వాళ్ల నాన్నగారు వెళ్ళిపోగానే అరుణ్ వాళ్ళ అమ్మ వైపు తిరిగి " అమ్మ నిన్ను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా" అని అడుగుతాడు.
" ఏంటి నాన్న అది" అని అంటుంది
" ప్రిఉష , ప్రియా నీ అలా ఆనందకు కొట్టావా లేకపోతే నీ కోపం అంతా తీర్చుకోవాలి ఇదే ఛాన్స్ అని కొట్టావా " అని అడుగుతాడు.
సంధ్య చిన్నగా నవ్వుతూ " నిజం చెప్పాలి అంటే ప్రియా ని అలా అన్నందుకు బాగా కోపం వచ్చి కొట్టాను , ఆఫ్ కోర్స్ అందులో అది కూడా ఒక రీసన్" అని అంటారు.
అరుణ్ కూడా చిన్నగా నవ్వుతూ " అంటే అత్తగారి పెత్తనం చూపిస్తున్నావన్నమాట" అని అంటాడు. మళ్లీ వెంటనే" డాడీ దాన్ని మార్చగలడు అని అంటావా?" అని అడుగుతాడు.
" చూద్దాం మేబి మారుతుందేమో, కానీ ఇప్పటినుంచి మీ డాడీ ఇంతకముందులా తనని వెనకేసుకు అయితే రాడు నాకు తెలిసి" అని అంటారు సంధ్యా.
*****
ప్రేమ్ ఊర్మిళ దేవి గారి గదిలో ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చుంటాడు.
ఇంట్లో ఆడవాళ్లు అంతా కూడా వంటగదిలో ఉంటారు అక్షయ ప్రెగ్నెంట్ అవడంతో హాల్లో కూర్చొని ఉంటుంది. ప్రియా మాత్రం బయట బాల్కనీలో ఫోన్ కాల్ లో ఉంటుంది.
ప్రేమ్ ని చూసి జగదీశ్ చంద్ర " సారీ ప్రేమ్ ఇప్పుడే అత్తయ్య చెప్పారు , నీ బెడ్ రూమ్ లో బాత్రూంలో వాటర్ ఇష్యూ వచ్చింది అని రేపు మార్నింగ్ కల్లా ఆ ఇష్యూ క్లియర్ అయిపోతుంది, ఈ లోపల నువ్వు వేరే రూమ్స్ లో అడ్జస్ట్ అవ్వచ్చు కదా " అని అంటాడు .
ప్రేమ్ చిరునవ్వుతో "పర్వాలేదు మామయ్య ఒక నైట్ కే కదా , ఐ కెన్ అడ్జెస్ట్ " అని అంటాడు.
జగదీష్ చంద్ర వాళ్ళ ఇంట్లో మొత్తం త్రీ ఫ్లవర్స్ ఉంటాయి కిందఫ్లౌర్ లో గెస్ట్ రూమ్ , వంటగది , పూజగది, స్టడీ రూమ్, మీటింగ్ రూమ్, అన్నీ కలిపి ఒక ఏడు(7) గదుల వరకు ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో పెద్దపెద్ద ఐదు బెడ్రూమ్ విత్ హాల్ ఉంటాయి , ఆ పై ఫ్లోర్లో త్రీ బెడ్ రూమ్స్ మిగతా ప్లేస్ అంతా కూడా పెద్ద హోల్ లాగా ఉంటుంది. ఈ త్రీ ఫ్లోర్స్ కి , పైకి కిందకి వెళ్లడానికి స్టెప్స్ తో పాటు లిఫ్ట్ కూడా ఉంటుంది.
సెకండ్ ఫ్లోర్ లో ప్రియా పేరెంట్స్ ఇంకా నానమ్మ ఉంటారు , ఇదే ఫ్లోర్లో గాయత్రీ గారి గది కూడా ఉంది అది జగదీష్ చంద్ర అలాగే ఉంచేశారు ఎప్పటికైనా వాళ్ళ అక్క వస్తుంది అనే నమ్మకంతో . టాప్ ఫ్లోర్ లో ప్రియా ఉంటుంది. మిగతా ఫ్లోర్లో రూమ్ కానా పైన థర్డ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ మోడరన్ ఇంకా చాలా అందంగా ఉంటాయి.
ఇప్పుడు గాయత్రి గారి ఫ్యామిలీ కూడా వీళ్ళ ఫ్యామిలీతో యాడ్ అవ్వడంతో సెకండ్ ఫ్లోర్ లో ఉనా గాయత్రి గారి రూమ్ ఆవిడ తీసుకోగా ఆదిత్య మాత్రం థర్డ్ ఫ్లోర్లో గది చూస్ చేసుకుంటాడు.
ఇన్ఫాక్ట్ ఆదిత్య చూస్ చేసుకున్నాక రూమ్ కోసం ప్రేమ్ ఇంకా ఆదిత్య కొట్టుకుంటారు, దానికి అక్షయ వన్ మంత్ తర్వాత ప్రేమ్ ఎలాగో ప్రియా రూమ్ లోకి షిఫ్ట్ అవుతాడు కాబట్టి అడ్జస్ట్ అవ మని చెప్తుంది. ప్రేమ్ అది కూడా కరెక్టే అని ఆ రూంలో అడ్జస్ట్ అవుతాడు . కానీ ప్రేమ్ బ్యాడ్ లక్ ఆ రూమ్ లోనీ బాత్రూం లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్రెష్ అవ్వడానికి ఊర్మిళాదేవి గారి గదిలో ఫ్రెష్ అయి వస్తాడు.
ప్రేమ్ కనుళ్లు అతని ప్రేయసి కోసం వెతుకుతూ ఉండగా అది గమనించిన అక్షయ " స్వీటీ కాల్ మాట్లాడుతుంది వచ్చేస్తుందిలే" అని అంటుంది చిన్నగా. ప్రేమ్ అడగకముందే .
ప్రేమ్ వెళ్లి అక్షయ పక్కన సెటిల్ అయ్యి " ఎవరితో వదిన అంతగనం మాట్లాడుతుంది కొంపతీసి ఆ నితిన్ గాడు గాని ఫోన్ చేశాడా" అని అడుగుతాడు.
ప్రేమ్ ఫైవ్ లో జెలసి చూసి అక్షయ చిన్నగా నవ్వుతూ " లేదు తను చదవకున్నా కాలేజ్ ప్రొఫెసర్ తో మాట్లాడుతుంది" అని అంటుంది.
ఇంతలో ప్రియా కాల్ ఎండ్ చేసి సంతోషంగా హాల్లోకి వస్తుంది తన మొహంలో సంతోషం చూసి జగదీష్ చంద్ర " ఏమైంది తల్లి అంత సంతోషంగా ఉన్నావు" అని అడుగుతాడు .
" అవును డాడీ ఇది చాలా గుడ్ న్యూస్" అని అంటూ ప్రియా వెళ్లి గుర్దీప్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆయన వైపు సంతోషంగా చూస్తూ "మావయ్య మా ప్రొఫెసర్ తిరిగి ఇండియా వస్తున్నారు. మనం రేపు వెళ్లి ఆయనని కలవాలి, నాతో పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి" అని అంటుంది.
గుర్దీప్ కి ప్రియా చెప్పింది ఏమీ అర్థం కాదు ’తన ప్రొఫెసర్ రావడానికి నేను పరిగెత్తడానికి సంబంధం ఏమిటి ’ అని అనుకుంటాడు అతని మనసులో.
గుర్దీప్ కె కాదు ప్రియా చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళ ఎవరికీ కూడా అంతగా అర్థం కాదు.
అక్షయ మాత్రం సంతోషంగా " నిజంగా ఆయన వస్తున్నాడా" అని అరుస్తుంది.
అక్షయ పక్కన కూర్చున్న ఆదిత్య అక్షయ అరుపులకి చెవులు మూసుకుంటూ " అబ్బా ఏంటే అలా అరుస్తున్నావు " అంటూ చెవులు రుద్దుకుంటూ "ఇంతకీ ఎవరు వస్తున్నారు , ఆయన వస్తే డాడీ పరిగెత్తడం ఏంటి,?" అని కన్ఫ్యూజ్ అవుతూ అడుగుతాడు.
" అయ్యో ఆది గారు మీకు ద గ్రేట్ న్యూరో సర్జన్ డాక్టర్ బెట్టల్ గారు తెలియదా" అని అడుగుతుంది అక్షయ.
ఆ పేరు వినగానే ఆదిత్య కళ్ళు పెద్దవి అవుతాయి "ఆయన నాకెందుకు తెలియదు ఆయన చాలా గ్రేట్ డాక్టర్ అయిన చేయి పడితే ఎటువంటి వ్యక్తి అయినా నడవాల్సిందే, కానీ ఆయన ఎక్కడ ఉంటాడు అనేది ఎవరికీ తెలీదు ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం, డాడీ ట్రీట్మెంట్ కోసం ఆయననే అప్రోచ్ అవుదాం అనుకున్నాం కానీ ఆయన వివరాలు ఏమీ మాకు తెలియలేదు, మాకు తెలిసిందల్లా ఆయన ఎవరికి స్టేట్మెంట్ చేయట్లేదు అని అయినా ఇప్పుడు ఆయన వయసు వల్ల రిటైర్మెంట్ తీసుకున్నాడు అని తెలిసింది . ఇప్పుడు ఆయన గురించి ఎందుకు" అని అడుగుతాడు ఆదిత్య.
ప్రేమ్ కూడా చాలా ట్రై చేస్తాడు ఆయన కోసం ఆయన వివరాలు తెలుసుకొని పర్సనల్గా వెళ్లి కలుస్తాడు కూడా కానీ ఆయన ట్రీట్మెంట్ ఇచ్చే పొజిషన్ లో ఉండడు ఆయన వయసు వల్ల ఇంకా ఆయన చేతులు సర్జరీ చేయడానికి కానీ ట్రీట్మెంట్ చేయడానికి కానీ సహకరించవు అని తెలుసుకొని వెనుతిరిగితాడు.
" ఆయన ప్రియ శిష్యురాలు ఎవరు కాదు మన ప్రియ , ప్రియా అంటే ఆయనకు చాలా ఇష్టం" అని చాలా గర్వంగా చెప్తుంది.
" ప్రియా ఆయన శిష్యురాలా?" అని అంటూ ప్రేమ్, ఆదిత్య అండ్ గుర్దీప్ షాక్ అవుతారు.
ఆదిత్య మాట్లాడుతూ " కానీ ఎలా ప్రియా ఫ్యాషన్ డిజైనింగ్ కదా చదువుకోండి ఆయన శిష్యురాలు అవ్వాలి అంటే డాక్టర్ చదివి ఉండాలి" అని కన్ఫ్యూజ్ అవుతూ అడుగుతాడు.
దానికే జగదీష్ చంద్ర మాట్లాడుతూ " ప్రియా చదివింది ఫ్యాషన్ డిజైనింగ్ కాదు డాక్టర్ కానీ తను ఆ ప్రొఫెషన్ కి గుడ్ బాయ్ చెప్పి ఫ్యాషన్ వరల్డ్ లో సెటిల్ అయ్యింది" అని కొంచెం డల్ గా చెప్తాడు.
దానికి ప్రియా వెంటనే మాట్లాడుతూ " డాడ్ ఇప్పుడు అదంతా అనవసరం. మా ప్రొఫెసర్ మామయ్యకి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు, రేపు వస్తాను అని అన్నారు ఇండియాకి. ఆయన ఒకసారి మావయ్యని చూస్తే మావయ్యకి కచ్చితంగా నయం అవుతుంది అన్న నమ్మకం నాకుంది చూస్తూ ఉండండి మావయ్య కచ్చితంగా అతని కాళ్ళ మీద నిలబడతారు" అని చాలా సంతోషంగా అంటుంది.
వెంటనే నిలబడి " ఈ విషయం వెంటనే అత్తయ్య కి నానమ్మ కి చెప్పాలి " అని అంటూ వంట గదిలోకి వెళ్తుంది ప్రియ.
ప్రియా వంటగదిలోకి వెళ్ళగానే ప్రేమ్ జగదీష్ చంద్ర వైపు చూసి " తను ఆ ప్రొఫెషన్ కి ఎందుకు గుడ్ బాయ్ చెప్పింది మామయ్య " అని అడుగుతాడు.
జగదీష్ చంద్ర కొంచెం బాధగా " నీకు చెప్పాను కదా ప్రేమ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆ ఇన్సిడెంట్ లో ప్రియా కోమాలోకి వెళ్ళింది . అదే టైంలో విన్ను చనిపోయాడు, తను సృహలో ఉండి ఉంటే ఆ అబ్బాయిని కాపాడుకోగలిగేదాన్ని అని బాధపడింది ప్రియా.తను ఎంతగానో ఇష్టపడి చదివిన చదువు తన వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకునే టైమ్ కి ఉపయోగపడలేదు అని , ఆ ప్రొఫెషన్ కి గుడ్ బాయ్ చెప్పేసింది , మేము ఎంత చెప్పినా కూడా మళ్ళీ అటువైపు వెళ్ళలేదు" అని బాధగా అంటాడు జగదీష్ చంద్ర.
" కానీ ఇందులో తన తప్పులేదు కదా మావయ్య" అని అంటాడు ఆదిత్య.
" అది మొండిది అది తను చెప్పిందే చేస్తుంది గాని పక్కన వాళ్ళు చెప్పింది అసలు వినదు" అని అంటుంది అక్షయ.
" ఆయన శిష్యురాలు అయ్యింది అంటే చాలా టాలెంటెడ్ అయ్యుంటుంది " అని అంటాడు ఆదిత్య.
"నా కూతురు అని కాదు కానీ తను చాలా క్విక్ లెర్నర్ , తన చిన్న వయసులోనే చాలా అవార్డ్స్ తెచ్చుకుంది అన్ని రంగాల్లో, అంతేకాదు చాలా చిన్న వయసులో చాలా అవార్డ్స్ గెల్చుకుంది తన ప్రొఫెషన్ లో, నా స్టడీ రూమ్ అంతా కూడా దాని అవార్డ్స్ తోనే నిండిపోయాయి " చాలా గర్వంగా చెబుతూ ఉంటాడు జగదీష్ చంద్ర.
" ప్రియా కి చిన్నప్పటినుంచి కూడా డాక్టర్ అవడం అంటే చాలా ఇష్టం కానీ దాన్నే వదులుకుంది " అని కొంచెం బాధగా అంటాడు.
ప్రేమ్ " డోంట్ వర్రీ మావయ్య నీ కూతురితో మళ్ళీ సెట్స్కోప్ పట్టిస్తాను చూస్తూ ఉండు" అని అంటాడు ప్రేమ్.
కొడుకు మాటలకు గుర్దీప్ " నా కొడకు ఏదైనా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు . ప్రియా నీ మళ్లీ నువు కోరుకున్నట్లుగా చూస్తావు" అని అంటాడు జగదీష్ చంద్ర వైపు చూస్తూ.
" ఆ పని చేయి ప్రేమ్ నీకు ఎంత రుణపడి ఉంటాను" అని అంటాడు జగదీష్ చంద్ర.
" కచ్చితంగా మామయ్య ఆరోజు తొందరలోనే వస్తుంది" అని అంటాడు ప్రేమ్ .
ఇంతలో సునంద ఇంకా గాయత్రి గారు వండిన వంట లన్నీ కూడా గార్డెన్ ఏరియా వైపు పని మనుషుల సహాయంతో చేరుస్తూ ఉంటారు .
అది చూసి జగదీష్ చంద్ర సునంద గారి వైపు చూసి "ఎక్కడికి శ్రీమతి గారు వంటలన్నీ గార్డెన్ ఏరియా పైపు తీసుకెళ్తున్నారు, డైనింగ్ ఏరియా ఇంట్లో ఉంది బయట కాదు, మర్చిపోయారా" అని అడుగుతాడు.
" ఈరోజు డిన్నర్ గార్డెన్ లో పున్నమి చంద్రుడి వెలుగులో చేద్దామని మీ అక్కయ్య గారి ఆలోచన అందుకే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాను" అని అంటారు సునంద గారు .
" వావ్ నైస్ ఐడియా" అని ఆదిత్య ప్రేమ్ ఇద్దరు ఒకేసారి అంటారు.
అంతలో ఊర్మిళాదేవి గారు ఆవిడ వేయించిన పచ్చడి పదార్థాలు దంచడానికి గార్డెన్ వైపు వెళ్తారు ఎందుకంటే అక్కడ ఒక రోలు ఉంటుంది .
ఊర్మిళా దేవి గారు ఎప్పుడు పచ్చడి చేసిన మిక్సీలో కాకుండా రోట్లో దంచడం ఆవిడకి బాగా ఇష్టం.
ఆవిడ వెనకాలే ప్రియా ఎంతో సంతోషంగా ఒక బౌల్ లో వేడి అన్నం తీసుకొని ఆవిడ వెనకాలే వెళ్తుంది.
వెళ్తూ వెళ్తూ హాల్లో కూర్చున్న వాళ్ళ వైపు చూసి జేమ్స్ బాండ్ లాగా వాళ్ల వైపు వేలు చూపించి "గోరుముద్దలు ఎవరికి కావాలి? కావాలి అనుకున్న వాళ్ళు ఫాలో మీ" అని అంటు డాన్స్ వేసుకుంటూ బుజ్జి కుక్క పిల్ల లాగా ఊర్మిళ గారి వెంట వెళ్తుంది.
ప్రియా లో మళ్లీ తన పాత అల్లరి కనిపించడంతో జగదీష్ చంద్ర చాలా సంతోష పడిపోతూ " పదండి వెళ్దాం" అని అంటాడు .
ఇంతలో ప్రేమ్ " ఇంతకీ ఈ గోరుముద్దలు కాన్సెప్ట్ ఏంటి మామయ్య" అని అడుగుతాడు .
జగదీష్ చంద్ర చిన్నగా నవ్వుతూ " నువ్వే చూద్దువు గాని పద" అని అంటూ గార్డెన్ ఏరియా లోకి నడుస్తాడు.
ఊర్మిళాదేవి గారు చిన్న స్టూల్ వేసుకొని కూర్చుని రోట్లో పచ్చడి దంచుతూ ఉంటారు.
ప్రియా ఊర్మిళాదేవి గారి మందు డాన్స్ , సారీ సారీ కుప్పిగంతులు వేస్తూ పాట పాడుతూ ఉంటుంది
దంచవే నా ముద్దుల నానమ్మ...
పచ్చడి దంచవే నా గుండెలదరా
హ... హ.... హహ... హ... హ
దంచవే నా ముద్దుల నానమ్మ...
పచ్చడి దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు...
అరె దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా.. కాస్త నొప్పి పెట్టినా...
ఆగకుండ.. ఆపకుండ
అందకుండ... కందకుండ...
దంచవే నా ముద్దుల నానమ్మ...
పచ్చడి దంచవే నా గుండెలదరా...
ఊర్మిళాదేవి గారు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఆవిడ పని ఆవిడ చేసుకుంటే పోతారు , ప్రియా ఎంత అల్లరి చేసినా పాటలు పాడిన సరే..
ప్రియా చేస్తున్న అల్లరికి గాయత్రి ఇంకా సునంద గారు నవ్వుకుంటూ అందరూ కూర్చోవడానికి శాప వేసి వండిన వంటలన్నీ ఆ శాప మీద నీటుగా ఆరెంజ్ చేస్తూ ఉంటారు.
ప్రేమ్ ప్రియా వైపు ఆరాధనగా చూస్తుంటే . ఆదిత్య ప్రియా వైపు ఆశ్చర్యంగా చూసి " ప్రియా ఇంత అల్లరి చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు" అని అంటాడు. ప్రియా పడుతున్న పాట , ఇంకా చేస్తున్న డాన్స్ స్టెప్స్ ఫన్నీగా అనిపించి.
పోటు మీద పోటు వెయ్యి...
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు...
కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి...
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు...
కుడి చేత కుదిపి కొట్టు...
ఏ చెయ్యి ఎత్తితేమి...
మరి ఏ చెయ్యి దించితేమి
హ... ఏ చెయ్యి ఎత్తితేమి...
మరి ఏ చెయ్యి దించితేమి
అహహహహ...
" ఇదేం చేసావ్ ముందు ముందు నువ్వే చూస్తావులే అది ఎంత అల్లరి పిల్లో" అని అంటాడు జగదీష్ చంద్ర, వెళ్లి శాప మీద కూర్చుని, గుర్దీప్ గారిని కూడా శాప మీద కూర్చో పెడుతూ.
ప్రేమ్ కూడా ప్రియా తో జాయిన్ అయ్యి తన పాటలో శృతి కలిపి తనతో డాన్స్ చేస్తూ ఉంటాడు.
అక్షయ కూడా వెళ్లబోతుంటే అది ముందుగానే గ్రహించిన ఆదిత్య తన చెయ్యి పట్టుకొని ఆపి "హలో ఎక్కడికి వెళ్తున్నావ్ అంత సీన్ లేదు ఈ బేబీ బంప్ తో డాన్స్ వెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందనుకో కళ్ళు విరగొడతాను , బుద్ధిగా వచ్చి ఇలా కూర్చో" అని అక్షయా ని బలవంతంగా తీసుకెళ్లి కూర్చో పెడతాడు. అక్షయ ఆదిత్య వైపు కోపంగా చూస్తూ కూర్చుంటుంది.
ఏ కంట పడితేమి...
ఎవ్వరేమంటే మనకేమి
ఏ కంట పడితేమి...
ఎవ్వరేమంటే మనకేమి
నువ్వు పుట్టంగానే...
బట్ట కట్టంగానే
నిన్ను కట్టుకునే హక్కున్న
పట్టాదారుణ్ణి నేను
దంచవే మేనమామ కూతురోయ్
వడ్లు దంచవే నీ గుండెలదరదరదర
ప్రేమ్ తిరిగి తిరిగి పాట తనమీద పడుతున్నాడని అర్థమై ప్రియ కూడా దానికి అనుకూలంగా పాడుతుంది
హా.. దంచుతా ఊర్మిళాదేవి మనవడా
నేను దంచితే నీ గుండె దడ దడ
హా.. హా.. హా.. హా.. హాహాహాహా
హా.. హా.. హా.. హా.. హాహాహాహా
ఈ లోపల ఊర్మిళాదేవి గారి పచ్చడి దంచడం అయిపోతుంది " పాట పాడింది చాల్లే గాని కూర్చోండి ముద్దులు పెడతాను" అని అంటుంది.
వెంటనే ప్రియా ఊర్మిళాదేవి గారి ఎదురుగా కూర్చుంటుంది మెరిసే కళ్ళతో, ప్రేమ్ ని కూడా తన పక్కన కూర్చోమన్నట్లు చేయి పెట్టుకొని లాగుతుంది కిందకి.
ఈ లోపల జగదీష్ చంద్ర, గాయత్రి గారూ, సునంద , అక్షయ కూడా వెళ్లి ఊర్మిల దేవి గారి దగ్గర కూర్చుంటారు.
గాయత్రి గారు అక్కడే కూర్చున్న ఆదిత్య వైపు గుర్దీప్ వైపు చూసి " అక్కడే కూర్చున్నారేంటి ఇటు రండి " అని పిలుస్తుంది.
గాయత్రి గారు ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాకపోయినా వాళ్ళందరూ వెళ్లి ఊర్మిళ దేవి గారి ఎదురుగా కూర్చుంటారు . గుర్దీప్ గారు ఆదిత్య సహాయంతో అక్కడికి వస్తారు.
ఊర్మిళాదేవి గారు నూరిన రోట్లో పచ్చడి తీసేసి ఆది కడగకుండా అందులోనే వేడి అన్నం వేసి ఆ రోట్లో పచ్చడి అన్నం కలిపి ముద్దలు చేసి అందరి చేతిలో ఒక ముద్ద పెడతారు.
( ఇలా ఎప్పుడైనా మీ అమ్మమ్మ గాని నానమ్మ గారి చేతితో రోటి పచ్చడి ముద్దలు తిన్నారా? ఇలా తింటే కామెంట్ చేయండి, నేను ఎక్కువగా మా నాన్నమ్మ చేతి రోటి పచ్చడి గోరుముదల్లి తినే దాన్ని . కానీ ఇప్పుడు ఆ రోటీ గోరుముద్దలు పెట్టడానికి ఆవిడ లేరు 😢)
ప్రియా ఆ పచ్చడి ముద్ద ఎంతో ఇష్టంగా తింటుంది.
" హమ్....నానమ్మ సూపర్" 👌🤤😋 అని అంటుంది.
ప్రేమ్, ఆదిత్య ఇంకా గుర్దీప్ కి అలా తినడం అదే మొదటిసారి కానీ ఆ ఒక ముద్ద ఎంతో రుచిగా అనిపిస్తుంది వాళ్లకి.
అలా అందరికీ రెండు ముద్దలు పెడుతుంది ఊర్మిళాదేవి గారు.
లాస్ట్ లో ఒక ముద్ద మాత్రమే మిగులుతుంది.
దానికోసం ప్రేమ్ ఇంకా ప్రియా చెయ్యి చాపుతారు నాకు పెట్టమంటే నాకు పెట్టమని...
ప్రేమ్ తనకి పోటీగా రావడంతో ప్రేమ్ వైపు ఉరిమి చూస్తుంది ప్రియా..
కొనసాగుతుంది...
ఇంతకీ ఆ రోటి పచ్చడి ముద్ద ఎవరికీ దొరుకుతుంది అంటారు? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.