you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 22

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 22

అప్పటికే గెస్ట్లు అందరూ రావడం మొదలయింది. ప్రేమ్ ఇంకా ప్రియా పూజలో కూర్చోవడంతో పెద్దవాళ్లు ఇంకా ప్రియా ఫ్రెండ్స్ అందరూ కూడా గెస్ట్ ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు.

జగదీష్ చంద్ర రాత్రి తనకి తెలిసిన తన సర్కిల్లో వాళ్లందరికీ కూడా ఫోన్ చేసి ఇన్విటేషన్స్ పంపించాడు ఎర్లీ మార్నింగ్ తన ఇంట్లో ఒక ఫంక్షన్ అని చెప్పాడు , కానీ ఎందుకో అనేది చెప్పలేదు చాలామందికి . వారు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఈరోజు ప్రియా ఎంగేజ్మెంట్ అని తెలుసుకొని అందరూ చాలా సంతోషపడ్డారు. జగదీష్ చంద్ర ఇంత సడన్గా తన కూతురి ఎంగేజ్మెంట్ చేస్తాడని ఎవరు ఊహించలేదు.

ప్రియ నీ పెళ్లి చేసుకునేది ఎవరు అని ఆరా తీస్తే జగదీష్ చంద్ర అక్క కొడుకు అని తెలిసి,  వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే వాళ్ళందరికే కూడా తెలుసు జగదీష్ చంద్ర వాళ్ల అక్క కోసం ఎన్నాళ్ళుగా వెతుకుతున్నాడో అనేది.

వాళ్ళందరూ కూడా జగదీష్ చంద్రని కంగ్రాచులేషన్స్ చేస్తూ ఉంటారు "  కంగ్రాట్స్ చందు ఒకేరోజు మీ అక్కని ఇంకా నీ కూతురికి మొగుడిని ఒకేసారి పట్టావుగా, నిజంగా ఇద్దరు చూడమచ్చటైన జంట , చాలా బాగున్నాడు మీ అల్లుడు"  అని అంటూ ప్రియ ఇంకా ప్రేమ్ ని చూసి వాళ్ళిద్దరి ఫేర్ చాలా బాగుందని అంటూ ఉంటారు.

జగదీశ్ చంద్ర వాళ్ళ బావ గారిని అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు. గుర్దీప్ తన బిజినెస్ ని ఈ ఊరిలో స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది. కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన టూ ఇయర్స్ లోనే ఆ ఊరిలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకుంటారు. గుర్దీప్  ఇంకా ఆదిత్య బిజినెస్ సర్కిల్లో చాలా మందికి తెలుసు, కానీ గుర్దీప్,  జగదీష్ చంద్ర బావ అవుతాడని ఎవరు ఊహించలేదు.జగదీష్ చంద్రకి ఆ ఊర్లో ఉన్న పలుకుబడి ద్వారా మీడియాని ఇన్వైట్ చేయకుండానే చాలామంది మీడియా వాళ్ళు వచ్చారు.

పూజ అయిపోవడంతో శాస్త్రి గారు ప్రియా ఇంకా ప్రేమ్ తల్లిదండ్రులను పిలవడంతో గాయత్రీ ఇంకా గుర్దీప్ , జగదీష్ చంద్ర , సునంద గారు వెళ్తారు.

శాస్త్రి గారు ప్రియా ఇంకా ప్రేమ్ ని ఆపోజిట్ సైడ్ అంటే ఎదురు ఎదురుగా కూర్చో పెడతారు. జగదీష్ చంద్ర ఇంకా సునంద గారు వెళ్లి ప్రియ పక్కన సెటిల్ అవుతారు,  అలాగే గాయత్రి గారు ఇంకా గుర్దీప్ ,  ప్రేమ్ పక్కన సెటిల్ అవుతారు. వారి అందరి చేత కూడా కొన్ని పూజలు చేయిస్తారు శాస్త్రి గారు

శాస్త్రి గారు ఊర్మిళాదేవి గారిని కూడా పిలిచి " అమ్మ లగ్నపత్రిక రాయమంటారా"  అని అంటారు.

" ఇంకా ఆలస్యం ఎందుకు శాస్త్రి గారు వెంటనే రాయండి"  అని ఊర్మిళాదేవి గారు చాలా సంతోషంగా చెప్తారు.

శ్రీరస్తు ,శుభమస్తు, అవిఘ్నమస్తుశ్లో." శ్రీరామపత్నీ జనకస్యపుత్రీ: సీతాంగనా సుందర కోమలాంగీ, భూగర్భజాతా భువనైకమాతా, వధూవరాభ్యాం వరదాభవంతు:"స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరవచ్చేనెల తొమ్మిదో తారీకు తెల్లవారుజాము 3:45 నిమిషాలకిశ్రీ జగదీష్ చంద్ర గారు & శ్రీమతి సునంద గారుల ఏకైక పుత్రిక శ్రీమతి ప్రియా నుశ్రీ గురదీప్ గారు & శ్రీమతి గాయత్రి వారి కనిష్ఠ కుమారుడు శ్రీ ప్రేమ్ నందన్ కి ఇచ్చి వివాహము జరిపించుటకు దైవజ్ఞులచే సుముహూర్తము నిశ్చయించినారు.అని అందరికీ వినపడేలాగా  ఆ లగ్నపత్రిక నీ చదువుతాడు శాస్త్రి గారు.

తర్వాతవధూవర పరస్పరాంగీకారార్థం తాంబూల సమర్పణం కరోమి।శుభమస్తు।అని శాస్త్రి గారు మంత్రాలు చదువుతూ  తాంబూలాలు మార్చుకోమని చెప్పారు.

ప్రేమ్ మొహంలో అంతులేని ఆనందం కనిపిస్తుంటే ప్రియా మొహం లో మాత్రం ఎటువంటి భావన లేకుండా సైలెంట్ గా కూర్చుని ఉంది.

ప్రియా ని అలా చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొంచెం బాధ కలిగింది. ఊర్మిళాదేవి తన మనవరాలిని అలా చూస్తూ ' నన్ను క్షమించవే నీకు ఇష్టం లేకపోయినా,  నా మనవడితో ఆనందంగా ఉంటావని కోరుకుంటూ ఇ పెళ్లిని బలవంతంగా చేయిస్తున్నాను . నాకు నమ్మకం ఉంది నీ పెదవులపై చిరునవ్వు వాడు మాత్రమే తీసుకురాగలడు, నువ్వు వాడితో చాలా సంతోషంగా ఉంటావని నా మనసు చెప్తుంది , ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయం నీకు నచ్చకపోవచ్చు కానీ నీ మనసు కచ్చితంగా మారి తీరుతుంది' అని అనుకుంటారు ఊర్మిళాదేవి గారు.

గాయత్రి గారికి కూడా ప్రియా మొహం వైపు చూస్తే జాలిగా అనిపించింది,  ఆవిడకి బాగా తెలుసు ప్రియా కి ఈ పెళ్లి ఇష్టం లేదు అని. ఆవిడకి ఇది కూడా తెలుసు ప్రేమ్ కి ప్రియా అంటే చాలా ఇష్టం అని , ప్రేమ్ ప్రియ మనసు మార్చగలడు అనే నమ్మకం ఆవిడకి కూడా ఉంది,  కానీ ఎందుకో అప్రయత్నంగా ప్రేమ్ వైపు చూసింది ఈ పెళ్లి  ప్రియా కి ఇష్టం లేకుండా జరిపించడం కరెక్టేనా అని.

గాయత్రి గారు ఫ్రేమ్ ని ఎందుకు అలా చేస్తుందా ప్రేమ్ కి బాగా తెలుసు .ప్రేమ్  గాయత్రీ గారి వైపు వంగి చిన్నగా మాట్లాడుతూ " అమ్మ నీ కోడలు ఇప్పుడు ఇలా ఉందని బాధపడుతున్నావ్ కానీ నా మీద నమ్మకం ఉంచు , మా పెళ్లికి దాని మొహం లో చిరునవ్వు చూస్తావు నువ్వు,  తన ఇష్టపూర్వకంగా నన్ను పెళ్లి చేసుకుంటుంది , నువ్వు చూస్తూ ఉండు"అని నమ్మకం గా చెప్తాడు.

గాయత్రి గారు " సరే రా ఇది నిశ్చితార్థం కాబట్టే నేను ఒప్పుకుంటున్నాను కానీ పెళ్లికి కూడా దాని మొహం లో నేను నవ్వు చూడలేక పోతే కనుక ఈ పెళ్లి నేనే ఆపేస్తాను"  అని అంటారు.

" సరే అమ్మ నీ ఇష్టం,  పెళ్లి లోపు దాని మనసు నేను మార్చలేక పోతే నీ వరకు అక్కర్లేదు నేనే ఈ పెళ్లిని ఆపేస్తాను " అని అంటాడు ప్రేమ్.

ప్రియా ని అలా చూస్తుంటే ప్రేమ్ కి కొంచెం బాధ కలిగిన ఎలాగైనా సరే పెళ్లి లోపల ప్రియా పెదవులపై చిరునవ్వు తెప్పించాలని గట్టిగా అనుకుంటాడు.

తన కూతురిని అలా చూస్తుంటే జగదీష్ చంద్ర కూడా చాలా బాధపడతాడు అప్రయత్నంగా ఊర్మిళాదేవి గారి వైపు చూస్తే , ఆవిడ తన కొడుకు ఆవేదనని గమనించి " నా మనవడి మీద నాకు నమ్మకం ఉందిరా , దాని మనసు వాడు మాత్రమే మార్చగలడు నువ్వు ఏమాత్రం ఆలోచించకు. ఈ అమ్మ మీద నమ్మకం ఉంచి , తాంబూలాలు మార్చుకో"  అని అంటారు.

సునంద గారు కూడా జగదీష్ చంద్ర గారి భుజం మీద చేయి వేసి " ప్రేమ్  మీద నమ్మకం ఉంచండి " అని చిన్నగా అంటారు.

జగదీష్ చంద్ర కూడా సరే అని అంటూ గాయత్రి గారి వైపు చూస్తారు గాయత్రి గారు కూడా  తమ్ముడి వైపు చూసి చిన్నగా నవ్వుతుంది.  తర్వాత ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు.

శాస్త్రి గారు పూజ చేయించిన ఉంగరాలు తీసుకొని ప్రేమ్ ఇంకా ప్రియా చేతిలో పెడతాడు.

" ఇంగేజ్మెంట్ సమయంలో ఉంగరాలు (రింగ్స్) మార్చుకోవడం ఒక ఆధునిక ఆచారం లాగా కనిపించినా, దీని వెనుక ఆధారంగా కొన్ని ఆధ్యాత్మిక భావాలు మరియు శరీర శాస్త్ర సంబంధిత విశ్వాసాలు ఉన్నాయి. ఇవి హిందూ సంప్రదాయాన్ని మరియు ప్రేమ, బంధం మధ్య ఉన్న గాఢతను వ్యక్తపరచే విధంగా ఉంటాయి. " అని అంటూ శాస్త్రి గారు వాళ్ళకి ఈ సాంప్రదాయ  విధానాల గురించి వివరించి చెప్తూ ఉంటారు.

ఆయన ఉంగరాల వైపు చూపిస్తూ 💍 "  ఉంగరం అంటే ఒక వలయం. ఇది ప్రారంభం లేకుండా ముగింపు లేని ఆకారం. ఇది రెండు ,వధువు మరియు వరుడు మధ్య ఉండే శాశ్వత బంధాన్ని సూచిస్తుంది. ఈ ఉంగరం చేతిలో ఉండటం అంటే, వారి బంధం ఎప్పటికీ చెదరని సంకేతం." .

ఆయన అలా చెప్తూ ఉంటే అందరూ శ్రద్ధగా ఆయన వైపు చూస్తూ వింటూ ఉంటున్నారు.

" సాధారణంగా ఉంగరాన్ని కుడి చేతి నాలుగో వేళ్ల (రింగు వేళ్ల)లో వేసే సంప్రదాయం ఉంది (పాశ్చాత్య సంప్రదాయంలో అది ఎడమచేతి వేళ్ళలో ఉంటుంది). అయితే హిందూ సంప్రదాయంలో దానికి ఒక విశిష్ట కారణం ఉంది" అని ఆయన చెప్తుంటే.

శైలు " దాని కారణ ఏంటి శాస్త్రి గారు"  అని అడుగుతుంది.

శాస్త్రి గారు ఆయన ఉంగరం వేలను అందరికీ చూపిస్తూ , " మీరు దీన్ని ఏమని పిలుస్తారు రింగు వేలు అనే కదా"  అని నవ్వుతూ అడుగుతారు.

శైలు అవును అన్నట్లు తలకాయ ఊపుతుంది. "  రింగు వేళ్ల  ద్వారా నాడీ  అదే ఇంగ్లీషులో వైన్(Vein) అంటారుగా , అధి నేరుగా గుండెకు అంటే హృదయానికి కలిసినదిగా మన పురాణాల విశ్వాసం ఉంది. అందువల్ల ప్రేమ, మనసు, బంధం — ఇవన్నీ గుండెతో సంబంధం ఉన్నవి కాబట్టి, ఆ వేళ్లలో ఉంగరాన్ని ధరించడం ద్వారా ఆ బంధాన్ని గుండెతో కలిపినట్టు భావిస్తారు.అలాగే పాంచభౌతిక తత్వం ప్రకారం మన వేళ్ళకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది . హిందూ సంప్రదాయం ప్రకారం, మన వేళ్ళు పాంచభౌతిక తత్త్వాలను (ఐదు మూలతత్త్వాలు) సూచిస్తాయి" అని అంటూ ఆయన చేతి వేళ్లను చూపిస్తూ" చిన్నవేలు – జల తత్వంరింగు వేళ్ళు – భూ తత్వంమధ్యవేలు – ఆకాశ తత్వంచిటికె వేళ్ళు – వాయు తత్వంబొటనవేలు – అగ్ని తత్వంరింగు వేళ్లు భూ తత్వానికి సంబంధించినవి, అంటే స్థిరత, స్థిరమైన బంధం. కాబట్టి, రింగును అక్కడ వేయడం అనేది ఈ బంధం స్థిరంగా ఉండాలని ఆకాంక్షించడం కూడా."  అని అందరికీ వివరంగా చెప్తారు శాస్త్రి గారు.

శైలు కూడా తన వేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ చూసుకుంటూ నిఖిల్ వైపు చూస్తుంది . అదే సమయానికి నిఖిల్ కూడా శైలు వైపు చూస్తూ చిన్నగా నవ్వుతాడు.

" ఉంగర మార్పిడి అనేది కేవలం చురుకైన సంఘటన కాదు, అది ఇద్దరి మధ్య ప్రేమ, భరోసా, జీవితాంత బంధానికి సంకేతంగా ఉంటుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి చర్య వెనుక తాత్త్వికత ఉంటుంది, అలాగే ఇది కూడా ఒక పవిత్రమైన ప్రతిజ్ఞను సూచిస్తుంది." అని  నిశ్చితార్థం రోజు ఉంగరాలు ఎందుకు మార్చుకుంటారో అందరికీ వివరించి చెప్తారు శాస్త్రిగారు.

" చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు నిజంగా దీని వెనకాల ఇంత అర్థం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది " అని అంటాడు ప్రేమ్.

శాస్త్రి గారు చిన్నగా నవ్వుతూ " ఇది చెప్పడం నా బాధ్యత నాయన " అని అంటాడు.

" మా ఇద్దరి పెళ్లికూడా మీ చేతుల మీద గానే జరగాలి శాస్త్రిగారు అలాగే మా పెళ్ళిలో జరిగే ప్రతి తంతు గురించి మీరు నాకు వివరించి చెప్పాలి"  అని అంటాడు ప్రేమ్.

" కచ్చితంగా నాయన మీ పెళ్లిని నా చేతుల మీద గానే జరిపిస్తాను"  అని నవ్వుతూ చెప్తారా శాస్త్రి గారు.

ఆ మాట వినగానే ఊర్మిళాదేవి గారు చాలా సంతోషపడతారు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో శాస్త్రి గారు పెళ్లిళ్లు చేయడం మానేశారు కాబట్టి, ఆయన స్థానంలో ఎక్కువగా ఆయన కొడుకు , మనవడే ఎక్కువ పెళ్లిళ్లు చేస్తున్నారు ఈయన పెళ్లిళ్లు చేయడం ఎప్పుడో మానేశాడు ఎన్ని సంవత్సరాలు తర్వాత మళ్లీ ప్రియా పెళ్లికి ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యకరం, బహుశా ఆయన మనవడు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఈయన ఇలా చేస్తున్నాడేమో అని అనుకుంటారు.

" సరే నాయన ఇక ఉంగరాల మార్చుకొంది"  అని శాస్త్రి గారు అనడంతో ప్రేమ్ సంతోషంగా సరే అంటాడు.

ముందుగా ఊర్మిళాదేవి ప్రియ నీ  ప్రేమ్ కి ఉంగరం తొడగమంటుంది .ప్రేమ్ వెంటనే తన ఛాయ్ ముందుకు ఇస్తాడు .ఊర్మిళాదేవి గారు ప్రేమ్ సంతోషం చూసి చినగా నవుతు " హ్మ్మ్ ....కానివ్వు రింగ్ వాడి వెలికి తొడుగు " అని ప్రియ నీ అంటుంది.

ప్రియ ఒకసారి వాళ్ళ అందరి వైపు ఒకసారి చూసి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ప్రేమ్ వేలకి ఉంగరం తొడుగుతుంది .అందరూ క్లాప్ 👏👏👏కొడతారు .

ప్రేమ్ ప్రియ తొడిగిన రింగ్ వైపు ఆరాధనగా చూస్తూ తన గుండెకి అదుముకుంటాడు.

తర్వాత  ప్రేమ్ తన చెయ్యి ముందుకు చాపుతాడు ప్రియ చెయ్యి ఇవ్వమంటూ.ప్రియా మాత్రం ఏ చలనం లేకుండా అలా ఉండేసరికి,  సునంద గారు ప్రియా పక్కకు వెళ్లి " చేయి ముందుకు ఇవ్వు తల్లి " అని అంటుంది .

ప్రియా తన చెయ్య ముందుకు ఇస్తుంది కానీ తన రింగ్ ఫింగర్ కి  ఆల్రెడీ రింగ్ ఉంటుంది .

ప్రియా వేలికి ఆ ఉంగరం చూసిన ప్రియా ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి మొహాల్లో దిగులు.  వారు  ఆ ఉంగరం సంగతి మర్చిపోయారు. ప్రియా ఆ ఉంగరం ఎప్పటికీ తీయదు అని వాళ్ళకి బాగా తెలుసు . ఇప్పుడు ప్రేమ్ ఉంగరం తొడగాలి అంటే ఆ ఉంగరం తీయాల్సి వస్తుంది కానీ దానికి ప్రియా ఒప్పుకోదు.

నితిన్ పెదవులపై చిరునవ్వు '  ఇప్పుడు నువ్వు ప్రియా వేలికి ఉంగరం ఎలా తడుగుతావో నేను చూస్తాను రా , అది ఆ ఉంగరం చచ్చేవరకు కూడా తెలియదు'  అని అనుకుంటాడు.

చుట్టూ మీడియా వాళ్ళు ఇంకా గెస్ట్ అందరూ ఉండడం చూసి ఉరిమిలాదేవి గారు మెల్లగా ప్రియా దగ్గరికి వెళ్లి " ప్రియా తల్లి ఆ ఉంగరం ఒకసారి తియ్యి తల్లి ఈసారికి తర్వాత మళ్లీ పెట్టుకొందువు గాని"  అని అంటుంది .

ప్రియా ఊర్మిళాదేవి గారి వైపు కోపంగా చూస్తూ  "ఉంగరం తీసేది అంటూ ఉంటే అది నా ప్రాణం పోయినా తర్వాతే అని నీకు ఎన్నోసార్లు చెప్పాను నానమ్మ నేను ఈ ఉంగరం తీయను"  అని గట్టిగానే ఉంటుంది

ప్రియా మొండితనం  తెలిసిన ఊర్మిళాదేవి గారికి ఏం చేయాలో అర్థం కాదు .

జగదీష్ చంద్ర కూడా  ప్రియా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాలి అనే లోపు  ప్రియా వాళ్ళ డాడీ వైపు కళ్ళ నీరుతో చూస్తుంది.ప్రియా కంట్లో నీరు చూసిన జగదీష్ చంద్ర ఏమి మాట్లాడలేక పోతాడు. ప్రియా కి ఆ రింగ్ ఎంత ముఖ్యమైనదో ఆయనకి బాగా తెలుసు. ఆయనకు కూడా ఏం చేయాలో అర్థం కాదు.

ప్రేమ్ మాత్రం ప్రియా వైపు నవ్వుతూ చూస్తూ " ఆ ఉంగరం తీయాల్సిన అవసరం లేదు అమ్మమ్మ"  అని అంటాడు.

ఆ మాట వినగానే ప్రియా ప్రేమ్ వైపు షాక్ లో చూస్తుంది.

కొనసాగుతుంది

ప్రియా ఆ రింగ్ ని ఎందుకు తీయనంటుంది ?. ప్రియా కి  ఆ రింగ్ తో ఉనా అనుబంధం ఏమిటి? ఇప్పుడు ప్రేమ్ ఏం చేస్తాడు. ?. తెలుసుకోవాలనుందా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు

నా కథ కనుక మీకు  నచ్చినట్లయితే సపోర్ట్ లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు .