you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 23

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 23

ప్రేమ్ మాత్రం ప్రియా వైపు నవ్వుతూ చూస్తూ " ఆ ఉంగరం తీయాల్సిన అవసరం లేదు అమ్మమ్మ"  అని అంటాడు.

" అదేంటి రా ఆ రింగ్ తీయకపోతే నువ్వు దానికి ఉంగరం ఎలా తొడుకుతావు?" అని అడుగుతుంది ఊర్మిళాదేవి. 

ఊర్మిళ దేవి గారు ప్రియా వైప చూసి " ప్రియా చుట్టూ అందరూ ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా వచ్చారు,  మీ నాన్నగారికి మన ఇంటికి ఉన్న పరువు తీయకు వెంటనే ఆ రింగ్ తీసి నాకు ఇవ్వు తర్వాత పెట్టుకుందువు గాని " అని ప్రియా కి వినిపించేలాగా చిన్నగా చెప్తుంది.

ప్రియా ఆ రింగ్  ఉన్న చేతిని తన గుండెకి అదుముకుంటూ " లేదు నానమ్మ నేను తీయలేను , నావల్ల కాదు , ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు " అని కంట్లో నీరుతో చెప్తుంది.

ఊర్మిళాదేవి గారు ఎలాగైనా ఆ రింగ్ ప్రియా చేతి వేళ్ళ నుంచి తీయాలి అని అనుకొని కొంచెం ముందుకు వెళ్ళబోతుంటే ప్రేమ్ ఊర్మిల దేవి గారి చేయి పట్టుకొని " అమ్మమ్మ నేను ఈ రింగ్ పెట్టడానికి తను ఆ రింగ్ తీయాల్సిన అవసరం లేదు"  అని అంటూ ఊర్మిళాదేవి గారిని ఆపుతాడు.

ఆ మాట వినగానే ప్రియా ప్రేమ్ వైపు షాక్ లో చూస్తుంది.

ప్రేమ్ ప్రియా వైపు చూసే చిన్నగా నవ్వుతూ "  నిజం బంగారం ఆ రింగ్ నీకు ఎంత ఇంపార్టెంట్ నాకు బాగా తెలుసు నేను తెచ్చిన ఈ రింగ్ పెట్టుకోవడానికి , ఆ రింగ్ తీయాల్సిన అవసరం లేదు"  అని అంటాడు.

ఊర్మిళాదేవికి చుట్టూ  ఉన్న వాళ్లకి ప్రేమ్ చెప్తుంది అంతగా అర్థం కాదు.

నితిన్ అరుణ్  వైపు చూస్తూ " వీడెప్పుడు ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నాడు". అని అడుగుతాడు.

"  నాకేం తెలుసురా,  నన్ను అడిగితే,  వాడు ఏం చేయాలనుకుంటున్నాడో నాకు ఏమైనా చెప్పి చేస్తాడా ఏంటి ? "  అని అంటాడు అరుణ్.

అరుణ్ కి నితిన్ మీద ఈరోజు కొంచెం కోపంగానే ఉంటుంది ఎందుకంటే , నితిన్ వల్లే ఈరోజు అరుణ్ కూడా ప్రియా చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది. నితిన్ అరుణ్ ని ఇరికించాడు  ప్రియా దగ్గర .ఇంకా ఆ సిద్దు విషయంలో కూడా కొంచెం కోపం గానే ఉన్నాడు అరుణ్. ఈ ఫంక్షన్ అయిపోయాక నితిన్ కి తన స్టైల్ లో కోటింగ్ ఇవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు అరుణ్.

ప్రేమ్ ప్రియా కి రింగ్  చూపిస్తూ " ఈ రింగ్ నీ రింగ్ మీద ఒక షీల్డ్ లాగా  ఉంటుంది ఒకసారి చూడు"  అని ప్రియా చేతికి ఇస్తాడు .



ప్రియ ఆ రింగ్ తీసుకొని చూస్తుంది. అరుణ్,  నితిన్ నిఖిల్, అక్షయ ఇంకా శైలు కూడా ఆ రింగ్ లో ఏమి ప్రత్యేకత ఉందో తెలుసుకోవడానికి వాళ్ళు కూడా దాన్ని పరిశీలిస్తూ ఉంటారు.  

ఆది చూట్టానికి హార్ట్ షేప్ లో ఉన్న డైమండ్ లాగా కనిపిస్తూ ఉంటుంది . కానీ దాన్ని కింద పరిశీలనగా చూస్తే   లోపలి హార్ట్ షేప్ ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుంది , ఆ డైమండ్ రింగ్ కంప్లీట్ హార్ట్ షేప్ కాదు , అది ఒక హార్ట్ షేప్ సెల్ లాగా ఉంటుంది . 

’ఇదేంటి విచిత్రంగా ఉంది , అందులోను సగం సగం గా ఉంది,  ఇందులో అంత స్పెషల్ ఏముంది'  అని అనుకుంటాడు నితిన్ తన మనసులో.

అరుణ్ కి ఏదో అర్థం అయినట్లు అనిపిస్తుంది , కానీ తన అనుమానం నిజమో కాదో ప్రియా వేలికి ఆ రింగ్ పెడితే  చూడాలి అని అనుకుంటాడు, అందుకే సైలెంట్ గా ప్రేమ్ ఏం చేయాలనుకుంటున్నాడో చూద్దామా అని అనుకుంటాడు. 

నితిన్ అరుణ్ వైపు చూస్తూ " ఒరేయ్ ఇది ఒక రింగ్ ఏ కదా ఇందులో స్పెషాలిటీ ఏముంది , అందులోనూ ఇది సగం సగం గా ఉంది ,ఇది నాకేమీ అంతగా అర్థం కాలేదు నీకేమైనా అర్థమైందా"  అని అడుగుతాడు క్యూస్షన్ పేస్ పెడుతూ .

" నీ బ్రెయిన్ కి ఎప్పుడు అర్థమైంది కనుక కొంచెం సేపు ఆగు నీకే తెలుస్తుంది"  అని అంటాడు చిరాగ్గా అరుణ్.

నిఖిల్ కి ఆ రింగ్ చూడగానే ఏదో అర్థం అవుతుంది ప్రేమ్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు '  థాంక్స్ ప్రియా ని అర్థం చేసుకున్నందుకు' అన్నట్లుగా.

ప్రేమ్ నిఖిల్ వైఫ్ వైపు చూసి నా బంగారం గురించి నాకు బాగా తెలుసు అన్నట్లు కల్లా అరుపుతాడు.

" వావ్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది బట్ హార్ట్ ఏంటి అన్ కంప్లీట్ గా ఉంది"  అని అడుగుతుంది శైలు.
అక్షయ కి కూడా అదే డౌట్ వచ్చి ఉండి ఉంటుంది.
" అవును ప్రేమ్ ఇదేంటి కొంచెం డిఫరెంట్ గా ఉంది " అని అడుగుతుంది అక్షయ.

గాయత్రి గారు ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ రింగ్ చూసి ఉంటారు కానీ అంతగా గమనించరు.  ఆ రింగ్ లో అంత ప్రత్యేకత ఏముందో వారికి అంతగా అర్థం కాదు.

ఆదిత్య కూడా కొంచెం క్యూరోసిటీతో " అవును ఇంతకీ అందులో అంత స్పెషాలిటీ ఏముంది ప్రేమ్ " అని అడుగుతాడు.

ప్రేమ్ మాత్రం సమాధానం ఇవ్వకుండా  ప్రియా వైపు నవ్వుతూ చూస్తూ  ఉంటాడు. 

ఆ రింగ్ చూసిన  ప్రియా కి ఏదో అర్థం అయినట్లు , అప్రయత్నంగా తన రింగ్ వైపు చూసుకుంటుంది .
ప్రియా ఫింగర్ కి ఉన్న రింగ్ హార్ట్ షేప్ పింక్ కలర్ రింగ్ .


ప్రేమ్ తెచ్చిన రింగ్  వైట్ కలర్ డైమండ్ హార్ట్ షేప్ లో  మధ్యలోధి మాత్రం  షెల్ లాగా ఉంటుంది  . 

 ప్రేమ్  రింగ్ ప్రియా పెట్టుకుంటే,  ప్రియ పింక్ డైమండ్ మీద ఆ  డైమండ్ షెల్  కరెక్ట్ గా ఫిట్  అయ్యేలాగా కనిపిస్తూ ఉంటుంది. అవి రెండు  కూడా ఒకటే రింగ్ లాగా కనిపిస్తాయి. ప్రియా రింగ్ మీద ప్రేమ రింగ్ ఒక షీల్డ్ లాగా ఉంటుంది. ఇవి రెండు ఒకే రింగ్ లాగా ఉంటూది అంటే ప్రియా ప్రేమ్ రింగ్ వేసుకోవడానికి ఇది తీయవలసిన అవసరం లేదు.


తను  ఆ రింగ్ వేసుకుంటే అది ఎలా ఉంటుందో ఊహించుకున్న ప్రియా మొహంలో చిరునవ్వు విచ్చుకుంటుంది. " అంటే ఇ రింగ్ ..." 

" అవును బంగారం. నువ్వు గెస్ చేసింది కరెక్టే"  అని చిరునవ్వుతో అంటాడు ప్రేమ్  అది వినగానే ప్రియా మొహంలో ఇంకా ఆనందం కనిపిస్తుంది.

ప్రియా మొహంలో వచ్చిన చిరునవ్వు చూసి అక్కడ అందరూ కూడా కొంచెం ఆశ్చర్యపోతారు .

జగదీష్ చంద్ర కి ప్రేమ్ ఏదో చేశాడు అది ఏంటో అర్థం కావట్లేదు కానీ తన కూతురిని అలా సంతోషంగా చూసి అతను చాలా సంతోషపడ్డాడు.

ప్రియా మొహంలో వచ్చిన చిరునవ్వు చేసి ప్రియా ఫ్రెండ్స్ , గాయత్రి ,  గుర్దీప్ కూడా చాలా సంతోషపడతారు. ప్రియా పూజ మొదలైనప్పుడు నుంచి కూడా డల్ గా ఉంది కానీ ఇప్పుడే తన మొహంలో నవ్వును చూశారు అందరూ. అది కూడా ప్రేమ్ వల్ల.

ఊర్మిళాదేవి గారు జగదీష్ చంద్ర వైపు చూసి "చూసావా నీ కూతురి మొహంలో చిరునవ్వు నా మనవడు మాత్రమే తెప్పించగలిగాడు ఇప్పుడైనా ఒప్పుకుంటావా వాడు దానికి  సరైన జోడి అని" అని అంటారు ఊర్మిళాదేవి గారు గర్వంగా.

జగదీష్ చంద్ర  , సునంద , ఆనందాక అవును అన్నట్లు అంటారు.

ప్రేమ్ వాళ్ళ అమ్మ వైపు చూసి  " ఇప్పుడేమంటావ్ అమ్మ నీ కోడలు నవ్వుతుంది చూసుకో"  అన్నట్లు కళ్ళు ఎగరేస్తాడు .
గాయత్రి గారు చిరునవ్వుతో  " ఆల్ ద బెస్ట్ నాన్న " అని చిన్నగా అంటారు.

ప్రేమ్ ప్రియా మొహంలో నవ్వు చూసి తనకి ఆ రింగ్ ఇవ్వమని " బంగారం రింగ్" అడుగుతాడు

ప్రియా వెంటనే రింగ్  ప్రేమ్ చేతిలో పెడుతుంది .
ఆ రింగ్ ప్రియా కి చూపిస్తూ " శాల ఐ " అని నవ్వుతూ అడుగుతాడు.

ప్రియ సంతోషంగా తన చెయ్యి ముందుకు చాపుతుంది. ప్రియా అలా తనకు తానుగా ఆ రింగ్ తొడగమని ప్రేమ్ ముందుకు చేయి చాపితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు .
నితిన్ ఇంకా అరుణ్ మాత్రం షాక్ లో అలా ఉండిపోయి చూస్తూ ఉంటారు.

" వీడు అంతగా ఏం చేశాడు రా ,  ప్రియా అలా చేయి ముందుకు ఇస్తుంది"  అని టెన్షన్ గా అడుగుతాడు నితిన్.

ఈరోజు ఎంగేజ్మెంట్ జరగదు అని అనుకుంటాడు నితిన్.  ఎందుకంటే ప్రియా ఆ రింగ్ ఎప్పటికీ తీయదు అని అతనికి బాగా తెలుసు కానీ అతను అనుకున్నది జరగకుండా ఇంకొకటి జరుగుతుంటే నితిన్ కి ఏమీ అర్థం కాదు.

అరుణ్ నితిన్ వైపు చూస్తూ "  నీకు ఆ రింగ్  చూస్తే ఏమీ అర్థం కాలేదా"  అని అడుగుతాడు.

" ఏముంది రా ఆ రింగ్ లో "  అని కొంచెం అసహనంగా అడుగుతాడు.

అరుణ్  అసహనంగా  " అందుకే రా నిన్ను బ్రెయిన్ లెస్ ఫెలో అని మన బ్యాచ్ లో అందరూ తిట్టేది కొంచెం సేపు ఆగు నీకే అర్థమవుతుంది " అని అంటాడు అరుణ్.

ప్రియా అలా హ్యాపీగా తన చేయి ముందుకు ఇవ్వగానే ఆదిత్య తన తమ్ముడి భుజం మీద తడుతూ "కమాన్ గో ఎహెడ్ రా" అని అంటాడు.

ప్రేమ్ ప్రియా చేతికి ఉన్న రింగ్ ని కొంచెం బయటికి తీసి తన రింగ్ తో ఫిట్ చేసి ప్రేమగా ఆ రింగ్ ప్రియా ఫింగర్ కి  తొడుగుతాడు.

ప్రియా చాలా సంతోషంగా తన రింగ్ చేసుకుంటుంది.


అది తన ఫింగర్ కి చాలా అందంగా కనిపిస్తుంది . 
ఆ రింగ్ అలా ప్రియా చేతికున్న రింగుకి కరెక్ట్ గా ఫిట్ అవ్వగానే నితిన్  కళ్ళు పెద్దవి అవుతాయి.

అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రింగ్ ప్రియా చేతికి ఉన్న రింగ్ కి కరెక్ట్ గా ఫిట్ అవ్వగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. 
ఆ రెండు రింగులు కలిపి ఇప్పుడు ఒకే రింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది.

అక్షయ ఇంకా శైలు " వావ్ ప్రియా చాలా అంటే చాలా బాగుంది తెలుసా ఇది ఇలా ఫీట్ అవుతుందని మేము ఊహించలేదు , ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ "  అని అంటారు.

నిజంగా ఆది ప్రియా చేతికి చాలా అందంగా కనిపిస్తుంది,  ఆ రింగ్ ప్రియా చేతికి ఉన్న రింగ్ కి కరెక్ట్ గా ఫీట్ అవడంతో , సునంద , జగదీష్ ఇంకా ప్రియా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషపడతారు ప్రియా హ్యాపీనెస్ చూస్తూ.

ప్రేమ్ ప్రియా మొహంలో ఉన్న హ్యాపీనెస్ చేస్తూ "  నచ్చిందా బంగారం"  అని అడుగుతాడు.

ప్రియ వెంటనే చుట్టూ ఎవరున్నారు ఎక్కడున్నాది అన్న సంగతి మర్చిపోయి ప్రేమ్ నీ  హాగ్  చేసుకుని "థాంక్యూ థాంక్యూ సో మచ్,  నాకు చాలా బాగా నచ్చింది,  ఐ లవ్ యు"  అని అంటుంది.

ప్రియా అలా ప్రేమ్ ని హ్యాక్ చేసుకుని ఐ లవ్ యు చెప్పే సరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. 
అక్షయ మాత్రం విజిల్ వేస్తుంది. ఆది చూసి ఆదిత్య షాక్ అవుతాడు.

నితిన్ కి ప్రేమ్ ని ప్రియా ని అలా చూసేసరికి,  ఇంకా ప్రియా ప్రేమ్ కి  అందరి ముందు ఐ లవ్ యు చెప్పే సరికి అతని గుండె పగిలినంత పని అవుతుంది.

ప్రియా అలా సడన్గా హగ్ చేసుకుని ఐ లవ్ యు చెప్తుందని ప్రేమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ప్రియా ఇలా ఐ లవ్ యు చెప్పేసరికి అతనికి అంతులేని ఆనందం కలిగింది. 

ప్రేమ్ కూడా ప్రియ నీ  ఇంకా గట్టిగా హగ్ చేసుకొని "ఐ లవ్ యు టూ బంగారం"  అని గట్టిగా అంటాడు.

వాళ్ళిద్దరూ అలా కలిసి పోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు జగదీష్ చంద్ర అయితే ఇంకా ఆనంద పడిపోతూ ఉంటాడు. అతని కంట్లో నుంచి అప్రయత్నంగా నీళ్లు కారుతూ ఉంటాయి. 

సునంద దాన్ని చూసి " ఏంటండీ ఇది, ఆనంద పడవలసిన సమయంలో ఇలా ఎవరైనా ఏడుస్తారా "  అని అంటే.
"  ఇది ఆనందభాష్పాలే"  అని అంటాడు జగదీష్ చంద్ర తన కళ్ళు తుడుచుకుంటూ.


వెయిట్ వెయిట్ ఏంటి ప్రియా ప్రేమ్ కి ఐ లవ్ యు చెప్పింది అంటే ప్రియా ప్రేమ్  కలిసి పోయారు అని అనుకుంటున్నారా , లేదండి ఇంకా ఉంది. మన ప్రియా ప్రేమ్ ని అంత సులువుగా ఒప్పుకోదండి , ఏదో హ్యాపీనెస్ లో అలా చెప్పేసింది అంతే , నెక్స్ట్ ఎపిసోడ్ లో చూస్తారు కదా ,  ఇక మందు వచ్చే ఎపిసోడ్స్ లో పాపం మన ప్రేమ్ , ప్రియ ప్రేమని గెలుచుకోవడానికి చాలా చేయవలసి ఉంటుంది. ఇంకా మన నితిన్ వీళ్ళని విడదీయడానికి చాలా ప్లాన్స్ చేసుకునే ఉన్నాడు అవన్నీ ముందు ముందు ఎపిసోడ్స్ లో మీరే చూస్తారు సారీ చదువుతారు . సో నేను రాసే నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం మీరు వేచి చూడాల్సిందే. 


కొనసాగుతుంది...

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు 

నా కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ?నచ్చలేదా?  , నచ్చితే కనుక నన్ను సపోర్ట్  ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మధ్య నాకు లైక్స్ పూర్తిగా రావట్లేదు అండి ఇది ఏమీ బాగోలేదు చదివిన వెంటనే లైక్స్ కొట్టేయండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా. 

బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.