you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ -41

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ -41

రుద్రా బైక్ మీద వెళ్తుంటే ప్రేమ్ మనిషి రుద్ర నీ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు.
రుద్ర పైన ఎగురుతున్న డ్రోన్ రుద్రా కి అలర్ట్ మెసేజ్ పాస్ చేస్తుంది రోబోటిక్ వాయిస్ లో" బాస్ సమ్వన్  ఇస్ ఫాలోయింగ్ , సమ్వన్ ఇస్ ఫాలోయింగ్" .

రుద్ర ఫాలో అవుతున్న మనిషి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుతూ , ప్రేమ్ నీ  తలుచుకొని " బావ నీకు అంత సులువుగా నేను ఎందుకు దొరుకుతాను"  అని అనుకొని. బైక్ స్లో చేస్తాడు.

ప్రేమ్  మనిషి రుద్ర అల బ్రేక్  స్లో చేసే పాటికి అతని బైక్ కొంచెం స్లో చేస్తాడు.
" నేను ఫాలో అవ్వడం ఇతను గమనించినట్లు ఉన్నాడు,  ఎట్టి పరిస్థితిలోనూ తను తప్పించుకోకూడదు"  అని అనుకొని అతని గన్ సీక్రెట్ గా బయటికి తీస్తాడు ఒకవేళ రుద్ర పారిపోవడానికి ట్రై చేస్తే షూట్ చేయడానికి.

రుద్ర మాత్రం కూల్ గా నవ్వుతూ అతని వైపు చూసి  హాయ్ చెప్పు బైక్ సైడ్ కి పార్క్ చేస్తాడు. 

ఆ మనిషి " వీడేంటి నాకు హాయ్ చెప్తున్నాడు నన్ను ఎటాక్ చేయడానికి చేస్తున్నాడా"  అని అనుకొని అలెర్ట్  అవుతాడు. బైక్ రుద్రా కి కొంచెం దూరంలో ఆపుతాడు.

రుద్ర అతనికి వినిపించేలాగా అరుస్తూ " యూ కాంట్ గెట్ మీ బాస్ " అని , ఒక బటన్ ప్రెస్ చేస్తాడు.

అంతే డ్రోన్, బైక్  ఇంకా రుద్ర  మాయమైపోతారు.
అది చూసి ప్రేమ్ మనిషి ఆశ్చర్యపోతాడు. అతను వెంటనే బైక్ దిగి చుట్టూ చూస్తాడు.
" వాట్ ద హెల్ , అంత సడన్ గా ఎలా మాయమైపోయాడు, వీడు మనిషేనా " అని చుట్టూ చూస్తూ ఉంటాడు.

రుద్ర ఎక్కడ కనపడడు , అతనికి అర్థం కాదు అతను ఎలా అమాయమైపోయాడు అనేది.

****

ప్రియా రుద్ర వెళ్ళిపోయాడు అనే బాధలో నిఖిల్ వైపు చూసి " ఎందుకు నిఖిల్ , అన్నయ్య అలా వెళ్ళిపోయాడు?  ఎందుకు మనతో ఉండట్లేదు ? అన్నయ్యకి అ ప్రమాదం ఎలా జరిగింది?  అతని చెయ్యి కోల్పోయే అంతలాగా. మనకి ఈ విషయం ఎందుకు తెలియలేదు?  నువ్వు ఏదో ఒకటి చెయ్  అన్నయ్య ని మన దగ్గరికి తీసుకొచ్చేలాగా అన్నయ్య ఇలా మనకి దూరంగా ఉండటం నాకు నచ్చట్లేదు " అంటుంది.

అరుణ్ కూడా " అవునురా నీ మిలటరీ పవర్స్ , ఏదో ఒకటి ఉపయోగించి వాడిని తిరిగి మన దగ్గరికి వచ్చేలాగా ఏదో ఒకటి చెయ్, ప్లీజ్ అంజలి కోసం " అంటాడు.

అరుణ్ మాటలకే నితిన్ మాట్లాడుతూ"వాడి వెళ్లిపోయి చాలా మంచి పని చేశాడు.  ఇప్పుడు వాడిని తీసుకొచ్చి అంజలి తో పెళ్లి చేద్దాము అనుకుంటున్నావా ? వాడితో పెళ్లి చేపించి అంజలి గొంతు కొయ్యాలి అనుకుంటున్నావా?  నీకు బూర పని చేస్తుందా అసలు?"  అని అంటాడు నితిన్ కోపంగా.

అరుణ్ కూడా అంతే కోపంగా " అంటే ఏంటి రా నీ ఉద్దేశం వాడికి అలా జరిగింది కాబట్టి వాడిని గాలికి వదిలేద్దాం అంటావా ? వాడు చిన్నప్పటినుంచి మనతోనే పెరిగాడు , అంజలి కోసం కాకపోయినా వాడు మనతో ఉండడమే కరెక్ట్ అయినా మీ అన్నయ్య ..." అని ఏదో అనబోతుంటే .
నితిన్  అరుణ్ వైపు కోపంగా చూసి " ఆపరా.. వాడు నాకు ఫ్యామిలీ  ఎప్పటికీ కాలేదు అది గుర్తుపెట్టుకో.  వాడు  ఏమైనా  మా అమ్మకు పుట్టాడ . ఎవడో  అనాధను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినంత మాత్రాన వాడు నా ఫ్యామిలీ  అయిపోతాడా " అని కోపంగా అంటాడు.

నితిన్ మాటలకు ఫ్రెండ్స్ అందరూ నితిన్ వైపు కోపంగా చూస్తారు . నితిన్ మాత్రం అదే కోపంలో వాళ్ళ వైపు చూసి "  మీరు ఏమైనా చెప్పండి  వాడిని నా ఫ్యామిలీ గా ఎప్పుడు ఒప్పుకోను,  అప్పుడు ఇప్పుడు, ఎప్పుడు కూడా"  అని కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 

ప్రియా నితిన్ వెళ్లిన వైపు బాధగా చూసి వాడితో మాట్లాడటానికి వెళ్లబోతుంటే , శైలు , అరుణ్ ఇంకా నిఖిల్ వద్దు అన్నట్లు వారిస్తారు.
" వీడు ఈ జన్మకు మారడు " అని కోపంగా అంటాడు నిఖిల్ 

ప్రియా మాత్రం " వాడిని అలా వదిలేస్తే ఎలా రా వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా,  ఎంత కాలం ఇలా రుద్ర అన్నయ్యని ద్వేషిస్తూ ఉంటాడు వాడికి అర్థం అయ్యేలాగా చెబితే మారుతాడు" అని అంటుంది.

నిఖిల్ మాత్రం కోపంగా "  ప్రియా వాడు చిన్న పిల్లవాడు ఏమి కాదు,  వాడిని మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, వాడి జలసి వల్ల ఇతరుల మీద అలా కోపం పెంచుకుంటూ వచ్చాడు ,  వాడు మారతాడు అన్న నమ్మకం నాకు లేదు, కానీ ఒక రోజు కచ్చితంగా వస్తుంది వాడు నిజాలు తెలుసుకునే రోజు , అప్పుడు వాడే మారుతాడు" అని అంటాడు. 

మళ్లీ నిఖిల్  మాట్లాడుతూ " ఇంకా రుద్రా గురించి అంటావా,  రుద్ర గురించి మా కన్నా నీకే బాగా తెలుసు,  వాడు అనుకునేది సాధించేదాకా తిరిగి రాడు . ఎలాగో ని పెళ్ళికి వస్తాను అని నీకు మాట ఇచ్చాడు వాడు నీకు మాట ఇస్తే ఎప్పుడు తప్పడు , కచ్చితంగా నీ పెళ్లి టైం కి వాడు వస్తాడు.  వాడు వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి చేసి వాడిని మన దగ్గరే ఉంచేసుకుందాం ఓకేనా.  కావాలంటే వాడిని హౌస్ అరెస్ట్ చేసైనా మనతో ఉంచుకుందాం. నువ్వు ఇలా బాధపడకురా నువ్విలా బాధపడితే నేను చూడలేను"  అని అంటాడు.

ప్రేమ్  తన ఆలోచనలలో ’ రుద్ర వీళ్ళకి అనాధగా పరిచయం అయ్యాడు , అంటే రుద్రా తల్లిదండ్రులు ఎవరో వీళ్ళకి తెలియదు,  రుద్ర పుట్టక రహస్యం వీళ్లకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ వీళ్లను చూస్తుంటే రుద్రా కి వీళ్ళకి మద్య ఉన్న అనుబంధం చాలా బలంగా అనిపిస్తుంది , ముఖ్యంగా ప్రియా , రుద్ర అసలు స్వరూపం వీళ్ళకి తెలియజేయాలి, రుద్ర ఏలాంటి వాడో వీళ్ళకి తెలిసేలాగా చేయాలి, కానీ అంతకన్నా  మందు రుద్రా బాల్యం గురించి నేను తెలుసుకోవాలి, రుద్రా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ’ అనుకుంటాడు.

అంతలో ప్రియా బాధపడుతుంటే చూడలేక  ప్రేమ్  , ప్రియ  దగ్గరికి వెళ్లి తన మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని "బాధపడక బంగారం మీ అన్నయ్యని నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది "  అని అంటారు.

రుద్ర మీద అంత మంచి ఒపీనియన్ లేకపోయినా ప్రియా బాధపడటం చూడలేడు ప్రేమ్ , ప్రియ కోసం ఏమైనా చేస్తాడు అందుకే అలా అన్నాడు.

ఆ మాటకి ప్రియా చాలా సంతోషపడి ప్రేమ్ వైపు చూసి చెయ్యి ముందుకు చాపి "నాకు ప్రామిస్ చేస్తావా ప్రేమ్  మా అన్నయ్యని నా దగ్గరికి తీసుకు వస్తావా"  అని ఆశగా అడుగుతుంది .

ప్రియ నీ బాధ పెట్టడం ఇష్టం లేని ప్రేమ్ " ఖచ్చితంగా మీ అన్నయ్యని ని దగ్గరికి చేరుస్తాను, మన పెళ్లికి ముందే మీ అన్నయ్య నీ దగ్గరికి వస్తారు ఓకేనా"  మాట ఇస్తాడు . ప్రేమ్ మాట ఇస్తే కచ్చితంగా చేసి చూపిస్తాడు అని ప్రియా కి బాగా తెలుసు.
ప్రియా సంతోషంగా ప్రేమ్ ని హగ్ చేసుకుంటుంది.

నిఖిల్ కూడా సంతోషంగా " స్వీటీ ఇన్నాళ్లు రుద్ర ఏమైపోయాడో అని చాలా బాధపడ్డాము , ఈరోజు వాడు క్షేమంగా ఉన్నాడు అన్న విషయం తెలిసింది , ఇంకా వాడు మన దగ్గరికి వస్తాడు అన్న నమ్మకం నాకు ఉంది ప్రేమ్ మాట ద్వారా.  ఇంటికి వెళ్దాం పద చాలా టైం అయింది " అని అంటాడు.

" అవును బంగారం పొద్దున్న నుంచి చాలా అలసిపోయి ఉంటావు ఆ ఫంక్షన్ వల్ల కూడా పద ఇంటికి వెళ్లి పడుకుందాం "  అని అంటాడు ప్రేమ్.

తర్వాత ఫ్రెండ్స్ అందరం కూడా ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకుంటారు. 

ప్రియా చాలా అలసిపోవడం వల్ల ప్రైమ్ బైక్ నడుపుతూ ఉంటుంటే తను వెనకాల కూర్చుని ప్రేమ్ ని పట్టుకొని అలాగే నిద్రపోతోంది . ప్రేమ్ ఒక కంట ప్రియ నీ గమనిస్తూనే బైక్ నీ ఇంటికి పోనేస్తాడు . ఇంటికి వెళ్లాక ప్రియా ని మెల్లగా ఎత్తుకొని తన గదిలోకి తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తనకి దుప్పటి కప్పుతాడు.
ముద్దుగా నిద్రపోతున్న ప్రియా ని అలా చూస్తుంటే  చాలా ముద్దొస్తుంది ప్రేమ్  కి  మెల్లగా తన నుదిటి మీద ముద్దు పెట్టుకొని "గుడ్ నైట్ బంగారం " అని మెల్లగా చెప్తాడు. 
ప్రేమ్ మాటలు తనకి చేరునట్లుగా నిద్రమత్తులోనే "గుడ్.. నైట్.. ప్రేమ్..." అని అంటుంది ప్రియా.

ప్రేమ్ చిన్నగా నవ్వుకొని ఆ గదిలో నుంచి బయటికి వస్తాడు.

అప్పుడే అక్షయ కూడా తన గదిలో నుంచి బయటికి వచ్చి " బాగా ఎంజాయ్ చేశారా మరిది గారు ఈరోజు" అని అంటుంది. 

ప్రేమ్ అక్షయ వైపు చూసి చిన్నగా నవ్వుతూ " ఇంకా పడుకోలేదా వదిన" అని అడుగుతాడు .

" కొత్త ప్రదేశం కదా అందులోనూ మధ్యాహ్నం చాలాసేపు నిద్రపోయాను,  నిద్ర పట్టలేదు " అని అంటుంది.

అక్షయ చేతిలో ఎంప్టీ బాటిల్  చేసిన ప్రేమ్ "వాటర్ కోసం బయటికి వచ్చావా ఇటు ఇవ్వు,  నేను తీసుకు వస్తాను"  అని అంటాడు.

అక్షయ ఆ బాటిల్ వైపు చూసి " కింద వరకు వెళ్లాల్సిన పని లేదు ప్రేమ్ ,ప్రియ  గదిలో చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది అందులో వాటర్ బాటిల్స్ ఉంటాయి ఒక వాటర్ బాటిల్ తీసుకొనిరా చాలు " అని అంటుంది.

ప్రేమ్ అలాగే అని చెప్పి ప్రియా గదిలో ఉన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగానే షాక్ అయిపోతాడు . ఎందుకంటే ఆ ఫ్రిజ్ నిండా కూడా చాక్లెట్స్ , స్నాక్ ఐటమ్స్ , ఐస్ క్రీమ్ , చాలా ఉంటాయి ఇంకా ఒక పక్కన బీర్ బాటిల్ వైన్ బాటిల్ కూడా చూసి షాక్ అయిపోతాడు.

" ఓరి దేవుడోయ్...  ఏంటి దీనికి తాగే అలవాటు కూడా ఉందా , చూడడానికి ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుంది , వామ్మో పెళ్లయిన తర్వాత ఇది తాగి నన్ను తన్నదు కదా " అని అనుకొని.  ఇమాజినేషన్ చేసుకుంటాడు. 

***
అది ప్రియ ఇంకా ప్రేమ్ కి పెళ్లి అయిన తర్వాత. 

ప్రియా కోపంగా ఊగిపోతూ " ఒరేయ్ ప్రేమ్ మొగుడా నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినా కూడా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు కదూ ఇప్పుడు చెప్తారా నీ పని " అని అంటూ కోపంతో ఊగిపోతుంది తన చేతిలో బాటిల్ , అదేనండి వైన్ బాటిల్ ఉంది.

" నేను చాలా సాఫ్ట్ అనుకున్నావ్ కదూ. కాదురా .....! చాలా వైల్డ్..! ,  నాకు అన్ని అలవాటులో ఉన్నాయి ఇప్పుడు చూడు నీకు ఎలా నరకం చూపిస్తానో. ఇంతవరకు పేపర్లలో,  న్యూస్ లో తాగుబోతు మొగుడు పెళ్ళాన్ని హింసించాడు అని  చూసి ఉంటావు . కానీ ఇప్పుడు ఇక్కడ తాగుబోతు పెళ్ళాం మొగుడ్ని ఎలా హింసిస్తుందో కొత్త రికార్డు రాస్తాను చూస్తూ ఉండు"  అని భయంకరంగా నవ్వుతూ ఉంటుంది.

***
" నో నో నో అలా జరగకూడదు"  అని అంటూ తన ఊహల్లో నుంచి బయటికి వస్తాడు ప్రేమ్.
బెడ్ మీద ప్రశాంతంగా పడుకొని ఉన్న ప్రియా కనిపిస్తుంది.

" ప్రేమించిన పాపానికి తాగుబోతు పెళ్ళాన్ని కూడా భరిస్తున్న ప్రేమ్ అని రేపు పొద్దున న్యూస్ పేపర్ లో వస్తుంది ఏమో...  కృష్ణయ్య ఏంటయ్యా ఇది నా రాత ఇలా రాశావు.  దానికి దేవకన్య లాంటి అందం అయితే ఇచ్చావు కానీ అందులో ఇలాంటి అలవాట్లు ఇవ్వడం నీకు న్యాయమేనా"  అని కృష్ణుడు వైపు చూసి జాలిగా అడుగుతాడు.

కాసేపటికి మొహం వేలాడేసుకుని ప్రియా గదిలో నుంచి బయటికి వస్తున్న ప్రేమ్ ని చూసి అక్షయ ఆశ్చర్యపోతుంది  " ఏమైంది వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు కదా వచ్చేటప్పుడు ఏంటి మొహం ఇలా వేలాడేసాడు " అని అనుకుంటుంది. 

" ఏమైంది ప్రేమ్ అలా ఉన్నావ్"  అని అక్షయ అడగ్గానే .

ప్రేమ్ అమాంతం అక్షయా నీ  హగ్ చేసుకొని ఏడుస్తూ " ఆ...ఆ....వదిన నీకు ఇది ఏమైనా భావ్యంగా ఉందా , ఆ.. దాని గురించి అన్ని చెప్పావు.  దానికి ఈ అలవాటు ఉందని నాకెందుకు చెప్పలేదు. ఆ..."  అని ఏడుస్తాడు.

అక్షయా కి ప్రేమ్ ఎందుకు అలా ఏడుస్తున్నాడో ఏమాత్రం అర్థం కాదు.

ఇంతలో అక్షయ కనపడక బయటికి వచ్చిన ఆదిత్య , ప్రేమ్ అలా అక్షయ ని పట్టుకొని ఏడవడం చూసి కంగారుగా వెళ్లి " ఒరేయ్ ఎందుకురా అలా ఏడుస్తున్నావు"  అని అడుగుతాడు.

వాళ్ళ అన్నయ్య రావడంతో ఆదిత్య వైపు చూసి అక్షయా నీ వదిలి ఆదిత్యా ని పట్టుకొని ఇంకా గట్టిగా ఏడుస్తాడు " ఆ.....అన్నయ్య ....నా జీవితం గూగిపళ్ళు అయిపోయింది రా...."  అని శ్లోకాలు పెట్టుకుంటూ ఏడుస్తాడు. 

ఎంతలో  ప్రియా కూడా ఆవలిస్తూ బయటికి వస్తుంది అక్కడ  ప్రేమ్  ఏడవడం చూసి " ఏ ఎందుకలా ఏడుస్తున్నావ్  అర్ధరాత్రి  దయ్యం పట్టిన వాడిలాగా , నా  నిద్ర చెడగొట్టడానికి"  అని అంటుంది.

ప్రేమ్ ప్రియా రూమ్  ఎదురుంగానే అలా అక్షయ ఇంకా ఆదిత్యా నీ పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు, ప్రియ రూమ్ డోర్ తెరిచే ఉండడంతో  ఆ సౌండ్స్ కి మెలకువ వచ్చిన ప్రియా బయటికి వస్తుంది.

ప్రేమ్ ప్రియా వైపు చూసి ఇంకా గట్టిగా రాగం అందుకొని " ఆ... ఇది నా జీవితం నాశనం చేసింది"  అని అంటాడు. పియా వైపు వెళ్ళు చూపిస్తూ.

ఆ మాటకి ఆదిత్య కళ్ళు పెద్దది అవుతాయి అతనికి ఇంకో రకంగా కాన్వే అవుతుంది మేటర్. 

ప్రేమ్ మాటలకి ప్రియా చిరాగ్గా "వచ్చే దారిలో  పిచ్చి కుక్క గాని కరిచింద ఏంటి? నారు ముసుకొని వెళ్లి పడుకో పో , నాకు నిద్ర వస్తుంది"  అని అంటుంది.

ప్రేమ్ మాత్రం ఆదిత్యా ని పట్టుకుని " ఆ...అన్నయ్య నువ్వే నాకు న్యాయం చేయాలి " అని ఏడుస్తూ అంటాడు.

ఆదిత్య ప్రేమ్ కి ధైర్యం చేస్తూ "నేను ఉన్నాను రా నీకు , నువ్వేమీ భయపడకు " అని అని .

ప్రియా వైపు చూసి " ప్రియా అది నీకు న్యాయంగా ఉందా నిశ్చితార్థం వెంటనే ఇలా చేయడం "  అని అడుగుతాడు.

ఆదిత్య మాటలకి ప్రియా కన్ఫ్యూజ్ అవుతూ "బావగారు  నేనేం చేశాను"  అని అడుగుతుంది.

ప్రేమ్ మాత్రం "  చూసావా అన్నయ్య నేనేం చేశాను అని అంటుంది, చేసింది అంతా చేసింది గాక , ఆ.. ఇప్పుడు నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నా పరువు అంతా పోతుంది ఈ విషయం గాని బయటికి వస్తే ఆ..."  అని ఏడుస్తాడు.

ఆదిత్య ప్రేమ్ వైపు వంగి చినగా "  మొత్తం తనే చేసిందా నీకు ఛాన్స్ ఇవ్వలేదా" అని అడుగుతాడు. 

ఆదిత్య మాటలకి ప్రేమ్ ’ ఏంటి వీడు నేను కూడా తనతో కలిసి తాగాను అనుకుంటున్నాడా ఏంటి?’ అని అనుకొని.

ప్రేమ్ అమాయకంగా ఫేస్ పెట్టి " ఏంటి అన్నయ్య నా గురించి తెలియదా ఏంటి? నేను శ్రీరామచంద్రుడు లాంటి వాడిని " అని డైలాగ్ వేస్తారు.

ఆ మాటలకు ఆదిత్య "  ప్రియా చాలా ఫాస్ట్ " అని అంటాడు.
ప్రేమ్ దానికి "అవును అన్నయ్య చాలా ఫాస్ట్" అని ఏడుస్తూ అంటాడు.

ప్రియా ప్రేమ్ వైపు చూసి "కన్ఫామ్ వీడికి చిప్ దొబ్బేసింది . లేకపోతే  వచ్చే దారిలో ఏదైనా దయ్యం పట్టి ఉంటుంది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు."   అని అనుకోని. 

అక్షయ వైపు తిరిగి "  అక్షయ భూత వైద్యుడికి ఫోన్ చేయవే, నీ మరిదికి ఏదో దయ్యం పట్టినట్టు ఉంది "  అని అంటుంది.

దెయ్యం పట్టింది అనగానే అక్షయ భయంతో ప్రేమ్ వైపు చూస్తుంది ఎందుకంటే అక్షయా కి  దయ్యాలు అంటే చాలా భయం.

ప్రేమ్  ప్రియా వైపు కోపంగా చూసి " చూసావా అన్నయ్య నాకు దెయ్యం పట్టింది అని ఎలా అంటుందో , నువ్వే నాకు న్యాయం చేయాలి"  అని అంటాడు.

ఆదిత్య ప్రేమ్  వైపు చూసి "  నేనునకధ నీకు"  అని అని ప్రియా వైపు తిరిగి "ఇదేమైనా బాగుందా ప్రియా చూడడానికే చాలా సాఫ్ట్ గా కనిపిస్తావు కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు"  అని అంటాడు. 

ప్రియా కి చిరాకు వచ్చి " అసలు నేనేం చేశానో నాకు కొంచెం చెప్తారా"  అని అడుగుతుంది .

" ఇలా నా తమ్ముడి నీ అమాయకుడిని చేసి వాడి శీలం  దోచుకోవడం తప్పుకథ,  ఏ ఆడవాళ్లదే శీలం మగవాడిది కాదా"  అని అడుగుతాడు.

ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు ప్రేమ్ తో సహా.
వాట్?.

కొనసాగుతుంది..

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు..