తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతుంటే వాళ్లకి సెండ్ ఆఫ్ చెప్పడానికి ప్రియా కూడా గేట్ వరకు వెళ్తుంది. అక్షయ కి కొంచెం నీరసంగా ఉండడంతో తాను లోపల ప్రియ రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంది.
ప్రేమ్ కూడా ప్రియా వెనకాలే వాళ్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తాడు.
ప్రేమ్ కూడా రావడం చూసిన నితిన్ " విదేంటి కుక్క పిల్లలాగా ఎప్పుడు మీ వెనకాల తిరుగుతూనే ఉంటాడా " అని కొంచెం అసహనంగా అంటాడు.
ప్రియ ప్రేమ్ ని ఒకసారి చూసి నితిన్ వైపు తిరిగి " ఇంగ్నోర్ హిం " అని చిన్నగా అంటుంది.
అరుణ్ తన కార్ దగ్గరికి నడుస్తూ " స్వీటీ ఈరోజు నైట్ ప్రోగ్రాం సంగతి ఏంటి ?" అని అడుగుతాడు.
" దాంట్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు.. బట్... ఒకవేళ నువ్వు నీ వైఫ్ తో నైట్ ఏదైనా ... ఐ మీన్ నైట్ ఎక్సర్సైజెస్... లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే నీకు ఎక్సెప్షన్ ఉందిలే " అని కన్ను కొడుతుంది.
అరుణ్ కి ప్రియ అన్న ఎక్సర్సైజెస్ ఫస్ట్ అర్థం కాకపోయినా తర్వాత తను దేని గురించి అంటుందో అర్థమై " ఏ ..నిన్ను " . అని ప్రియా ని కొట్టడానికి చెయ్యి ఎత్తగానే.
ప్రియా నవ్వుతూ భయపడుతూ వెళ్లి నిఖిల్ వెనకాల దాక్కుంటుంది " నిఖిల్ హెల్ప్ మీ " అని అంటూ.
నిఖిల్ ప్రియా కి అడ్డుగా నిలిచి ఉంటాడు.
నిఖిల్ అడుగ రావడంతో , వెనకాల దాక్కొని ఉన్న ప్రియా వైపు చూసి " నీకు ఈమధ్య బాగా అల్లరి ఎక్కువైంది , నిఖిల్ ఉన్నాడనేగా నీ ధైర్యం" అని అంటాడు నవ్వుతూ అరుణ్.
ప్రియా గర్వంగా " అవును...నిఖిల్ ఉండగా నామీద చెయ్యేసి ధైర్యం ఎవరికి ఉంది చెప్పు " అని అంటూ అరుణ్ నీ వెక్కిరిస్తుంది.
ప్రియా అల్లరి ప్రేమగా చూస్తూ ఉంటాడు ప్రేమ్.
అరుణ్ " నిన్ను..." అని అంటూ ప్రియ నీ కొట్టడానికి చూస్తే ప్రియా అరుణ్ కి దొరకకుండా ఉంటుంది.
నిఖిల్ అరుణ్ ని అడ్డుకుంటూ " ఏ .. స్వీటీ ని ఏమైనా అంటే ఊరుకోను " అని అంటారు.
అరుణ్ నిఖిల్ వైపు చూసి " హలో బాస్ నేనేమీ దాన్ని అనలేదు, అదే నన్ను ఎగతాళి చేస్తుంది , అయినా నువ్వేంటి రా ఎప్పుడు స్వీటీ కే సపోర్ట్ చేస్తూ ఉంటావు , అది చూడు ఒకసారి నన్ను ఎలా ఎక్కిరిస్తుందో " అని ప్రియ మీద కంప్లైంట్ చేస్తాడు.
ఇంతలో అరుణ్ ఫోన్ మోగుతుంది చేస్తుంది అతని భార్య ప్రిఉష . అరుణ్ ఒకసారి ఫోన్ వైపు చూసి ఫోన్ సైలెంట్ లో పెట్టేస్తాడు .
అది చూసి ప్రియా " ఒరేయ్ ఎత్తరా బాబు . మళ్ళీ ఎత్తలేదు అని , అంతా మీ ఫ్రెండ్స్ వల్లే అని . మా మీద పడిపోతుంది " అని అంటుంది.
" ఇంటికి వెళ్ళాక దాని సంగతి నేను చూస్తా లే , ఇదంతా నాకు మామూలే గాని , ఇంతకీ నైట్ ఏ టైం కి రమ్మంటావు " అని అడుగుతాడు అరుణ్.
ప్రియా కొంచెం సేపు ఆలోచించి " వన్ ఓ క్లాక్? " అని అడుగుతుంది కన్ను ఎగరేస్తూ.
" ఓకే డన్ " అని అందరు ఫ్రెండ్స్ డోన్ సింబల్ చూపిస్తారు. అందులో ప్రేమ్ కూడా ఉంటాడు.
ప్రేమ్ కూడా డాన్ సింబల్ చూపించడంతో నితిన్ కొంచెం చిరాగ్గా " నువ్వు ఎందుకు మాతో పాటు డోన్ సింబల్ చూపిస్తున్నావ్ " అని అడుగుతాడు .
" ఎందుకంటే ఇకపై మీతో నేను కూడా వస్తాను కాబట్టి " అని అంటాడు ప్రేమ్.
" మా ఫ్రెండ్స్ మాత్రమే వెళ్తాము నువ్వు మా ఫ్రెండ్ వి కాదు నువ్వు అలా జాయిన్ అవ్వడానికి నేను ఒప్పుకోను" అని అంటాడు.
" హలో బాస్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు ప్రియా కి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, సో ప్రియా ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను, అందుకు నాకు ఆల్రెడీ లైసెన్స్ వచ్చేసింది , అందులోనూ నేనే వస్తానంటే ప్రియా కూడా నో చెప్పదు" అని అంటాడు ప్రేమ్.
ఇంతలో నితిన్ ఏదో అనబోతే ప్రియా మాట్లాడుతూ "వదిలేయరా మంచి పని కోసమే కదా వస్తున్నాడు రా నీవు " అని అంటుంది.
ఆ మాటకి ప్రేమ్ చూసావా అన్నట్లు నితిన్ వైపు చూసి కన్ను ఎగరేస్తే, నితిన్ మాత్రం కోపంతో భుసాల కొడుతూ సైలెంట్ గా ఉంటాడు. ప్రియా మాటల గుర్తుకు వచ్చి.
కొంచెం సేపటికి ముందు నితిన్ ప్రియా దగ్గరికి వెళ్లి ,
" స్వీటీ నిజం చెప్పరా నువ్వు ప్రేమ్ ని ప్రేమిస్తున్నావా ?" అని అడుగుతాడు.
ప్రియా కొంచెం అసహనంగా " పిచ్చి పట్టిందా నీకు నేను ప్రేమ్ నీ ప్రేమించడమేంటి? " అని అడుగుతుంది .
" మరి ఇదంతా ఏంటి, హాల్లో అందరి ముందు వాడికి అలా చెప్పావు కదా" అని అడుగుతాడు. ఆ కిస్ సంగతి కూడా అడుగుదాం అనుకున్నాడు కానీ అడగలేక పోయాడు.
దానికి ప్రియా " నేను నా లైఫ్ లో విన్ను నీ తప్ప ఎవరిని ప్రేమించలేదు ఆ విషయం నీకు కూడా తెలుసు. ప్రేమ్ సంగతి అంటావా ఆ రింగ్ ఎక్కడ తీయాల్సి వస్తుంది ఏమో అని భయపడ్డాను కానీ ప్రేమ్ వల్ల ఆ రింగ్ నా దగ్గరే ఉంది, ఆ ఎమోషన్ లో అలా చెప్పానే కానీ ప్రేమ్ మీద ప్రేమతో కాదు , ఇంకో విషయం ఈ మనసులో విన్ను కి తప్ప వేరే వాళ్ళకి చోటు ఇవ్వలేను, ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు" అని కొంచెం సీరియస్ గానే ఉంటుంది.
ఇంకొకరికి చోటు ఇవ్వను అని ప్రియా అనగానే కొంచెం బాధ పడతాడు నితిన్ కానీ అదేమీ బయటికి కనిపించనివ్వడు
" కానీ అందరూ నువ్వు వాడిని ఇష్టపడుతున్నావ్ అని అనుకుంటున్నారే బయట" అని అసహనంగా అంటాడు నితిన్.
" నితిన్ నామీద నీకు నమ్మకం ఉందా" అని అడుగుతుంది ప్రియా.
నితిన్ వెంటనే ఉంది అని అంటాడు.
" అయితే నా మీద నమ్మకం ఉంచు , నేను ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాను, ఆ ప్రేమ్ కి మెల్లగా నచ్చచెబుతాను వాడే ఈ పెళ్లి క్యాన్సల్ చేసేలాగా చేస్తాను ఓకేనా" అని అంటుంది.
సరే అని అంటాడు నితిన్ .
" సరే అయితే ఇకపై నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకు " అని అంటుంది ప్రియా.
నితిన్ సరే అన్నట్లు అంగీకరిస్తాడు అందుకే ఇప్పుడు ప్రేమ్ వాళ్ళతో రావడానికి ప్రియా ఒప్పుకున్న ఏమి మాట్లాడలేదు నితిన్.
అందరూ వాళ్లు వచ్చిన వెకిల్స్ మీద రిటన్ అయిపోతారు.
ప్రేమ్ ఇంకా ప్రియా లోపలికి రిటర్న్ అవుతూ ఉండగా " అవును బంగారం నువ్వు ప్రతినెలా ఈ డేట్ లో బయటికి వెళ్తావు కదా అది కూడా నైట్ టైం. మీ అమ్మా, నాన్నకు తెలియదు అంటావా " అని అడుగుతాడు
ప్రియా గురించి ప్రతి విషయం అక్షయ ప్రేమ్ కి ముందుగానే చెప్పి ఉంటుంది కాబట్టి ఈ విషయం కూడా ప్రేమ్ కి తెలుసు అని ప్రియా కి తెలుసు.
" నిజం చెప్పాలి అంటే డాడీ కి తెలుసు, కానీ ఏమీ తెలియనట్టే ఉంటాడు, నా ఫ్రెండ్స్ నాతో ఉంటారు కాబట్టి డాడీకి అంత టెన్షన్ ఉండదు నా గురించి " అని అంటుంది ప్రియా.
" నువ్వు చేసే పని బాగానే ఉంది కానీ పొద్దున చేయొచ్చు కదా ఎందుకు నైట్ పూట" అని అడుగుతాడు ప్రేమ్ .
" మనం మన కుడి చేత్తో సహాయం చేస్తే మన ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది , పొద్దున అయితే అందరూ చూస్తారు అందుకే నైట్ , అందులోనూ నాకు నైట్ అలా తిరగడం అంటే ఇష్టం" అని అంటుంది ప్రియా.
మళ్లీ తానే మాట్లాడుతూ " నైట్ నీ నిద్ర పాడు చేసుకుని నాతో రావాల్సిన అవసరం లేదు నీకు నిద్ర వస్తే హాయిగా పడుకోవచ్చు" అని అంటుంది.
" అలా ఎలా బంగారం భార్య చేసే ప్రతి పనిలో భర్త సహాయం కూడా ఉండాలి అని అంటారు కదా, నువ్వు ఇకమీదట ఏమి చేసినా కూడా నీ పక్కన ఎప్పుడూ నేను ఉంటాను" అని అంటాడు ప్రేమ్.
" మనిద్దరికీ ఇంకా పెళ్లి అవలేదు " అని అంటుంది ప్రియ .
" ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయినట్లే బంగారం" అని అంటాడు ప్రేమ్ చిరునవ్వుతో.
ఇంతలో వాళ్లు గుమ్మం దగ్గరికి రానే వస్తారు.
ఇంతలో ప్రియ మీదకి ఒక గుమ్మడికాయ రావడం చూసి దడుచుకుంటుంది.
" ఆ...!...." . అంటూ టాప్ లేచిపోయేలాగా అరుస్తుంది.
ప్రియా అరుపుకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చెవుల మూసుకుంటారు , ప్రేమ్ తో సహా.
హాల్లో ప్రశాంతంగా జ్యూస్ తాగుతున్న ఆదిత్య ఆ అరుపుకి పొలమారి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు . అది చూసి గుర్దీప్ కొడుకు వీపు మీద దబా దబా కొడతాడు.
ఆ దెబ్బలకి ఆదిత్య " అబ్బా డాడీ ..! నువ్వు నన్ను ఊరడించడానికి కొట్టినట్టు లేదు, ఏదో కోపంతో కొట్టినట్టు ఉంది " అని అంటాడు , గుర్దీప్ కి దూరంగా జరుగుతూ , నొప్పి పెడుతున్న అతని వీపుని రుద్దుకుంటూ.
’మిమ్మల్ని కొట్టే ఛాన్స్ నాకు ఇలాంటి సమయంలోనే కదా రా వచ్చేది మిగతా టైంలో కొడితే మీ అమ్మ ఊరుకుంటుందా ఏంటి , నా తాట తీస్తుంది’ అని చిన్నగా అంటాడు.
ఆదిత్య " ఏంటి డాడీ ఏదో అంటున్నావ్ " అని అడుగుతాడు.
’వినపడినట్లు ఉంది ఎదవకి ’ అని అనుకొని
వెంటనే " సరే పద ముందు ప్రియా ఎందుకు అంత గట్టిగా అరచిందో చూద్దాం " అని అంటాడు గుర్దీప్.
ఆదిత్య కూడా ప్రియా ఎందుకు అంత గట్టిగా అరిచిందో తెలుసుకోవడానికి గుర్దీప్ తో పాటు గుమ్మం దగ్గరికి వెళ్తాడు.
ప్రియ అరుపుకి అందరూ గుమ్మం దగ్గరికి వస్తారు.
ఊర్మిళ దేవి గారు మాట్లాడుతూ " అరవకే దిష్టి తీస్తే ఎవరైనా ఇలా అరుస్తారా" అని అంతే గట్టిగా అంటుంది.
ప్రియా ఫాస్ట్ గా కొట్టుకుంటున్న తన గుండె మీద చెయ్యి వేసుకుని " ఒసేయ్ ముసలి ఈ గుమ్మడికాయ తో నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా , ఇలా ఈ గుమ్మడికాయతో నాను భయపెట్టి , రేప్పొద్దున్న న్యూస్ పేపర్లో ద గ్రేట్ జగదీష్ చంద్ర కూతురు గుమ్మడికాయ చూసి హార్ట్ ఎటాక్ వచ్చి పోయింది అని న్యూస్ పేపర్ లో వేస్తే ఎంత పరువు పోతుందో తెలుసా నీకు" అని అంటుంది.
" నువ్వు ఆ గుమ్మడికాయ వల్ల పోతావో లేదా నాకు తెలియదు గానీ , నీ అరుపులకి మేమంతా పోయేలాగా ఉన్నాం , అయినా అంత గట్టిగా అరిచావేంటే" అని అంటాడు ప్రేమ్ తన చెవులు రుద్దుకుంటూ.
ఆదిత్య అక్కడ జరుగుతున్నది అంతా వింతగా చూస్తూ " ఏంటి గుమ్మడికాయ చూసి ఇంత గట్టిగా అరిచిందా, వామ్మో , మా తల్లే. ఈ ఇంట్లో ముందు ముందు ఇంకెన్ని చూడాలో " అని అనుకుంటాడు.
" ఇది పెద్ద కంచు రా మనవడా, ఇప్పుడేం చూసావ్ ముందు ముందు నువ్వే చూస్తావ్ గా దీని గొంతు ఎంత పెద్దదో , దీంతో ఎలా వేగుతావో ఏమో . అయినా మందు అయితే సైలెంట్ గా నుంచొంది దిష్టి తీసే వరకు, మీ ఇద్దరికీ ఎంతమంది దిష్టి తగిలిందో " అని అంటారు ఊర్మిళాదేవి గారు ఒక పక్కన ప్రియ ని అంటూనే దిష్టి తీస్తారు.
ప్రియా ఏదో అనడానికి చూస్తుంటే జగదీష్ చంద్ర "తల్లి అమ్మ దిష్టి తీసే వరకు సైలెంట్ గా ఉండు" అని అంటాడు.
ఊర్మిళాదేవి గారు గుమ్మడికాయ తో పాటు ఎర్ర నీళ్ళు , ఉప్పు ఎండు మిరపకాయలు తో కూడా దిష్టి తీసి అవన్నీ కూడా పని మనిషికి ఇచ్చే బయట పడేయమని చెప్తుంది.
ఆ ప్రోగ్రాం అంతా అయిపోగానే ప్రియా మాట్లాడుతూ "నా కన్నీ నీ పోలికలే అని అంటారు . అంటే నా గొంతు కూడా నీదే కదా నానమ్మ, ఆ మాటకొస్తే మా తాతయ్య పాపం నీతో ఎంత వేగాడో ఏంటో, మా తాతయ్య అన్ని సంవత్సరాలు నీతో వేగినందుకు నిజంగా ఆయనకి ఉన్న సహనం ఓర్పుకి ఆయనకి బ్రహ్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందే " అని వెటకారంగా అని , తన లెహంగా పట్టుకొని, " నేను చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్న " అని అని ఇంకొక మాటకి తావు ఇవ్వకుండా పైకి వెళ్ళిపోయింది.
కొనసాగుతుంది....
తప్పును ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.