ఆవేశపడతావు . "ఆవేశం అనార్హుతం ఆలోచన ఉత్తమం " అని పెద్దలు చెబుతారు కాబట్టి మనం కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం దొరక వచ్చేమో కాబట్టి నీకున్న బాధలో నువ్వు ఆవేశపడకు వాడేo నువ్వు అనుకున్నట్టు రెంటు ఇంట్లో.... అని జేజి ఇంకా ఏదో చెప్పబోతుంటే ప్రబ తాతయ్యతో పాటు వెనక వస్తు వద్దు అని తలతిప్పడంతో" సరే గీతికా నీ ఇష్టం అదిగో చూడు అక్కడ ఫ్రూట్స్ బాగున్నట్టు ఉన్నాయి" అని జేజి చెప్పడంతో మరి కొన్ని ఫ్రూట్స్ తీసుకుని ఇంటికి వెళతారు.