you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 27

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 27

వచ్చిన గెస్ట్లు అందర కూడా ప్రియా ఇంకా ప్రేమ్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫొటోస్ దిగతు వెళ్తూ ఉన్నారు. ప్రియా కి అదంతా కూడా నచ్చకపోయినా వచ్చిన వాళ్ళందరిని కూడా చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంటు ఉంది. 
ఊర్మిళ దేవి గారు , జగదీష్ చంద్ర, గుర్దీప్ , గాయత్రి ఇంకా సునంద వచ్చిన గెస్ట్లు లతో మాట్లాడుతూ , వెళ్ళిపోతున్న వాళ్లకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు.

అరుణ్ , నితిన్, నిఖిల్, శైలు, అక్షయ ఇంకా ఆదిత్య స్టేజి  పక్కన చైర్స్ వేసుకొని సెటిల్ అయ్యారు, ప్రియా ఇంకా ప్రేమ్ కి కొంచెం దూరంలో. 

వీళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ఒక అజ్ఞాత వ్యక్తి ప్రియా వాళ్ళింట్లోకి ఎవరో గమనించని టైంలో దొంగతనంగా జొరబడతాడు.  అతను ఎవరికీ కనపడకుండా కొంచెం దూరంలో దాక్కొని అతను మందుగా తెచ్చుకున్న గన్ కి సైలెన్సర్ ఫిక్ చేసుకుని ప్రియా వైపు ఎయిమ్ చేసి అవకాసం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.

కొంచెం సేపటికి గెస్ట్లు  చాలావరకు వెళ్లిపోవడంతో ప్రియా స్టేజి మీద ఉన్న సోఫాలో నీరసంగా కూలబడిపోయింది . 
ప్రేమ్ ప్రియ నీ చూసి చిన్నగా నవ్వుతూ " ఏంటి బంగారం అలసిపోయావా " అని అడుగుతాడు.

ప్రియా నీరసంగా మొహం పెట్టి అవును అన్నట్లు తలకాయ ఊపుతుంది. 

ప్రేమ్ ప్రియా కోసం ఏమైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకొద్దాం అని అలా తిరిగాడో లేదో , ఇంతలో ప్రియా మందికి ఒక జ్యూస్ గ్లాస్ వస్తుంది అది తెచ్చింది నితిన్. 

ప్రియా ఆ జ్యూస్ క్లాస్ వైపు నితిన్ వైపు చూసి "థాంక్స్ రా నువ్వు ఒక్కడివేరా నన్ను అర్థం చేసుకున్నావు " అని నీరసంగా అంటూ ఆ జ్యూస్ గ్లాస్ తీసుకుని గటగట తాగేస్తుంది.

నితిన్ ప్రియా వైపు ప్రేమగా చూస్తూ " నీ గురించి నాకు అని తెలుసు రా. నేను మాత్రమే నిన్ను ప్రేమగా చూసుకోగలను , కొంతమంది ఉంటారు ప్రేమిస్తున్నానని మాటల చెప్తూ ఉంటారు కానీ ఏ మాత్రం పట్టించుకోరు"  అని అంటాడు , ఒకంట ప్రేమ్ వైపు చూస్తూ.

శైలు నితిన్ కి ప్రియ పట్ల ఉన్న కేరింగ్ చేస్తూ ఉంటే చాలా సంతోషం కలిగింది.

" నితిన్ ప్రియా ని చాలా కేర్ చేస్తాడు కదూ"  అని చిన్నగా అంటుంది .
ఆ మాటలు విన్న నిఖిల్ "  అంటే మన ఎవరికీ దాని మీద కేరింగ్ లేదనా " అని అంటాడు.

శైలు నితిన్ వైపు చూస్తూ " అది కాదు నిఖిల్ నువ్వు నన్ను ఎలా కేరింగ్ చేస్తావో , నితిన్ కూడా ప్రియా ని అలాగే కేర్ చేస్తూ ఉంటాడు "  అని అంటుంది.

నిఖిల్ శైలు వైపు అనుమానంగా చూస్తూ " నీ బుర్రలో పిచ్చిపిచ్చి ఆలోచనలు ఏమీ తీసుకు రావట్లేదు కదా " అని అంటాడు.

శైలు ఏదో చెప్పాలని అనుకునే లోపు నిఖిల్ శైలుని ని ఆపేస్తూ " వద్దు శైలు అలాంటి ఆలోచనలు కూడా రానివ్వకు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది ప్రియా ప్రేమతో ఉంటేనే చాలా సేఫ్ గా ఉంటుంది , నితిన్ తో కాదు , ఇంకా ఈ డిస్కషన్ అనవసరం సైలెంట్ గా ఉండు " అని అంటాడు.

శైలు ఆలోచనలో పడుతుంది  " ఒకవేళ నితిన్ ప్రియ నీ ప్రేమిస్తున్నాడు అని చెప్తే , నిఖిల్ , నితిన్ కి సపోర్ట్ చెయ్యడు , ప్రేమ్ కె సపోర్ట్ చేసేలాగా ఉన్నాడు , పాపం నితిన్ నేనే వాడికి సపోర్ట్ చేయాలి"  అని అనుకుంటుంది.

ప్రేమ్ కి నితిన్  ఇంటెన్షన్స్ అర్థమైన అదేమీ పట్టించుకోకుండా , ప్రియా కి జ్యూస్ తెచ్చి ఇచ్చినందుకు " థాంక్యూ బాస్ నా వైఫ్ కి జ్యూస్ తెచ్చి ఇచ్చినందుకు నేనే ఇప్పుడు తెద్దాం అనుకుంటున్నాను " అని అంటాడు.

" అనుకోవడంలో , చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంది బాస్"  అని అంటాడు నితిన్.
ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా చిన్న నవు నవ్వి ఊరుకుంటాడు.

ప్రియా కాళీ అయిన గ్లాస్ నితిన్ చేతికి ఇచ్చే"  థాంక్స్ రా " అని అంటుంది.

" స్నాక్స్ ఏమైనా తీసుకురానా స్వీటీ తింటావా"  అని మృదువుగా అడుగుతాడు నితిన్ .

ప్రియా ఒకసారి టైం చేసుకొని " ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది కదా ఒకేసారి లంచ్ చేసేద్దాం లే " అని అంటుంది.

గుర్దీప్ , జగదీశ్ చంద్ర , ఊర్మిళాదేవి గారు ఇంకా సునంద బయట గెస్ట్ లనూ సెండ్ ఆఫ్ చేసుకుంటూ  ఉంటారు. 

గాయత్రి గారి వచ్చి ప్రేమ్ ఇంకా ప్రియా వైపు చూసి " పిల్లలు లంచ్ టైం అయిపోయింది కదా , వెళ్లి చేస్తారా ఇక్కడికి తీసుకు రమ్మంటారా"  అని అడుగుతుంది .

" మేమే వెళ్తే తినేసి వస్తాము అత్తయ్య" అని అంటుంది ప్రియా. 

" సరే అయితే ఎలాగో ఫంక్షన్ కంప్లీట్ అయిపోయినట్లే వెళ్లి భోజనం చేసేయండి"  అని అంటుంది గాయత్రి గారు .

" ఓకే మామ్ " అని అంటాడు ప్రేమ్.

అక్షయ మాట్లాడుతూ " లాస్ట్ గా మనమందరం కలిసి ఒక ఫోటో దిగి లంచ్ ఏరియా కి వెళ్లి పోదాం"  అని అంటుంది.

" సరే అయితే త్వరగా కానివ్వండి లంచ్ టైం అవుతుంది " అని అంటారు గాయత్రి గారు.

ఫ్రెండ్స్ అందరూ కూడా సరే అని అనుకొని అందరూ కూడా ప్రియా ఇంకా ప్రేమ్ పక్కన నుంచుంటారు నితిన్ మాత్రం ప్రియా పక్కకి నంచుంటాడు . ప్రియ కి అటు నితిన్ ఇటు వైపు ప్రేమ్ ఉంటారు.

ఫోటోగ్రాఫర్ విల్లా ఫొటోస్ తీస్తూ ఉండగా . ఎయిమ్ చేసిన గన్ తో రెడీగా ఉన్నాడు అజ్ఞాత వ్యక్తి.

ప్రియ ప్రేమ్ కి క్లోజ్ గా నుంచోకుండా నితిన్ కి క్లోజ్ గా నుంచుంటుంది,  ఆది చూసి ప్రేమ్ ప్రియ నీ తన వైపుకు లాకుంటాడు, అదే టైమ్ కి  కరెక్ట్ గా ప్రియ వెనకాల ఉనా బెలూన్ బ్లాస్ట్ అవుతుంది.

దానితో అందరూ టెన్షన్ పడతారు ప్రియ గురించి .
కానీ  ప్రేమ్ ఇంకా నిఖిల్ అలెర్ట్ అయ్యి చుట్టూ చూస్తూ ఉంటారు. వాళ్ల ఇద్దరి కళ్ళు కూడా డేంజరస్ ఇంకా కోపంగా మారిపోతాయి.

అజ్ఞాత వ్యక్తి ప్రియా కి ఏం చేసి షూట్ చేసే టైంలో ప్రేమ్ తనని పక్కకి లాగడంతో ప్రియా కి ఏం చేసిన బుల్లెట్ , మిస్ అయి ప్రియా వెనకాల అన్న బెలూన్ కి తగులుతుంది. అతను వెంటనే అలెర్ట్ అవుతూ అక్కడ నుంచి  పారిపోతాడు.

బెలూన్ బ్లాస్ట్ సౌండ్ కి ప్రియా భయపడిపోయి పానిక్   అవుతూ తన చెవుల మూసుకుంటుంది . ప్రేమ్ ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తనని  గట్టిగా హాగ్ చేసుకుంటాడు. అతని కళ్ళ మాత్రం చుట్టూ స్కాన్ చేస్తూ ఉంటాయి. 

నితిన్ ప్రియా ని తన చేతిలోకి తీసుకుందాం అనుకుంటే ఫ్రేమ్ కళ్ళు ఎర్రగా ఉండడం,  అందులోను ఫ్రేమ్ మొహం ఎర్రగా కోపంతో ఉన్నట్లు కనిపించడంతో కొంచెం భయపడి వెనక్కి అడుగు వేస్తాడు.నితిన్ కి ఆ టైంలో ప్రేమ్ నీ చూస్తుంటే  చాలా భయం వేసింది.  
' వీడేంటి ప్రియా ని నా చేతిలో తీసుకుందామనుకుంటే  ఇంత కోపంగా చూస్తున్నాడు ' అని తన మనసులో అనుకుంటాడు.

ప్రేమ్ మొహం కోపం గా  కనిపిస్తూ ఉండడంతో అందరికీ ప్రేమ్ ఎందుకంత కోపంగా అన్నాడో అక్కడ ఉన్న వారు ఎవరికి కూడా అర్థం కాదు.

చుట్టూ స్కాన్ చేస్తున్న ప్రేమ్ కళ్ళకి ఒకచోట అనుమాన స్పదంగా కనిపిస్తుంది . ప్రేమ్ నిఖిల్ వైపు చూస్తాడు,  అదే టైమ్ కి  నిఖిల్  కూడా ప్రేమ్ వైఫై చూస్తాడు .  ప్రేమ్ కళ్ళతో అటువైపు అన్నట్లు సైగ చేస్తాడు.

నిఖిల్  సడన్ గా అక్కడి నుంచి పరిగెడతాడు .శైలు ఇంకా తన ఫ్రెండ్స్ కి నిఖిల్ ఎందుకు అలా సడన్ గా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లాడో అర్థం కాదు.

నిఖిల్ సంగతి మర్చిపోయి ప్రియా కి ఏమైందన్నా కంగారులో అందరూ ప్రియా దగ్గరికి వస్తారు. కానీ ప్రేమ్ ఎవరిని దగ్గరికి రానివ్వడు. ప్రియ నీ  గట్టిగా హగ్ చేసుకుని చుట్టూ కోపంగా చేస్తూ ఉంటాడు. 
ప్రేమ్ బిహేవియర్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది అక్కడ ఉన్న వారందరికీ. 

ఆదిత్య కి  తన తమ్ముడి మొహంలో ఉన్న కోపం చూసి ఆశ్చర్యపోతాడు.  ఎందుకంటే ప్రేమ్ కి సామాన్యంగా కోపం రాదు ఇప్పుడు ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు. 

ప్రేమ్ కలలో కోపం చూసిన గాయత్రి గారికి ఏమీ అర్థం కాదు.  ఆవిడ మెల్లగా కొడుకు దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి " ఏమైంది నాన్న"  అని చిన్నగా అడుగుతుంది.

ప్రేమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రియా వైపు చూస్తాడు ప్రియ అప్పటికే సృహతప్పి ఉంది ఉంటుంది.

తనని ఎత్తుకొని ప్రియా గది వైపే నడుస్తాడు అందరూ కూడా ప్రేమ్ వెనకాల వెళ్తారు.  ప్రియా ని మెల్లగా తన బెడ్ మీద పడుకోపెట్టి "  టాబ్లెట్స్ " అని నితిన్ వైపు చూసి అడుగుతాడు. 

ప్రేమ్ వాయిస్ లోనీ బేస్ నెస్ కి కొంచెం దడుచుకున నితిన్ వెంటనే ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుని ఆ టాబ్లెట్స్ దాంట్లో డిసాల్వ్ చేసి ఆ గ్లాస్ ప్రేమ్ కి ఇస్తాడు.

ప్రేమ్ ఆ వాటర్ ని ప్రియా కి మెల్లగా పట్టించి తనకి దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు.

పని వాళ్ళ వల్ల విషయం తెలుసుకున్న జగదీష్ చంద్ర , ఊర్మిళా దేవి గారు, సునంద ఇంకా గుర్దీప్ కంగారుగా పైకి వస్తారు.

" ఇప్పుడు ఎలా ఉంది నా మనవరాలికి " అని కంగారు పడుతూ లోపలికి వస్తున్న ఊర్మిళాదేవి గారు నీ చూస్తూ గాయత్రి గారు " ఇప్పుడే టాబ్లెట్ వేసాము అమ్మ కొంచెం సేపటికి కోలుకుంటుంది"  అని అంటుంది.

సునంద గారు జగదీష్ చంద్ర వైపు చూసి "  మీకు అప్పుడే చెప్పాను ఆ బెలూన్స్ ఆ స్టేజి మీద వద్దు అని . మీరే అవి స్పెషల్ గా తెప్పించిన బెలూన్స్ ఏమీ కాదులే అని అన్నారు , ఇప్పుడు చూశారా ఏమైందో" అని ఏడుస్తూ అంటారు.

జగదీష్ చంద్ర  కూడా కొంచెం బాధపడుతూ " తప్పంతా నాదే వెంటనే ఆ బెలూన్ తీసేయమని చెప్తా"  అని అంటాడు.

ప్రేమ్ మాత్రం ప్రియా పక్కన అలా కూర్చుని ఏదో దీర్ఘాలోచన లో ఉండడం చూసిన గాయత్రి గారు "ఏమైంది నాన్న అలా ఉన్నావ్?, ప్రియా కి ఏమి కాదులే మేమందరం ఉన్నాం కదా"  అని అంటారు. 

ప్రేమ్ గాయత్రి వైపు చూసి " అమ్మ ప్రియా నీ జాగ్రత్తగా చూసుకో తన దగ్గరికి ఎవరు రాకూడదు , ఎవరు కూడా " అని ఒత్తి పలికి " నేను ఇప్పుడే వస్తాను, ప్రియా జాగ్రత్త " అని చెప్పి కిందకు వెళ్తాడు.
వెళ్తూ వెళ్తూ నితిన్ ఇంకా అరుణ్ వైపు చూసి " డోర్స్ అన్ని క్లోజ్ చేయండి బయట సాంగ్స్ ఏవి కూడా లోపలికి రాకూడదు"  అని చెప్పి వెళ్ళిపోతాడు.

అరుణ్ ఇంకా నితిన్ ఒకరి మొహాలు ఒకరి చూసుకుని "  వీడేంటి మనకి ఆర్డర్స్ ఇచ్చి వెళ్తున్నాడు " అని అనుకుంటారు.
ప్రియా గురించి ఆలోచించి డోర్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు. ప్రేమ్ చెప్పాడు అని కాదు ప్రియా గురించి ఆలోచించి. 

ఆదిత్య ప్రేమ్ ఎందుకలా ఉన్నాడు , ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రేమ్ వెనకాలే వెళ్తాడు.

ప్రేమ్ కోపంగా కిందకు వెళ్తుంటే నిఖిల్ ఎదురొస్తాడు .

ఒక ఉదుటున నిఖిల్ దగ్గరికి వెళ్లి " దొరికాడా వాడు" అని కోపంగా అడుగుతాడు .

ప్రేమ్ కోపానికి కొంచెం దడుచుకొన్న,  నిఖిల్ గట్టిగా ఊపిరి పీల్చుకొని " దొరికాడు , కానీ ప్రాణాలతో లేడు" అని చెప్తాడు.

ప్రేమ్ కోపంగా " ఎక్కడున్నాడు వాడు?"  అని అడుగుతాడు.

కొనసాగుతుంది....

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు. 

అవును ఇంతకీ ప్రియా అని చంపాలని చూసింది ఎవరు? మీకు ఎవరికైనా తెలుసా? .