" ఆ పెన్ డ్రైవ్ దొరికింది అంటే , అందులో ఏముందో కూడా నీకు తెలిసి ఉండాలి కదా. మరి ఆ విషయం ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వలేదు, నేను చనిపోయానని ప్రపంచాన్ని ఎందుకు నమ్మించావు ?" అని అడుగుతాడు రుద్ర.
(రుద్రా చనిపోయాడు అని ఈ ప్రపంచానికి తెలిసేలాగా చేసింది మన ప్రేమ్ . అది ఎందుకు అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. )
" చెప్పు ప్రేమ్ నువ్వు తలుచుకొని ఉంటే ఆనాడే ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న విషయాన్ని ఈ ప్రపంచానికి తెలిసేలాగా చేసే వాడిది , నేను ఎక్కడ ఉన్నానో కనుకోవడం, నీకు వెన్నతో పెట్టిన విద్య. కానీ వదిలేసావు ఎందుకు" అని అడుగుతాడు రుద్ర.
" నీలాంటి వాళ్లు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరిని ఒక చోట చేర్చడానికె రా నిన్ను వదిలింది " అని అంటాడు ప్రేమ్.
రుద్రా, ప్రేమ్ ఇచ్చిన సమాధానికి చిన్నగా నవ్వుతూ " అయ్యో బావ గారు మీరు దాని కోసమే నన్ను వదిలరా . నేను కూడా మా జాతి వాళ్ళ అందరిని కూడా ఒకచోట చేర్చడానికి నా ఈ ప్రయత్నం కూడా, త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది లేండి " అని అంటాడు.
’అసలు వీడి లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఆ విషయం వెంటనే తెలుసుకోవాలి వాళ్ళు ఈ ప్రపంచానికి ప్రమాదం కాకముందే ఈ ప్రపంచాన్ని వీడి లాంటి వాళ్ళ నుంచి కాపాడాలి ’అని అనుకుంటూ .
"నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా?" అని అడుగుతారు.
రుద్రా చిన్నగా నవ్వుతూ "అడగండి బావగారు" అని అంటాడు.
" నిజంగా నువ్వు మనిషివేనా" అని అడుగుతాడు .
రుద్రా దానికి నవ్వుతూ " నేను ఒక అద్భుతం" అని అంటాడు.
ప్రేమ్ ఇంకా ఏదో అడగడానికి చూస్తుంటే
ఇంతలో ప్రియా తన చేతిలో త్రీ గ్లాసెస్ ఫలుద పట్టుకొని వస్తుంది " ఫలుద ఎవరికి కావాలి?"
ప్రియా రావడంతో ఆ డిస్కషన్ అక్కడితో ఆపేస్తారు.
ప్రియా తన చేతుల్లో మూడు గ్లాసులు పట్టుకొని రావడం చూసి ప్రేమ్ ఇంకా రుద్ర వెంటనే వెళ్లి తన చేతిలోని గ్లాసెస్ తీసుకుంటారు.
" నిన్ను తెచ్చుకోమని చెప్పారా. మాకు కూడా తీసుకొచ్చావా " అని అంటాడు రుద్ర.
ప్రియా తన చేతుల్లో ఉన్న చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫలుద వైపు చూసి "రుద్ర అన్నయ్య ఇది నీ ఫేవరెట్ తీసుకో" అని అంటూ అది రుద్రా కి ఇచ్చి .
రుద్రా చేతుల్లో వెనిల్లా ఫ్లేవర్ ఫలుద తీసుకొని ప్రేమ్ కి ఇస్తూ " ప్రేమ్ ఇది నీకు " .
అని అంటూ ప్రేమ్ చేతుల్లోనీ గ్లాస్ తీసుకుని " ఇది నాది " అని అంటూ మాంగో ఫ్లేవర్ తను తీసుకుంటుంది.
రుద్ర తన చేతిలోనీ ఫలుద వైపు చూస్తూ " నాకు ఏది ఇష్టమో నీకు ఇంకా గుర్తుందా?" అని అడుగుతాడు.
ప్రియా సంతోషంగా జవాబు ఇస్తూ " హా . నీకు ఏది ఇష్టమో ప్రతిదీ నాకు తెలుసు, ఎందుకంటే, నీవి మా అమ్మ అభిరుచులు ఒకేలాగా ఉంటాయి కాబట్టి" అని అంటుంది. తన ఫలుద ఎంజాయ్ చేస్తూ.
మళ్లీ తానే మాట్లాడుతూ " హమ్..త్వరగా తినేయండి అవతల వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు". అని అంటుంది.
***
శైలు తన వాచ్ లో టైం చూసుకుంటూ నిఖిల్ వైపు తిరిగి " ఎక్కడికి వెళ్ళింది ఇది, ఎప్పుడు మనకన్నా ముందే ఉంటుంది కదా . ఈసారి ఎందుకింత లేటు . పొద్దున ఫంక్షన్ వల్ల నిద్రపోయిందంటావా" అని అడుగుతుంది .
దానికి నితిన్ కోపంగా జవాబు ఇస్తూ " ఆ ప్రేమ్ గాడు దాన్ని పడుకొ నివ్వలేదు అంట , దాన్ని నిద్ర చెడగొట్టి బలవంతంగా బయటకు తీసుకువెళ్లాడని చెప్పింది , స్వీటీ పొద్దున్నుంచి ఆ ఫంక్షన్ వల్ల ఎంత అలసిపోయిందో దానికి రెస్ట్ కూడా ఇవ్వట్లేదు వాడు, పాపం స్వీటీ . వాడు ఆ ఇంట్లోనే ఉంటాడు రోజు దాన్ని ఎంత విసిగిస్తూ ఉంటాడో ఏంటో" అని అంటాడు.
నితిన్ మాటలకి నిఖిల్ మాట్లాడుతూ "ఒరేయ్ ఎగస్ట్రాలు ఆపు , మన అందరి కన్నా ప్రియా ని ఎక్కువగా కేర్ చేసేది ప్రేమ్ మాత్రమే, ప్రేమ్ కి బాగా తెలుసు ప్రియా ని ఎలా చేసుకోవాలో నువ్వు అంతా బాధపడాల్సిన పని లేదు, అందులోనూ ఇప్పుడు ప్రేమ్ దానికి కాబోయే భర్త స్వీటీ ని ఇంకా కేరింగ్ గా చూసుకుంటాడు నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన పనిలేదు" అని అంటాడు.
నిఖిల్ ఆ ప్రేమ్ కి సపోర్ట్ చేస్తుంటే ఒళ్ళు మండి "మందు నవ్వు ఆ ప్రేమ్ కి సపోర్ట్ ఇవ్వడం ఆపుతావా, వాడు స్వీటీ నిద్ర చెడగొట్టి అర్థరాత్రి రోడ్ మీద తిప్పుతున్నాడు , స్వీటీ కి రెస్ట్ కావాలి , స్వీటీ ఆరోగ్యం పాడైతే, అది అర్థం అవుతుందా నీకు" అని కోపంగా అంటాడు నితిన్.
వీళ్ళ గొడవ ఎక్కడ పెద్దదవుతుందో అని శైలు ఇంకా అరుణ్ " ఆపండ్రా?" అని అంటారు ఒకేసారి.
శైలు " ఎప్పుడు చూడు ఏదో ఒక విషయం మీద గొడవ పడుతూనే ఉంటారు, అసలు మీ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా కాకుండా భద్ర శత్రువు లాగా కనిపిస్తున్నారు ఈమధ్య" అని అంటుంది.
ఇంతలో " భద్ర శత్రువుల? ఎవరు" అని గొంతు వినిపిస్తుంది.
ప్రియా ఇంకా ప్రేమ్ బైక్ మీద రావడం చూసి ఆశ్చర్యపోతారు, ఎందుకంటే బైక్ ప్రియా రైడ్ చేస్తుంది కాబట్టి.
" స్వీటీ నువ్వే నా బైక్ రైడ్ చేస్తున్నది , భయం పోయిందా " అని అడుగుతాడు అరుణ్.
ప్రియా బైక్ మీద నుంచి దిగుతూ " ఇదంతా ప్రేమ్ వల్లే ఈరోజు చాలా త్రిల్లింగ్ గా అనిపించింది తెలుసా , ఈ బైక్ రైడ్ చేస్తుంటే, ఇంకా ఈరోజు నేను ఎవరిని గుదలేదు నన్ను ఎవరు గుదలేదు చూసావా నాకు ఏ దెబ్బలు తగలేదు కూడా " అని అంటుంది సంతోషంగా.
" వావ్ ప్రియా ఇది చాలా మంచి విషయం ఇన్నాళ్ళకి మా ప్రియ తన భయం వదిలేసింది అన్నమాట" అని అంటాడు నిఖిల్.
ప్రియా వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా "ఏ... మీ అందరికీ ఒక సర్ప్రైజ్" అని అంటుంది .
"ఏంటి ఆ సుప్రైజ్" అని అందరూ ఒకేసారి అడుగుతారు.
" ఒక నిమిషం" అని వెనక చూస్తూ ఉంటుంది." ఏడి మా వెనకాలే బయలుదేరాడుగా ఇంకా రాలేదేంటి" అని అంటుంది.
నిఖిల్ " ఎవరైనా వస్తున్నారా స్వీటీ " అని అడుగుతాడు .
" మా వెనకాల వచ్చాడు ఏడు " అని అంటుంది రోడ్డు వైపే చూస్తా.
శైలు అది గమనించి " ఎవరు వస్తున్నారే కొంపతీసి మహేష్ బాబు గానీ ప్రభాస్ గాని వస్తున్నారా ఏంటి " అని అంటుంది.
ఈ లోపల ఒక వ్యక్తి బ్లాక్ హుడీ వేసుకుని ఒక అబ్బాయి బైక్ మీద వస్తూ ఉంటాడు .
అతన్ని చూసి "ఇతను ఏంటి ఇంత బక్కగా ఉన్నాడు ప్రభాస్ అంత హైట్ అయితే ఉన్నాడు గానీ ప్రభాస్ బాడీ లేదు ,మహేష్ బాబు కూడా ఇంత బక్కగా ఉండడు ఎవరబ్బా?" అని అనుకుంటుంది శైలు .
అతని మొహం కనపడకపోవడంతో అందరూ ఎవర అని చూస్తూ ఉంటారు .
ఇంతలో రుద్ర బైక్ దిగి తన హుడ్డి క్యాప్ ఫేస్ కి పెట్టుకున్న మాస్క్ తీస్తాడు . అతని ఫేస్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
రుద్ర నీ చూడగానే అరుణ్ కళ్ళ వెంట నీళ్లు , అవి కోపం ఇంకా బాధతో వస్తున్నాయి . అరుణ్ ఎమోషనల్ కంట్రోల్ చేయడానికి ప్రియా అరుణ్ దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుంటుంది . ప్రియా మొహాన్ని చూసి కొంచెం కంట్రోల్ అవుతాడు అరుణ్.
రుద్రాన్ని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే నితిన్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు.
నిఖిల్ రుద్రా నీ హాగ్ చేసుకొని " ఎన్నాళ్లు అయింది రా నిన్ను చూసి, ఎక్కడున్నావు ?ఎలా ఉన్నావు? " అని ఎమోషనల్ గా అంటాడు.
" చాలా బాగున్నాను రా " అని అని శైలు వైపు తిరిగి "కంగ్రాట్స్ పెళ్లి కుదిరింది అంటగా " అని అంటాడు .
శైలు వెళ్లి రుద్రా నీ సైడ్ హాగ్ చేసుకుంటూ " ఐ మిస్డ్ యూ సో మచ్" అని అంటుంది.
రుద్ర కూడా కొంచెం ఎమోషనల్ గా "నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను" అని అంటాడు.
" ఎక్కడికి పోయావు రా, ఒక ఫోన్ లేదు ఒక కాంటాక్ట్ లేదు , విన్ను ఒక్కడు మాత్రమే నీ ఫ్రెండ్ ఆ మేము కాదా " అని కొంచెం కోపంగా అని మళ్ళీ ఎమోషనల్ గా " విన్ను మాకు దూరం అయిన తర్వాత నువ్వు కూడా కనపడకుండా పోయావు, నిజమే ఒప్పుకుంటాను విన్ను వల్ల నువ్వు మాకు పరిచయం అయ్యావు . విన్ను లేకపోతే మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతావా" అని అడుగుతాడు అరుణ్. " నీకోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? అసలు ..." ఇంకా ఏదో అనబడుతుంటే ప్రియా అరుణ్ చేయి పట్టుకుంటుంది ఇది కరెక్ట్ టైం కాదు అన్నట్లు. అరుణ్ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాడు.
ప్రేమ్ వీళ్ళని అబ్సర్వ్ చేస్తూ ఉంటాడు .
విల్లా మాటలు బట్టి అతనికి ఏమీ అర్థం అయింది అంటే , విన్ను వల్ల వీళ్ళు రుద్రా కి దగ్గర అయ్యారు, వీళ్లను చూస్తుంటే చాలా క్లోజ్ గా ఉన్నారు , కానీ రుద్రా గురించి పూర్తిగా వీళ్లకు తెలుసా ? అసలు విన్ను కి రుద్రా ఎలా పరిచయం అని ఎన్నో ప్రశ్నలు అతనిలో మెదులుతూ ఉంటాయి.
రుద్రా నితిన్ మొహంలో అన్న కోపం గమనించి చిన్నగా నవ్వుతూ " ఎలా ఉన్నావ్ రా, బాగున్నావా " అని ప్రేమతో అడుగుతాడు.
నితిన్ మాత్రం " హా.. ఇప్పటివరకు బాగానే ఉన్నాను" అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు.
నితిన్ ఇచ్చిన సమాధానానికి కోపం వచ్చిన నిఖిల్ ఏదో అన్న బోతుంటే రుద్ర నిఖిల్ చెయ్యి పట్టుకుంటాడు వద్దు అన్నట్లు.
ప్రియా వీళ్ళని డైవర్ట్ చేయడానికి " త్వరగా వాళ్లకి పంచేస్తే మనం కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు , అప్పుడు ఎవరికీ కావలసిన ప్రశ్నలు వాళ్ళు అడగొచ్చు పదండి" అని అంటుంది.
వాళ్లు కూడా అదే కరెక్ట్ అనుకోని మెల్లగా ఒకచోటికి వెళ్తారు , అక్కడ ఒక వ్యక్తి ఒక వెహికిల్ లో వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ వెహికల్ లో ఫుడ్ పాకెట్స్ బ్లాంకెట్స్ ఉనా కవర్ ఉంటాయి.
ప్రియ నీ చూసి సంతోషంగా పలకరిస్తూ "బాగున్నారా మేడం? ఇదిగోండి మీరు అడిగిన ఐటమ్స్" అని చూపిస్తాడు.
ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూడగానే వాళ్ళు వెంటనే వెళ్లి ఆ వెహికల్ లో ఉన్న కవర్స్ అన్నీ కూడా కిందకి దించుతారు , ప్రేమ్ ఇంకా రుద్రా కూడా వాళ్ళకి సహాయం చేస్తారు. నిఖిల్ ఇంకా అరుణ్ రుద్రా చెయ్యి కొంచెం తేడాగా ఉండడం గమనిస్తారు.
ప్రియా అతనికి థాంక్స్ చెప్పే డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది.
ప్రియా ఇంకా తన బ్యాచ్ రోడ్ సైడ్ మీద పడుకున్న పేదవాళ్ళకి ,అందరి దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కవర్ పెడుతూ ఉంటారు. ఆ కవర్లో వాళ్లకి కావాల్సిన బట్టలు, బొంతలు ,ఫుడ్ ఐటమ్స్ ఇంకా కొంచెం మాని అన్ని ఉంటాయి.
ప్రియ ఇంకా తన ఫ్రెండ్స్ కి ఇలా నైట్ పూట వచ్చి వాళ్లు పడుకునే టైంకి అలా వాళ్ల దగ్గర పెట్టి వెళ్ళిపోతారు. పొద్దున ఆ పేదవాళ్లు లేచి వాటిని చూసుకొని ఎంతో సంతోష పడిపోతారు. వీళ్ళు ఇలా ఒక ఏరియా కాకుండా ప్రతినెలా ఒకొక ఏరియా జ్యూస్ చేసుకుని ఇలా లేని వాళ్ళకి పంచి పెడుతూ ఉంటారు అది కూడా వాళ్ళ సొంత సేవింగ్స్ నుంచి .
ప్రియా ఇలా చేయడం తన 16 ఇయర్స్ ఏజ్ నుంచి మొదలు పెట్టింది, విన్ను తో కలిసి . ఫస్ట్ విన్ను ఇంకా ప్రియా ఇలా చేస్తూ ఉండేవాళ్లు తర్వాత తన ఫ్రెండ్స్ కూడా వీళ్ళతో జాయిన్ అయ్యారు.
అంతేకాదు ప్రియా తన సొంత డబ్బులతో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఇంకా అనాధాశ్రమం నడుపుతూ ఉంటుంది , దానికి ఫండ్స్ తన ఫ్రెండ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు.
ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చోటకి చేరుకుంటారు.
ప్రియా రుద్రా వైపు చూసి " అన్నయ్య ఎంత కాలం ఇలా రీసెర్చ్ అంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు నాతో పాటు వచ్చాయొచ్చు కదా, నిన్ను చూస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది , ఇంటికి రావచ్చు కదా ప్లీజ్ " అని అడుగుతుంది.
అరుణ్ కూడా " అవును రా నువ్వు రిటర్న్ వెళ్లడం మాకు ఇష్టం లేదు మాతో పాటు ఇక్కడే మా దగ్గరే ఉండిపో , నీ రాక కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అని మర్చిపోవద్దు" అని అంటాడు.
రుద్ర మాత్రం చిరునవ్వుతో " లేదు నేను ఇప్పుడప్పుడే మీ దగ్గరికి రాలేను" అని అంటాడు.
అరుణ్ ఇంకా ఆగలేక కొంచెం కోపంగా "ఎందుకు రాలేవు రా ? నీ కోసం మేము ఎంత వెతికానో తెలుసా? నీకోసం ఆ పిచ్చిది ఇంకా అలాగే ఉంది నువ్వు ఎప్పటికైనా వస్తావని ఆశతో, దానికోసం అయినా రారా ప్లీజ్ " అని అంటాడు బాధగా.
అరుణ్ అలా అనగానే రుద్ర కనులలో ఒక అందమైన అమ్మాయి రూపం మెదులుతుంది.
"రుద్ర ఐ లవ్ యు" . "నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను రుద్ర". " నీకు అమ్మానాన్న అన్ని నేనే , నేను నీకు అమ్మ అయి లాలిస్తాను , తప్పు చేసావనుకో నాన్న ఐఈ మందలిస్తాను, అలాగే నీ ప్రియురాలిగా నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను"
"అరేయ్ రుద్రా ఇంత బక్కగా ఉన్నా నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుంది రా" " నువ్వు ఒక ఏలియన్ రా నాకు ఏలియన్స్ అంటే చాలా ఇష్టం తెలుసా"
అన్నమాటలు అతని మెదడులో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అతనికి తెలియకుండానే అతని కంట్లో నుంచి కన్నీరు.
రుద్రా కొంచెం బాధగా " తాను నాతో ఉండడం కరెక్ట్ కాదురా ప్లీజ్ అర్థం చేసుకో, తనకి వేరే పెళ్లి చెయ్యి " అని అంటాడు.
" ఏంటి వేరే పెళ్లి చేయాలా దానికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా , నిన్ను తప్ప వేరే వ్యక్తిని తన జీవితంలో ఊహించుకోలేదు, జీవితాంతం అలాగే ఉండిపోవడానికి ఇష్టపడుతుంది, నువ్వు బ్రతికి ఉండంగా వేరే వ్యక్తిని తన జీవితం లోకి రానివ్వదు " అని అంటాడు.
రుద్రా బాధగా "నేను చనిపోయాను అని చెప్పరా ఎలాగో ఈ లోకం అదృష్టం నేను ఎప్పుడో చనిపోయాను" అని అంటాడు.
అరుణ్ కోపంగా రుద్ర కాలర్ పట్టుకుని " ఏంటి చనిపోయావు అని చెప్పాలా , అసలు ఏంట్రా నీ ప్రాబ్లం. అంజలి అంటే నీకు ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసు, దానికోసం చావు అంచుల వరకు వెళ్లావు, చివరికి తనని పెళ్లి చేసుకునే టైం కి మాయమైపోయావు, నువ్వు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్లావు అసలు ఎవరికీ తెలియదు, ఇన్నాళ్ళకి తిరిగి వచ్చావు . నీకోసం పిచ్చిదాని లాగా ఎదురు చూస్తుంది అది , నోరు మూసుకొని వచ్చి దాన్ని పెళ్లి చేసుకో" అని అంటాడు.
అరుణ్ అలా కోపంగా రుద్రా కాలర్ పట్టుకోగానే అరుణ్ నీ వారిస్తారు తన ఫ్రెండ్స్.
అరుణ్ తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ "వదలండి రా , నన్ను ఆపడం కాదు, ముందు వాడికి నచ్చ చెప్పండి వచ్చి అంజలి ని పెళ్లి చేసుకోమని" అని కోపంగా అంటాడు.
రుద్ర తన హుడ్డి హాండ్స్ పైకి లేపి , తన కృత్రిమ చెయ్యి వైపు చూపించి " ఇప్పుడు చెప్పగలవా తనని పెళ్లి చేసుకోమని" అని అంటాడు.
రుద్రా కృత్రిమ చేయి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ప్రేమ్ తప్ప.
కొనసాగుతుంది..
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు..