ప్రభా అమ్మకు ఒంట్లో బాగోలేదని చూపించి ఇంటిలో వదిలి
అమ్మా నేను రామపురం వెళ్లాలని అనుకుంటున్నాను అని చెప్పాడు ప్రభ.
"ఇప్పుడు ఎందుకురా? " అడిగింది గౌరీ.
గోవిందు పెళ్లికి వెళ్లలేదు కదా. అందుకే ఒకసారి వెళ్లి పలకరిద్దామని అన్నాడు ప్రభ.
అవును కదా వాడి పెళ్లికి రమ్మని చెప్పాడు. అయినా నాకు జ్వరం రావడంతో వెళ్లలేకపోయాం. సరే నువ్వు వెళ్ళు మీ మేడంకి ఫోన్ చేశాను. తను రాత్రికి ఇక్కడికి వస్తానని చెప్పారు నువ్వు వెళ్లి త్వరగా వచ్చేయ్ అని చెప్పింది గౌరీ.
అమ్మకి చెప్పి రామాపురం వెళ్లి సర్పంచ్ ఇంటిదగ్గర బైక్ నిలపడంతో తాళం వేసి ఉంది . వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు అనుకుని పక్కనే నిలబడిన ఒక తాతను అడగడంతో "పెళ్లి పొలంలోని ఇంటి దగ్గరే చేశారని, పెళ్లి రోజు నుండి వారు పొలంలోని అక్కడే ఉంటున్నారు ."అని చెప్పడంతో సర్పంచ్ పొలంలో ఉన్న ఇంటికి వెళ్ళాడు ప్రభ. చీకటి పడుతోంది, త్వరగా మాట్లాడించి ఊరికి వెళ్ళిపోవాలి అనుకొని లోపలికి వెళ్ళగా లోపల ఒక ముసలమ్మ కనిపించింది.
ఎవరు కావాలి బాబు అడిగింది ముసలమ్మ.
'గోవిందు 'బదులిచ్చాడు ప్రభ.
ఇంట్లో వాళ్ళందరూ గోవిందు, లతికని తీసుకుని గుడికి వెళ్లారు. కాసేపట్లో వస్తారేమో అంటూ కుర్చీ చూపించగా అక్కడ కూర్చున్న తర్వాత 'ఈ స్వీట్ తీసుకో ' అని ఇవ్వడానికి రావడంతో వద్దు అని చెప్పలేక ఒక స్వీట్ తీసుకుని నోటిలో పెట్టుకుంటూ బయటికి వెళ్లి గేటు వైపు చూస్తూ ఉండగా సర్పంచ్ వచ్చాడు .
ప్రభ! ఎప్పుడొచ్చావ్ అమ్మకి జ్వరం తగ్గిందా అడిగాడు సర్పంచ్.
ఆ ,తగ్గిందండి చెప్పాడు ప్రభ.
రా లోపలికి వెళ్దాం లతక వాళ్ళు ఈపాటికి వచ్చేస్తుంటారు అని చెప్పడంతో సర్పంచ్ తో పాటు లోపలికి వెళ్ళగా మాటలతో గంట గడిచింది ఇంకా రాలేదు . ప్రభా మరొకసారి డోర్ వైపు చూడడంతో సర్పంచ్ ప్రభని చూసి' పాపం ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాడు ఏమో ' ఇంతవరకు ఏం చేస్తున్నారో అనుకొని టైం చూస్తే 7 దాటిపోయింది అనుకుంటూ ఉండగానే వచ్చారు గోవిందు లతికలు.
ప్రభ అందరిని మాట్లాడిoచి అక్కడినుండి ఫామ్ హౌస్ కి వెళ్ళాడు.
ఆరుబయట పున్నమి వెన్నెల కాంతిలో ఇద్దరూ చె
మంచం వేసుకొని చల్లని గాలి వేస్తూ ఉంటే మాటల్లో మునిగారు పతంగి , పెద్దాయన లిద్దరు.
ప్రభ బైక్ తీసుకొని రావడంతో లైట్ మంచం వైపు పడగా ఎవరని చూసిన పతంగి దగ్గరకొచ్చాక "ప్రభ ఉన్నట్టున్నాడే, ఈ టైంలో ఎందుకు వస్తున్నట్టు " అనుకొని "అయ్యగారు! ప్రభ " అనేసరికి లేచి కూర్చున్నాడు పెద్దాయన.
ప్రభ ఇద్దరినీ పలకరించి , వచ్చిన విషయం చెప్పడంతో "ఎలాగో వచ్చి గోవిందు ని పలకరించి మేలు చేశావులే లేదంటే వాడు ఎప్పుడూ ఏదో ఒక సాకుతో నిన్ను పెళ్లికి రాలేదని అంటూనే ఉంటాడు." అన్నాడు పెద్దాయన.
అరణ్య ! అడిగాడు ప్రభ.
అరణ్య లేదు. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్లిందని చెప్పాడు పెద్దాయన.
పతంగి! ప్రభ కి భోజనం పెట్టు అని పెద్దాయన అనడంతో వద్దు, నేను సర్పంచ్ వాళ్ళ ఇంటిదగ్గర తిని వచ్చాను .నేను రాత్రి 7:00 కల్లా వెనదిరిగి వెళ్లాలని వచ్చాను అయినా వెళ్లడానికి కుదరలేదు అక్కడ అమ్మకు బాగోలేదు చెప్పాడు ప్రభ.
ప్రభా !పడుకో ఉదయం త్వరగా లేచి వెళ్దువు గాని అన్నాడు పెద్దాయన.
అలాగేనండి అని ప్రభా అంటుంటే పతంగి మkరో మంచం తేవడానికి వెళ్లగా " అన్న! ఎక్కడుందో చెప్పు నేనే తీసుకొని వస్తాను అని వెళ్లి మంచం తీసుకుని వచ్చి మంచంపై తలవాల్చగా " వెన్నెల రాత్రి ఎంత అందమైనది "అని పెద్దాయన ఏదో చెబుతుంటే ముఖానికి రగ్గు కప్పుకున్న ప్రభ రగ్గు తీసి " గురూజీ ! మీరు కవితలు కూడా చెబుతారా 'అంటూ మాటలు కలిపి చివరికి పశువుల నాటువైద్యం టాపిక్ రావడంతో గురూజీ ఇంతకీ మీకు ఈ నాటువైద్యం నేర్చుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది అడిగాడు ప్రభ.
అదంతా ఒక పెద్ద కథ లేరా పడుకో ఇప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది అన్నాడు పెద్దాయన.
అయినా పర్లేదు నాకు ఆ కథ చెప్పండి ప్లీజ్ అని ప్రభ అడుగుతుంటే చెప్పసాగాడు పెద్దాయన.
* * *
మా నాన్న పశువుల నాటువైద్యం చేసేవారు. తనకి పొలం ఉన్న కొంచెం వ్యవసాయాన్ని చేసుకుంటూ మిగిలినది కౌలుకిచ్చి చేయించేవాడు. ఇంటికి సంబంధించిన ఇతరత్రా ఖర్చులన్నీ వైద్యం నుండే సంపాదించేవాడు. అలా తన చేతి గుణము ఏమో మంచి స్థాయికి చేరగలిగినాడు. నాకు మూగజీవాలంటే అసలు ఇష్టం ఉండలేదు. నాన్న మా ఇంట్లో ఎన్నిసార్లు పెంచుకున్న జీవుల్ని మచ్చిక చేయాలని చూసిన అసహ్యించుకునేవాడిని. తనే పశువుల పేడ తీసేసేవాడు. వాటికి సంబంధించి అన్ని విషయాలు చక్కగా చూసుకునేవాడు . మా నాన్న ఒకసారి ఒక జత గిత్తల్ని తీసుకొచ్చాడు .వాటిని రామలక్ష్మణాన్ని పేరు ముద్దుగా పిలుచుకునేవాడు.
ఒకసారి నేను చదువుకునే టౌన్ కి బయట ఎద్దుల పోటీ ఉండడంతో నన్ను అక్కడికి రమ్మని చెప్పాడు . అయినా నాన్న వెళ్ళకపోతే ఏమంటారొ అని బలవంతం మీద మనసునొప్పించి వెళ్ళాను.
నడివయిస్తున్న నాన్న ఎద్దులను పట్టుకుని ఎంత హుషారుగా వాటి తలని, మోపురాన్ని ముద్దు పెట్టుకొని రెండూ ఎద్దుల తలని రెండు చేతులతో పట్టుకొని తన తల దగ్గరకు తీసుకుని ఏదో చెబుతున్నట్టున్నాడు. అందులో రాము నాన్నని నాలుకతో నాకుతుంటే " "రాము నువ్వు పందెంలో గెలుస్తావని నాకు హామీ ఇస్తున్నావన్నమాట. " అంటూ దూరంగా నిలుచున్న నన్ను చూసి చూడు ! నా బిడ్డలు నన్ను ఎంత అక్కున చేర్చుకుంటున్నాయా కచ్చితంగా గెలుస్తాయి . అప్పుడైనా నువ్వు రామలక్ష్మణుల్ని కనీసం ముట్టుకుంటావా "అని నన్ను అడిగేసరికి ఊహు అనలేక ఉ అని తల ఊపాను మాట్లాడకుండా.
మైకులో పోటీ ని అనౌన్స్ చేస్తున్నారు. నాకైతే నాన్న అంత కష్టపడి ఇంత దూరం వచ్చాడు ఈ ఎద్దులు ఏం చేస్తాయో నాన్నా భయం . అది కాక అవి పొరపాటున ఒక్క సారి బిరుసుగా లాగితే బక్కగా ఉన్న నాన్న ఎక్కడ పడిపోతాడు అన్నది ఇంకా భయం. పోటీకి పేర్లు పిలుస్తున్నాను రామలక్ష్మణ అనగానే ఒక్క కేక తో నాన్న తన ఇద్దరు ముద్దు బిడ్డలతో రంగంలోకి అడుగు పెట్టాడు . సన్నగా ఉన్న నాన్న సత్తువెంటో నాకు అర్థం కాలేదు. యువత గా ఉన్న నేను పందెంలో పందెంలోకి వెళ్లాల్సిన రేస్ అది. అయినా నాన్నకి పట్టుదల ఎక్కువ ఏదైనా అనుకుంటే సాధ్యమైనంత వరకు వదిలిపెట్టడు. అలా రామలక్ష్మణులిద్దరూ పందానికి నేను రెడీ అంటూ పోటీలోకి దిగి అన్ని ఎద్దుల జతలలో ముందు కాస్తా లక్ష్మణుడు తడబడిన ఆ తర్వాత ఊపందుకొని తమ శక్తినంత కూడగట్టి పరిగెత్తి విజేతగా నిలిచాయి. ఆ క్షణం నాకు తెలియకుండానే నా చేతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి . నాన్న కళ్ళలో ఆనందం వెల్లిరిసింది. ఇది చాలు రా నా జీవితానికి అంటుంటే నేను వెళ్లి నాన్న దగ్గర నిలబడగా న్యూస్ రిపోర్టర్ వచ్చి ఒక ఫోటో తీశారు.
పందెం తర్వాత వారం రోజులకి సెలవులను ఇంటికి వెళ్లాను రాముడికి ఏదో ఊపిరితిత్తి వ్యాధి రావడంతో ఎంత నాటు వైద్యం చేసినా , డాక్టర్స్ కి సూపించిన చనిపోయాడు. అప్పుడు నాన్న నాలుగు రోజులు అన్నం తినలేదు . లక్ష్మణుడైతే రెండు రోజులు అరుస్తున్నాడు గాని గడ్డి కూడా తినలేదు. ఒక మనిషికి జంతువుకి ఇంత అనుబంధం ఉంటుందా అన్న ప్రశ్న నాలో మొదలైంది. నాన్న ఆ బాధ నుండి తేరుకోవడానికి వారం రోజులు పట్టింది. అంతవరకు పని వాళ్ళతో కలిసి నేను లక్ష్మణుడి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్లేవాడిని. గడ్డి వేసేవాడిని. నీరు పెట్టేవాడిని అలా కొంచెం మెల్ల మెల్లగా లక్ష్మణుడికి దగ్గరయ్యాను .నన్ను చూస్తూ అప్పుడప్పుడు అంబా అనీ అరిచేది ఏదో నాలో నాకే తెలియని ఒక కంపనం అదే జంతు ప్రేమ అనుకుంటఒక రోజు లక్ష్మణుడిని మా తోటలో కట్టివేసి పని వాళ్ళు వేరే పొలానికి వెళ్లారు నేను తోటలో కూర్చుని పైపు బిగుతుగా ఉంటే తిప్పుతూ ఉండగా ఏదో ఒక అరుపు వినిపించినట్టయింది. ముందుకు వంగి మరోసారి తిప్పుతుండగా ఇంకోసారి ఆదేశంతో అదే శబ్దం ఇంకాస్త గట్టిగా వినిపించింది. అప్పుడు అర్థమైంది అది ఎలుగుబంటి అరుపని. ఏం చేయాలో అర్థం కాలేదు దూరం నుండి చూసిన లక్ష్మణుడు రంకే వేస్తూ పగ్గాన్ని తెంచాలన్న ప్రయత్నంలో బలాన్నంత కూడా గట్టి చివరికి తాడు తెంచుకొని కాలదువ్వుతూ పరిగెత్తుకొచ్చింది. వెంటనే నేను వెళ్లి లక్ష్మణుడి వెనుక నిలబడగా ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోయింది. ఆ క్షణం నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి .ఎప్పుడో చిన్నప్పుడు" ఎద్దు మనిషి ప్రాణాన్ని బలి తీసుకుంది "అని న్యూస్ పేపర్ లో చదివి మూగ జీవాల్ని దరకి చేరనివ్వలేదు. కానీ ఇవాళ అలాంటి ఎద్దు నా ప్రాణాన్ని కాపాడింది. అంటే మన పెద్దలు చెప్పినట్టు " పుట్టిన వాడు గిట్టక తప్పదు" అన్నమాట పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని అర్థమైంది. కాకపోతే ఏ జీవి ఎప్పుడ, ఎక్కడ ,ఎలా మరణిస్తాడు అనేది ఎవరికి తెలీదు. అది కేవలం సృష్టి రహస్యం దానిని చేదించడం అసాధ్యం అని నాకనిపించింది. ఇక ఆ లక్ష్మణుడిని గుండెకు హత్తుకొని బోరున ఏడ్చేసాను. తన నుదుటిపై ముద్దు పెట్టగా అది నా చేతుల్ని నాకుతుంటే ఆ స్పర్శ నన్ను మూగజీవాలపై మక్కువని పెంచింది . ఇంటికి నేనే తోలుకొచ్చి సెలవులు ముగిసే వరకు బాగా చూసుకున్నాను . కాలేజీకి వెళ్లేటప్పుడు ఒకసారి నాన్న పెంచుకున్న పెంపుడు జంతువుల్ని చూసి వస్తూ ఉండగా వెలిసింది అతని కళ్ళు నా వైపు ఏదో అడగాలని దీనంగా చూస్తున్నట్టు అనిపించాయి. అయినా రాముడు చనిపోవడం చూసిన నేను నాన్న విశ్వ ప్రయత్నం చేసిన అది దానికి ఊపిరితిత్తుల రోగం మేలు కాక చనిపోవడంతో నాటు ఔషధం గురించి నేను ఏమంటానో అని భయపడి ఆలోచిస్తూ ఉన్నాడని నాకనిపించింది . అప్పుడు నాన్నతో చెప్పాను" నాన్నగారు! మీరు నన్ను ఏమీ అడగాలని అనుకుంటున్నారో నాకు తెలుసు కానీ రాముడి మరణం గురించి నేనైతే ఏమీ అనను. ఎందుకంటే ' మరణం అనేది సహజమైనది. దానికి ఎవరూ బాధ్యులు కారు. ఎవరైనా కాలం చల్లగానే ఊపిరి ఎవరికైనా కాలం చెల్లిగానే ఎవరి ఊపిరైనా ఆగిపోవాల్సిందే " అని చెబుతున్న నా ముఖాన్ని తదేకాకంగా చూస్తున్నారు నాన్న.
చిన్న ! నిజంగా నీవు నాటు వైద్యాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకున్నావా? అడిగాడు నాన్న.
అవునన్నట్టు తల ఊపాను అయితే ఇప్పుడు కుదరదని కాలేజీకి సెలవులు వచ్చినప్పుడు ఇంకా నేర్చుకుంటాను. మిగిలిన వైద్యం ఆ తర్వాత నేర్చుకుంటానని చెప్పగా కాలేజీ సెలవులు వదిలినప్పుడు నాటువైద్యం నేర్పించాడు నాన్న అని చెప్పుకొచ్చాడు పెద్దాయన.
గురూజీ ! మీ కథ చాలా బాగుంది. మీకు శిష్యుడినైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అని ప్రభ చెప్పగా సరే బాబు పడుకో టైం మూడు గంటలు అయింది అని పెద్దాయన చెప్పడంతో గుడ్ నైట్ అండి అని చెప్పి రగ్గు కప్పుకుని పడుకున్నాడు ప్రభ.