you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 29

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 29

శైలు ప్రియా అని చెక్ చేస్తూ ఉంటుంది. 
" ఎలా ఉంది శైలు ఇప్పుడు నా మనవరాలికి కి " అని అడుగుతుంది ఊర్మిళాదేవి గారు.

" పర్వాలేదు అమ్మమ్మ ఇప్పుడే కదా ఇంజక్షన్ చేసింది ఇంకొక అరగంటలో లేచి కూర్చుంటుందిలే" అని అంటుంది శైలు.

" నా కూతురు ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకోలేదంటావా"  అని అడుగుతుంది సునంద గారు.

" ఆంటీ మీకు తెలిసిందే కదా మనం ఎన్ని డాక్టర్లు చూపించాము తనకు తానుగా ఈ భయం నుంచి బయటికి వస్తే కానీ మనం ఏం చేయలేము"  అని అంటుంది శైలు. 

గాయత్రి గారు మాట్లాడుతూ " ఇంతకీ ప్రియా కి ఈ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది"  అని అడుగుతుంది.

గాయత్రి గారికి అన్ని తెలియాలి అని అనుకొని జగదీష్ చంద్ర మాట్లాడుతూ  " అక్క నీకు నేను అన్ని వివరించి చెప్తాను,  ప్రియా కి ఇది మొదటి సంబంధం కాదు.  ప్రియ నాలుగు సంవత్సరాలు క్రితం ఒక అబ్బాయిని ప్రేమించింది,  ఆ అబ్బాయి నీ పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకుంది. నిశ్చితార్థం దగ్గరలో పెట్టుకుందాం అనగా,  నాన్నగారు ఆ అబ్బాయి ఇంకా ప్రియా ముగ్గురు కలిసి ఏదో గుడికి అని వెళ్లారు వచ్చే దారిలో అనుకోకుండా వీళ్ళ కారు కి యాక్సిడెంట్ జరిగింది , అందులో ఆ అబ్బాయి  ప్రియా ని కాపాడబోయి చనిపోయాడు.  ప్రియా గాయాలతో బయటపడింది . నాన్నగారు రెండు సంవత్సరాలు కోమాలో ఉండి , తర్వాత చనిపోయారు " అని బాధగా చెప్తారు జగదీష్ చంద్ర.

వాళ్ల నాన్నగారు ఎలా చనిపోయారో తెలుసుకున్న గాయత్రి గారి కళ్ళల్లో నీరు తిరిగాయి,  అలాగే ప్రియా గతం గురించి తెలుసుకొని కొంచెం బాధపడతారు కూడా.  ప్రియా లైఫ్ లో ఇలా జరిగింది అని తెలిసి చాలా బాధ పడతాడు గుర్దీప్.

జగదీష్ చంద్ర జరిగింది చెప్తున్నప్పుడు ప్రేమ్ , ఆదిత్య ఇంకా నిఖిల్ అప్పుడే ప్రియా గది తలుపు దగ్గరకి వచ్చి ఉంటారు , ఆయన చెప్పింది అంతా కూడా  వాళ్లు కూడా వింటారు.

జగదీష్ చంద్ర గారు నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది చెప్తూ ఉండగా అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో నుంచి నీరు కారుతుంది. 

జగదీశ్ చంద్ర ప్రియా వైపు బాధగా చూస్తూ " ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రియా చాలా డిస్టర్బ్ అయింది అప్పటినుంచి కూడా పెళ్లి చేసుకోకుండా ఆ అబ్బాయి జ్ఞాపకాలతో అలా ఉండిపోయింది , ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో తన కళ్ళ ముందే ఒక బ్లాస్ట్ చూసింది,  అప్పటినుంచి కూడా ఏదైనా బ్లాస్ట్ జరిగిన,  గట్టిగా బ్లాస్ట్ కి సంబంధించిన సౌండ్  వచ్చిన తను పానిక్ అయిపోతూ ఉంటుంది . నా కూతురిని ఈ సమస్య నుంచి బయట పడేసే మార్గం ఇప్పటికీ నాకు దొరకలేదు .తర్వాత ఇన్ని సంవత్సరాలకు మల్లి పెళ్లికి ఒప్పుకుంది, నాకోసం మన కుటుంబం కోసం"  అని అంటారు .

ప్రియా పెళ్లి ఎందుకు వద్దు అనాదో గాయత్రీ గారికి ఇప్పుడు అర్థం అవుతుంది. 

మళ్లీ జగదీష్ చంద్ర మాట్లాడుతూ "  ప్రియ ఈ పెళ్లి బలవంతంగా చేసుకుంటుందేమో అని ఎక్కడో చిన్న అనుమానం ఉండేది అక్క నాకు,  కానీ ఈరోజు ప్రియా ప్రేమ్ కి ఐ లవ్ యు చెప్పగానే నాకు ఆ అనుమానం తీరిపోయింది " అని అంటాడు జగదీష్ చంద్ర. 

సునంద గారు  కూడా మాట్లాడుతూ"  అవును వదిన  , అ సంఘటన తర్వాత ప్రియా మనస్ఫూర్తిగా నవ్వడం నేను చూడలేదు . ప్రియా లోని అల్లరితనం,  చిలిపి చేష్టలు అన్నీ కూడా మాయమైపోయాయి ,  నా పాత ప్రియా ని నేను చూడలేనేమో అని ఎప్పుడూ బాధపడే దానిని.  కానీ ప్రేమ్ దగ్గర మనస్ఫూర్తిగా నవ్వుతుంది , అల్లరి చేస్తుంది , నా పాత ప్రియ ని ప్రేమ్ దగ్గర మాత్రమే చూడగలిగాను. ఈ తల్లి బాధ చూడలేక ఆ కృష్ణయ్య ప్రేమ్ ని నా ప్రియా జీవితంలోకి తెచ్చి ఉంటాడు " అని అంటుంది సునంద గారు కన్నీళ్ల మధ్య. 

ఈ డిస్కషన్ అంతా వింటున్నా నితిన్ కి చాలా కోపం వస్తుంది, వీళ్ళందరూ కూడా ప్రేమ్ ని అంతగా నమ్మడం చూడలేకపోతున్నాడు.
’ఏ మందు పెట్టావ్ రా వీళ్ళందరికీ నువ్వు , వీళ్ళందరూ కూడా నీ మీద ఇంత నమ్మకం పెట్టుకుంటున్నారు, కానీ వీళ్ళ అందరి నమ్మకం తప్పు అని నేను నిరూపిస్తాను చూస్తూ ఉండు.  ప్రియా నా దగ్గర మాత్రమే సంతోషంగా ఉండగలదు అని వీళ్ళకి చూపిస్తాను ఆరోజు దగ్గరలోనే ఉంది ' అని కసిగా అనుకుంటాడు.

ఊర్మిళాదేవి గారు సునంద భుజం మీద చేయి వేసి "నువ్వేమీ బాధపడకు నా మనవడు నా మనవరాలిని తిరిగి  నా పాత మనవరాలిగా మార్చి మనకి ఇస్తాడు చూస్తూ ఉండు " అని అంటారు.

అప్పుడే ప్రేమ్ లోపలికి వస్తూ "  డోంట్ వర్రీ అమ్మమ్మ నీ మనవరాలిని నీకు నేను తిరిగి ఇస్తాను లే " అని నవ్వుతూ అంటాడు.

ప్రేమ్ వెళ్లి ప్రియా పక్కన కూర్చుంటూ ప్రియా తల ప్రేమగా నిమురుతూ . " ప్రియా గురించి మీరేమీ కంగారు పడొద్దు ప్రియా గురించి నాకు అంతా తెలుసు తన పాస్ట్ గురించి నాకు ముందే తెలుసు మా వదిన నాకు  ముందే చెప్పింది " అని అక్షయ వైపు చూస్తాడు.
అక్షయ ప్రేమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది.

" పాస్ట్ అందరికీ ఉంటుంది.  ప్రియా పాస్ట్  గురించి తెలిసిన తర్వాతే తన మీద నాకున్న ప్రేమ ఇంకా పెరిగింది , తన పాస్ట్ మా ఫ్యూచర్ ని,  నాకు ప్రియ మీద ఉన్న ప్రేమని ఎప్పుడు ఎఫెక్ట్  చేయదు , ఈ గుండె ఆగే వరకు,  నాకు తన మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ చెరగదు"  అని అందరి వైపు చూస్తూ ఉంటాడు.

ప్రేమ్ ప్రియ మీద ఉన్న తన ప్రేమని అందరికీ అలా చెప్తుంటే అందరికీ చాలా సంతోషం అనిపించింది.

ఆ మాట వినగానే శైలు కొంచెం ఆశ్చర్య పోతుంది "అంటే ప్రేమ్ కి ప్రియా పాస్ట్ గురించిన తెలిసిన తర్వాతే ప్రియా ని లవ్ చేయడం మొదలు పెట్టాడా.  ఇతన్ని నేను నమ్మొచ్చా?  ప్రియా విషయంలో " అనుకుంటూ ఉంటుంది.
అప్రయత్నాంగా నితిన్ వైపు చూస్తుంది. 

' నితిన్ కి కూడా ప్రియా అంటే చాలా ఇష్టం , ప్రియా ప్రేమ్ ని పెళ్లి చేసుకుంటే నితిన్ తట్టుకోగలడా ' అని తన మనసులో అనుకుంటుంది.

ఏదైతే ఏ తను మాత్రం నితిన్ కి సపోర్ట్ గా ఉండాలి అని అనుకుంటుంది ఎందుకంటే తాను నితిన్ కి మాట ఇచ్చి ఉంటుంది కనుక. 

" సరే అయితే అందరూ కిందకు వెళ్లి భోజనం చేయండి ప్రియా దగ్గర నేను ఉంటాలే"  అని అంటాడు ప్రేమ్.

" నువ్వు కూడా భోజనం చేయలేదు కదా ప్రేమ్ నువ్వు కూడా వెళ్లి భోజనం చేసి రా ఈ లోపల ప్రియా దగ్గర నేను ఉంటాలే " అని అంటారు సునంద గారు.

" అత్తయ్య ..ఈరోజు నాకు ఎంతో ముఖ్యమైన రోజు . ఈ రోజు మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది.  ఈరోజు తనతో కలిసి భోజనం చేద్దాం అని అనుకున్నాను తను లేచాక  ఇద్దరం కలిసి తింటాము మీరు వెళ్లి చేసేయండి " అని  అంటాడు ప్రేమ్.

జగదీష్ చంద్ర కూడా ఏదో చెబుదాం అనేలోపు గాయత్రి గారు మాట్లాడుతూ " వాడు ఒకసారి అనుకున్నాడు అంటే , అది ఎవరు చెప్పినా వినడు వాడు ప్రియా లేసే వరకు కూడా భోజనం చెయ్యడు , మీరు పదండి వాడు ఉంటాడులే దాని దగ్గర"  అని అంటారు.

ఊర్మిళాదేవి గారు కూడా సరే అని  " వాడు తాను భార్యతో కలిసి తింటాను అంటున్నాడు కదా పదండి అందరం భోజనం చేద్దాము"  అని అంటారు .

అందరూ కిందకు నడుస్తారు భోజనం చేయడానికి కానీ నితిన్ అక్కడే ఉండడం చూసి నిఖిల్ నితిన్ భోజనం చేయడానికి పదమని అంటే .

" నాకు ఆకలిగా లేదు"  అని అంటాడు." నేను కూడా ప్రియా లేచాక తింటాలే"  అని అంటాడు.

నిఖిల్ మాత్రం నితిన్ ని వారిస్తూ భోజనం చేయడానికి పద్దమని అంటాడు కానీ నిఖిల్ 
" నేను తినను " అని దృఢంగా చెప్పడంతో .

" సరే నీ ఇష్టం ప్రియా లేచిన తర్వాత నువ్వు ఇంకా భోజనం చేయలేదు అని తిడితే మా హెల్ప్ కోసం మాత్రం రావద్దు " అని అని నితిన్ ని కూడా వదిలేసి అందరు కిందకి వెళ్ళిపోతారు.

ప్రేమ్ నితిన్ నీ ఇగ్నోర్ చేసి ప్రియా పక్కన బెడ్ మీద కూర్చుని ఉంటే.  నితిన్ మాత్రం సోఫాలో కూర్చుని తన ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు.

కొంచెం సేపటికి ప్రేమ్ చేతిలో అన్నా ప్రియా చాయ్ కదలడం గమనిస్తాడు ప్రేమ్ . వెంటనే ప్రియా వైపు చూస్తాడు ప్రియా అప్పుడే స్పృహలోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. 

" బంగారం లేచావా"  అని ప్రేమ్ చిన్నగా అంటాడు .
ప్రేమ మాటలకి నితిన్ ఫోన్ పక్కన పెట్టి ప్రియా దగ్గరికి వస్తాడు.

ప్రియా కొంచెం నీరసంగా పైకి లేచి కూర్చుంటుంది . ప్రేమ్  వెంటనే దగ్గర్లో ఉన్న వాటర్ తీసుకొని ప్రియా కి ఇస్తాడు . ప్రియా అది  తాగి గ్లాస్ రిటన్ ప్రేమ్ కి ఇస్తుంది. ఆ గ్లాస్ నితిన్ చేతికి ఇస్తాడు ప్రేమ్.

తన చేతిలోకి వచ్చిన గ్లాస్ వైపు చూసి 'వీడేంటి నన్ను ఒక సర్వెంట్ లాగా చేస్తున్నాడు'  అనుకుంటూ ప్రేమ్ వైపు కొంచెం కోపంగా చూస్తాడు నితిన్.

" ఇప్పుడు ఎలా ఉంది బంగారం " అని అడుగుతాడు ప్రేమ్ చిన్నగా.

ప్రియా కొంచెం సెట్ అవుతూ " ఆ పర్వాలేదు ఐ యాం ఫైన్ " అని అంటుంది. 

" స్వీటీ ఆకలేస్తుందా ఏమైనా తీసుకురానా"  అని వెంటనే అడుగుతాడు నితిన్.

నిజంగా ప్రియా కి బాగా ఆకలేస్తుంది వెంటనే తలకాయ ఊపుతుంది ఏదో ఒకటి తీసుకురమ్మని  అన్నట్లు. 

" ఇప్పుడే తీసుకొస్తాను స్వీటీ " అని నితిన్ వెంటనే బయటికి నడవ బోతుంటే, ప్రేమ్ మాత్రం ఏమీ పట్టనట్టు అక్కడే కూర్చుని ఉంటాడు. 

'వీడేంటి ప్రియా ఆకలి అని అంటే వెంటనే ఏదో ఒకటి తీసుకొస్తాడు అని అనుకుంటే , నాకేం పట్టదు అన్నట్టు అలా కూర్చున్నాడు పైగా ప్రియా లేచాక ప్రియా తోనే చేస్తాను అని పెద్ద పెద్ద డైలాగులు , వీడికి కూడా తెస్తాను అనుకుంటున్నాడేమో వీటికి మాత్రం అసలు తీసుకురాను భోజనం ' అని అనుకుంటూ డోర్ వైపు నడుస్తాడు

అప్పుడే గాయత్రి గారు  లోపలికి వస్తూ ఉంటారు ప్లేట్లో భోజనం పెట్టుకుని.

గాయత్రి గారి వైపు చూసి "ఆంటీ కరెక్ట్ టైం కి వచ్చారు నేనే ఇప్పుడు ప్రియా కి భోజనం తీసుకొద్దాం అని అనుకున్నాను మీరు రానే వచ్చారు " అని అంటాడు.

" ప్రేమ్ ఫైవ్ మినిట్స్ ముందే మెసేజ్ చేశాడు భోజనం పైకి తీసుకురమ్మని , నువ్వు కూడా భోజనం చేయలేదు కదా ప్రియా ఎలాగో లేచింది కదా నువ్వు వెళ్లి భోజనం చెయ్, చాలా లేట్ అవుతుంది ,  నేను ప్రియా కి పెడతాలే " అని అంటారు గాయత్రి గారు.

ఆ మాటలకి నితిన్ కొంచెం ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తాడు ' ప్రియా సృహలోకి వచ్చి ఇప్పుడే కదా అయింది,  వీడు ఇంతకుముందే మెసేజ్ చేశాడా ? వీడికి ఎలా తెలుసు ప్రియా కరెక్ట్ గా ఫైవ్ మినిట్స్ తర్వాత లెగుస్తుందని ' అని  అనుకుంటాడు తన మనసులో.

గాయత్రీ మాటలకి ప్రియా నితిన్ వైపు చూసి " ఇంకా నవ్వు భోజనం చేయలేదా"  అని అడుగుతుంది. 

" అంటే నీకు బాగోలేదు కదా స్వీటీ నువ్వు లేచాక కలిసి తిందామని చేయలేదు"  అని చిన్నగా అంటాడు.

" నీకు ఎన్నిసార్లు చెప్పాలి టైం కి భోజనం చేయమని"  అని కొంచెం కోపంగా అంటుంది ప్రియ.

ప్రేమ్ చిన్నగా నవ్వుతూ" కోప్పడకు బంగారం ఇప్పుడే కదా లేచావు నీరసంగా ఉండి ఉంటావు ఫస్ట్ ఏమైనా తిన తర్వాత వాడి మీద కోప్పడుదువు గాని"  అని అంటాడు.

గాయత్రి గారు రెండు ప్లేట్స్ తీసుకురావడం చూసి "అత్తయ్య ఒక ప్లేట్ వాడికి ఇవ్వండి "అని అంటుంది ప్రియా.

గాయత్రి గారు ఒక ప్లేట్ ప్రియ ఇంకొక ప్లేట్ ప్రేమ్ కి  అని తెచ్చి ఉంటారు , నితిన్ కూడా ఇక్కడే ఉన్నా సంగతి ఆవిడ మర్చిపోయారు. బట్ ప్రియా ఒక ప్లేట్ నితిన్ కి ఇవ్వమనగానే వెంటనే ఆ ప్లేట్ నితిన్ కి ఇస్తుంది . 
" తీసుకో బాబు " 
ఆవిడ మళ్ళీ కిందకి వెళ్లి ఇంకో ప్లేట్ భోజనం తీసుకువద్దాం అనుకుంది.

ప్రియా నితిన్ నీ కోప్పడుతూ " హమ్ ..ఇంకేంటి చూస్తున్నావ్  వెంటనే భోజనం చెయ్ చాలా టైం అవుతుంది"  అని మందలిస్తుంది ఒక తల్లి లాగా.

నితిన్ బుద్ధిగా ఆ ప్లేట్ తీసుకొని అక్కడే సోఫాలో కూర్చుని బోన్ చేయడం మొదలు పెడతాడు. నితిన్ కి అప్పటికే చాలా ఆకలిగా ఉంటుంది.

’ ప్రేమ్ గాడు కూడా భోజనం చేయలేదు కాబట్టి ఇప్పుడు వాడు కిందకు వెళ్తాడు ఎంచక్కా నేను ప్రియా కలిసి ఇక్కడే భోజనం చేయొచ్చు ' అని అనుకుంటాడు నితిన్ తన మనసులో

గాయత్రి గారు ఇంకో ఒక ప్లేట్ ప్రియా కి ఇవ్వబోతుంటే ఆ ప్లేట్ ప్రేమ్ తీసుకుని " ఇటు ఇవ్వు అమ్మ నేను పెడతాను"  అని అంటాడు.

" నేను పెడతా లేరా ఎలాగో నవ్వు కూడా భోజనం చేయలేదు కదా వెళ్లి తిను " అని అంటారు గాయత్రి గారు .

ప్రియా ప్రేమ్ వైపు చూసి"  నువ్వు కూడా భోజనం చేయలేదా " అని అడుగుతుంది.

"  నీతో కలిసి తిందామని చేయలేదు బంగారం"  అని అంటాడు ప్రేమ్.

తన వల్ల వీళ్లు ఇలా భోజనం చేయకుండా ఉండటం ప్రియా కి కొంచెం బాధగా అనిపించింది.

ఆ ప్లేట్ తీసుకోబోతూ " నేను తింటాను ప్రేమ్ నువ్వు కూడా వెళ్లి తిను " అని చిన్నగా అంటుంది.

ప్రేమ్ ఆ ప్లేట్ ప్రియా చేతికి అందకుండా తానే ముద్దాలు కలిపి ప్రియా నోటికి అందిస్తాడు " ఫస్ట్ నువ్వు తిను"  అని అంటాడు. 

ప్రియా ఆ ముద్ద తినకుండా" ప్రేమ్ నేను తినగలను"  అని అంటూ ప్లేట్ అందుకోవడానికి ట్రై చేస్తుంది.

ప్రేమ్ తన చేతిలో కలిపిన ముద్ద ప్రియా నోటికి అందిస్తూ "ముందు తినమన్నానా " అని సీరియస్గా అంటాడు.

ప్రేమ్ మొండితనం గురించి తెలిసిన ప్రియ తను తినకపోతే ప్రేమ్ తినడు అని తెలిసి ప్రేమ్ పెట్టిన ముద్ద తింటుంది.

ఆది చూస్తున్న నితిన్ కి చాలా కోపం వస్తుంది. 
' చి నాకెందుకు ఇలాంటి ఐడియాలు రావు ' అని తనలో తాను అనుకుంటాడు.

ప్రియా టైం చూసే పార్టీకి అప్పటికే మూడు అవడంతో తాను తిన తర్వాత ప్రేమ్ తినేసరికి చాలా లేట్ అవుతుంది అని గమనించి , తాను కూడా ముద్దలు కలిపి ప్రేమ్ కి అందిస్తుంది.
" నువ్వు కూడా తిను చాలా టైం అయింది"  అని అంటుంది. 

ప్రేమ్ ప్రేమగా ప్రియా పెట్టిన ముద్దను అందుకుంటాడు. 

అది చూసి నితిన్ రక్తం ఇంకా మరిగిపోతుంది అతనీ నోట్లో రుచిగా అనిపించిన భోజనం ఇప్పుడు చేదుగా అనిపించింది అతనికి.
' ఇది చూడడానికేనా నేను ఇక్కడ కూర్చుని తింటున్నది'  అని అనుకుంటాడు.

ప్రేమ్ ఇంకా ప్రియా అలా ఒక ప్లేట్లో ఒకరికొకరు తినిపించుకోవడం చూసిన గాయత్రీ గారికి చాలా ఆనందం కలుగుతుంది. 
అక్కడే ఉన్న కృష్ణుడు విగ్రహం వైపు తిరిగి కృష్ణుడికి దండం పెట్టుకుంటూ " కృష్ణయ్య ఈ జంటని ఎప్పుడు విడదీయకయ్యా " అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.

కొనసాగుతుంది. ..

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు. 

నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.