you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 35

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 35

" అమ్మమ్మ  చిన్నప్పటి నుంచి నీ చేతి గోరుముద్దలు అది ఎన్నో తిని ఉంటుంది , ఇకపై ఇది నా టర్న్ , నాకు పెట్టు "  అని అడుగుతాడు ప్రేమ్.

" కావాలంటే నీకు విడిగా గోరుముద్దలు పెడుతుందిలే   ఈ రోటి పచ్చడి ముద్ద నాకే కావాలి,  నానమ్మ నాకు పెట్టు"  అని అంటుంది ప్రియ.

" నో , విడిగా తినే దానికన్నా ఈ రోటిలో కలిపిన ముద్ద తింటుంటే చాలా రుచిగా ఉంది,  నాకు ఇదే కావాలి " అని అంటాడు ప్రేమ్.

ప్రియా ఏడుపు మొహం పెట్టుకొని " నో నాకు ఇలా తింటేనే చాలా ఇష్టం"  అని అని ఊర్మిళాదేవి గారి వైపు చూసి "  నానమ్మ నువ్వే చెప్పు,  నువ్వు ఎప్పుడు చివరి ముద్ద ఇంట్లో చిన్న వాళ్లకే కదా పెడతావు ,సో ఇంట్లో అందరికన్నా చిన్నదాని నేనే కదా సో ఈ ముద్ద నాకే పెట్టు"  అని అంటుంది.

" ఆ లెక్కన చూసుకుంటే మా ఇంట్లో నేనే చిన్న వాడిని అంటే ఈ ముద్ద నాకే వస్తుంది, అమ్మమ్మ నాకు పెట్టు "  అని అంటాడు ప్రేమ్.

" హలో ఇప్పుడు అందరం ఒకటే ఫ్యామిలీ ఆ లెక్కన చూసుకుంటే నేను చిన్నదాన్ని సో ఇది నాది,  నానమ్మ నాకు పెట్టు "  అని అంటుంది ప్రియా.

ప్రేమ్ ఇంకా ప్రియా అలా చిన్న పిల్లల్లాగా కొట్టుకోవడం చూసి ఊర్మిళ దేవి గారు " అబ్బబ్బ...  ఆపండ్రా మీ ఇద్దరు . ఈ ముద్ద ఇద్దరికీ పెడతాను ఉండండి"  అని అంటూ ఆ మొత్తాన్ని రెండుగా చేయడానికి చూస్తుంది.

అది గమనించిన ప్రేమ్  ఊర్మిళాదేవి గారి చెయ్యి పట్టుకుని ఆ ముద్ద సగం కొరికేస్తాడు. మిగిలినది ప్రియా ముందు పెట్టి " ఇదిగో సగం , తిను, నాది చాలా జాలి హృదయం కాబట్టి సగం నీకు ఇస్తున్నాను"  అని అంటాడు. 

ప్రేమ్ చేసిన పనికి కోపం వచ్చి " నువ్వు ఎంగిలి చేసింది నేను తినాలా ?" అని అంటుంది ప్రియా కోపంగా. 

" సరే నీ ఇష్టం తినకపోతే పో మొత్తం నేనే తినేస్తాను , నిజంగా లాస్ట్ ముద్ద రుచే వేరు"  అని అంటూ ప్రేమ్ ఆ ముద్ద తన నోటి దగ్గరికి తీసుకు వెళ్తుంటే , ’సచ్చినోడు ఇది కూడా తినేస్తాడా ఏంటి , అమ్మో... నా ముద్ద ’ అని అనుకొని ప్రియా వెంటనే అది తినేస్తుంది.

ప్రియా చేసిన పనికి ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటారు. 
ప్రియా చెవి దగ్గరికి వెళ్లి తనకు మాత్రమే వినిపించేలాగా "నీకు ఒకటి చెప్పనా బంగారం ఇలా ఎంగలి ముద్ద తింటే ముద్దు పెట్టుకున్నట్లే అంటారు తెలుసా నీకు, అంటే ఇన్ డైరెక్ట్ గా మనమిద్దరం ముద్దు పెట్టుకున్నట్లే"  అని అంటూ కన్ను కొడతాడు.

ఆ మాట వినగానే ప్రియా కోపంగా ప్రేమ్ వైపు చూసి "ఏ నిన్ను ..." అని ప్రేమ్  నీ కొట్టడానికి చెయ్యి వెత్తగానే .

" అమ్మమ్మ సేవ్ మీ , ఇది నన్ను చంపేసేలాగా ఉంది"  అని అంటాడు ప్రేమ్  భయం నటిస్తూ. 

ప్రేమ్,  ప్రియ ఇంకా కొట్టక ముందే అలా అరవడంతో "ఏ నేను ఇంకా నిన్ను కొట్టలేదు , ఎందుకు అలా అరుస్తావ్" అని అంటుంది.

ఊర్మిళాదేవి  గారు " సరే.. సరే ... పదండి రా ,  వెళ్లి భోజనం చేద్దాం పదండి " అని అంటూ అందరినీ చాప మీదకు తీసుకువెళ్తుంది.

గాయత్రి ఇంకా సునంద  అందరికీ వండిన పదార్థాలు ప్లేట్స్ లో పెట్టి అందరికీ ఇస్తారు ప్రియా మాత్రం ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ తింటా ఉంటుంది.
’ ఒరేయ్ నన్నే ఏడిపిస్తున్నావు కాదు,  ఇక చూడరా నిన్ను ఎలా ఆడుకుంటానో.  ఇది నా ఇల్లు నా అడ్డ . మామూలుగా ఉండదు రా నీకు.  ప్రియా అంటే ఏంటో నీకు చూపిస్తాను. నిన్ను ముప్పతిప్పలు పెట్టకపోతే నా పేరు ప్రియా నే కాదు’ అని మంగమ్మ శబదం చేస్తుంది.

ఇంతలో ప్రేమ్ కి పోలమారడంతో ఊర్మిళాదేవి గారు ప్రేమ్ కి వాటర్ ఇస్తుంది " నెమ్మదిగా తిను నాన్న"  అని అంటూ.

"ఎదురుగా కూర్చుని నా తిండికి దిష్టి పెడుతున్నారు నానమ్మ అందుకే ఇలా పొలమారింది " అని అంటాడు ప్రేమ్  ఓరకంట ప్రియా ని చూస్తూ.

ప్రేమ్, ప్రియా నే అంటున్నాడు అని అందరికీ అర్థం అయింది. 
ఆ మాటకి ప్రియా కోపంగా " ఏ నేనేమీ నీకు దిష్టి పెట్టట్లేదు " అని అంటుంది.

" మరి ఎందుకే నా వైపు అలా చూస్తున్నావ్ అంత అంత గుడ్లు  వేసుకొని, అంత అందంగా ఉన్నానా " అని అంటాడు ప్రేమ్.

" అవును నువ్వు పెద్ద రితిక్ రోషన్ మరి నిన్నే చూస్తూ ఉండడానికి"  అని వెటకారంగా అంటుంది. 

ఇంతలో గాయత్రి గారు మాట్లాడుతూ " ప్రేమ్ సైలెంట్ గా తిను ఎందుకు ప్రియా అని ఏడిపిస్తున్నావు"  అని అంటుంది.
ప్రేమ్ ఏదో ఆనబోతుంటే గుర్దీప్ కూడా " ప్రేమ్ తినేటప్పుడు ఏంటి అల్లరి సైలెంట్ గా తిను" అని అంటాడు.
ప్రేమ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా తింటూ ఉంటాడు. 

ప్రియా గాయత్రి గారి వైపు చూసి " అత్త నాకు ఒక డౌట్ " అని అడుగుతుంది. 

" ఏంటి తల్లి అది" .

" నానమ్మ తాతయ్య నీకు పెట్టిన పేరు ఆనంది . మరి గాయత్రీ గా పేరు ఎందుకు మార్చుకున్నావ్? దానివల్ల నిన్ను వెతకడం చాలా కష్టమైంది మాకు తెలుసా"  అని అంటుంది.

దానికి దుర్దీప్ మాట్లాడుతూ " మా ఇంట్లో అది ఆనవాయితీగా వచ్చింది  తల్లి , పెళ్లయిన తర్వాత మా ఇంటికి వచ్చిన ఆడపిల్లకి . అత్తగారు కోడలికి ఒక కొత్త పేరు ఇస్తుంది,  అలా మా అమ్మ,  గాయత్రి గా పేరు పెట్టింది నందు కి, అందరూ గాయత్రి అని పిలిచినా నేను మాత్రం నందు అనే పిలుస్తాను మీ అత్తని " అని అంటారు. 

" హో... అవునా మరి అక్షయ కి పేరు మార్చలేదు"  అని అడుగుతుంది.

" అది అత్త ఇష్టం తల్లి,  అత్తలకి మార్చుకోవాలి అనుకుంటే మార్చుకుంటారు లేకపోతే అదే పేరు ఉంచుతారు.  గాయత్రీ కి అలా పేరు మార్చడం అంతగా నచ్చదు అందుకే అక్షయా కి పేరు మార్చలేదు" అని అంటాడు గుర్దీప్.

" అంటే రేపు నేను మీ కోడలుగా వస్తే నా పేరు కూడా అలాగే మార్చుతారా"  అని అడుగుతుంది ప్రియా. 

దానికి ప్రేమ్ మాట్లాడుతూ " కచ్చితంగా ఆండాలు అని పేరు పెడతాను"  అని అంటాడు.
నా పేరు వినగానే అందరూ పక్కున నవ్వుతారు.

దానికి ప్రియా ప్రేమ్  వైపు ఉరిమి చూస్తే.  గాయత్రి గారు "ప్రేమ్..."  అని కొంచెం కోపంగా అంటారు. 

" అయ్యో మమ్మీ అది దాని పేరే , ప్రియా ని ద్వారకా లో అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు , మా మొదటి పరిచయంలో దాని పేరు ఆండాలు అని నాకు చెప్పింది.  దానికి ఆ పేరంటే ఎంతో ఇష్టం." అని వత్తి పలుకుతూ "   అందుకే ఆ పేరు పెడదాం అని అంటున్నాను " అని అంటాడు ప్రేమ్  చాలా క్యాష్వెల్ గా .

ప్రేమ్  మాటలకు అందరూ ప్రియా వైపు ఆశ్చర్యంగా చూస్తారు నిజమా అన్నట్లు .

ప్రియా మాత్రం ప్రేమ్  వైపు కోపంగా చూస్తూ "తెలియని వ్యక్తులకి నా పేరు ఎలా చెప్పమంటావు , అందులోనూ నానమ్మ తెలియని వ్యక్తులకి నా పేరు ఇంకా వివరాలు , ఎప్పుడు కూడా చెప్పద్దు అని చెప్పింది , అందుకే ఆ టైంలో నోటికి వచ్చిన పేరు చెప్పాను, అంతేగాని ఆ పేరంటే ఇష్టం ఉండి కాదు, ఇందులో నువ్వు నన్ను తప్పు పట్టడానికి ఏమీ లేదు,  అంటే అమ్మమ్మని అను"  అని అంటుంది.

ఆ మాటకి ప్రేమ్ ఊర్మిళ దేవి గారి వైపు చూస్తాడు . ఊర్మిళాదేవి గారు చిన్నగా నవ్వుతూ , అవును అన్నట్లు అంటుంది.

ప్రేమ్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని" నీ పేరు అదే అనుకున్నాను నేను, ఆరోజు బయటికి వెళ్లి వచ్చేలోపు నువ్వు  మాయమైపోయావు , నువ్వు ఎక్కడికి వెళ్లావు తెలియదు,  ఏమైపోయావు తెలియదు , నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు, నువ్వు ఆరోజు వెళ్లిపోయిన తర్వాత,  ఆ పేరు పట్టుకొని నీకోసం  ఎన్నాళ్లు వెతికానో తెలుసా నీకు , చివరికి నా అదృష్టం బాగుంది మా అన్నయ్య పెళ్లిలో కలిశాను నిన్ను, నీ వివరాలు అప్పుడే తెలిసి ఉంటే ఈ పార్టీకి మనకి ఎప్పుడో పెళ్లి అయిపోయేది ఈ ఫ్యామిలీ ఎప్పుడో కలిసి ఉండేది "  అని అంటాడు. జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ. 

ప్రియా కూడా జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ ఆ రోజు ప్రేమ్ కి సరిగా గుడ్ బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కొంచెం ఫీల్ అయింది. 

" సారీ ఆ రోజు గుడ్ బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళినందుకు.  ఆరోజు నిఖిల్ వచ్చాడు నన్ను సేవ్ చేయడానికి , నేను సృహాలో లేకపోవడం చూసి అందులోని కొంచెం ఫీవర్ గా ఉందని వెంటనే హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు, తీరా నేను కళ్ళు తెరిచి చూస్తే  మా ఇంట్లో ఉన్నాను, తర్వాత నీ గురించి నిఖిల్ నీ అడిగితే  అక్కడ ఎవరూ లేరు అని చెప్పాడు,  సో నువ్వు మీ ఇంటికి రీచ్ అయిపోయావ్ ఏమో అని అనుకున్నాను. " అని అంటుంది ప్రియా. 

ఆదిత్య ప్రేమ్ భుజం పైన చెయ్యి వేసి " ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి ప్రేమ్. అప్పుడు నువ్వు వెళ్లి ప్రియా కి నీ ప్రేమ విషయం చెప్పి ఒప్పించాలి అనుకున్న తను ఒప్పుకునేది కాదు, అప్పుడు మన ఫ్యామిలీ కలిసినా కూడా ఈ పెళ్లి  నవ్వు అనుకున్నట్లు జరిగి ఉండేది కాదేమో,  ఇప్పుడు చూసావా  పరిస్థితుల్లో ఎలా నీకు అనుకూలంగా మారాయో , తనకు తానుగా ఈ పెళ్ళికి  ఒప్పుకునే లాగా చేశాడు ఆ దేవుడు దేనికైనా టైం రావాలి "  అని చిన్నగా అంటాడు ప్రేమ్ కి మాత్రమే వినిపించేలాగా. 

ప్రేమ్ కూడా అదే కరెక్ట్ అనుకుంటాడు ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ కలిసినా కూడా ప్రియా ని ఒప్పించగలిగే వాడు కాదు,  ప్రియా తనకు తానుగా  పెళ్లి చేసుకుంటాకి ఒప్పుకుంటే గాని జరగదు . ఏదైతేనే తను అనుకొని చేసినా అనుకోకుండా చేసిన ఈ పెళ్లి కైతే ఒప్పుకుంది , ఇక మిగతాది తన మనసు మార్చడం మాత్రమే ఉంది  , తొందరలోనే తన మనసు మార్చగలను అన్న నమ్మకం ప్రేమ్ కి కలిగింది.

ప్రేమ్ ఇంకా ప్రియా వాళ్ళ పాస్ట్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే వీళ్ళు ఇద్దరు అసలు ఎలా కలిశారు అన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగింది.
జగదీష్ చంద్ర గాయత్రి గారి వైపు చూసి " అక్క వీళ్ళ ఎలా కలిశారో నీకు తెలుసా?"  అని అడుగుతాడు.

"  ఆ తెలుసురా వీళ్ళ లవ్ స్టోరీ మొత్తం నాకు తెలుసు ఫ్రేమ్ నాకు మొత్తం చెప్పాడు"  అని అంటుంది .

" అక్క నాకు చెప్పవా"  అని అడుగుతాడు చిన్న పిల్లాడిలాగా.

గాయత్రి గారు చిన్నగా నవ్వుకుంటూ " చెప్తానులే ఇప్పుడు కాదు తర్వాత " అని అంటుంది.

వాళ్ల సరదా మాటలతో,  ఆ పున్నమి చంద్రుడి వెన్నెల్లో భోజనం ముగిస్తారు.

ప్రేమ్ ప్రియా వాళ్లు నైట్ ఏవో ప్లాన్స్ వేసుకున్నారు అని చెప్పడంతో పెద్దవాళ్ళు వాళ్ళ ఇద్దరికీ ఇంటికి త్వరగా రమ్మని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు.

ప్రేమ్ ఇంకా ప్రియా 10:30 కి ఇంటి నుండి బయటకి వస్తారు.
ప్రియా ప్రేమ్ వైపు అసహనంగా చూస్తూ "  ప్రేమ్ ఇంకా వన్ అవ్వడానికే చాలా టైం ఉంది, ఈ గ్యాప్ లో ఒక మంచి స్లీప్ వేసేదాన్ని,  ఇప్పుడే ఎందుకు బయటకు తీసుకువచ్చావ్ "  అని అంటుంది.

నార్మల్ గా తాను తన ఫ్రెండ్స్  ఇలా బయటికి వెళ్లే రోజు  మంచి స్లీప్ వేసి అలారం పెట్టుకుని లేచి 12:30 కి ఇంటి నుంచి బయటకు వెళ్తారు , వన్ కి అందరూ మీట్ అయి త్రీ కళ్ళ మళ్ళీ ఇంటికి రిటర్న్  అయిపోతారు. 

" ఈరోజు నీకు మెమొరబుల్ డే లాగా మారుస్తాను చూడు  బంగారం " అని అంటూ విజిల్ వేస్తాడు. 

ఇంతలో ఒక బాడీగార్డ్  హార్లే-డేవిడ్సన్ CVO లిమిటెడ్ సిల్వర్ కలర్ బైక్  తీసుకువచ్చి కీస్  ప్రేమ్ కి ఇస్తాడు. 

ఆ బైక్ చూడగానే ప్రియా కల్లు మెరుస్తాయి, బట్ వెంటనే డల్ అయిపోతుంది. 
ప్రేమ్ ఆ బైక్  కీస్ ప్రియా చేతికి ఇస్తాడు  .
ప్రియా అయోమయంగా చూస్తూ ఉంటే "  ఈరోజు నువ్వు ఈ బైక్ రైడ్ చేస్తూ ఉంటే నేను వెనకాల కూర్చుంటానన్నమాట " అని అంటాడు ప్రేమ్.

" ఏంటి నేను రైడ్ చేయాలా?"  

"  అవును నువ్వే  " .

" కానీ నాకు అంత పర్ఫెక్ట్ గా రాదు"  అని చిన్నగా అంటుంది.

" ఏమి పర్వాలేదు బంగారం నువ్వు రైడ్  చెయ్ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే నేను గైడ్ చేస్తాను వెనకనుంచి " అని అంటాడు.

ప్రియా హెసిటేట్ చేస్తుంది.  ఎందుకంటే ప్రియా కి బైక్స్ నడపడం అంటే ఒకప్పుడు చాలా ఇష్టం , తన కాలేజ్ డేస్ లో అలా ఒకసారి బైక్  రైడ్ చేస్తాను అంటే , విన్ను ఇంకా నిఖిల్ బైక్ ఎలా నడపాలో  తనకి నేర్పించారు. 
ఒకసారి వాళ్ళిద్దరూ లేని టైంలో నితిన్ తో కలిసి బైక్ రైడ్ చేస్తుంది , కానీ అనుకోకుండా చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది.  ఎవరికీ ఏమీ కాదు గాని ఆక్సిడెంట్ వల్ల ప్రియా చెయ్యికి దెబ్బ తగిలితే నితిన్ కాలు విరుగుతుంది. దానివల్ల ఆ సెమిస్టర్ ఎగ్జామ్ కూడా రాయలేక పోతుంది ప్రియా. నితిన్ అయితే ఆ భయంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఏ బైక్ కూడా పట్టుకోలేదు. 

ప్రియా బ్యాడ్ లక్  ఏమో , తను తర్వాత ఎప్పుడు బైక్ రైడ్  చేద్దామని బైక్ పట్టుకున్న సరే , తనకు దెబ్బలు తగిలేవి లేదా తనకి బైక్ నేర్పించే వాళ్లకి  దెబ్బలు తగిలేవి.  ఇలా ఒక్కసారి కాదు ప్రియా బైక్ పట్టుకున్న ప్రతిసారి ఇలాగే జరిగేది . ప్రియా తరచూ దెబ్బలు తగిలించుకోవడం వల్ల ప్రియా ఫ్రెండ్స్ ఇంకా జగదీష్ చంద్ర ప్రియా ని ఎప్పుడు బైక్ రైడ్ చేయనివ్వలేదు. 

ప్రియా కి ఇప్పుడు బైక్ రైడ్ చేయాలని ఉన్న ఒకవేళ తన వల్ల ప్రేమ్ కి దెబ్బలు తగులుతాయేమో అని ఎక్కడో చిన్న భయం అందుకే హెసిటేట్ చేస్తుంది.
ప్రియా ఏం ఆలోచిస్తుందో ప్రేమ్ కి  బాగా తెలుసు .
తన చెయ్యి పట్టుకొని " బంగారం నా కళ్ళల్లోకి చూడు " అని అంటాడు.

ప్రియా అప్రయత్నంగా ప్రేమ్  కలలోకి చూస్తుంది "ట్రస్ట్ మీ బంగారం ఈసారి నీకు గాని నాకు గాని చిన్న గీత కూడా పడదు" .

కొనసాగతుంది...

వీళ్ళ ఈ ప్రేమ ప్రయాణం ఎటువైపు మల్లుతుంది ? .
ప్రేమ్ ఇచ్చిన మాట ప్రకారం ప్రియ  సంతోషంగా పెళ్లి పీటలు ఎక్కే  ప్రేమ్ నీ పెళ్లి చేసుకుంటుంది అంటారా  .
ప్రియ లో మళ్ళీ ప్రేమ చిగురించే లాగా ప్రేమ్ చేయగలుగుతాడా.
ఇంతకీ మన నితిన్ సంగతి ఏంటి? . ప్రియా కి నితిన్ ప్రేమ సంగతి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది. 

తపుళ్లు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.