శ్రీహరి మరణంతో చాలా కృంగిపోయాడు భుజంగం. అసలేం జరిగింది. వాడక్కడ మరణించడం ఏంటి. పెద్దవాడు చూస్తే బతికి ఉన్నా వంశాన్ని ఇచ్చే స్థితిలో లేడు .ఆశలన్నీ చిన్నవాడి పై ఉంటే వాడేమో ఆశ నిరాశని చేసి వెళ్లిపోయాడు. వాడి చావుకి కారకులు ఎవరైనా సరే సహించేది లేదు.నా మనషులతో నిఘా పెట్టించి వాళ్ళని చంపి పాతేస్తాను. అనుకొని తన మనుషులతో అలర్ట్ గా ఉండమని చెప్పి పంపించాడు.
కృష్ణ మురళి తనకు అనుమానం వచ్చిన అమ్మాయిని అనుసరిస్తూ వెళ్ళగా హోటల్ ముందు కూర్చుని ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టుంది. తన ఫోన్ తీసి ఏదో నెంబర్ నొక్కి ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో విసుగుతో టేబుల్ మీద ఉంచి అటు ఇటు చూడ సాగింది.అంతలో కృష్ణకు గీతిక ఫోన్ చేయడంతో అఫీషియల్ గా ఉపయోగించే ఫోన్ కాకుండా తన సీక్రెట్ ఫోన్ ను ప్యాంటు జేబులో నుండి తీసి లిఫ్ట్ చేసాడు.
హలో !గీతిక అంటూ హమ్మయ్య ! గీతిక బతికే ఉంది అనుకుంటూ ఉండగా "సార్ వన్ అవర్ ముందు మీరు ఫోన్ చేశారు." అని గొంతులో మాటలు సన్నగా వినబడడంతో 'చెప్పు గీతిక నువ్వు బాగానే ఉన్నావుగా' అని అడిగాడు కృష్ణ.
" సర్ నాకే పాపం తెలియదు సార్ "అని గీతిక ఏడుస్తూ ఉంటే" నువ్వు ఏడ్చకు నీకు ఏ కష్టం వచ్చినా మీ సర్ ఉంటాడని నేను ఆరోజే చెప్పానుగా భయపడకు నేను కూడా అలా ఎందుకు జరిగిందనే విషయంపై ఆలోచిస్తుంటే ఒక అమ్మాయి మీద అనుమానం వచ్చి అనుసరిస్తున్నాను.
అదిగో తను ఫోన్ ఎవరికో చేస్తూనే ఉంది కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో విసుగు వచ్చిందేమో అక్కడి నుండి ఎక్కడికో బయలుదేరుతున్నట్టుంది" అని చెబుతూ తను అటువైపు బయలుదేరగా ఆ అమ్మాయి శ్రీహరి గెస్ట్ హౌస్ వైపు వెళుతూ ఉండగా కృష్ణ " గీతికా నువ్వు ఒక పని చెయ్ నేను మొన్న రాత్రి నీవు లీవ్ లెటర్ రాసినట్టు రాణి కి వేరే వాళ్ళ మొబైల్ నుండి మెయిల్ చేశాను. నువ్వు ఈరోజు లేదా రేపు ఆఫీసుకు వెళ్లి ఏదో ఒక కారణం చెప్పి రిజైన్ లెటర్ని ఇచ్చిరా లేదంటే మీ రాణి మేడమ్ కి అనుమానమోస్తే వాళ్ళ నాన్నకంటే కఠినమైనది ముందు నువ్వు ఆ పని చెయ్" అని చెప్పి అటువైపు చూడడంతో అమ్మాయి కనబడలేదు.అటు పక్కనే ఉన్న చెట్టు కిందకి వచ్చి లైటర్తో అంటించి ఒకసారి నోటిలో పెట్టి తాగుతూ ఇటు తిరిగి చూడగా ఆ అమ్మాయి అటు వస్తుండడం చూసి వెంటనే సిగరెట్ ని కాలికింది కేసి తొక్కి ఎస్ఐ కి ఫోను కలిపాడు కృష్ణ.
"ఆ, కృష్ణ గారు చెప్పండి " ఎస్ఐ అడిగాడు.
సర్ ఇక్కడ శ్రీహరి గెస్ట్ హౌస్ కి ఒక అమ్మాయి వెళుతుంది మీరు త్వరగా వచ్చేయండి. అని చెప్పడంతో "కృష్ణ గారు మీరు ఒక పని చేయండి వాచ్మెన్ కి తాళం తీసి పక్కకు వెళ్ళమని చెప్పండి."అని ఎస్ఐ చెప్పడంతో అలాగే చేశాడు కృష్ణ.
అమ్మాయి గేటు దగ్గరికి వెళ్లి అటు ఇటు చూసి గేటు తీసి లోపలికి వెళ్లి శ్రీహరి కోసం చూడగా శ్రీహరి రూమ్ తాళం వేసి ఉండడంతో వేరే రూములు కూడా చూసి వెనదురుగుతూ ఉండగా ఏదో చప్పుడు కావడంతో గొడవ పక్కన నక్కి నిలబడి తొంగి చూస్తే పోలీసులు కనిపించగా తప్పించుకోవాలని చూస్తుంది.
అంతలో డ్డాను లేడీ కానిస్టేబుల్ పట్టుకోగా కృష్ణ మురళి వచ్చి " సర్ ముందు తను ఎవరో చూడండి. "అనేసరికి "సర్ మీరు మరీ దయ కలిగిన వారిగా కనిపిస్తున్నారు తను ఎవరూ లేనప్పుడు ఈ గెస్ట్ హౌస్ కి వచ్చిందంటేనే అర్థమవుతోంది ఆ అమ్మాయి రాంగ్ స్టెప్ వేసిందని. సరే , మీకోసం తనని ముఖం మీరున్న ముసుగు తీయమని చెబుదాం. తనకు శ్రీహరి కేసుకి ఎలాంటి సంబంధం లేకపోతే ఇక్కడే వదిలేద్దాం ఏమంటారు." అని ఎస్ఐ అడిగే సరికి అలాగే సార్ అన్నాడు కృష్ణ.
లవ్ లేని అరెస్టు చేసిన తర్వాత కోర్టు దగ్గరికి వచ్చిన అన్నా వదినల్లో " చూడు ఎలా నిలబడి ఉందో "అని వదిన అంటుంటే అన్నకి కోర్టు లోపలికి వెళ్లాలనిపించలేదు. అప్పుడే లవ్లీ పోలీసులు తీసుకొస్తుంటే దూరం నుండి చూసిన అన్నకి ప్రేమో కోపమో తెలీక వెళ్లి రెండు చెంపలు వాయించాలనుకొని కొట్టలేక కళ్ళల్లో నీళ్లు కారుస్తుంటే "అన్నయ్య! ఈ పని ఎప్పుడో చేయాల్సింది కానీ సమయం మించిపోయింది.
అమ్మ లేకపోయినా అన్నీ నీవై నన్ను ఎంతగా ఎదగాలనుకున్నావో ఎదిగాను కానీ పేదరికం వల్ల అలసిపోయిన నా మనసు డబ్బు వైపు పరిగెత్తమని చెప్పి చివరికి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నీలా నాకు కొద్దిపాటి ప్రేమానురాగం ఉన్న నేను ఇలా అయ్యుండే దాన్ని కాదు. వదిన కూడా పేదరికం నుండి వచ్చింది అయినా ఇంట్లో తను ఉన్నంతలో తను పనికి వెళ్తూ నన్ను చూసుకుంటూ ఉంటుంది . అప్పుడప్పుడు ఇంట్లో కాస్త సాయంగా ఉండాలని తను చెబుతుంటే ఎందుకో నాలో జలసి, ఏదో అధికారం. తనని ఏ రోజు ప్రేమగా పలకరించింది లేదు తనంటే రెండో తనకంటే రెండాకులు ఎక్కువ చదివానని పొగరేమో! డబ్బే నా ప్రపంచం అని తనని ఎన్నోసార్లు చిన్నచూపు చూశాను.
ఒకరోజు తను ప్రెగ్నెంట్ అయి మంచి వార్త చెప్పినందుకు అన్నయ్య 500 రూపాయల చీర తెచ్చి ఇవ్వగా నేను ఎంత జగడం చేశాను అయినా తను ఏం మాట్లాడలేదు. అందుకేనేమో నేను జాబ్ చేస్తూ తనకోసం వెయ్యి రూపాయల చీర కొని తీసుకెళ్తే అల్మరలోనే ఉంది కానీ ఇంతవరకు తను కట్టింది లేదు.' యు ఆర్ గ్రేట్ వదిన". అంటూ ఆమె వైపు చూస్తుండగా ఇక లవ్లీ ని ఆ స్థితిలో చూడలేక తను అక్కడి నుంచే వెళ్ళిపోయింది.
లవ్లీ వెంటనే పరిగెత్తుకొచ్చి అన్నయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే తామే కన్నీళ్లతో పాదం తడుస్తూంటే అతను అడుగుల్ని వెనక్కి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పోలీసులు లవ్లీ లోపలికి తీసుకెళ్లి నిలబెట్టగా విచారణ మొదలైంది.
లవ్లీ ! నీ వైపు వాదించే లాయర్ ఎవరైనా ఉన్నారా అని జెడ్జ్ అగడంతో లేరని తలూపి తనే వచ్చి బన్నులో నిలుచుంది లవ్లీ.
విచారణ మొదలైంది భుజంగం లాయర్ లేచి నిలబడి లవ్లీ నిలబడిన బోన్ దగ్గరికి వచ్చి " నీ పేరు" అని అడిగాడు లాయర్.
లవ్లీ చెప్పింది గడుసుగా.
మీరు చాలా పేదవాళ్ళని విన్నాను.
పేదవాళ్లంటే అంది లవ్లీ.
కూడు,గుడ్డ లేని వాళ్ళని... అని ఇంకా ఏదో లాయర్ అనబోగా అంత పేదరికం ఏం కాదు సార్ అలా ఉంటే మా అన్నయ్య నన్ను బీకాం తర్వాత ఎంబీఏ చేయించే వాడే కాదు వాడు కూలి వెళ్లి నన్ను ఇంతగా చదివించాడు.
మరి ఇంత పెద్ద చదువు తమరు చేసింది ఏంటి?
అంటే అంది సందేహంగా అర్థం కానట్టు లవ్లీ.
అంటే చదివి జాబ్ కి జాయిన్ అయి ఇంటి నుండి ఇల్లాలు కాకుండా ఈ ఇతర పనులేంటి అని
అంటే మీ ఉద్దేశం, అదేదో సూటిగా అడగండి అంది లవ్లీ.
నువ్వు చెప్పే పాయింట్ కి వస్తున్నా శ్రీహరి గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లావు.
శ్రీహరి కోసం.
శ్రీహరి నీకు ఎలా తెలుసు?
శ్రీహరి నేను కంపెనీకి జాయిన్ అయినప్పటి నుంచి నాకు తెలుసు.
మరి అతనితో నీ రిలేషన్.
ఒక్క నిమిషం సైలెంట్ అయింది లవ్లీ.
చెప్పు "వాట్ ఇస్ ది రిలేషన్ విత్ శ్రీహరి" అని లాయర్ లవ్డ్ వాయిస్ తోడిగే అడిగాడు.
శ్రీహరి అంటే నాకు ఇష్టం అయితే అతడు చాలా రిచ్ కాబట్టి నన్ను పెళ్లి వరకు అనుమతి ఇస్తాడో లేదో అని అన్నది ఒక బెంగ మరోవైపు నాలాంటి వారిని వారి కుటుంబం ఆదరిస్తుందో లేదో అనేది మరొక బెంగ అందుకే తన మీద ఇష్టాన్ని కష్టంగా మార్చుకొని అంటూ మిగతావి మాట్లాడకుండా ఉంది లవ్లీ.
ఆ మిగతా మాటలు నేను పూర్తి చేస్తాను. అని లాయర్ ఈ లవ్లీ తో ఒకసారి గెస్ట్ హౌస్ కి వెళ్లడానికి లక్ష రూపాయలకే ఒప్పందం చేసుకున్నాడు. శ్రీహరిని కలిసిన చివరి రోజు వాడు లక్ష బ్యాంక్ చెక్ పై రాసి ఏదో ఫోన్ కాల్ వచ్చిందని బయటికి వెళ్లినప్పుడు కోటి రూపాయలని రాసి పొరపాటున వెళ్లేటప్పుడు ఈ లవ్లీ ఆ బ్యాంక్ చెక్ నీ అక్కడే పడేసుకుని పోవడం వలన తన గుట్టు రట్టడంతో శ్రీహరి ఈమెని చంపాలని మనుషుల్ని పంపించాడు అది తెలియక అక్కడి నుండి తప్పించుకొని ముంబై వెళ్లి అది శ్రీహరి మరణించాడని తెలియక ఇక్కడికి వచ్చి పట్టుబడింది. "అంటూ వివరించి జడ్జ్ వైపు చూసి వివరణ ఏమని ఇంకొన్ని ప్రశ్నలు వేయాలని అనుమతి కోరుతున్నాను అనడంతో జ్జడ్జి యస్ అడగండి అనేసరికి ' లవ్లీ 'అన్నాడు లాయర్.
తలెత్తి చూసింది లవ్లీ.
నువు జాబ్ కి జాయిన్ అయి రెండేళ్లు అవుతుంది. శ్రీహరి ఎన్ని లక్షలు నీకు ధార పోశాడు అవునా కాదా
అవును అంటూ తలుపుంది మౌనంగా లవ్లీ.
మరి ఎందుకు లక్షలని కోటిగా మార్చావు.
ఎందుకంటే శ్రీహరి మరో అమ్మాయి మీద మనసు పడ్డాడు అంటూ తలెత్తి డోర్ వైపు చూడగా ప్రభ అక్కడే కనిపించడంతో ఏదో చెప్పొద్దని తలను అటు ఇటు తిప్పడంతో అలాగేనని తలుపింది లవ్లీ.
ఆ శ్రీహరి వేరే అమ్మాయి మీద మనసు మళ్లిస్తే నీకేంటి ప్రాబ్లం అన్నాడు లాయర్.
అది నాకు నచ్చలేదు. ఆ అమ్మాయి కూడా అదే కంపెనీలో పని చేస్తోంది అంటూనే కృష్ణ మురళికి గుండెల్లో దడ మొదలైంది. ఈ అమ్మాయి గీతిక పేరు ఎక్కడ బయట పెడుతుందో అని ఒళ్లంతా చెమటలు పట్టున పట్టినట్లు అవ్వడంతో ఏంటండీ అని రాణి కనుసైగాతో అడిగేసరికి ఏమీ లేదు అంటూ లవ్లీ వైపు చూసాడు కృష్ణ.