రుద్ర తన హుడ్డి హాండ్స్ పైకి లేపి , తన కృత్రిమ చెయ్యి వైపు చూపించి " ఇప్పుడు చెప్పగలవా తనని పెళ్లి చేసుకోమని" అని అంటాడు.
రుద్రా కృత్రిమ చేయి చూసి అందరూ షాక్ అవుతారు.
అతను ఫుల్ హాండ్స్ హుడ్డి వేసుకోవడంతో అంతగా గమనించలేదు అందరూ , అందులోనూ అతని కృత్రిమ చెయ్యి రియల్ హ్యాండ్ లాగా ఉంది. రుద్ర క్లియర్ గా చూపించే వరకు అది కృత్రిమ చెయ్యి అని ఎవరో తెలుసుకోలేకపోయారు
" అన్నయ్య నీ చెయ్యి ఏమైంది" ప్రియా కంగారుగా అడుగుతుంది. తన కళ్ళల్లో నుంచి కన్నీరు.
రుద్ర ప్రియా కన్నీరు తుడుస్తూ " ఒక ఆక్సిడెంట్ లో నా చెయ్యి కోల్పోయాను" అని చెప్పి అరుణ్ వైపు తిరిగి "ఇప్పుడు చెప్పగలవారా అంజలి ని పెళ్లి చేసుకోమని" అని అంటాడు.
అరుణ్ కి ఏమి మాట్లాడాలో అర్థం కాదు, అంజలి ఇంకా అరుణ్ ట్విన్స్ , అంజలి అంటే అరుణ్ కి చాలా ఇష్టం, అంజలి రుద్రా నీ ఎంత ప్రేమించిందో అతనికి బాగా తెలుసు, రుద్ర కనపడకుండా పోయినప్పుడు అంజలి ఎంత బాధపడిందో స్వయంగా చూశాడు, ఇప్పుడు రుద్రా పరిస్థితి చూసి ఏమి చెప్పాలో అతనికి కూడా అర్థం కాలేదు.
రుద్ర మాట్లాడుతూ "అంజలి బంగారం రా, నాలాంటి వాడి కోసం తన జీవితం నాశనం కాకూడదు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు అంజలి కి దూరమైపోయాను, తన జీవితం బాగుండాలి నాలాంటి వాడితో తను హ్యాపీగా ఉండలేదు" అని అంటాడు.
ఇంతలో ఒక డ్రోన్ అక్కడికి వచ్చి రుద్రా కి అలర్ట్ మెసేజ్ ఇస్తుంది , రోబోటిక్ వాయిస్ లో " బాస్.! టైమ్ టూ లీవ్ , టైం టు లీవ్ "
రుద్ర అది విని వెంటనే "ఇక నేను వెళ్లే సమయం అయింది , వెళ్తాను " అని అంటాడు .
రుద్ర వెళ్తాను అనగానే ఫ్రెండ్స్ అందరూ ఒకసారిగా "ఎక్కడికి రా ,వద్దు , మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావ్ " అని కంగారుగా అంటారు .
నితిన్ మాత్రం రుద్ర వెళ్ళిపోతున్నాను అనగానే ఒక రకమైన ఆనందం అతని మొహంలో.
" నేను మీతో ఉండకూడదు రా నా జీవితం వేరు , నేను ఒక లక్ష్యం కోసం వెళ్తున్నాను అది పూర్తయ్యాక తిరిగి వస్తాను " అని సీరియస్ గా అంటాడు.
రుద్ర వెళ్ళాలి అని చెప్పాడు అంటే ఎవరు చెప్పినా ఆగడు అన్న విషయం వాళ్లందరికీ తెలుసు.
ప్రేమ్ మాత్రం రుద్ర వైపు అనుమానంగా చూస్తూనే ఉంటాడు.
ప్రియ కన్నీళ్ళతో రుద్రా చెయ్యి పట్టుకుని "అన్నయ్య ప్లీజ్ వెళ్ళద్దు " అని అంటుంది.
ప్రేమ్ , ప్రియా ఇంకా రుద్రా కి ఉన్న అటాచ్మెంట్ చూస్తూ ఉంటాడు, రుద్ర కి ప్రియ అంటే చాలా ఇష్టం అని అతనికి అర్థం అయింది . రుద్ర పొద్దున జరిగిన విషయం గురించి క్లారిఫై చేసిన తర్వాత కూడా ప్రేమ్ కి ఎక్కడో చిన్న అనుమానం.
ఎందుకంటే ప్రేమ్ సీక్రెట్ ఏజెంట్ గా రుద్రా లాబ్ కి వెళ్ళినప్పుడు అతను స్వయంగా చూశాడు , రుద్ర ఒక కిరాతకుడు , ఎంతో మందిని చంపాడు తన ఎక్స్పరిమెంట్ కోసం, చిన్న పిల్లల్ని కూడా వదలకుండా. ఆరోజు ప్రేమ్ ఆ ల్యాబ్ లో బంధించి ఉన్న అందరిని కాపాడి ఆ లాబ్ ఇంకా రుద్రా నీ నాశనం చేద్దామని అనుకున్నాడు, కానీ అతను స్టెప్ తీసుకోక ముందే ఆ ల్యాబ్ బ్లాస్ట్ అయిపోయింది.
తర్వాత ఆ బ్లాస్ట్ కి సంబంధించిన వివరాలు వెతుకుతూ ఉండంగా అతనికి ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది, ఇంకా ఆ పెన్ డ్రైవ్ మీద ప్రేమ్ పేరు రాసి ఉంటుంది. ఆరోజు ఆ పెన్ డ్రైవ్ చూసిన తర్వాత ప్రేమ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది . రుద్ర మీద ఉన్న అభిప్రాయం కొంచెం మారుతుంది , కానీ అతను అంత సులువుగా నమ్మకం పెట్టుకోలేడు రుద్ర మీద . ఎందుకంటే అది రుద్ర వేసిన ప్లాన్ అయినా అయ్యుండొచ్చు అని. ప్రేమ్ కి మొత్తం క్లారిఫై వచ్చేవరకు కూడా రుద్ర మీద నమ్మకం పెట్టుకో తలుచుకోలేదు.
రుద్ర ప్రియ తల మీద ఆప్యాయంగా చేయి పెట్టి "భయపడకు రా నీ పెళ్లి టైం కి కచ్చితంగా వస్తాను ఇది నేను నీకు ఇస్తున్న ప్రామిస్" అని అంటాడు.
ప్రేమ్ వైపు తిరిగి ఇటు రమ్మన్నట్లు సైగ చేస్తాడు . ప్రేమ్ అనుమానంగా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియా చేతిని ప్రేమ్ చేతిలో పెడుతూ "నా చెల్లి జాగ్రత్త తనని జాగ్రత్తగా కాపాడు, తనని ఒక్క క్షణం కూడా వదలకు, అన్ని క్రియేట్ చేసి వస్తాను" అని అంటాడు.
" అది నా ప్రాణం , దాని వరకు వెళ్ళాలి అంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి , అది చావు అయినా సరే" అని సీరియస్ గా చెప్తాడు.
ప్రేమ్ మాటల్లో విన్ను కనిపిస్తూ ఉంటాడు రుద్రాకి.
అరుణ్ వెళ్లే రుద్రా నీ హాగ్ చేసుకుని " నీకోసం అంజలి ఎదురు చూస్తూ ఉంటుంది, ఈ లోపం వల్ల అది నీకు దూరం అవుతుందని ఎప్పటికీ అనుకోకు అది నిన్ను ప్రేమించింది నువ్వు ఎలా ఉన్నా ఇష్టపడుతుంది అది గుర్తుపెట్టుకో, ఇంకా దాని ఇష్టానికి నేను ఎప్పుడు ఎదురు చెప్పను" అని సీరియస్గా అంటాడు.
రుద్రా కి ప్రస్తుతం అరుణ్ ని కన్విన్స్ చేసే టైం లేదు వెంటనే అక్కడ నుంచి వెళ్లాలి. చివరిసారిగా నిఖిల్ నీ హాగ్ చేసుకొని నిఖిల్ చేవిలో " ప్రియా లైఫ్ డేంజర్ లో ఉంది నా మనుషులు తనకి ప్రొటెక్షన్ ఇస్తున్నాను కానీ ఎటువైపు నుంచి ఏమైనా జరగవచ్చు, తనకి ఏమైనా జరిగితే నాలోని రాక్షసుడు మేలుకుంటాడు అది గుర్తుంచుకో " అని అనగానే నిఖిల్ కళ్ళు పెద్దవి అవుతాయి. అతనికి కొంచెం భయంగా కూడా అనిపించింది, ఎందుకంటే రుద్రా లోని రాక్షసుడు బయటికి వస్తే ఎంత అల్లకల్లోలం అవుతుందో నిఖిల్ కి బాగా తెలుసు.
రుద్ర నిఖిల్ కళ్ళల్లోకి చూస్తూ "తనని ఎప్పుడు వదలకు " అని అని ప్రేమ్ వైపు తిరిగి " నా గురించి ప్రేమ్ కి అని విషయాలను నువ్వే చెప్పాలి, ప్రతి విషయం కూడా" అని ఒత్తి పలుకుతాడు.
వెంటనే ప్రేమ్ ని హగ్ చేసుకొని ప్రేమ్ చెవిలో" ప్రేమ్ నీ ఇన్వెస్టిగేషన్ ఆపకు, నా గురించి విన్ను గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకో అప్పుడే నీకు ఎన్నో విషయాల గురించి అవగాహన వస్తుంది, ఇంకా నాకు టైం లేదు వెళ్తున్నాను" అని చెప్పి వెంటనే బైక్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాడు .
ప్రేమ్ రుద్రా వెళ్లిపోవడం చూసి తన పాకెట్ లో ఉనా ఒక చిన్న డివైజ్ బటన్ ప్రెస్ చేస్తాడు. వెంటనే ఒక వ్యక్తి రుద్రా నీ ఫాలో అవుతూ వెళ్తాడు.
రుద్ర వెళ్లిపోయిన తర్వాత ప్రియా చాలా డల్ అవ్వడం చూసి తన ఫ్రెండ్స్ అందరం కూడా ప్రియ నీ సమదాయిస్తూ ఉంటారు.
రుద్ర విషయంలో ప్రియా డల్ అవడం నితిన్ కి అసలు నచ్చలేదు తన మనసులో " ఆక్సిడెంట్ లో వాడు ఆ చేయి బదులు వాడే చచ్చిపోయిన బాగుండేది. ఈ దరిద్రం ఉండేది కాదు’ అని అనుకుంటాడు.
" స్వీటీ బాధపడకు రా వాడి కి అసలు ఫీలింగ్స్ ఏ లేవు, అవతలి వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించడు, వాడి గురించి వాడు చూసుకుంటాడు , వాడు ఇతరుల గురించి ఆలోచించి, ఇతరుల ఫీలింగ్స్ గురించి ఆలోచించే వాడే అయితే , అంజలి ని అంత బాధ పెట్టే వాడు కాదు, ఇలా వాడి జాబ్ ముఖ్య అనుకుని వదిలి వెళ్ళేవాడు కాదు , వాడి గురించి నువ్వు ఇలా బాధపడడం కరెక్ట్ కాదు, వాడి గురించి ఆలోచించకు" అని అంటాడు నితిన్ .
నితిన్ మాటలకు కోపం వచ్చినా నిఖిల్ " ఒరేయ్ వాడి గురించి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు ఏంటో మా అందరికీ బాగా తెలుసు వాడు వాడి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు, వాడు వాడి గురించి ఆలోచించుకునే వాడే అయితే వాడు నిన్ను ఆరోజు సేవ్ చేసే వాడే కాదు గుర్తుంచుకో ఆ రోజు వాడే లేకపోతే ఈపాటికి చచ్చే వాడివి నువ్వు" అని అంటాడు.
నితిన్ కూడా కోపంగా " ఆ రోజు వాడి వల్లే నేను ఆ ఫైర్ లో చిక్కుకున్నాను వాడే లేకపోతే అది అసలు జరిగేదే కాదు మొత్తం చేసింది వాడే మళ్లీ హీరో లాగా అందరిని కాపాడాను అని షో చేశాడు" అని అంటాడు.
దానికి ప్రియా కోపంగా నితిన్ వైపు చూసి " ఆ రోజు రుద్ర అన్నయ్య వల్ల కాదు నా వల్ల జరిగింది ఆ ఫైర్ ఆక్సిడెంట్ , నేను చేసిన తప్పుని అన్నయ్య తన మీద వేసుకున్నాడు" అని ఎమోషనల్ గా చెప్తుంది . ఆ మాటకి నితిన్ కొంచెం షాక్ అవుతాడు.
శైలు వెంటనే జరిగింది మొత్తం నితిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
నితిన్ నిజం తెలుసుకొని రుద్ర నీ మిస్ అండర్స్టాండ్ చేసుకున్నానని కొంచెం బాధ పడతాడు కానీ అది ఎక్కువ సేపు నిలవదు నితిన్ లో మళ్ళీ కోపం వచ్చి చేరుతుంది.
అది మొత్తం విన్న ప్రేమ్ కి రుద్రా మీద ఒక ఒపీనియన్ వస్తుంది కానీ అతనికి అర్థం కానిది ఏటంటే రుద్ర ఎందుకు అలా మారాడు? ఎందుకు అంతమంది ప్రాణాలు తీశాడు? అసలు రుద్ర ఏం చేస్తున్నాడు? అతని లక్ష్యమేంటి? అని ఎన్నో ప్రశ్నలు ప్రేమ్ ని చుట్టుముట్టాయి.
****
అసలు ఏం జరిగింది అంటే ప్రియా చిన్న వయసులో ఉన్నప్పుడు అంటే తనకి ఒక 14 ఏళ్ల వయసు . రుద్ర కి 18 ఏళ్ల ఉంటాయి .
రుద్రా కి చిన్న వయసు నుంచి సైన్స్ అంటే చాలా ఇష్టం అతను ఏవేవో ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటాడు , ప్రియా కి కూడా వాటి మీద కొంచెం ఆసక్తి ఎక్కువే , అందుకే ఎక్కువగా రుద్రా తో టైం స్పెండ్ చేస్తూ ఉండేది అతని ల్యాబ్ లో .
అలా ఒకరోజు రుద్రా లేని సమయంలో , ప్రియా రుద్ర ల్యాబ్ కీస్ దొంగతనం చేసి , ఎక్స్పరిమెంట్ చేస్తూ రాంగ్ కెమికల్ మిక్స్ చేస్తుంది. కానీ ఎటువంటి రియాక్షన్ ఉండదు. చాలా సేపు ఎదురు చూసి ఏ రియాక్షన్ లేకపోవడంతో దాని అక్కడే వదిలేసి వాళ్ల నాన్న రావడంతో తన ఇంటికి వెళుతుంది.
కొంచెం సేపటికి ఆ కెమికల్ రియాక్షన్ మొదలయ్యి లాబ్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోతుంది.
ఆ లాబ్ విన్ను వాళ్ల ఇంటి బేస్మెంట్ లో ఉంటుంది. ఆ ఫైర్ విన్ను వాళ్ళ ఇంటినే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో రెండు ఇంటికి కూడా అంటుకుంటుంది .
అనుకోకుండా అలా బ్లాస్ట్ జరిగే పాటికి అందరూ భయపడి పోతారు .
అదే టైం కి ఇంటికి వచ్చిన విన్ను ఇంకా రుద్ర మంటలు చూసి వెంటనే అందరిని సేవ్ చేస్తాడు , తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ఆ మంటల్లో పరిగెడుతూ, అందరిని సేవ్ చేస్తారు.
అందరిని సేవ్ చేసిన తర్వాత విన్ను ఇంటి పనిమనిషి నితిన్ ఇంకా ఇంట్లోనే ఉండిపోయాడు అని చెప్తుంది.
బ్లాస్ట్ ఆ ఇంటికి కింద బేస్మెంట్ లో జరగడంతో ఆ ఇల్లు మొత్తం కూడా మంటలతో నిండిపోతుంది.
అందరూ ఆ ఇంట్లోకి వెళ్లి నితిన్ నీ సేవ్ చేయడం చాలా రిస్క్ అని ఎవరు ముందుకు కదలరు.
అది ఏమీ లెక్క చేయకుండా రుద్ర తన ప్రాణాలు సైతం పనంగా పెట్టి నితిన్ ని సేఫ్గా బయటికి తీసుకొస్తాడు . ఈ ప్రాసెస్ లో రుద్రా కి చాలా దెబ్బలు తగులుతాయి ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్తాడు. కానీ నితిన్ నీ మాత్రం సేఫ్ గా బయటకు తీసుకు వస్తాడు.
ఇదంతా తెలుసుకున్న ప్రియ రుద్ర నీ హాస్పిటల్ లో కలుస్తుంది, తన వల్లే ఇదంతా జరిగింది అని చాలా బాధపడుతుంది.
ప్రియా తెలిసి చేసిన తెలియక చేసిన తన వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయేవి అని తెలుసుకొని విన్ను ప్రియా మీద చాలా కోప్పడతాడు.
నితిన్ ఆ ఫైర్ ఇన్సూరెన్స్ వల్ల పొగ లంగ్స్ లోకి వెళ్లడంతో హాస్పిటల్లో ఒక నెల రోజులు ఉంటాడు.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైం లో రుద్ర ఆ తప్పు అంతా తన మీద వేసుకుంటాడు , ఎందుకంటే దీనివల్ల ప్రియా లైవ్ స్పాయిల్ అవుతుందేమో అనే భయంతో.
కానీ ప్రియా తన చేసిన తప్పు ఒప్పుకోవడానికి పోలీసుల దగ్గరికి వెళ్తుంటే జగదీష్ చంద్ర ఇంకా ప్రియా ఫ్రెండ్స్ వారిస్తారు తనని.
ప్రాణ నష్టం ఏమీ కాకపోవడంతో , అందులోను రుద్ర తన ప్రాణాలు సైతం పనంగా పెట్టి అందరిని కాపాడడంతో, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుంది.
ఇదంతా జరిగింది ప్రియా వల్ల అయితే శిక్ష మాత్రం రుద్రా కి పడడంతో ప్రియా చాలా బాధపడుతుంది .
జగదీష్ చంద్ర తన పలుకుబడి వాడి రుద్రా నీ జైలు నుంచి అయితే బయటికి తీసుకు వస్తాడు గాని, ఆ సంవత్సరం జూనియర్ సైంటిస్ట్ అవార్డ్ మిస్ చేసుకుంటాడు రుద్ర.
ఈ ఇన్సిడెంట్ వల్ల ఆ అవార్డు రుద్రా కి రాలేదు అంతేకాదు , అతను స్కిన్స్ స్కూల్ నుంచి డిబార్ కూడా అయ్యాడు , ఇదంతా తన వల్లే అనీ ప్రియా చాలా బాధపడింది కానీ రుద్ర ప్రియా ని నోరు ఎత్తనివ్వలేదు.
ప్రియా వారిస్తూ ఉంటే రుద్ర మాత్రం ప్రియా వైపు చూసి " నువ్వు నా చెల్లివి, చెల్లిని కాపాడుకోవడం అన్నగా నా బాధ్యత, ఇది నా బాధ్యత" అని మాత్రమే చెప్పేవాడు.
నితిన్ హాస్పిటల్ లో అన్కాన్షియస్ లో ఉండడం వల్ల ప్రియా నే ఆ ఇన్సిడెంట్ కి కారణం అని తెలియదు. అందులోనూ రుద్ర ఈ విషయం ఎవరు బయట పెట్టకూడదు అని అందరి చేత మాట తీసుకొని ఉంటాడు. అందుకే నితిన్ కి తెలియదు.
తర్వాత జగదీష్ చంద్ర సహాయంతో రుద్ర స్టేట్స్ వెళ్లి తన చదువు పూర్తి చేస్తాడు.
***
కొనసాగుతుంది..
ఇంతకీ రుద్ర లక్ష్యం ఏమిటి? నితిన్ విన్ను వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉన్నాడు ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైం లో? , అసలు విన్ను కి నితిన్ కి ఉనా సంబంధం ఏమిటి ? రుద్రా అంటే నితిన్ కి ఎందుకు అంత కోపం? తెలుసుకోవాలని ఉందా నీకెందుకు ఆలస్యం నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్లి పోదామా.
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు..