ఇంటికి వచ్చినఇంటికి వచ్చిన కృష్ణ మురళి బయటకి వెళ్లి లైన్ మాన్ ని అడగడంతో"ఇక్కడ ఎవరో వ్యక్తి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని ..అందుకే కరెంట్ ఆఫ్ చేసేసి వస్తున్నాను. అని చెప్పగా కృష్ణ కూడా చూద్దామని అటు వెళ్లడంతో బోర్లా పడి ఉన్న ఆరడుగుల ఆజానుబాహుడి బట్టలు వర్షంలో మట్టి రంగుగా మారిపోయాయి పోయి ఉన్నాయి.
లైన్మెన్ జాగ్రత్తగా స్తంభానికి ఉన్న వైర్ ని కట్ చేసి దిగడంతోటే వీడు ఎవడో ఏంటో ఎందుకు ఇక్కడికి వచ్చి చచ్చాడు అనుకుంటూ ముందుకెళుతుండగా బిల్డింగ్ ఓనర్ కూడా రావడంతో చూస్తే తల కూడా బోర్లా పడింది. ఎవరని ఎలా తెలుస్తుంది అనుకొని ఒక కట్ట తీసుకొని తలని ఎత్తుదామని అనుకున్న లైన్మెన్ వద్దులే మనకెందుకు పోలీసులు వచ్చి చూసుకుంటారు అనుకుని నిలబడ్డాడు. అంతలోనే పోలీసులు రావడంతో చచ్చిన మనిషిని చేతికి బ్లౌజ్ వేసుకుని కదిలించగా చూసిన కృష్ణకి గుండె ఆగినంత పని అయింది.
శ్రీహరి! అంటూ నోటిని గట్టిగా మూసుకుని మూగరోధన చేస్తూ రాణి కి ఫోన్ చేసి నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి నీ తమ్ముడు ఆచూకీ తెలిసింది అని చెప్పడంతో వడివడిగా వచ్చింది రాణి.
చచ్చి శవమై పడి ఉన్న తమ్ముడిని చూడగానే రాణి గుండె బద్దలైంది. శ్రీహరి ! అంటూ బోరున విలపించసాగింది. కృష్ణా, రాణీ భుజం పట్టుకుని ఓదారుస్తూ ఉండగా నాన్న నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసిన రానికి ఏం చెప్పాలో గొంతు పెగలడం లేదు కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఉన్నాయి.
"రాణి !చెప్పమ్మా ఎందుకు మౌనంగా ఉన్నావు . వాడిని ఈరోజు త్వరగా ఇంటికి రమ్మని చెప్పు .ఈరోజు వాడికి పుట్టినరోజు కదా చాలా ఇల్లంతా అలంకరించి వాడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. ఈరోజు వాడికి ఒక సువార్త చెప్పాలని నిర్ణయించుకున్నాను అదేనమ్మ ,పెళ్లి విషయం. ఆరోజు అమ్మాయిని చూపించాను గా తనకి కూడా శ్రీహరి అంటే ఇష్టం అంట .అందుకే ఆ విషయం కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. వాడితో పాటు నువ్వు కూడా కలిసి వచ్చేయ్." అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసిన నాన్న మాటలు విని శోకసంద్రంలో మునిగిపోయి కృష్ణుని హత్తుకుని ఏడ్చసాగింది.
కృష్ణ మనసు ఆలోచిస్తున్నది కూడా శ్రీహరి గురించే.ఈ మరణం ఎలా సంభవించింది అనేది ప్రశ్న అనుకోని రాణిని భుజం తట్టి పక్కకు నిలబెట్టి శ్రీహరి శవం దగ్గరికి వెళ్లి చుట్టూ పరిశీలన చేశాడు ఆధారమేదైనా కనిపిస్తుందేమోనని. కానీ, ఏమీ కనిపించలేదు అంతలో పోలీస్ జాబ్ వచ్చేసరికి పక్కకి నిలబడ్డాడు కృష్ణ.
పోలీసులు వచ్చిన కాసేపటికి కార్లు వరసగా రావడంతో నాన్నగారు వచ్చేసారు అని అర్థమైంది రాణికి.
కారు దిగిన వెంటనే ఆహాకారాలతో కొడుకు శవం దగ్గరికి చేరుకున్నాడు భుజంగం. కొడుకుని ముట్టబోగా వద్దని పోలీసులు వారిస్తుంటే ఎందుకు నా కొడుకుని ముట్టొద్దని అంటున్నారు "శ్రీహరి లేరా! ఈరోజే నీ పుట్టినరోజు ఇల్లంతా అలంకరించి ఇంటిల్లిపాది నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంట్లో జ్యోతులు వెలుగుతూ ఉంటే ఇక్కడ నా ఇంటి దీపం ఆరిపోయిందేoట్రా " అంటూ నెత్తినూరు కొట్టుకో సాగాడు. అంతలో ఎస్సై కూడా రావడంతో శవాన్ని పోస్ట్మార్టంకి పంపించాలని చెప్పగా హాస్పిటల్ కి వెళ్ళారు.
హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటే బయట బుసలు కొడుతున్నాడు భుజంగం. నా కొడుకుకి ఇలాంటి చావు సంభవించడం ఏంటి? ఇది అబద్దం అని అటు ఇటు తిరుగుతూ ఉండగా డాక్టర్ రావడంతో ఎదురు చూస్తే అది కరెంటు షాక్ కొట్టడం వల్లే అతను చనిపోయాడని డాక్టర్ చెప్పడంతో డాక్టర్ని పట్టుకొని అది అబద్ధమని చెప్పండి అని డాక్టర్ విరుచుకుపడ్డాడు. భుజంగం లేదు సార్ నేను చెప్పేది నిజం అతని దగ్గర ఎలాంటి ఆధారం మాకు దొరకలేదు."అని డాక్టర్ చెప్పడంతో దుఃఖిస్తూ కొడుకు ముఖాన్ని పట్టుకొని ఏడుస్తూ ఇంటికి తీసుకెళ్లి గెస్ట్ హౌస్ వెనక కాల్చేశారు.
అక్క! అంటూ వెనకాలే తిరుగుతూ ఆట పట్టిస్తూ తన పనిలో చాలా సహాయంగా ఉంటూ తన కంపెనీ స్థాయికి అక్క కంపెనీ చేరాలని ఎంత కష్టపడ్డాడో అయినా విధి వంచించింది అనుకొని నాన్నతో కూడా చెప్పకుండా ఆ బాధని తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది రాణి.
కృష్ణ మురళి కి మాత్రం క్షణక్షణం అనుమానం పెరుగుతోంది.ఏం చేయాలి .దీని గురించి ఎలా తెలుసుకోవాలి. "వాడేమంతా అమాయకుడు కాదు, చదువుకున్నవాడు. వాడిలో ఉన్నది ఒకటే తప్పు అమ్మాయిల పిచ్చి . కనిపించిన ప్రతి అందమైన పువ్వుని వాసన చూడాలని , అందులోని మకరందాన్ని ఆస్వాదించాలనే మనస్తత్వం ఉన్నవాడు. వాడికి ఎందుకిలా జరిగిందో కచ్చితంగా తెలుసుకుంటాను. " అని ఇంటి ముందున్న గేటు దగ్గరికి వెళ్లి మరొక్కసారి చుట్టూ పరిశీలించి చూస్తే గేటుకి ఉన్న చిన్న పువ్వు డిజైన్ కి పొడవైన వెంట్రుకలు చిక్కుకొని ఉండడం చూసి ఇవి ఎవరి వై ఉండొచ్చు . ఇక్కడికి ఎవరైనా వచ్చారా, శ్రీహరి ఒక రోజు లవ్లీతో నవ్వుతూ మాట్లాడడం నేను చూశాను . కొంపదీసి తను ఇక్కడికి వచ్చిందా! అనుకుంటూ లోపల అంతా చూసినా ఎక్కడ ఏ ఆచూకీ దొరకకపోగా తను పెంచిన కుందేళ్ళకి గడ్డి వేయాలని అటు వెళ్లిన కృష్ణ కాంపౌండ్ దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి రావడంతో అక్కడ కొన్ని మట్టి గాజులు పగిలి ఉండేవి పడి ఉండడం చూసి ఇక్కడికి ఎవరో అమ్మాయి వచ్చినట్టుంది. కానీ లవ్లీ మాత్రం కాదు. తనకి బంగారం, వెండి మీద ఉన్న మమకారం మట్టి గాజుల మీద లేదు. ఎవరై ఉంటారు. ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా సీసీ కెమెరా గుర్తుకు రావడంతో వెళ్లి కాంపౌండ్ లోపల ఉన్న సీసీ కెమెరాలు చూడగా అవన్నీ ఆఫ్ చేయబడి ఉన్నాయి. వెంటనే ఆన్ చేసి ముందుకెళుతూ ఉండగా వాటర్ సంపులో లో మోటర్ పనిచేయడం లేదని చూస్తున్న ఎలక్ట్రీషియన్ "సర్! ఇక్కడ ఏదో ఫోన్ పడి ఉంది. " అని చెప్పడంతో చూస్తే అది శ్రీహరిదే. ఎందుకు మొబైల్ సంపులో పడింది అనుకొని మొబైల్ ని ఆన్ చేయగా అది పని చేయడంతో ఈ మొబైల్ కి వాటర్ లో పడిన ఏం కాదు పనిచేస్తుంది అనుకొని అందులో ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చూడగా బిజినెస్ కి సంబంధించిన అవి తప్ప వేరే ఏమీ కనిపించలేదు . ఇక ఫోన్ చేతిలో పెట్టుకొని గేటు బయటకెళ్ళి బయట ఆటోమెటిక్ కెమెరా ఎప్పుడూ ఆన్ లో ఉండే కెమెరా కాబట్టి అక్కడికి వెళ్లి దాన్ని తీసి లోపలికి తీసుకెళ్లాడు కృష్ణ.
కృష్ణ! ఎంత సేపయింది బయటకు వెళ్లి. ఏం చేస్తున్నావ్, అంటూ అప్పుడే వచ్చిన రాణి "ఎందుకండి, సీసీ కెమెరా తీసుకొచ్చారు."అని అడగడంతో ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్లి కంప్యూటర్ ఆన్ చేసి చూస్తూ ఉండగా ముందు బ్లర్ గా కనిపించడంతో కాస్త ఫార్వర్డ్ కొట్టి చూడగా ఎవరో అమ్మాయి ఎల్లో డ్రెస్ వేసుకొని గేటు వైపు రావడం చూసి" గీతికలా ఉందే ! "అనుకుంటూ ఉండగా రాణి "ఏమండీ! సిసి కెమెరాలో ఏదైనా ఆధారం కనిపిస్తోందా " అంటూ వచ్చేసరికి ' రాణి! నాకు చాలా తలనొప్పిగా ఉంది కొంచెం స్ట్రాంగ్ కాఫీ తెస్తావా ' అనేసరికి అలాగేనండి, అని రాణి లోపలికి వెళ్ళగా కృష్ణ వీడియోని చూసి "కన్ఫామ్ ,ఆ అమ్మాయి గీతికే ,తను ఎందుకు ఇక్కడికి వచ్చింది. అంటూ మళ్ళీ చూస్తుంటే గీతిక గేటు దగ్గరికి వచ్చి ఎవర్నో పిలుస్తూ ఉండడం చూసి జూమ్ చేసి ఆమె లిప్స్ మూమెంట్ ని పరిశీలించి గీతిక పలుకుతున్న పేరు ఎక్కడో పరిచయం ఉన్నట్టుంది అనుకొని మళ్లీ చూస్తుండగా రాని వస్తున్న శబ్దం కావడంతో బ్లర్ అయిన వీడియో ఓపెన్ చేసి ఎందుకో గాలికి కెమెరాలు కదలడంతో కొన్ని వీడియోస్ సరిగ్గా రాలేదు, కాఫీ ఇవ్వు అంటూనే తను కాఫీ ఇచ్చి ఇటు ఇవ్వండి నేను చూస్తాను అని అడగడంతో ముందు నువ్వు నా పక్కన కూర్చో అంటూ ఎడమ చేయి ఆమె భుజంపై వేసి నువ్వు కూడా కాఫీ తాగు అని తన గ్లాసులో సగం కాఫీ ఆమెకి ఇచ్చి ఇద్దరూ తాగిన తర్వాత రాణి గ్లాసు లోపలికి తీసుకెళ్తుండగా " రాణి! నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే నువ్వు చాలా సెన్సిటివ్ , ముందు వెళ్లి రెస్ట్ తీసుకో నేనంత చూస్తాను . " అని చెప్పగానే ఆమె వెళ్లి పడుకుందని కన్ఫర్మ్ అయిన తర్వాతే మళ్ళీ కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా గీతిక గేటు దాటే వరకు మాత్రమే ఉంది వీడియో. గీతిక గేటు దాటగానే ఏదో స్కూటీ అలా జస్ట్ కొద్ది దూరం మాత్రమే టర్న్ చేసుకుంటూ ఉండగా కనిపించింది. దాని నెంబర్ కనిపిస్తుందేమోనని చూడడంతో ఏమీ కనిపించలేదు.
సీసీటీవీలోని వీడియోను పెన్ డ్రైవ్ కి ఎక్కించుకొని అందులో ఉన్న వీడియోస్ ను డిలీట్ చేశాడు కృష్ణ.అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులతో శ్రీహరి కేసు గురించి మాట్లాడి తర్వాత సీసీ కెమెరా గురించి చెప్పాలనుకొణని వద్దులే , కొంచెం ఆలోచించి ఆ తర్వాత చెబుదాం అనుకొని వస్తూ ఉండగా అక్కడ కెమెరా సీసీ కెమెరా లో చూసిన బండి కనిపించడంతో పోలీసులను అడిగాడు కృష్ణ.
సర్ ఈ బండి మీ ఇంటికి ఉన్న రెండో దారిలో యాక్సిడెంట్ అయి పడి ఉంది . అక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉంది. అమ్మాయి కోసం ఇంత వరకు ఎవరూ రాలేదు. మేమే కరెంటుకి ఇచ్చేసాము. ఆతర్వాత స్కూటర్ని ఇక్కడికి తెచ్చామని పోలీస్ చెప్పడంతో కృష్ణ ఆ స్కూటీ దగ్గరికి వెళ్లి చూస్తే బండికి నంబర్ లేదు. ఏదో అలా వేసిన నంబర్ కూడా గోకినట్టు ఉండడంతో నంబర్ సరిగ్గా కనబడలేదు . ఇంకాస్త ముందుకెళ్లి చూడగా బ్యాటరీ పగిలిపోయి ఉంది . అద్దాలు కూడా పగిలిపోయి ఉన్నాయి . సగం మిగిలిన అద్దంపై ఒక రూపాయి పేస్ట్ చేసి దానిపై ఎల్వి అని రాసి ఉంది. ఇది కచ్చితంగా లవ్లీ బండి. ఎందుకంటే నేను ఆఫీసు నుండి బయటకు వస్తుండగా ఒకరోజు లవ్లీ స్టిక్కర్ ని పేస్ట్ చేస్తూ "ఇది పేదవాడి మొదటి పొదుపు మెట్టు " అని మాలతితో చెప్పడం నేను విన్నాను. అంటే లవ్లీ యాక్సిడెంట్లో చనిపోయినట్టే నా ! లవ్లీ, గీతిక, శ్రీహరి ముగ్గురు ఎందుకు ఆ రోజు కలిశారు అనే ప్రశ్నించుకొని అక్కడినుండి ఇంటికి వెళదామని అనుకున్నా పోవాలనిపించలేదు. కారణం గీతిక. " గీతిక కోసమే నేను దీన్ని కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకుని తీరుతాను. పోలీసుల వరకు వెళితే చాలా కష్టం. మా మామయ్య భుజంగం వరకు వెళితే చాం పెను ప్రమాదం. " కాబట్టి నేనే జాగ్రత్తగా డీల్ చేయాలి. అనుకొని అక్కడి నుండి ఆఫీస్ కి వెళ్లి చూస్తే అక్కడ గీతిక , లవ్లీ, మాలతి ముగ్గురు లేరు . గీతిక ఎందుకు రాలేదు, కనీసం లీవ్ లెటర్స్ అయినా పెట్టారా? అని చెక్ చేస్తే అవి కూడా లేవు . దీని వెనకాల ఏదో పెద్ద కథ జరిగినట్టు ఉంది అనుకుని గీతికకి కాల్ చేయగా తను లిఫ్ట్ చేయట్లేదు. ఇంతకీ తేనెలా ఉందో అసలు ఉందో లేదో! శ్రీహరి తనని ఏమైనా చేశాడా? అని శతవిధాల ఆలోచించి తన మనసు సతమతమైపోతుంటే భుజంగం ఫోన్ చేయడంతో వెంటనే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసాడు కృష్ణ. "అతను జలగ లాంటివాడు వెళితే ఎలాంటి విషయాన్ని అయినా సునాయాసంగా బయటికి రప్పిస్తాడు. " అనుకొని అక్కడి నుండి వెళుతూ ఉంటే ఒక అమ్మాయి తనను ఢీ కొట్టి వెను తిరిగి చూస్తే స్కార్ఫ్ వేసి ముఖానికి కప్పి ఉంది కానీ ఆమె చూపుల్లో ఏదో తేడా కొడుతోంది అనుమానం వచ్చి అమ్మాయిని పలకరించగా వినపడనట్లు వడివడిగా పోతుంటే ఆమెకు తెలియకుండా అనుసరించాడు కృష్ణ .