ఒక అండర్ గ్రౌండ్ ల్యాబ్ లో ఒక మనిషి ల్యాబ్ కోట్ వేసుకొని ఏదో ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఆ ల్యాబ్ అంతా కూడా ఏవేవో కెమికల్స్ తో ఉంటుంది అంతేకాదు అక్కడ చాలా రకాల జంతువులు బంధించి ఉంటాయి.
అతనికి ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది ఇంకోటి కృత్రిమ చేయి , ఆ కృత్రిమ చేయి సహాయంతో చాలా సులభంగా అతని పని చేస్తూ ఉంటాడు , కొన్ని కెమికల్స్ కలుపుతూ ఏవేవో నోట్ చేసుకుంటూ ఉంటాడు. అతను కొంచెం వీక్ గా ఉన్నట్లు, ఇంకా చాలా బక్కగా కూడా కనిపిస్తూ ఉంటాడు.
పక్కనే సైలెన్స్ లో పెట్టిన అతని ఫోన్ ఎంతగా రింగ్ అవుతున్నా కూడా అతను దానిమీద దృష్టి పెట్టలేదు. అతను చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టాడు.
చివరికి అతను మిక్స్ చేసిన కెమికల్స్ ద్రవాన్ని ఒక సిరంజిలోకి తీసుకొని అక్కడ బోన్ లో బంధించి ఉన్న ఒక ఎలుక ని తీసుకొని ఆ ఇంజక్షన్ దానికి చేస్తాడు. ఆ ఎలుక కి ఒక చెయ్యి కాలు ఉండదు.
ఆ ఎలుక కే కాదు అక్కడ బంధించి ఉన్న చాలా జంతువులకు ఏదో ఒక అవయవం ఉండదు.
అప్పటివరకు నీరసంగా ఉన్న ఎలుక ఆ ఇంజక్షన్ చేయగానే దాని శరీరంలో ఏవో మార్పులు వస్తూ ఉంటాయి , దానికి కొత్త అవయవాలు చెయ్యి ఇంకా కాలు రావడం ఆ సైంటిస్ట్ గమనిస్తాడు .
ఆ ఎలుకను చూసి అతని మొహం లో చిరునవ్వు .
కానీ అతని ఆనందం ఎంతో సేపు నిలవలేదు కొన్ని క్షణాలు తర్వాత ఆ ఎలుక చనిపోతుంది.
అతను చేస్తున్న ఎక్స్పరిమెంట్ మళ్లీ ఫెయిల్ అవ్వడంతో కోపంతో గట్టిగా అరుస్తాడు.
" ఆ..."
అప్పుడే ఒక వ్యక్తి ల్యాబ్ కోర్ట్ లో లోపలికి వస్తాడు "ఏంటి మళ్ళీ ఫెయిల్ అయిందా, అందుకేనా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు" అని అడుగుతాడు అతని దగ్గరికి వస్తూ.
ఇతని పేరు జోన్స్, ఈ అండర్ గ్రౌండ్ ల్యాబ్ ఇతనిదే అండ్ ఇతను ఆ సైంటిస్ట్ ఫ్రెండ్.
జోన్స్ మాట వినగానే కృత్రిమ చేయ వ్యక్తి కోపంగా
ఆ ఇంజక్షన్ అతని మెడ మీద ఉంచి " ఈసారి మనిషి మీద ట్రై చేద్దాం అనుకుంటున్నా" అని కొంచెం కోపంగా ఉంటాడు . ఇతను చూడడానికి బక్కగా బలహీనంగా కనిపించిన, బలంగానే ఉంటాడు.
జోన్స్ భయంతో " రుద్ర ప్లీజ్ ఏం చేయకు ప్లీజ్" అని వేడుకుంటాడు.
ఆ సైంటిస్ట్ పేరు మీకు ఇప్పుడు తెలిసింది అనుకుంటా , అతని పేరు రుద్ర. ఇతను ఎవరో కాదు మన ప్రేమ్ ఒక వ్యక్తి గురించి చెప్పాడు కదా ఆ వ్యక్తి ఇతనే.
ఆ ఇంజక్షన్ ఇంకా జోన్స్ మేడ మీద ఉంచి "ఎందుకు వచ్చావు ?" అని అడుగుతాడు రుద్ర.
ఆ ఇంజక్షన్ ఎక్కడ అతనికి గుచ్చుకుంటుందో అని భయపడుతూ " కొంచెం ఆ ఇంజక్షన్ దూరంగా పెట్టు రుద్ర చెప్తాను ...ప్లీజ్ " అని వణుకుతున్న స్వరంలో అడుగుతాడు.
రుద్ర విసురుగా ఇంజక్షన్ విసిరేసి " ఇప్పుడు చెప్పు ఎందుకు వచ్చావు" అని కోపంగా జోన్స్ నీ అడుగుతాడు.
తల మీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ "అమ్మయ్య, కొంచెం ఉంటే చచ్చిపోయే వాడిని " అని అనుకోని .
రుద్రా వైపు తిరిగి కొంచెం బాధగా " అది ....మన.. సామ్ చనిపోయాడు" అని చిన్నగా అంటాడు.
ఆ మాట వినగానే రుద్ర కొంచెం అసహనం, కోపం, బాధ కలిగిన స్వరంలో "ఎలా?" అని అడుగుతాడు.
" నేను ఎంత చెప్తున్నా వినకుండా నీకు అడ్డుగా ఉన్న ఆ ఏజెంట్ పి నీ బలహీనం చేసి వస్తాను అని వెళ్ళాడు , కానీ చనిపోయాడు అని ఇప్పుడే మెసేజ్ వచ్చింది " అని బాధగా ఉంటాడు జోన్స్.
ఈ ఏజెంట్ పి ఎవరో కాదు మన హీరో ప్రేమ్.
ఏజెంట్ పి అని పేరు వినగానే రుద్ర చేతులు వనకడం స్టార్ట్ అవుతాయి , అతనికి తెలియకుండానే అతని నుదుట్టి మీద చెమటలు పడతాయి.
రుద్రా కంగారుగా మాట్లాడుతూ " పిచ్చి పట్టిందా మీ అందరికీ నేను చెప్పాను కదా కొన్నాళ్లు అతనికి దూరంగా ఉండమని . అతని దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్లారు ?" అని జోన్స్ మీద అరుస్తాడు.
జోన్స్ మాట్లాడుతూ " నేను ఆల్రెడీ చెప్పాను వాడికి తొందర పడొద్దు అని. కానీ వాడే నీ మొహం లో ఆనందం చూడాలి అని అంటూ వెళ్ళాడు. వెళితే వెళ్లావు ఏజెంట్ పి నీ చంపేసి రమ్మని అంటే, లేదు వాడి చావు రుద్ర చేతుల్లోనే ఉంది, ప్రస్తుతం వాడిని బలహీనం చేసి వస్తాను అని వెళ్ళాడు, కానీ చనిపోతాడని నేను అనుకోలేదు, నేను వాడిని ఎంతగానో ఆపడానికి ట్రై చేశాను కానీ వాడు వినలేదు" అని అంటాడు.
సామ్ చనిపోయాడు అని తెలిసి చాలా బాధపడతాడు రుద్ర. ఎందుకంటే సామ్ ని తన తమ్ముడి లా చూస్తాడు కాబట్టి.
రుద్ర కోపంతో పిడికిలి బిగించి " వాడి చావు నా చేతుల్లోనే ఉంది " అని అంటాడు.
అతని కృత్రిమ చేయి వైపు బాధగా చూస్తూ " కానీ అంతకన్నా మందు నేను పూర్తిగా సిద్ధం అవ్వాలి దానికి ఎంతో సమయం పట్టదు " అని అంటాడు.
అంతలో ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా టెన్షన్ పడిపోతూ " వాడు సామ్ నీ చంపాడు అంటే నా గురించి తెలుసుకొని ఉంటాడు అంటావా? ఇక్కడికి వస్తాడా? అయ్యో వాడు ఇప్పుడు ఇక్కడికి వస్తే నేనేం చేయను ? నా రీసెర్చ్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఈ ల్యాబ్ కూడా బ్లాస్ట్ చేసేస్తాడా ?. క్వీక్ , ఇకనుంచి పారిపోవాలి, వాడి ఇక్కడికి రాకముందే"
అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.
జోన్స్ కంగారు పడుతున్న రుద్ర నీ పట్టుకొని "కంగారు పడకు రుద్ర , వాడికి నీ గురించి ఏమీ తెలియలేదు , వాళ్ళు సామ్ నీ పట్టుకోకముందే, సామ్ ప్రాణ త్యాగం చేశాడు, ఒకవేళ సామ్ వాళ్ళకి ప్రాణాలతో దొరికినా కూడా నీ గురించి చెప్తాడు అనుకున్నావా? , ప్రాణం పోయినా నీ గురించి బయట పెట్టడు వాడు" అని అంటాడు.
ఆ మాట వినగానే రుద్రా కొంచెం రిలాక్స్ అవుతాడు. ఎందుకంటే సామ్ గురించి రుద్రా కి చాలా బాగా తెలుసు కాబట్టి, సామ్ ప్రాణం పోయినా రుద్రా గురించి బయట పెట్టడు.
జోన్స్ మాట్లాడుతూ " కానీ సామ్ ఈ స్టెప్ తీసుకోవడం వల్ల వాళ్లకి నువు బ్రతికే ఉన్న విషయం తెలిసే ఛాన్స్ ఉంది, కానీ ఆరోజు ఆ బ్లాస్ట్ లో నీ బ్లడ్ శాంపిల్స్ దొరకడం వల్ల నువ్వు చనిపోయావు అని డిక్లేర్ చేశారు కాబట్టి , నువ్వు చనిపోయిన మన టీం ఇంకా ఉంది అని వారికి తెలిసే ఛాన్స్ ఉంది " అని అంటాడు.
రుద్రా కూడా అదే విషయం ఆలోచిస్తూ " నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా ఛాన్స్ ఉంది , నేను చనిపోయిన మన గ్యాంగ్ ఇంకా ఉంది అని తెలిసి , వాళ్ళు ఇకమీదట మన గ్యాంగ్ నెంబర్స్ కోసం హంట్ మొదలు పెడతారు, సో కొన్ని రోజులు మన వాళ్ళని అలర్ట్ గా ఉండమని చెప్పు" అని అంటాడు.
జోన్స్ వెంటనే " ఓకే రుద్ర ఇప్పుడే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను" అని అంటాడు.
" ఇంతకీ సామ్ ఎవరిని చంపడానికి వెళ్లాడు ఆ ఏజెంట్ బలహీనత ఎవరు?" అని అడుగుతాడు రుద్ర.
" ఓన్లీ ఫైవ్ మినిట్స్ రుద్రా ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కనుక్కొని నీ టేబుల్ మీద ఉంచుతాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జోన్స్.
ఈరోజు ఎక్స్పరిమెంట్ ఫెయిల్ అవ్వడంతో అందులోనూ సామ్ చనిపోయాడని తెలుసుకొని బాధగా అతని క్యాబిన్ వైపు నడుస్తాడు రుద్ర.
కరెక్ట్ గా ఫైవ్ మినిట్స్ తర్వాత జోన్స్ ఇంకా అతని అసిస్టెంట్ ఒక ఫైల్ తీసుకొచ్చే రుద్రా క్యాబిన్ కి వస్తారు.
అందులో ప్రియా డీటెయిల్స్ అండ్ ఫొటోస్ ఉంటాయి.
ప్రియా ఫోటో చూడగానే షాక్ అయిపోతాడు రుద్ర.
" ఈ అమ్మాయి ..." అని ఏదో అంటుండగా.
జోన్స్ అసిస్టెంట్ మాట్లాడుతూ " ఈ అమ్మాయి ఆ ఏజెంట్ కి కాబోయే భార్య . ఆ ఏజెంట్ ఈ అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడు , ఈ అమ్మాయి అతని వీక్నెస్ , ఈ అమ్మాయికి ఏం జరిగినా కూడా అతను తట్టుకోలేడు , మనం ఒకవేళ ఈ అమ్మాయిని చంపేస్తే .... " అని అంటున్న అతని మాటలు సగం లోనే ఆగిపోతాయి.
ఎందుకంటే అప్పటికే అతని గొంతులో ఒక షాప్ పెన్ దిగుతుంది.
పక్కనే ఉన్న జోన్స్ మహమంతా కూడా రక్తం పడుతుంది.
ఆ వ్యక్తి అతని గొంతు పట్టుకొని ఆశ్చర్యంగా రుద్ర వైఫై చూస్తాడు . ఎందుకంటే ఆ పెన్ అతని గొంతులో దింపింది ఎవరు కాదు రుద్ర.
ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు.
రుద్ర సడన్ యాక్షన్ కి జోన్స్ కూడా ఆశ్చర్యపోతాడు.
రుద్రా కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి "ఏమన్నావ్... ఆ అమ్మాయిని చంపుతావా... చంపడం వరకు కాదు ఆ ఆలోచన నీ బుర్రలోకి వస్తేనే నీ బ్రెయిన్ బయటకి తీసి చంపుతా" అని కోపంగా అంటాడు.
రుద్ర కోపం చూసి జోన్స్ చాలా భయపడిపోతాడు. అతని నోట్లో నుంచి ఒక మాట కూడా బయటికి రాదు.
రుద్ర జోన్స్ వైపు చూసి " వీడిని బయటికి తీసుకెళ్ళి పడేయి " అని అంటాడు.
వెంటనే జేమ్స్ ఒక బటన్ ప్రెస్ చేయగానే బయట నుంచి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి చనిపోయిన ఆ వ్యక్తిని బయటికి తీసుకువెళ్లిపోతారు.
రుద్ర మాత్రం ప్రియా ఫోటోని ప్రేమగా తడుముతూ ఉంటాడు. అతని పెదవులపై చిరునవ్వు జోన్స్ కళ్ళు తాటి పోలేదు.
జోన్స్ అడుగుదామా వద్దా అని అనే లోగా రుద్రా నే మాట్లాడుతూ " ఈ అమ్మాయిని చంపుతాడంట. ఈగ కూడా వాళ్లనివ్వను ఈ అమ్మాయి మీద నేను. " అని అంటాడు.
జోన్స్ వైపు తీరిగి " ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఈ అమ్మాయికి ఏమి కాకూడదు , ఆ ఏజెంట్ ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ అమ్మాయికి ఏమి కానివాడు . అయినా సరే మన వైపు నుంచి కూడా ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వండి ఆ అమ్మాయికి మాత్రమే , ఆ ఏజెంట్ కి ఏమైనా పర్వాలేదు ఆ అమ్మాయి మాత్రం సేఫ్ గా ఉండాలి" అని ఆర్డర్ వేస్తాడు.
జోన్స్ రుద్ర మాటలకి చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. 'ఆ ఏజెంట్ ని బలహీన చేయడానికి ఈ అమ్మాయిని యూస్ చేసుకుంటాడేమో అని అనుకుంటే , ఇప్పుడేమో ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వమని అంటున్నాడు అసలు ఈ అమ్మాయికి రుద్రా కి కనెక్షన్ ఏంటి, కొంపదీసి ఆ అమ్మాయిని చూడగానే లవ్ లో పడిపోయాడా? నిజంగానే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అదే అయ్యుండొచ్చు' అని అనుకుంటాడు.
ఏదైతే ఏ అడుగుదాం అనుకొని మెల్లగా " రుద్ర ఈ అమ్మాయి నీకు ఏమవుతుంది , ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? " అని అడుగుతాడు.
ప్రేమ అనే మాట వినగానే రుద్ర జోన్స్ వైపు కోపంగా చూస్తూ" ప్రేమ ఏంటి? ఆ అమ్మాయిని నేను ఎందుకు ప్రేమిస్తాను ? నేను ఎవరిని ప్రేమించాను అన్న సంగతి నీకు తెలియదా ? " అని అడుగుతాడు.
జోన్స్ తన మనసులో ' ప్రేమించకపోతే ఆ అమ్మాయి కి ప్రొటెక్షన్ ఇవ్వమని ఎందుకు అంటున్నాడు? ఇంతకీ ఆ అమ్మాయి వీడికి ఏమవుతుంది? ' అని అనుకుంటాడు. మళ్లీ గట్టిగా అడిగితే ఎక్కడ కోపంలో అతనిని కూడా చంపేస్తాడేమో అని భయపడతాడు కూడా.
అక్కడే నుంచుని ఏదో ఆలోచిస్తూ ఉన్న జోన్స్ నీ చూస్తూ " ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావ్ మన వాళ్ళందరినీ కూడా ఆ అమ్మాయి ప్రొటెక్షన్ కి పంపించు ఆ అమ్మాయికి ఏం జరిగినా నిన్ను చంపేస్తాను " అని బేస్ వాయిస్ తో అంటాడు.
జోన్స్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కొనసాగుతుంది....
ఇంతకీ ఈ రుద్ర ఎవరు? మన ప్రియ నీ ఎందుకు కాపాడాలని అనుకుంటున్నాడు? ఇంతకీ ఈ రుద్ర మంచోడా? చెడ్డోడా? , ఇతని ఎంట్రీ మన ప్రియ ఇంకా ప్రేమ్ లైఫ్ లో ఏమేమి చేంజెస్ తీసుకువస్తాయి ? వీటి అన్నిటికీ ఆన్సర్ తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ చదివేయాల్సిందే మరి. ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ ఎపిసోడ్ కి వెళ్లి పోదామా.
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.