you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ -38

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ -38

రుద్రా నీ చూసి సంతోష పడిపోయి " రుద్ర..."  అని ఆశ్చర్యంగా అంటూ వెళ్లి అతని సైడ్ హార్ట్ చేసుకుంటుంది ప్రియ.

" ఎలా ఉన్నావురా ? చాలా రోజులు , కాదు కాదు చాలా సవత్సరాలు  అయింది నిన్ను చూసి, నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా"  అని అంటాడు రుద్ర . ప్రియా నుదుటి పైన ముద్దు పెడుతూ.

ప్రియా ఇంకా రుద్రా నీ  అంత క్లోజ్ గా చూసిన ప్రేమ్ కి అతని కింద  భూమి కంపించినట్ట అవుతుంది . అతనికి ఏమీ అర్థం కాదు ప్రియా కి రుద్రా  ఎలా తెలుసు?  అతనికి అసలు అర్థం కాదు అసలు రుద్ర క్రిమినల్ అని ప్రియా కి తెలుసా, లేదా,  అని అనుకుంటూ ఉంటాడు.

" ఎన్నాళ్ళ అయ్యిందో నిన్ను చూసి , ఫోన్ కూడా చేయడం మానేశావు,  నువ్వు ఫోన్ చేసి సిక్స్  మంత్స్ అవుతుంది తెలుసా.  అసలు నేనంటే నీకు అసలు ఇష్టం లేదు అందుకే నన్ను అసలు పట్టించుకోవడం మానేశావ్ ?"  అని రుద్ర మీద అలుగుతుంది ప్రియా.

" ఐ యాం సారీ రా. నీకు తెలుసు కదా నా రీసెర్చ్ గురించి నేను ఎంత బిజీగా ఉంటానో"  అని అంటాడు రుద్ర.

" హా తెలుసులే . ఇంతకీ స్టార్ట్ చేసిన ఆ రీసెర్చ్ సక్సెస్ అయ్యిందా"  అని అడుగుతుంది.

’ప్రియా కి రుద్రా రీసెర్చ్ గురించి కూడా తెలుసా తెలిసికూడా రుద్రా కి  సపోర్ట్ చేస్తుందా’ అని ఆశ్చర్యపోతాడు ప్రేమ్.

" ఎక్కడరా,  సగమే పూర్తయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైంకి నా బ్యాడ్ లక్  ఆ రీసెర్చ్ ల్యాబ్ ని వదిలేసి ఇంకొక చోటికి వెళ్లాల్సి వచ్చింది దానివల్ల మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాను డోంట్ వర్రీ తొందరలోనే పూర్తి చేస్తానులే"  అని అంటాడు , ఒకంట ప్రేమ్ నీ చూస్తూ.

’ ఆ రీసెర్చ్ పూర్తి చేయడానికి నువ్వు బతికి ఉండాలిగా ’రుద్రా నీ  కోపంగా చూస్తూ. తన మనసులో అనుకుంటాడు ప్రేమ్   .

" ఈసారి నీ రీసెర్చ్ లో ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ చిన్న సైంటిస్ట్ కూడా హెల్ప్ చేస్తుందిలే " అని జోక్ చేస్తుంది ప్రియా. 

ఆ మాట వినగానే ప్రేమ్ అదిరిపడతాడు . వెంటనే "ప్రియా .!" అని అరిచినట్టే అంటాడు. 

ఆ రీసెర్చ్ ఎంత ప్రమాదమో ప్రేమ్ కి బాగా తెలుసు ఆ రీసెర్చ్ వల్ల ఎంతమంది  తమ ప్రాణాలు కోల్పోయారు కూడా ప్రేమ్  కి బాగా తెలుసు . ప్రియ ఆ రీసెర్చ్ కి సహాయం చేస్తాను అంటుంటే , ప్రియా గురించి పూర్తిగా తెలిసిన ప్రేమ్ నమ్మలేక పోతాడు.

ప్రేమ్  పిలుపుకి ప్రేమ్ వైపు చూస్తుంది ప్రియ " ఓ ప్రేమ్ ఇక్కడే ఉన్నాడు కదా మర్చిపోయాను" అని అనుకుంటూ . 
వాళ్ళిద్దరికీ పరిచయం చేయాలి అని "  ప్రేమ్ మీట్ మై గురు , కాదు కాదు అన్నయ్య రుద్ర"  అని అంటు రుద్ర వైపు తిరిగి

" రుద్ర ఇతను మా బావ , పేరు ప్రేమ్ " అని పరిచయం చేస్తుంది.

రుద్ర ప్రియా వైపు  అల్లరిగా చూస్తూ "  ఓన్లీ భావ మాత్రమేనా?  కాబోయే శ్రీవారూ కూడా అని పరిచయం చేయవా?"  అంటాడు.

ఆ మాటకి ప్రియా కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ "హా..ఇతను నా.. ఫియాన్సీ "   అని చెప్తుంది.

ప్రియా ప్రేమ్ నీ తన  ఫియాన్సీ అని ఇతరులకు అలా పరిచయం చేస్తుంటే  ప్రేమ్ కి  చాలా సంతోషం అనిపించింది కానీ అది రుద్ర అవడం కొంచెం కోపంగా కూడా ఉంది.

రుద్ర ప్రేమ్ కి షేక్హాండ్ ఇస్తూ " సో మీరే అన్నమాట మా ప్రియ ని చేసుకోబోయే వ్యక్తి . అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని బావ అని పిలవాలి అనుకుంటా" అని వెటకారంగా అంటాడు.

ప్రేమ్  కూడా షేక్హాండ్ ఇస్తూ " హాం... నేను కూడా అనుకోలేదు నీలాంటి వాడి తో బావ అని పిలిపించుకుంటాను అని"  అని అంటాడు ప్రేమ్.

రుద్రా చిన్నగా నవ్వుతూ " ఎనీ హౌ ప్రియా అంటే నాకు చాలా ఇష్టం.  తనని నేను సొంత సిస్టర్ లాగా భావిస్తూ ఉంటాను,  తనకి నీ వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగిన, నీవల్ల తన కంట్లో నుంచి ఒక కన్నీటి బొట్టు రాలిన,  నీకు ఏమవుతుందో నేను గ్యారెంటీ ఇవ్వలేను"  అని అంటాడు.

" మీరు తన గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు , అదంటే నాకు ప్రాణం,  దాని జోలికి ఎవరు వచ్చినా, ఆఖరికి తాను అన్నయ్య అని భావించిన వ్యక్తి అయినా సరే , ఈ భూమి మీద ఉండడు"  అని అంతే సీరియస్ గా చెప్తాడు ప్రేమ్.

ప్రియా  కి వీళ్ళ మాటలు కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. రుద్ర వైపు తిరిగి "రుద్రా అన్నయ్య నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఈ ఫుడ్ ఎంత బాగుంటుంది అని చెప్పావు అంటే ఈ సిటీలోనే ఉంటున్నావు అని అర్థం. నువ్వు ఈ సిటీలో ఉండి కూడా నన్ను కలవడానికి రాలేదు,  ఇది చాలా బ్యాడ్"  అని అంటుంది.

రుద్రా ప్రియ వైపు అపోలాజిటిక్ గా చూస్తూ "సారీ రా నీకు తెలుసు కదా నేను ఒక రీసెర్చ్ లో ఉన్నాను అని,  అది చాలా కాన్ఫిడెన్షియల్ అందుకని మమ్మల్ని బయటికి ఎక్కువ రానివ్వరు,   అప్పుడప్పుడు వాళ్లకి  మస్కా కొట్టి ఇలా వస్తూ ఉంటాను అన్నమాట, ఇంకా ఈరోజు అనుకోకుండా న్యూస్ లో నీ ఎంగేజ్మెంట్ న్యూస్ చదివాను ఇక ఉండబట్టలేక నిన్ను చూద్దాము అని ఇలా వచ్చేసాను" అని అంటాడు రుద్ర.

" సర్లే వస్తే వచ్చావు ఈరోజు నైట్ మొత్తం నాతోనే స్పెండ్ చేయాలి"  అని ఆర్డర్ వేస్తుంది ప్రియా.

" మా చెల్లి ఆర్డర్ పాస్ చేశాక నేను వద్దంటానా అలాగే " అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు రుద్ర.

ప్రేమ్ కి మాత్రం రుద్ర ఇంకా ప్రియా గురించి ఎన్నో ప్రశ్నలు మనసులో తొలచి వేస్తూ ఉంటాయి. అసలు ప్రియా కి రుద్రా కి ఎలా పరిచయం?  ఇంత క్లోజ్ గా ఉన్నారు అంటే వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉండి ఉండాలి.
ప్రియా కి రుద్ర చేస్తున్న రీసెర్చ్ గురించి తెలుసా  ? తెలిసినా కూడా రుద్రా తో ఇంత క్లోజ్ గా ఎలా ఉండగలుగుతుంది?.
రుద్ర  ప్రియ నీ  సిస్టర్ లాగా చూస్తాను అని అంటున్నాడు.  ప్రియా నీ సిస్టర్ లాగా అనుకునే వాడే అయితే ,  పొద్దున ప్రియా ని చంపడానికి ఎందుకు చూస్తాడు . ఇదంతా నటన అని అనుకుంటే,  నటన లాగా అనిపించడం లేదు.  ప్రియా ని చూసేటప్పుడు అతని కళ్ళల్లో ఆప్యాయత కనిపిస్తూ ఉంది. ఏదైనా సరే వీడు ప్రియా దగ్గర ఉండడం చాలా ప్రమాదం.
  ప్రియ ని వీడికి దూరంగా ఉంచాలి. వీడు అసలు మనిషే కాదు . వీడిని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసి జైలు లో వేస్తే . లేదు లేదు   అలా చేయలేను.
  వీడు చనిపోయాడు అని లోకం అంత  నమ్ముతుంది. అందులోను వీడే ఆ సైంటిస్ట్ అని నాకు తప్ప ఎవరికి తెలియదు ఇప్పటివరకు వీడి పేస్ కూడా ఎవరు చూడలేదు నేను తప్ప.

ఇంతలో ప్రియా ఫోన్ రింగ్ అవుతుంది . ఫోన్ చేస్తున్నది నితిన్. 
ప్రియ  ఫోన్ బయటికి తీసి " హలో"  అని అంటుంది.

" హలో స్వీటీ నిద్ర లేచావా?"   అని అంటాడు.

"  నితిన్ నేను అసలు పడుకుంటేనే కదరా నిద్ర లేవడానికి నేను ఫుడ్ కోర్ట్ కి వచ్చాను ఇక్కడి నుంచి డైరెక్ట్ మనం అనుకున్న స్పాట్ కి వచ్చేస్తాను , మీరందరూ కలిసి బయలుదేరండి,  నేను స్టార్ట్ అవుతున్నాను"  అని అని ఫోన్ కట్ చేస్తుంది ప్రియా .

రుద్ర ప్రియా వైపు చూసి " ఎవరు నితిన్ ఆ"  అని అడుగుతాడు .

" హా " .

"  ఇంకా వాడు అలాగే ఉన్నాడా ఏమైనా ఇంప్రూవ్ అయ్యాడా"  అని అంటాడు రుద్ర .

" వాడి గురించి తెలిసిందే కదా పద నువ్వు కూడా మాతో పాటు.  నిన్న చూస్తే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు "  అని అంటుంది .

రుద్ర ప్రియా వైపు చూసి " బిర్యాని తిన్నాక ఫలూధ ట్రై చేయవా?  వెళ్లి ఫలుదా తీసుకో,  ఈ లోపల నీకు కాబోయే ఆయనతో నేను మాట్లాడతాను, మీ ఆయనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి "  అని అంటాడు రుద్ర.

రుద్రా కి ప్రేమ్ గురించి చెప్పాలి అనుకుంటుంది ప్రియా, కానీ ఎలా చెప్పాలో తనకి అర్థం కాదు తర్వాత చెప్పచ్చు అనుకొని సరే అని చెప్పి ఫలుద కోసం వెళ్తుంది.

ప్రియా వెళ్ళగానే ప్రేమ్ రుద్రా వైపు కోపంగా చూస్తూ "ప్రియా నీకు ఎలా తెలుసు, మార్నింగ్ తనని చంపాలని చూసి, అదే కుదరకపోవడంతో , ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు,  నా ప్రియా జోలికి వస్తే చంపేస్తాను"  అని కోపంగా అంటాడు. 

చుట్టూ ఉన్న సెక్యూరిటీ ప్రేమ్  మాటలకి దగ్గరికి రాబోతుంటే వద్దు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తాడు.

" చూడు ప్రేమ్ నీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కానీ ఇస్తున్నాను , ప్రియా ని నేను చంపాలి అని అనుకోలేదు అది నా గ్యాంగ్ లో ఒకడు నీ మీద పగ తీర్చుకోవడానికి తనమీద అటాక్ చేయాలి అనుకున్నాడు, నిన్ను వీక్ చేయడానికి . ఒకవేళ వాడు నీ చేతిలో చావకపోయినా,  ప్రియా జోలికి వెళ్లినందుకు నా చేతిలో చచ్చేవాడు " అని అంటాడు రుద్ర.

" మనిషి ప్రాణాలతో ఎక్స్పెరిమెంట్స్ చేసే నీకు ఇలా సిస్టర్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా"  అని వెటకారంగా నవ్వుతాడు ప్రేమ్.

" ఏ మనిషి కూడా కొన్ని పనులు తన ఇష్ట పూర్వకంగా చేయడు పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వస్తుంది. అయినా కొన్ని సాధించాలి అంటే కొంతమంది ప్రాణ త్యాగం చేయక తప్పదు, నేను చంపిన వాళ్ళు ఈ భూమికి భారమై ఎందుకు పనికిరాని వాళ్ళు , నా గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు గాని ఒక విషయం నేను అనుకున్నది జరిగే వరకు వెనక అడుగు మాత్రం వెయ్యను"  అని అంటాడు రుద్ర.

" నువ్వు అనుకున్నది ఎలా పూర్తి చేస్తావో నేను చూస్తాను ఇప్పటివరకు ఎలుక పిల్లలాగా దాక్కున్నావు.  ఇపుడు బయటికి వచ్చావు నిన్ను అంత సులువుగా వదులుతానని ఎలా అనుకున్నావు , నీ నిజస్వరూపం ప్రపంచానికి చూపించి నిన్ను చంపుతాను చూస్తూ ఉండు " అని అంటాడు ప్రేమ్.

రుద్ర మాత్రం చిన్నగా నవ్వుతూ " నేను అదే కోరుకుంటున్నాను ప్రేమ్ నువ్వు ప్రతి విషయం తెలుసుకోవాలి ప్రతి విషయం కూడా "అని ఒత్తి  పలుకుతూ, " అప్పుడే కదా ఈ ప్రపంచానికి మనుషులు ఎలాంటి వాళ్ళో తెలిసేది"  అని అంటాడు. 

" కచ్చితంగా నీలాంటి వ్యక్తులు కూడా ఈ భూమి  మీద అన్నారు అని తెలియాలి కదా అందరికీ, నీ గురించి ఈ ప్రపంచానికి తెలియడానికి నీ సొంత చెయ్యని సైతం నరుక్కున్న మహానుభావుడివి " అని అంటాడు ప్రేమ్. రుద్రా చెయ్యి వైపు చూస్తూ.

రుద్ర తన చెయ్యి వైపు  చూసి బాధగా ఏదో ఆలోచనలో " ఆరోజు నేను ఎందుకు అలా చేశానో ప్రపంచానికి తెలియాలి , నా పుట్టుక గురించి అందరికీ తెలియాలి అప్పుడే కదా వాడి గురించి ఈ ప్రపంచానికి తెలిసేది నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది " అని అంటాడు.

ప్రేమ్ రుద్రా వైపు చూసి కోపంగా " ఆరోజు లాబ్ ఎందుకు నాశనం చేశావు ఏమి డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశావు"  అంటాడు. 

రుద్రా చిన్నగా నవ్వుతూ "  ఆ రోజా నీకు థాంక్స్ చెప్పాలి అనుకున్నాను ప్రేమ్ కానీ కుదరలేదు,  ఇంకా  నీవల్ల ఆ లాబ్ డిస్ట్రాయ్ అయ్యింది , అంతేకాదు వాళ్ళకి నామీద నమ్మకం ఇంకా పెరిగింది,  ఆ ఇన్సిడెంట్ వల్ల ." అని అంటాడు. 

ప్రేమ్ కి ఏమీ అర్థం కాదు, రుద్ర చెప్తున్నది, కానీ  ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థం అయింది , ఆ లాబ్ రుద్ర కావాలనే డిస్ట్రాయ్ చేసాడు అని, కానీ ఎందుకు. 

" బై ద వే అది నీకు దొరికిందా"  అని అడుగుతాడు రుద్ర. 

ప్రేమ్ రుద్రా మాటలకు నొసళ్లు ముడిచి ఆలోచిస్తాడు "దొరకడమా ?" .
వెంటనే ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ " ఆ రోజు ఆ పెన్ డ్రైవ్ కావాలని అక్కడ వదిలి వెళ్ళింది నువ్వేనా"  అని అడుగుతాడు. 

" ఆ పెన్ డ్రైవ్ దొరికింది అంటే , అందులో ఏముందో కూడా నీకు తెలిసి ఉండాలి కదా.  మరి ఆ విషయం ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వలేదు,  నేను చనిపోయానని ప్రపంచాన్ని ఎందుకు నమ్మించావు ?" అని అడుగుతాడు రుద్ర.

కొనసాగుతుంది..

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు. 

ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ దేనికి సంబంధించింది , అందులో ఏమి ఉంది ? ప్రేమ్  ఎ రుద్రా చనిపోయాడు అని ఈ ప్రపంచానికి తెలియజేశాడు  ? ఎందుకు ? .
ఇంతకీ రుద్ర గతమేమిటి ?  .
ఆ లాబ్  ఎందుకు డిస్ట్రాయ్  చేయాల్సి వచ్చింది.? .  ఇంతకీ రుద్ర పుట్టుక గురించి ఉన్న రహస్యం ఏమిటి ? .
తెలుసుకోవాలనుందా ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది.
ఇంతకీ ఈ రుద్ర మంచోడా, చెడ్డోడా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి.