you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 28

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 28

నిఖిల్ ప్రేమ్ ని ఒక  కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు .
ఆ కార్ దగ్గర ఆల్రెడీ ఇద్దరు బాడీగార్డ్స్ ఉండి ఉంటారు. వాళ్లు ప్రేమ్ ని చూడగానే సెల్యూట్ చేస్తూ కార్డు డికి ఓపెన్ చేస్తారు.

అక్కడ ఒక వ్యక్తి ప్రాణాలు లేకుండా పడిపోయి ఉంటాడు , అతని కాలికి చేతుకి బుల్లెట్ తగిలి ఉంటుంది , అతని నోట్లో నుంచి నురగ కారుతూ ఉంటుంది. ఇతను ఎవరు కాదు ప్రియా కి గన్ ఏం చేసిన వ్యక్తి.

ప్రేమ్  ఆ వ్యక్తి వైపు ఒకసారి చూసి నిఖిల్ వైఫై చేసి 
" యువర్ ఫైవ్ సెకండ్స్ లేట్ నిఖిల్,  లేకపోతే వీడు మనకి ప్రాణాలతో దొరికే వాడు"  అని బేస్ వాయిస్ లో అంటాడు ప్రేమ్.

నిజంగానే నిఖిల్ 5 సెకండ్స్ లేట్ చేశాడు. నిఖిల్ తలదించుకొని " ఐ యాం సారీ సార్"  అని అంటాడు .

" ఏం జరిగింది " అని అడుగుతాడు ప్రేమ్.

నిఖిల్ జరిగింది గుర్తుతెచ్చుకుంటూ ప్రేమ్ కి వివరిస్తాడు.
ప్రేమ్  కన్ను సెగతో డైరెక్షన్ చెప్పగానే ఆ డైరెక్షన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు నిఖిల్.

అప్పుడే ఒక వ్యక్తి ఇంటికి డెకరేషన్ చేయడానికి వచ్చిన వారి బట్టలలో , చేతిలో గన్ తో బయటికి పరిగెడుతూ ఉండడం కనిపిస్తుంది , నిఖిల్ కి .

నిఖిల్ ఆలస్యం చేయకుండా  ఆల్రెడీ సైలెన్సర్ ఫిట్ చేసిన తన  గన్ తీసుకొని అతని కాలు మీద షూట్ చేస్తాడు.

కాళ్ళకి బుల్లెట్  తగలడం తో నొప్పికి ఎటు కదల లేక పోతాడు ఆ వ్యక్తి . నిఖిల్ తన వైపు రావడం చూసి భయపడి వాళ్ళు పెట్టే టార్చర్ గుర్తుకు వచ్చి వెంటనే అతని లాకెట్ తీసుకొని అది నోట్లో పెట్టుకుంటాడు.

నిఖిల్ ఆ స్టెప్ ఊహించలేదు , వెంటనే గన్ తో అతని చెయ్యి మీద షూట్ చేస్తాడు , బట్ నిఖిల్ ఆపేలోపు ఆ వ్యక్తి ఆ లాకెట్ ని మింగేసి ఉంటాడు.  అందులో సైనేడ్ ఉంటుంది. నిఖిల్ ఒక ఫైవ్ సెకండ్స్ ముందు కాల్చిన ఆ వ్యక్తి ఆ లాకెట్ నోట్లో పెట్టుకునే వాడు కాదు.

" షిట్.." అని అనుకుంటూ నిఖిల్ ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు కానీ ఆలోపలే ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు.

నిఖిల్ కి  ఏం చేయాలో అర్థం కాక ఆ చనిపోయిన బాడీని ఒక కార్ డిక్కీలో వేసి సెక్యూరిటీ కి చూస్తూ ఉండమని చెప్పి లోపలికి వస్తాడు.

ఈలోపలే ప్రేమ్ కిందకి వస్తూ ఉంటాడు .ఇలా జరిగింది మొత్తం ప్రేమ్ కి వివరిస్తాడు నిఖిల్.

నిఖిల్  అలా జరిగింది మొత్తం చెప్పేసరికి " ఏమైనా క్లూస్ వదిలాడా "  అని అడుగుతాడు ప్రేమ్  .

" చూసాను ఏమి దొరకలేదు  ఆ గన్ తప , వాడి దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు " అని చెప్తాడు నిఖిల్ .

ప్రేమ్ సెక్యూరిటీ గార్డ్ వైపు చూస్తూ  " రిమూవ్ హిస్ డ్రెస్ " అని అంటాడు.

సెక్యూరిటీ గార్డ్స్ అలాగే అన్నట్లు ఆ చనిపోయిన వ్యక్తి బట్టలు మొత్తం విప్పేస్తారు.

ప్రేమ్ అతన్ని పైనుంచి కింద దాకా స్కాన్ చేసి " టర్న్ హీమ్ " అని అంటాడు. 

సెక్యూరిటీ ఆ చనిపోయిన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్ట గానే అతని వీపు మీద ఈగల్ టాటూ విత్ కోడ్ లెటర్స్  కనిపిస్తుంది.

ఆది చూసి నిఖిల్  షాక్ అయిపోతాడు .

ప్రేమ్  ఆ టాటూ వైపు సీరియస్ గా చూస్తూ  "అయితే నేను గెస్ చేసింది కరెక్టే,  వీళ్ళు మళ్ళీ ప్రియా వెనుక పడుతున్నారన్నమాట"  అని అంటాడు.

నిఖిల్ , ప్రేమ్  వైపు చూసి " మనం వీళ్ళ బేస్ మొత్తం డిస్ట్రాయ్  చేసాము కదా, అంటే వీళ్ళు ఇంకా బతికే ఉన్నారా " అంటాడు.

ప్రేమ్ బాడీగార్డ్ వైపు చూసి " క్లియర్ ఇట్"  అని చెప్పి నిఖిల్ వైపు  చూస్తాడు. 
"  వాళ్ళ ప్లేస్ ని అయితే డిస్ట్రాయ్ చేసాము కానీ ఆరోజు మనం మెయిన్ పర్సన్ మిస్ చేశాను "  అని అంటాడు లోపలికి నడుస్తూ.

ఆ మాటలు వినగానే నిఖిల్ షాక్ అవుతూ " ఏంటి వీళ్ళు ఇంకా బతికే ఉన్నారా, హా గాడ్ ఇప్పుడు ఏం చేద్దాం"  అని అడుగుతాడు నిఖిల్.

" తప్పు మొత్తం నాదే నిఖిల్ ఆరోజు ఆ ప్లేస్ ని బ్లాస్ట్ చేయగలిగాను కానీ అందులో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని క్లియర్గా చెక్ చేసి ఉండాల్సింది  మరొకసారి .వాడు మనం బ్లాస్ట్ చేసే పది నిమిషాలకు ముందే , అండర్ గ్రౌండ్ నుంచి ఎస్కేప్ అయ్యాడు" అని అంటాడు ప్రేమ్ కోపంగా.

" ఇదంతా కూడా నీకు ముందే తెలుసా అయితే నాకు ఎందుకు చెప్పలేదు"  అని అడుగుతాడు నిఖిల్.

" మనం వాడి ప్లేస్ ని బ్లాస్ట్ చేసిన తర్వాత, వాడి బ్లడ్ శాంపిల్స్ దొరకడంతో వాడు చనిపోయాడు అని అనుకున్నాను, ఇన్ఫాక్ట్ వాడి చెయ్యి నాకు అక్కడ దొరికింది, సో వాడు చనిపోయాడు అని డిక్లేట్ చేసుకున్నాను . వాడు సైకో వాడు తప్పించుకోవడానికి వాడి చెయ్యి వాడే ఎరగా వేసి అక్కడ నుంచి పారిపోయాడు . తర్వాత నాకు ఎటువంటి అనుమానం కలగలేదు అందుకే రిలాక్స్డ్ గా ఉన్నాను .బట్  రీసెంట్ గా వాడు బ్రతికే ఉన్నాడు అని తెలిసింది , బట్ ఐ యాం నాట్ ష్యూర్.
వాడు నన్ను గానీ నిన్ను గానీ అటాక్ చేస్తాడేమో అని అనుకొని మన చుట్టూ సెక్యూరిటీ,  నీకు తెలియకుండా కూడా నేనే టైట్ చేశాను సేఫ్ సైడ్ గా  . కానీ ఇలా ఒకడు డెకరేషన్ వాళ్లతో కలిసిపోయి ప్రియా దగ్గరికి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు " అని అంటాడు ప్రేమ్.

" కానీ ప్రియా ని ఎందుకు టార్గెట్ చేశాడు " అని అడుగుతాడు నిఖిల్. 

" నాకు తెలీదు . మేబి మన వీక్నెస్ మీద దెబ్బ కొడితే మనం వీక్ అవుతామని వాడి ప్లాన్ ఏమో"  అని అంటాడు ప్రేమ్.

" ఇప్పుడు మనం ఇంకా అలర్ట్ గా ఉండాలి"  అని అంటాడు నిఖిల్.

" డోంట్ వర్రీ వాడికి ఇంతకు ముందు ఉన్న అన్ని సోర్సెస్ ఇప్పుడు లేవు , కానీ వాడికి సపోర్ట్ చేసే వాళ్ల కోసం వెతుకుతూ ఉన్నాడు " అని అంటాడు ప్రేమ్.

" వాడు వీడిని పంపి మనకి ఒక అలర్ట్ మెసేజ్ లాగా పంపించాడు మనం ఇక ముందు అలెర్ట్ గా ఉండాలి" అని అంటాడు నిఖిల్.

" నా జోలికొస్తే మామూలు చావు  ఇచ్చేవాడిని, కానీ  వాడు నా ప్రియా జోలికి వచ్చాడు వాడికి అంత సులువుగా చావనిస్తానా"  అని అంటూ  ప్రేమ్ ఒక స్మైల్ ఇస్తాడు.

ఆ స్మైల్ చూడగానే నిఖిల్ కి కొంచెం భయం వేస్తుంది . 
‘పాపం వాడికి బాగా ముడింది ఎవరితో పెట్టుకోకూడదో వాడితోనే పెట్టుకున్నాడు' అని మనసులో అనుకుంటూ  వెంటనే " ఇంతకీ ప్రియా కి ఎలా ఉంది?"  అని అడుగుతాడు.

" ఆ బెలూన్ తన చెవి దగ్గరలో పేలడం వల్ల ఆ సౌండ్ కి బాగా పానిక్  అయిపోయి అన్కాన్షియస్ అయింది , ఇప్పుడే టాబ్లెట్ వేసి వచ్చాను ఇంకా హాఫ్ ఎన్ అవర్ లో సృహలోకి వస్తుంది డోంట్ వర్రీ తన గురించి నేను చూసుకుంటాలే"  అని అంటాడు ప్రేమ్.

వీళ్ళ మాటల్లో హాల్లోకి రానే వస్తారు. అక్కడ ఆదిత్య తన చేతిలో ఏదో పట్టుకొని చూస్తూ ఉంటాడు.

ఆదిత్యవైపు చూస్తూ " ఏంటి అన్నయ్య ఏదైనా డైమండ్  దొరికిందా ఏంటి అంత పరిశీలంగా చూస్తున్నావ్ " అని నవ్వుతూ ఆదిత్య దగ్గరికి వస్తాడు .

ఆదిత్య ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ తన చేతిలోది చూపిస్తూ "  ఏంట్రా ఇది"  అని అడుగుతాడు , అది బులెట్.

ప్రేమ్ ఇంకా నిఖిల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు .ఆదిత్య ఆ బులెట్ చూపిస్తూ " ఈ బులెట్ నాకు స్టేజ్ మీద దొరికింది నిజం చెప్పు ప్రేమ్ ఆ బెలూన్ నార్మల్ గా పేలిందా లేకపోతే ఈ బుల్లెట్ వల్ల పేలిందా " అని అడుగుతాడు. 

ప్రేమ్ వెంటనే చుట్టూ చూస్తూ వెళ్లి వాళ్ళ అన్నయ్య నోరు మూస్తూ " ఉష్...అరవకురా.!  నీకు అన్ని వివరంగా చెప్తాను " అని చెప్పి ఆధిత్యాన్ని పక్కకు తీసుకెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. 

ప్రేమ్ చెప్పింది మొత్తం విన్న ఆదిత్య షాక్ అవుతూ "వాట్ ?  నువ్వు ఇంకా ఎస్ ఎఫ్ ఎఫ్ లో చేస్తూనే ఉన్నావా ? ఫోర్ ఇయర్స్ బ్యాక్ రిటైర్మెంట్ తీసుకున్నావు కదరా,  నీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు మళ్ళీ ఎస్ ఎఫ్ ఎఫ్  అంటున్నవ్ ఏంటి ? నాకేమీ అర్థం కావట్లేదు  ?" అని అంటాడు ఆదిత్య.

ఆదిత్య మాటలకి నిఖిల్ మాట్లాడుతూ " సార్ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోలేదు , జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు అంతే ఆయన హెల్త్ ఆయన దేశభక్తికి అడ్డు వస్తుందని మీరు ఎలా అనుకున్నారు సార్, హి ఇస్ ఆన్ జెమ్, ఆయనని అంత సులువుగా ఎవరు వదులుకోలేరు"  అని అంటాడు.

ఆదిత్య నిఖిల్ వైఫ్ విచిత్రంగా చూసి " నువ్వేంటి వాడిని కొత్తగా సర్ అంటున్నావ్?"  అని అడుగుతాడు .

దానికి ఫ్రేమ్ నవ్వుతూ "  ఎందుకంటే  హి వర్క్ అండర్ మీ " అని అంటాడు. 

దానికి ఆదిత్య షాక్ అవుతూ " ఏంట్రా మాకు ఇ షాకులు " అని అంటాడు. 

" ఇంకా చాలా షాక్ ఉన్నాయిలే గాని , నీకు అవన్నీ వివరంగా తర్వాత చెప్తాను ముందు పద నా బంగారానికి ఎలా ఉందో చూడాలి"  అని అంటూ పైకి వెళ్తాడు ప్రేమ్.

" అసలు వీడు ఎస్ ఎఫ్ ఎఫ్ లో ఎలా జాయిన్ అయ్యాడో , వాళ్ళందరూ వీటిలో ఏమి చూశారో , వీడిని అందరికన్నా హై పొజిషన్లో ఎందుకు కూర్చోబెట్టారో ఇప్పటికీ నాకు అర్థం కాదు"  అని అంటాడు ఆదిత్య,  వెళ్తున్న ప్రేమ్ వైపు చూస్తూ.

ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది కదా . ఏం లేదండి మీకు ఫస్ట్ చెప్పాను కదా నిఖిల్ మిలటరీ లో  చేస్తాడు అని నిఖిల్ చేసేది ఎస్ ఎఫ్  ఎఫ్ లో ఒక సీక్రెట్ ఏజెంట్ గా అతని బాస్ ఎవరో కాదు మన ప్రేమ్ అదేనండి మన కథలో హీరో . వీళ్ళు ఒక సీక్రెట్ మిషన్ చేసి ఉంటారు దాని ఫలితంగా ఇప్పుడు అవతలి వాళ్లు ఆ రివెంజ్ కోసం మన ప్రియ ని టార్గెట్ చేసి ఉంటారు ప్రియా ని ఎందుకు టార్గెట్ చేశారు అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది . ఇంకా వాళ్ళు చేసిన ఆ మిషన్ ఏంటో కూడా ముందు తెలుస్తోంది లేండి.

కొనసాగుతుంది...

బాయ్ మళ్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.