you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 24

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 24

ప్రియా అలా ప్రేమ్ కి ఐ లవ్ యు చెప్తుంది అని ఎవరు ఊహించలేదు . ఇన్ఫాక్ట్ ప్రియా కూడా అలా చెప్తానని తను ఎప్పుడు అనుకోలేదు కూడా.

వాళ్ళిద్దరిని అలా చూసినా నితిన్ తట్టుకోలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బాధ ఇంకా కోపంగా,  అరుణ్ కూడా నితిన్ ఏం చేస్తాడో అనే భయంతో నితిన్ వెనకాలే వెళ్తాడు.

ప్రియా అలా చెప్పగానే హ్యాపీనేస్ తట్టుకోలేని అక్షయ అక్కడ గట్టిగా విజిల్ వేస్తుంది,  ఆది చూసి ఆదిత్య షాక్ అవుతాడు '  ఏంటిది మొగరాయుడు లాగా ఇలా విజిల్ వేస్తుంది. అయినా దీనికి విజిల్ వేయడం కూడా వచ్చా' అని తన మనసులో అనుకొని చుట్టూ చూస్తూ ఉంటాడు. 
చుట్టూ అన్న వాళ్ళు అక్షయ వైపు చూడడంతో  'చుట్టూ ఎవరున్నారు , అసలు ఎక్కడున్నాము అని కూడా మర్చిపోయి ఇది, అసలే నాకంటూ బిజినెస్ లో ఒక పేరు ఉంది ఇప్పుడు దీనివల్ల మొత్తం పోయేలాగుంది'  అని అనుకుంటూ వెంటనే అక్షయ అని వారిస్తాడు.

ఆదిత్య అలా తనని పట్టుకునేసరికి బుంగమూతి పెట్టుకుని ఆదిత్య వైపు చూస్తుంది " ఏంటి అధి గారు మీరు.  హ్యాపీనెస్ లో అలా విజిల్ వేస్తుంటే అలా ఆపేశారు , ఇది ఎంజాయ్ చేయవలసిన మూమెంట్" అని అంటుంది. 

" ఒసేయ్ ఒకసారి చుట్టూ చూడు పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెస్ వచ్చారు నువ్వు ఇలా విజిల్స్ వేస్తూ ఉంటే నా పరువు పోతుంది మూసుకొని సైలెంట్ గా ఉండు "  అని అంటారు.

అక్షయ చుట్టూ చూస్తుంది ' పక్కనోడి కోసం మన ఆనందాన్ని మనం దాచుకోవాలా'  అని తనలో తాను అనుకుంటూ కోపంగా  " ఛీ మీరు ఎప్పుడు ఇంతే, మనిషన్నాక కొంచెం కళా పోషణ ఉండాలి పక్కనోడు చూస్తున్నాడు అని మన హ్యాపీనెస్ ని ఆపేసుకుంటామా ఏంటి"  అని అంటుంది. 

ఆదిత్య కి  అక్షయ చెప్పింది కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది కానీ అదే సీరియస్ నెస్ మైంటైన్ చేస్తూ "అయినా సరే విజిల్ వెయ్యకు కావాలనుకుంటే ఎవరూ లేని టైంలో నీకు ఎన్ని విజిల్స్ కావాలంటే అన్ని వేసుకో ఇప్పుడు కాదు"  అని అంటాడు. అక్చుఅల్లీ ఆదిత్య కూడా విజిల్ వెయ్యాలని అనిపిస్తుంది , ఎందుకంటే తన తమ్ముడి కూడా తన లవ్ లైఫ్ లో సక్సెస్ అయినందుకు , బట్ తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు చుట్టూ అన్న వాళ్ల వల్ల. కానీ తను చేయలేని పని అక్షయ చేసినంతకు కొంచెం హ్యాపీగానే అంతే ఆదిత్య కి.

ప్రియా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు ప్రేమ్ ని గట్టిగా హాగ్  చేసుకొని ప్రేమ్ తొడిగిన రింగ్ చూసుకుంటూ ఉంటుంది.

ప్రేమ్ ప్రియ నీ అలాగే హగ్ చేసుకుని " ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది బంగారం నువ్వు  మన ఎంగేజ్మెంట్ రోజు  ఇలా నా లవ్ నీ యాక్సెప్ట్ చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు, ఫైనల్లీ నా టూ ఇయర్స్ స్ట్రగుల్ పూర్తయిపోయింది. రియల్లీ ఐ యాం సో హ్యాపీ " అని అంటాడు. 

ప్రేమ్ చెప్పిన మాటలు వింటున్న జగదీష్ చంద్ర , సునంద ఇంకా ఊర్మిళా దేవి గారు  కొంచెం షాక్ అయి చూస్తూ ఉంటారు. ప్రేమ్  ప్రియా నీ టు ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా సంగతి వాళ్ళ ఎవరికీ కూడా తెలియదు.

జగదీష్ చంద్ర నిఖిల్ వైపు చూస్తూ " ప్రియా కి ప్రేమ్ ముందే తెలుసా"  అని అడుగుతాడు. అతను ప్రియ కి  ప్రేమ్ , అక్షయ మరిదిగా మాత్రమే తెలుసు అనుకుంటాడు , కానీ వీళ్ళకి అంతకుముందే పరిచయం ఉంది అని అనుకోలేదు.

నిఖిల్ ,  ప్రియా ఇంకా ఫ్రేమ్ వైపు చూస్తూ" మీకు 2 ఇయర్స్ బ్యాక్ ద్వారక లో  ప్రియ మిస్ అయినా సంగతి తెలిసిందే కదా అంకుల్"  అని అడుగుతాడు.

జగదీష్ చంద్ర ఆశ్చర్యంగా చేస్తుంటే .
" అవును అంకుల్ టు ఇయర్స్ బ్యాక్ ప్రియా ద్వారకలో వన్ వీక్ మిస్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే , ఆ వన్ వీక్ ప్రియా ప్రేమ్ దగ్గరే ఉంది  .  ఆ వన్ వీక్ నేను ప్రియా కోసం చాలా వెతికాను చివరికి ప్రియా జాడ తెలుసుకొని తిరిగి ఇక్కడికి తీసుకు వచ్చేసాను, అప్పుడు నాకు ప్రియా తో  ప్రేమ్ కనిపించలేదు , ప్రేమ్ ప్రియా దగ్గర లేని టైంలో ప్రియా ని మనం సేవ్ చేశాం. అప్పటినుంచి ప్రేమ్  ప్రియా కోసం వెతుకుతూనే ఉన్నాడు అంట , దాని తర్వాత ప్రియా ని అక్షయ పెళ్లిలో చూశాడు, వెంటనే ప్రియా కి ప్రపోజ్ చేశాడు బట్ ప్రియా నో చెప్పింది,  అప్పటినుంచి కూడా ప్రియా మనసు మార్చడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు . " అని చెప్తాడు నిఖిల్. 

" వీరిద్దరూ ఎలా కలిశారు ఆ వన్ వీక్ వీళ్ళ మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా"  అని అడుగుతుంది సునంద. 
ప్రియా వన్ వీక్ కనపడక పోయేసరికి సునంద చాలా కంగారు పడింది కానీ ప్రియా సేఫ్ గా ఇంటికి రాగానే చాలా సంతోష పడింది, కానా ఆ వన్ వీక్ ప్రియా  ప్రేమ్ తో ఉంటుందని తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు.

" ఆ తెలుసు ఆంటీ , మీకు తెలుసు కదా ప్రియా మా దగ్గర ఏమి దాచి ఉంచదు అని.  ఏం జరిగిందో మాకు చెప్పింది.  ఆ రోజు తనతో ఉన్న అబ్బాయి ప్రేమ్ అని మాకు అక్షయ  పెళ్లిలోనే తెలిసింది"  అని చెప్తాడు నిఖిల్.

గాయత్రి గారు కూడా మాట్లాడుతూ " నాకు ప్రేమ్ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని తెలుసు కానీ ప్రియ నే ఆ అమ్మాయి అని నాకు తెలియదు.   పెద్దోడి పెళ్లిలో  ప్రేమ్ ప్రియా తో క్లోజ్ గా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను తర్వాత అడిగితే ప్రియా నే తాను ప్రేమించిన అమ్మాయిని నాకు చెప్పాడు"    అని అంటుంది.

" అంటే మాకు తెలియకుండా చాలానే జరిగాయి అన్నమాట"  అని అంటారు ఊర్మిళ దేవి గారు.

నిఖిల్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. ప్రియా తన లైఫ్ లో మూవాన్ అయినందుకు నిఖిల్ చాలా సంతోషపడుతున్నాడు.

ఊర్మిళాదేవి గారు ప్రేమ్ ఇంకా ప్రియా దగ్గరికి వెళ్లి
"మాకు చెప్పకుండా నీ మనసులో ఇంత ప్రేమ దాచుకున్నావా ,  ఈ విషయం నాకు తెలిసి ఉంటే ఈ పాటికి మీకు ఎప్పుడో పెళ్లి జరిగి ఉండేది , నా కూతురు నా దగ్గరికి ఎప్పుడో వచ్చి ఉండేది,  ఏదైతే ఏ ఆ కృష్ణయ్య మీ ఇద్దరినీ కలిపాడు"  అని అనుకుంటూ  ఊర్మిళాదేవి గారు ప్రేమ్ వైపు చూస్తూ.

ప్రేమ్ ప్రియ తన లవ్ యాక్సెప్ట్ చేసిన హ్యాపీనెస్ లో ఇంకా ఊర్మిళ దేవి మాటలకి కొంచెం సిగ్గు పడుతూ ఉంటాడు.

ఊర్మిళాదేవి ప్రేమ్ తల మీద నిమ్మిరి ప్రియా వైపు చూసి " తల్లి నీ మొగుడిని వదులుతావా , ఈ ఫంక్షన్ అయిపోయాక నీ మొగుడిని ఎంత సేపు కావాలనుకుంటే అంత సేపు కౌగిలించుకోవచ్చు ఇప్పుడైతే వాడిని వదలవే" అని అంటుంది ప్రియ నీ కదుపుతూ. 

ఊర్మిళాదేవి గారు ప్రియా ని అలా ప్రేమ్ నుంచి విడదీయ గానే ఈ లోకంలోకి  వచ్చింది ప్రియా. 

ఒకసారి తనని తాను చూసుకుంది . తను ప్రేమ్ ని హగ్ చేసుకుని ఉండటం గమనించి వెంటనే ప్రేమ్ కి దూరం జరిగింది .

ప్రేమ మాత్రం ప్రియా వైపు ప్రేమగా చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు.

వెంటనే తను ఇప్పుడు ఏం చెప్పిందో గుర్తు చేసుకుని షాక్ అయిపోయింది ప్రియా. 
' నేనేంటి ఇలా చెప్పాను వాడికి నేను ఐ లవ్ యు ఎలా చెప్పాను ' అని తనలో తాను సతమతమైపోయింది .
తనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు.  తను ప్రేమ్ కి ఐ లవ్ యు ఎలా చేపిందో తనకి కూడా అర్థం కాలేదు.
తాను ఒకసారి చుట్టూ చూసింది అందరూ తన వైపే సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నారు.

'నో నో  ఇలా జరగకూడదు, నా మనసులో ప్రేమ్ కి  స్థానం ఇవ్వలేను, ఆది ప్రేమ్ కి  ఇప్పుడే చేపేయాలి , ప్రేమ్ కి లేనిపోని ఆశలు కలిగించకూడదు, ముందు ప్రేమ్ తో  వెంటనే మాట్లాడాలి' అని అనుకుంటుంది ప్రేమ్ వైపు చూసి.

" ప్రేమ్ అది ...నేను.. నేను ...నీతో పర్సనల్గా మాట్లాడాలి"  అని అంటుంది.

ఊర్మిళాదేవి గారు కలగజేసుకుంటూ " నీ మొగుడితో ఫంక్షన్ అయిపోయాక ఎంత సేపు కావాలంటే అంత సేపు మాట్లాడుకోవచ్చు,   అంతగా కావాలంటే బయటకి సినిమా కి కూడా వెళ్ళండి , ఇప్పుడైతే ముందు ఈ దండలు మార్చుకోండి " అని అంటూ వాళ్ళిద్దరికీ పూల మాలలు ఇస్తుంది.

" అది కాదు నానమ్మ నేను చెప్పేది " అని ప్రియ ఏదో చెప్పబోతుంటే .
ఊర్మిళాదేవి గారి మళ్లీ మాట్లాడుతూ "  చుట్టూ చాలా మంది గెస్ట్లు ఉన్నారు తల్లి తర్వాత మాట్లాడుకుందాం మందు అయితే ఈ కార్యక్రమం కానివ్వండి " అని అంటుంది.

ప్రియా కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రేమ్ కి వెంటనే క్లారిఫై చేద్దాం అని అనుకుంటుంది కానీ ఊర్మిళాదేవి గారు  మాట్లాడనివ్వకుండా చేస్తుంది.

ప్రియా కంగారు చూసి ఏదో అర్థమై నట్లు అనిపిస్తుంది ప్రేమ్ కి అతని మనసు కొంచెం బాధగా మారుతుంది కానీ వెంటనే తనని తన కంట్రోల్ చేసుకుంటూ
' నువ్వు ఇప్పుడు అందరి ముందు చెప్పిన దానిని నువ్వు మళ్ళీ నీ మనస్ఫూర్తిగా  చెప్పేలాగా చేసుకుంటా బంగారం, నీ మనసులో నేను ఉన్నానని నాకు తెలుసు కానీ అది ఒప్పుకోవడానికి నువ్వు ఇప్పుడు సిద్ధంగా లేవు అని కూడా నాకు తెలుస్తోంది కానీ ఎలాగైనా సరే నీ మనసులోని మాట,  నీకు నువ్వుగా నాకు చెప్పే రోజు కచ్చితంగా వస్తుంది'  అని అనుకుంటాడు.

ప్రియా కంగారు గమనించిన నిఖిల్ ప్రియా దగ్గరికి వెళ్లి తన భుజం మీద చేయి వేసి " స్వీట్ చాలా మంది గెస్ట్లు ఉన్నారు నువ్వు ప్రేమ్ తో  ఏమి మాట్లాడాలనుకున్న ఈ ఫంక్షన్ అయ్యాక మాట్లాడు , ప్రేమ్ నిన్ను నీ ఫీలింగ్స్ బాగా అర్థం చేసుకోగలడు అతనితో నువ్వు ప్రశాంతంగా తర్వాత మాట్లాడు, ఇది కరెక్ట్ టైం కాదు"  అని చిన్నగా అంటాడు.

నిఖిల్ ప్రియా మనసు చదవగలిగాడు ప్రియా ప్రేమ్ తో ఏం మాట్లాడాలి అనుకుంటుందో అతను గెస్ చేశాడు అందుకే ప్రియా తో అలా చెప్పాడు.

" అది కాదు నిఖిల్ అతనికి హోప్స్ ఇచ్చిన దాన్ని అవుతాను కదా " అని అడుగుతుంది ప్రియా.

"  నీ మనసు వాడు క్లియర్ గా చదవగలడు  నువు  ఇలా ఐ లవ్ యు చెప్తే వాడు నమ్ముతాడు అనుకుంటున్నావా , అతను కూడా నీతో తర్వాత మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు,  ఒకసారి చుట్టూ చూడు చాలా మంది గెస్ట్లు వచ్చి ఉన్నారు . ఈ విషయం ప్రేమ్ తో తర్వాత పర్సనల్ గా మాట్లాడితే బెటర్ ఒకసారి ఆలోచించు"  అని  చిన్నగా అంటాడు.

ప్రియా కూడా అదే కరెక్ట్ అనుకొని ప్రేమ్ వైపు చూస్తుంది .

అదే టైం కి ప్రేమ్ ప్రియా వైపు వంగి తన చెవిలో " డోంట్ వర్రీ బంగారం నువ్వు ఎక్సైట్మెంట్లో నాకు ఐ లవ్ యు చెప్పావని నాకు తెలుసు. కానీ ఇదే మాట మళ్లీ నాకు మనస్ఫూర్తిగా నామీద ప్రేమతో  చెప్పే రోజు కచ్చితంగా వస్తుంది చూసుకో " అని అని కన్ను కొడతాడు.

ప్రేమ్ తన మాటలు సీరియస్గా తీసుకోలేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటుంది ప్రియా నార్మల్ అవుతూ.

ప్రేమ్ ప్రియా చెవిలో ఏదో చెప్పడం గమనించిన ఊర్మిళాదేవి గారు " మీ మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పానా,  ముందు ఈ దండలు మార్చుకోండి " అని అంటూ ఊర్మిళదేవి గారు దండలు మార్చుకోమని ప్రేమ్ ఇంకా ప్రియా నీ  తొందర పెడుతుంది .

ముందుగా ప్రేమ్ ప్రియా మెడలో మాలవెయ్యబోతుంటే , అక్షయ ఇంకా శైలు ప్రియ నీ వెనక్కి లాగేస్తారు.

అక్షయ ప్రియ నీ అలా వెనక్కి లాగగానే ప్రేమ్  "వదిన ఏంటిది " అని అడుగుతాడు.

" ఆ... అంత తొందర ఏంటి మారధి గారు.., ప్రియా మెడలో మీరు ఈ మాల వెయ్యాలి అంటే ముందు కట్న కానుకల సంగతి తేల్చండి " అని అంటుంది.

అక్షయ కట్న కానుకలు అని అనగానే జగదీష్ చంద్ర కూడా ఆ సంగతి మర్చిపోయాను అని అనుకుంటాడు.

ఆదిత్య ప్రేమ్ వెనకాల నిలబడి "హలో ...భార్యమని గారు కట్నకానుకలు ఇవ్వాల్సింది ఆడపిల్ల వారు మగ పెళ్లి వారు కాదు"  అని అంటాడు.

మళ్లీ వెంటనే  " ఒసేయ్ నువ్వు మా ఇంటి పెద్ద కోడళ్ళువి ప్రేమ్ వైపు నుంచి కట్నం డిమాండ్ చేయడం మానేసి  , ప్రియా వైపు నుంచి కట్నం అడుగుతావేంటి నువ్వు " అని అంటాడు.

" ముందు ప్రియ కి ఫ్రెండ్ అయిన తర్వాతే మీ ఇంటికి కోడలుగా వచ్చాను.  అయినా అదంతా పక్కన పెట్టండి . మా ప్రియ ని చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి , అలాంటిది ఊరికినే ఇచ్చేస్తామా ఏంటి మా  ప్రియ నీ . మా ప్రియా ని చేసుకోవాలి అంటే ఎదురు కట్నం  ఇవ్వాలి .ఇప్పుడు చెప్పండి మా ప్రియా కి ఎంత కట్నం ఇస్తారు"  అని అడుగుతుంది.

" అవును కరెక్టే,  ఇప్పుడు చెప్పండి మా ప్రియా కి ఎంత కట్నం ఇస్తారు"  అని అడుగుతుంది శైలు కూడా.

ప్రియా వద్దు అని అంటున్న "  నీకేం తెలియదు ఊరుకో"  అని ప్రియ ని మాట్లాడనివ్వకుండా చేస్తూ,  ప్రేమ్  వైపు డిమాండింగ్ గా  చూస్తారు ఎంత కట్నం ఇస్తావు అన్నట్లు.

" నా తమ్ముడు ఏమైనా తక్కువ , మా తమ్ముడిని చేసుకోవాలన్న రాసిపెట్టి ఉండాలి ముందు మీరెంత కట్నం ఇస్తారో అది చెప్పండి ముందు"  అని అంటాడు ఆదిత్య అంతే డిమాండింగ్ గా.

వీళ్లు చేసే అల్లరి చుట్టు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

వీళ్ళ మాటలకి జగదీష్ చంద్ర నవ్వుతూ " నా అల్లుడికి నా కంపెనీ సీఈఓ గా పోస్ట్  ఇస్తున్నాను అలాగే నా ఆస్తి మొత్తం ప్రియ ఇంకా ప్రేమ్ పేరున మారుస్తున్నాను"  అని అందరి ముందు డిక్లేర్ చేస్తాడు జగదీష్ చంద్ర.

అది విన్న అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. 

కొనసాగుతుంది..

జగదీష్ చంద్ర తీసుకొని ఆ నిర్ణయం ఇప్పుడు ఎటు దారితీస్తుంది? , ప్రేమ్ దానికి ఒప్పుకుంటాడా?  ఇంతకీ మన ప్రియా రియాక్షన్ ఏంటో?.
ఇంతకీ మన నితిన్ సంగతి ఏంటి అంటారు.? 
ప్రియా కి నితిన్ ప్రేమ సంగతి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది? . చాలా క్యూస్షన్స్ ఉన్నాయి కదా,  ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్లి పోదామా.

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.