ప్రియా కంట్లో నీరు చూడగానే శైలు చాలా బాధపడుతుంది ఆ పేరు తీసి ఉండకూడదు అని అనుకుంటుంది.
నిఖిల్ వెంటనే ప్రియా దగ్గరికి వెళ్తాడు తనని కన్సల్ చేయడానికి " స్వీటీ ప్లీజ్ ఏడవకురా, నిన్ను మేము ఇలా చూడలేము" అని అంటాడు.
ప్రియా కంట్లో నీరు చూసిన ప్రేమ్ కూడా వెంటనే సిద్దు ని పక్కనే ఉన్న నితిన్ చేతిలో పెట్టి ప్రియా ని హాగ్ చేసుకుంటాడు. " ప్రియా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్" . అని అంటూ ప్రియ వెన్ను నిమురుతూ ఉంటాడు.
ప్రియా ప్రేమ్ ని పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటుంది.
నిఖిల్ ఇంకా ప్రేమ్ ఇద్దరూ కలిసి ప్రియని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటారు.
ప్రియ నీ అలా చూస్తుంటే అక్కడి వారికి బాధగా ఉంది. శైలు కి చాలా గిల్టీ గా ఉంది , తన వల్లే ఇప్పుడు ప్రియ ఇలా ఏడుస్తుంది అని.
నితిన్ కూడా ప్రియా దగ్గరికి వెళ్లాలి అనుకుంటాడు కానీ ఈలోపలే , ప్రేమ్ అలా సిద్దు ని తన చేతిలో పెట్టగానే గుండె ఆగినంత పని అవుతుంది.
‘ చచ్చాను రా దేవుడా! ... వీడు ఏంటి దీన్ని నా చేతిలో పెట్టాడు" అనీ సిద్ధూ వైపు చూస్తూ భయపడుతూ ఉంటాడు.
నితిన్ కి ఇంతకుముందు సిద్ధూ తో ఉనా ఎక్స్పీరియన్స్ గుర్తుకు వచ్చి కంగారు పడతాడు , తన ఒళ్లంతా కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి .
సిద్ధూ నితిన్ వైఫై కోపంగా చూస్తూ ఉంటుంది.
సిద్దు నితిన్ నీ కొరకడానికి తన నోరు తెరిచేలోపు నితిన్ టెన్షన్లో వెంటనే సిద్దు ని పక్కనే ఉన్న అరుణ్ చేతిలో పెడతాడు.
అరుణ్ తన చేతిలోకి వచ్చిన సిద్దు నీ చూసి కంగారు పడిపోతూ " ఒరేయ్ దరిద్రుడా దీన్ని నా చేతిలో పెట్టావ్ ఏంటి రా" అని అరుస్తాడు.
వెంటనే అరుణ్ కి ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న శైలు చేతిలో దాన్ని పెడతాడు.
శైలు చేతిలోకి సిద్దు అలా సడన్గా వచ్చేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాదు, సిద్దు మీద ఉన్న భయంతో గట్టిగా అరుస్తుంది. " ఆ....!.. నిఖిల్...! దీని నుంచి నన్ను కాపాడరా... !నాకు అసలే ఇంజక్షన్స్ అంటే భయం" అని అరుస్తుంది.
సిద్ధూ కి తనని అందరూ ఒకరి చేతిలో నుంచి మరొకరు అలా మారుస్తూ ఉంటే దానికి ఇంకా కోపం వస్తుంది కోపంతో సౌండ్ చేస్తూ ఉంటుంది.
సిద్దు అలా సౌండ్ చేసేసరికి శైలు కంగారులో ఏమి చేయాలో అర్థం కాక దానిని అక్షయ చేతికి ఇస్తుంది, " ఒసేయ్ దీని నాకిచ్చావ్ ఏంటే ? ఆ..! " అని భయపడిపోతూ శైలు మీద అరుస్తుంది అక్షయ.
అక్షయ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిని ఆదిత్య చేతికి ఇస్తుంది.
ఆదిత్య తన చేతిలోకి వచ్చిన సిద్దు ని చూసి కొంచెం భయపడతాడు ఎందుకంటే సిద్ధూ కోపం గా ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది . ఆదిత్య కి ఇంతకుముందు ఎప్పుడు తాబేలు పట్టుకున్న ఎక్స్పీరియన్స్ లేదు అందులోనూ ఈ తాబేలు కొంచెం వైల్డ్ అని విన్నాడు , ఫస్ట్ వీలు చెప్పిందేమీ నమ్మలేదు కానీ ఇప్పుడు ఆ తాబేలు కోపంగా చూస్తూ ఉంటే కొంచెం భయం వేసింది ఆదిత్య కి, ఎక్కడ కరుస్తుంది ఏమో అని.
సిద్ధూ నోరుని ఆదిత్య వైపు పోనిచడానికి ట్రై చేస్తుంది . ఆదిత్య అది వెంటనే పసిగట్టి తనని ఎక్కడ కరుస్తుందో అని తిరిగి నితిన్ చేతికి ఇస్తాడు.
తిరిగి తిరిగి అది మళ్లీ నితిన్ చేతికి వచ్చేపాటికి ఈసారి నితిన్ కు ఇంకా భయం వేస్తుంది .
" మళ్లీ చచ్చానురా దేవుడా " అని మళ్ళీ అరుస్తూ దాన్ని అరుణ్ చేతికి ఇస్తాడు.
అరుణ్ మళ్ళీ దాన్ని శైలు చేతిలోకి ఇస్తాడు.
శైలు అక్షయ చేతిలోకి ఇస్తుంది.
అక్షయ మళ్లీ ఆదిత్య చేతిలోకి ఇస్తుంది .
అది మళ్ళీ నితిన్ చేతిలోకి ఇలా వాళ్ళ సిద్దు నీ ఒకరి చేతిలో నుంచి ఒకరు మారుస్తూ రౌండ్స్ తిప్పుతూ ఉంటారు .
సిద్దు భయపడిపోయి తన కాళ్ళు , చేతులు తలకాయ ని డిప్పలోకి దాచేసుకుంటుంది .
అయినా సరే వీళ్ళు ఆ సిద్దు ని రౌండ్స్ తిప్పుతూనే ఉంటారు ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలోకి భయపడుతూ.
వీళ్ళ అరుపులకి ప్రియా, నిఖిల్ ఇంకా ప్రేమ్ వాళ్ల వైపు చూస్తే వాళ్ళు చేస్తున్న పనికి వల కళ్ళు పెద్దవి అవుతాయి .
ప్రియా ఏడవడం ఆపేసి కళ్ళు తుడుచుకొని అక్కడ జరిగేది చూస్తూ ఉంటుంది .
వీళ్ళు ఎంత గట్టిగా అరుస్తారు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు కూడా బయటకి పరిగెత్తుకుంటూ వస్తారు, అక్కడ జరుగుతున్నది చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు.
వాళ్లు సిద్దు ని ఒకరి చేతిలో నుంచి ఒకరు మార్చుకుంటూ ఉన్నారు. చాలా ఫాస్ట్ గా. వాళ్లు ఒకరి చేతిలో నుంచి ఒకరికి మార్చి మార్చి అలా సిద్దు ని తిప్పుతుంటే వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది.
వీళ్లు అలా సిద్దు ని ఒక బాల్ లాగా చేసి ఒకరి చేతిలో నుంచి ఒకరు క్యాచ్ పడుతుంటే ప్రియా కి కోపం , జల్లి అలాగే ఫన్నీగా కూడా అనిపించింది.
ముందుగా ప్రేమ్ రియాక్ట్ అయ్యి వెంటనే వెళ్లే సిద్దు ని వాళ్ళ చేతిలో నుంచి తీసుకుంటాడు.
పాపం సిద్దు 🐢😵💫🫨😵💫😵💫. దానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి వాళ్ళు చేసిన పని వల్ల
ప్రేమ్ అలా సిద్ధూ నీ తీసుకునే సరికి అందరూ ఊపిరి పీల్చుకుంటారు " బతికిపోయాం రా బాబు " అని అందరూ ఒకేసారి అంటారు.
ప్రియా సిద్దు కి ఏమైందో అని కంగారు పడుతూ ప్రేమ్ దగ్గరికి వెళ్లి సిద్దు ని చూస్తుంది.
సిద్దు మొత్తం లోపలికి ముడుచుకొని ఉంటుంది ప్రియా సిద్దు డిప్ప మీద నిమురుతూ " సిద్ధూ ఏం కాలేదుగా నీకు , నేను. ఒకసారి బయటికి రా" అని అంటుంది. కానీ సిద్దు బయటికి రాడు, ఎందుకంటే సిద్ధూ చాలా భయపడి పోయి ఉంది.
" పిచ్చి పట్టిందా మీ అందరికీ సిద్ధుని బాల్ లాగా చేసి ఆడుకున్నారు , అది నోరులేని మూగ జీవి దానితో ఇలాగైనా బిహేవ్ చేసేది " అని వాళ్ళ మీద అరుస్తుంది.
" దానికి నోరు లేదు కానీ, ఇంత ఇంత పళ్ళు ఉన్నాయి. నీకు గుర్తుందిగా ఆది నన్ను ఎలా కరిచిందో ఒకసారి" అని అంటాడు నితిన్ చిన్నగా.
ప్రియా కోపంగా నితిన్ మీద అరుస్తూ " నోరు ముయ్! అయినా అదంటే భయం ఉన్నవాడివి దానిని ఎందుకు పట్టుకున్నావ్ " అని నితిన్ నీ తిడుతుంది.
నితిన్ ఏదో చెప్పాలని మళ్ళీ నోరు తెరిచేలోపు ప్రియా నితిన్ వైపు వేలు చూపిస్తూ " నోరు ముయ్యమన్నానా " అని గట్టిగా అంటుంది.
నితిన్ తన మనసులో ' ఇదంతా ఆ ప్రేమ్ వల్లే వచ్చింది , ఆడు సిద్దు ని నా చేతిలో పెట్టకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు ఇదంతా వాడు కావాలని చేసి ఉంటాడు ' అని ప్రేమ్ వైపు ఉరిమి చూస్తూ ఉంటాడు.
ప్రియ మిగతా వాళ్ల వైపు చూసి " అయినా మీరందరూ ఏంటి దాని కిందకు వదలకుండా అలా బాల్ లాగా ఆడుతున్నారు అలా బాల్ లాగా దాని ఎవరైనా క్యాచ్ పడతారా, దానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలియదా" అని అరుస్తుంది.
ప్రియా వాళ్ళందరినీ తిట్టేసరికి , అందరూ వాళ్ళు చేసిన తప్పుకు అందరూ ఒకేసారి " సారీ ఏదో భయం వల్ల అలా చేశాను" అని అంటారు. అందులో ఆదిత్య గారు కూడా ఉంటారు.
" నాకు కాదు సారీ సిద్దుకి చెప్పండి సారీ" అని అరుస్తుంది.
ప్రియా ఫ్రెండ్స్ అండ్ ఇంక్లూడింగ్ ఆదిత్య కూడా సిద్దు వైపు చూసి " సారీ సిద్దు" అందరూ ఒకేసారి అంటారు.
ప్రియా వాళ్ళందరినీ అలా మందలిస్తూ ఉంటుంటే గాయత్రి గారు చూసి నవ్వుకుంటారు ఎందుకంటే అందులో తన పెద్ద కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి.
ప్రియా ప్రేమ్ దగ్గరికి వెళ్లి ప్రేమ్ చేతిలో ఉన్న సిద్దు ని చూస్తూ " దీనికి ఏం కాలేదు కదా" అని కొంచెం భయంగా అడుగుతుంది . ఎందుకంటే సిద్ధూ అసలు బయటికి రావట్లేదు.
ప్రేమ దానిని చూస్తూ " ఏమి కాలేదులే కొంచెం భయపడినట్లు ఉంది. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ కి ఇప్పుడే మెసేజ్ చేశాను వాడు వెటర్నరీ డాక్టర్ ఇంకా సేపట్లో వస్తాడు ఏమైనా ఇబ్బందిగా ఉందేమో వాడు చెక్ చేస్తాడులే " అని అంటాడు.
ప్రేమ్ అలా సిద్ధూ గురించి కేర్ తీసుకోవడంతో ప్రియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ప్రియా నార్మల్ అవడం చూసి కొంచెం రిలాక్స్ అవుతాడు నిఖిల్ . ' వీళ్ళ కంగారులో సిద్దు ని అలా చేస్తే చేశారు కానీ ప్రియ ని నార్మల్ చేశారు వీళ్ళందరూ' అని అనుకుంటాడు తన మనసులో.
ఇంతలా పెద్ద వాళ్ళందరూ అక్కడికి వస్తారు .
ప్రియా ఫేస్ కొంచెం ఏడ్చినట్లు కనిపించడంతో వాళ్ల కొంచెం కంగారు పడతారు ఏం జరిగిందో అని. ఊర్మిళాదేవి గారు " ఏం జరిగింది ఇక్కడ" అని అడుగుతుంది . ప్రియా ఎందుకు ఏడ్చిందో అర్థం కాక.
' ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలి అంటే ఫస్ట్ నుంచి ఏం జరిగిందో చెప్పాలి అందులో వీళ్లు మళ్లీ విన్ను పేరు గనక చెబితే మళ్ళీ ప్రియా అప్సెట్ అవుతుంది' అని అనుకున్నా నిఖిల్ " ఏం జరిగిందో అని తర్వాత చెప్తాలే నానమ్మ , అందరం లోపలికి వెళ్దాం పదండి , ఏదో పూజ చేయాలి అన్నావు కదా" అని అంటాడు. పెద్దవాళ్ల వైపు చూసి సైగ చేసి ఇప్పుడు వద్దు అన్నట్లు.
నిఖిల్ గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు రీసన్ లేకుండా టాపిక్ అలా డైవర్ట్ చేయడు. ప్రియా ఫేస్ చూస్తే బాగా ఏడ్చినట్లు వాళ్ళకి బాగా అర్థమైంది , కానీ నిఖిల్ అది ఇప్పుడు వద్దు అని అనడంతో , ఏదో జరిగిందని వాళ్ళు అర్థం చేసుకున్నారు తర్వాత ఏం జరిగిందో నిఖిల్ ఏ చెప్తాడు అని సైలెంట్ గా ఉన్నారు.
" అవును మర్చిపోయాను ప్రియా , ప్రేమ్ లోపలికి రండి నాన్న మీ ఇద్దరితో నిశ్చితార్థానికి ముందే పూజ చేయించాలి" అని అంటుంది ఊర్మిళాదేవి.
ప్రియా సిద్దు వైపు చూస్తూ " నానమ్మ సిద్దు చాలా భయపడిపోయింది దాని దగ్గర కొంచెం సేపు ఉండి దాని భయం తగ్గాక వస్తాను " అని అంటుంది.
" దాన్ని గోపి చూసుకుంటాడులే, ఇక్కడికి ఎవరి రాకుండా నేను చూసుకుంటాలే గాని ముందు లోపలికి పద దుర్ముహూతం వచ్చేస్తుంది , దుర్ముహుతంలో పూజా మొదలు పెట్టకూడదు" అని అంటారు ఊర్మిళాదేవి గారు.
" అది కాదు నానమ్మ సిద్దు నాతో తప్ప ఎవరితోనూ ఉండదు ఆ విషయం నీకు తెలిసిందే కదా, ఇప్పుడు సిద్దు చాలా భయపడిపోయింది దాన్ని అలా వదిలి ఎలా రమ్మంటావు" అని అంటుంది ప్రియా.
ఊర్మిళాదేవి గారు ఏదో చెప్పేలోగా ప్రేమ్ మాట్లాడుతూ " అమ్మమ్మ ఇది ఇప్పుడు మాతో పూజలో కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా " అని అంటాడు.
ప్రేమ్ ఐడియా ప్రియ కి కూడా నచ్చుతుంది ఎందుకంటే సిద్దు ని ఇప్పుడు ఈ టైం లో వదిలి వెళ్లడం ప్రియా కి కూడా ఇష్టం లేదు
ప్రేమ్ కి సిద్దు ని అలా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అందులోను సిద్ధూ ఇప్పుడు చాలా భయపడిపోయి ఉంది, కానీ వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడే పూజ చేయాలి అని అంటుంది అందుకని సిద్దు ని వాళ్ళతో తీసుకెళ్దాం అని అనుకుంటాడు ప్రేమ్.
ఊర్మిళ దేవి గారు ఏదో చెప్తాం అనుకునే లోగా శాస్త్రి గారు మాట్లాడుతూ " తప్పకుండా తీసుకురావచ్చు బాబు తాబేలు విష్ణుమూర్తి అవతారం అని అంటారు అది మీ పక్కన పెట్టుకుని పూజ చేస్తే పూజకి ఎంతో శుభ ఫలితం తగ్గుతుంది పదండి" అని అంటాడు.
ప్రియా ప్రేమ్ ని చూస్తూ " థాంక్స్" అని చిన్నగా చెప్తుంది.
ప్రేమ్ ప్రియా వైపు చూసి చిన్నగా నవ్వుతూ " సిద్దు నా దగ్గర సేఫ్ గానే ఉంటుంది కానీ , వెళ్లి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని రా ఇలా పూజా లో కూర్చుంటే బాగోదు , ఒకసారి నీ ఫేస్ చూసుకో" అని అంటాడు.
నిఖిల్ శైలు దగ్గరికి వెళ్లి " స్వీటీ ఫేస్ కొంచెం కాడికి తనని పూజ దగ్గరికి తీసుకురా, అలాగే ప్రియా దగ్గర ఏ టాపిక్స్ తీసుకు రాకూడదో నీకు బాగా తెలుసు నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా" అని కొంచెం సీరియస్ గానే అంటాడు.
శైలు చిన్నగా సారీ చెప్తుంది .
" నాకు తెలుసు నువ్వు కావాలని చేయలేదు అని కానీ ఒకసారి చూసి మాట్లాడితే మంచిది ఇకపైన ఓకేనా " అని మృదువుగా చెప్తాడు.
శైలు అర్థమైనట్లుగా తలకాయ ఊపి ప్రియా దగ్గరికి వెళ్లి " స్వీటీ రా " అని ప్రియా ని లోపలికి తీసుకువెళ్తుంది.
కొంచెం సేపటి తర్వాత హాల్లో తయారు చేసిన స్టేజి మీద ప్రియ ఇంకా ప్రేమ్ ఇద్దరు కలిసి పూజ మొదలు పెట్టారు, సిద్దు నీ ప్రేమ్ తన ఒడిలో ఉంచుకొని పూజ చేస్తున్నాడు. సిద్దు తన తల మాత్రమే బయట పెట్టి అక్కడ జరుగుతున్నది అంతా కూడా వింతగా చూస్తూ ఉంటుంది కానీ సైలెంట్ గానే ఉంటుంది. వాళ్లు ఇద్దరూ శాస్త్రి గారు చెప్పింది చేస్తున్నారు. పూజలో ప్రేమ్ తెచ్చిన రింగ్స్ పెట్టీ ఉనాయి.
ప్రియా ఏ అల్లరి చేయకుండా బుద్ధిమంతురాలు లాగా పూజ అంతా కూడా సవ్యంగా పూర్తి చేస్తుంది ప్రేమ్ తో కలిసి.
వాళ్ళిద్దరితో గణపతి పూజ చేయించిన శాస్త్రి గారు వాళ్లతో మాట్లాడుతూ " ఈ పూజ చాలా దివ్యంగా జరిగింది, అందులోనూ మీ మధ్యలో ఈ తాబేలు పెట్టుకొని చేశారు కాబట్టి , మీకు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది , మీ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు రావు"
"ఇష్ట కామ్య పరిశీధిరస్థు" అని వాళ్ళ ఇద్దరిని దీవిస్తాడు.
ప్రేమ్ వైపు చూసి " నీ సంకల్పం గొప్పది నాయన ఈ పెళ్లి కచ్చితంగా జరిగి తీరుతుంది నీకు ఆ కృష్ణయ్య దీవెనలు ఎల్లవేళలా ఉంటాయి" అని అంటాడు శాస్త్రి గారు.
ప్రేమ్ ప్రియా చేతిని పట్టుకొని వెళ్లి శాస్త్రి గారి దగ్గర కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు.
శాస్త్రి గారు వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా దీవించి వాళ్ళని పైకి లేపి ప్రేమ్ వైపు చూస్తూ " నువ్వు కోరుకున్నట్లుగానే ఈ పెళ్లి జరుగుతుంది నాయనా, ఈరోజు నుంచి తన చెయ్యి విడవకు అది ఎంత కష్టమైనా సరే నీ మనసు గాయపడిన సరే ఎప్పటికీ ఈ చేయి విడవకు ఒకసారి ఈ చేయి విడిచావో ఆ కృష్ణయ్య కూడా మిమ్మల్ని కలపలేడు" అని తూచాయగా ప్రేమ్ కి అర్థం అయినట్లు కానట్లు చెప్తాడు.
ప్రేమ్ కి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు , కానీ ప్రియా చెయ్యి పట్టుకొని " ఈ చేయి నా శ్వాస వదిలే వరకు కూడా వదిలిపెట్టను శాస్త్రి గారు " అని అంటాడు.
ఆయన చిన్నగా నవ్వుతూ ప్రియా వైపు చూసి " ఆ కృష్ణయ్య నీకు ఒకటి దూరం చేశాడు అంటే ఆది రెట్టింపుగా నీకు ఇస్తున్నాడు అని అర్థం, నీ భర్త గురించి అనువానువ్వు తెలుసుకో ఒకసారి నీకు తెలిసిన తర్వాత అతని నువ్వు ఎప్పటికీ వదులుకోలేవు తల్లి " అని ప్రియా తల మీద నిమ్మరతూ చెప్తాడు.
ఆయన చెప్పింది ప్రియా కి కూడా ఏమీ అర్థం కాదు అప్రయత్నం గా ప్రేమ్ వైఫై చూస్తుంది.
కొనసాగుతుంది ....
వీళ్ళ జీవితంలో ముందు ముందు ఏం జరగబోతుంది? ప్రేమ్ మనసు గాయపడేలాగా ఏం జరుగుతుంది? ప్రియ మనసు మారుతుందా ? ప్రేమ్ మీద ప్రియ కి ప్రేమ కలుగుతుందా.?....
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.