you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ -42

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ -42

ప్రియా కి చిరాకు వచ్చి " అసలు నేనేం చేశానో నాకు కొంచెం చెప్తారా"  అని అడుగుతుంది .

" ఇలా నా తమ్ముడి నీ అమాయకుడిని చేసి వాడి శీలం  దోచుకోవడం తప్పుకథ,  ఏ ఆడవాళ్లదే శీలం మగవాడిది కాదా"  అని అడుగుతాడు.

ఆ మాటకి ప్రియా కి ఫీజులు ఎగిరిపోతాయి,  ఉన్న కాస్త నిద్ర మత్తు కూడా వదిలిపోతుంది.

" వాట్?"
ప్రియా ,ప్రేమ్, అక్షయ ముగ్గురు ఒకేసారి అరుస్తారు

" నేను దేని గురించి మాట్లాడుతున్నాను,  వీడు దేని గురించి చెప్తున్నాడు. " అని అనుకోని ఏదో అర్థం అయ్యి " ఏంటి  నా మాటలు ఈ రకంగా కన్వే అయినాయా వీడికి ." అని మనసులో అనుకొని వెంటనే ప్రియా వైపు  చూస్తాడు. ఎస్ ఎక్స్పెక్టెడ్ ప్రియా ప్రేమ్ వైపు కోపంగా చూస్తుంది.

’  ఓరి దేవుడోయ్  ఇప్పుడు నేనేం చేయాలి నా బంగారం చేతిలో ఇప్పుడు నేను చచ్చాను, దీనికి కోపం వస్తే మామూలుగా కుమాదు ’ అని పొద్దున్న ప్రియా,  నితిన్ ఇంకా అరుణ్ నీ కొట్టడం గుర్తుకు తెచ్చుకుంటాడు ప్రేమ్ .

వెంటనే ఆదిత్య వైపు చూసి ఏడుపు మొహం పెట్టుకొని " ఒరేయ్ అన్నయ్య నా బ్రతుకు అది కాదురా నువ్వు చేసావ్ రా గుగ్గిపాలు ఆ..ఆ.." అని ఏడుస్తూ అంటాడు.

ఈసారి ఆదిత్యా కోఫ్యూస్ అవుతూ " ఆ ..! ఇప్పటిదాకా ప్రియ నీ జీవితం నాశనం చేసింది అని ఏడ్చి,  ఇప్పుడు నేను నాశనం చేశాను అంటావ్ ఏంటి , పిచ్చి గాని పట్టిందా ఏంటి నీకు ఈరోజు"  అని అంటాడు ఆదిత్య.

"ఒరేయ్ అన్నయ్య నీకు ఇక్కడ సిచువేషన్ అర్థం కావట్లేదు .ఈరోజు నా పని అవుట్ , నాకు సాయం చేస్తానని చెప్పి , నాకు స్వర్గానికి ఎంట్రీ పాస్ తీసుకున్నావ్ రా ఇక్కడ " . అని అంటాడు ప్రేమ్.

ప్రేమ్ మాటలకి ఆదిత్య కి   ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అని అర్థమవుతుంది కానీ అదేంటో అర్థం కాదు.

ప్రియా కోపంగా ఊగిపోతూ ప్రేమ్ వైపు చూసి "  ఆ మాటలు వీడే చెప్పాడా మీకు"  అని ప్రేమ్ వైపు చూసి ఆదిత్య నీ  అడుగుతుంది. 

బేసికాల్గా ప్రేమ్ క్లారిఫైగా ఎవరికి చెప్పాడు , ఇప్పుడు ప్రియ తాగుబోతు అని చెప్తే కొడుతుంది . అలా కాదు ఆదిత్య చెప్పింది చెపితే ఇంకా కొడుతుంది ప్రేమ్ కి ఏం చేయాలో అర్థం కాదు.
ప్రేమ్ ఆదిత్య వైపు చూసి దండం పెడుతూ మనసులో  ’ ఒరేయ్ నీకు దండం పెడతాను,  ఇంకేం మాట్లాడమాకు రా , ఇక్కడ జరుగుతున్న సిచువేషన్ నీకు అర్థం కావట్లేదు, నేను ఒకటి చెబితే నీకు ఇంకొకటి కన్వే అయింది, నువ్వు ఒక మాట తప్పుగా మాట్లాడిన నా పని అవుట్'  అని మనసులో అనుకుంటాడు. 

ఆదిత్య కి ఇంకా అక్కడ జరుగుతున్న మ్యాటర్ అర్థం కాదు, ప్రేమ్ ఎందుకు అలా దండం పెడుతున్నాడో అర్థం కాదు, ’విదేంటి ఇలా దండం పెడుతున్నాడు నన్ను మాట్లాడద్దు అన్నట్లు.  వీడే గా నాకు జస్టిస్ కావాలి అని అడిగాడు, ఇప్పుడు ఏంటి మాట్లాడద్దు అన్నట్లు సైగ చేస్తున్నాడు.’అని అనుకుంటాడు. 

ప్రియా కోపంగా " చెప్పండి బావగారు ఆ మాటలు ప్రేమే మీతో చెప్పాడా"  అని అడుగుతుంది.

ప్రేమ్ వెంటనే "అది... కాదు... బంగారం.. నేను చెప్పింది... వేరే... అది కాదు.." అని తడబడుతూ అంటాడు .
ప్రియా ప్రేమ్ వైపు వేలు చూపిస్తూ "  నువ్వు ఆగు! "  అని ఆదిత్య వైపు తిరిగి "మీరు చెప్పండి"  అని కోపంగా అడుగుతుంది.

ఆదిత్య కి   ప్రియా ఎందుకంత కోపంగా ఉందో అర్థం కాదు  " అవును స్వయంగా వాడే చెప్పాడు వాడు నోటితో నువ్వే వాడి జీవితం  నాశనం చేసావు అని, ఒప్పుకుంటాను మీకు ఎంగేజ్మెంట్ అయ్యింది అని కానీ పెళ్లికి ముందు ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు... " అని ఆదిత్య ఇంకా ఏదో చెప్ప పోతుంటే 

ప్రియా కి ఇంకా కోపం ఆగక గట్టిగా " ఒరేయ్ .....! ప్రేమ్...!"  అని అరుస్తుంది. ఇల్లు దద్దరిల్లిపోయేలాగా.
ఆ దెబ్బకి ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఒక భూకంపం వచ్చిన వాళ్ళ లాగా తుళ్ళి పడి లేగుస్తారు.

-- 
గాయత్రీ కంగారుగా "ఏంటండీ ఈ అరుపులు అర్థరాత్రి పూట ఏమై ఉంటుంది " అని కంగారు పడి  అడుగుతుంది .

గుర్దీప్ "ఇంకెవరు నీ చిన్న కొడుకు ఏదో చేసి ఉంటాడు పద వెళ్లి చూద్దాం"  అని అంటాడు.

" ఎప్పుడు వాడిని ఏదో ఒకటి ఆనంది మీకు పొద్దు గడవదు"  అని అంటుంది గాయత్రి గారు. గుర్దీప్ నీ వీల్చైర్  లో కూర్చోబెట్టడానికి సహాయం చేస్తూ.

"  నీ కొడుకుల మీద నీకు ఎంత నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు కానీ నా కొడుకుల మీద నాకు చాలా నమ్మకం ఉంది,  ఇది కచ్చితంగా ఆ ప్రేమ్ గాడు ఏదో చేసి ఉంటాడు" అని అంటాడు గుర్దీప్.

జగదీష్ చంద్ర , సునంద గారి కూడా ఉలిక్కిపడి లెగుస్తారు
జగదీష్ చంద్ర "ఇవి మన బేబీ అరుపులు లాగా ఉన్నాయి ఏమైందో వెళ్లి చూద్దాం పద " అని కంగారుగా బయటికి వస్తారు.

అదే టైం కి ఊర్మిళాదేవి , గాయత్రి ఇంకా గుర్దీప్  బయటికి వస్తారు వాళ్ళ గదుల్లో నుంచి.

--- 

ప్రియా అరుపులకి ప్రేమ్ భయపడిపోయి వెంటనే "అది కాదు బంగారం నీ ఫ్రిజ్లో నేను బీర్ ఇంకా వైన్ బాటిల్స్ చూశాను , నీకు తాగే అలవాటు ఉందేమో అని ,  అలా అన్నాను , కానీ వీడికి ఇంకో రకంగా కన్వే అయ్యింది" అని ఆదిత్యా నీ ఒక తన్ను తాని  "నేను ఆ రకంగా చెప్పలేదు సుమీ " అని చాలా స్పీడ్ గా చెప్తాడు. 

ఆదిత్య కి అప్పుడు మ్యాటర్ అంతా అర్థమవుతుంది. " నాకేం తెలుసురా నువ్వు అలా శోకాలు పెట్టీ ఏడుస్తుంటే నేను నిజంగా నీ శ్రీ...
హమ్..." అని ఆదిత్య ఏదో చెప్పే లోపు ప్రేమ్ వెంటనే ఆదిత్య నోరు మూసేస్తాడు .

" ఒరేయ్ నీకు దండం పెడతాను ఆపరా మళ్ళి నువ్వు ఆ మేటర్ ఎత్తావనుకో... , దాన్ని ఒకసారి చూడు ఎంత కోపంగా ఉందో"  అని ప్రియా వైపు చూపిస్తాడు ప్రియా కోపంగా ఊగిపోతు ప్రేమ్ నే చేస్తూ ఉంటుంది.
" ఈరోజు నాకు స్వర్గానికి పాస్ ఇస్తుంది ,ఇంకోసారి ఆ మాట పలికితే " అని అంటాడు.

ప్రేమ్ మాటలకి అక్షయ వెంటనే "  ఆ బీర్ బాటిల్ ఇంకా వైన్ బాటిల్స్ జగదీష్ అంకుల్ వి, నానమ్మకి తెలిస్తే ఊరుకోదు అని ప్రియా రూమ్ లో పెడతారు అంకుల్  " అని  వెంటనే అంటుంది.

ఆ మాటలు వినగానే ప్రేమ్  ఆనంద పడిపోతూ "అంటే నా బంగారానికి తాగే అలవాటు లేదా?"  అని మెరిసే కళ్ళతో అడుగుతాడు .
ఈ మాటలకి ప్రియా కి ఇంకా ఒళ్ళు మండుతుంది.

అక్షయ రిప్లై ఇచ్చే లోపు  ప్రియా మాట్లాడుతూ  "అంటే నాను తాగుబోతు అనుకున్నావా!  అయిపోయావురా ఈరోజు నా చేతిలో"  అని ప్రేమ్ వెంట పడుతుంది.

ప్రేమ్,  ప్రియా కి దొరక్కుండా హాల్లో అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు.
" ఒరేయ్ అన్నయ్య సేవ్ మీ " అని అరుస్తూ.

ఆదిత్య మాత్రం కూల్ గా చేతలు కట్టుకొని  ప్రేమ్ వైపు చూసి "ఆయన బంగారం లాంటి పిల్లని తాగుబోతు అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది రా , నీ మాటలు వల్ల నేను ఇంకో రకంగా అర్థం చేసుకొని పాపం ప్రియా నీ అపార్థం  చేసుకున్నాను ఐ యాం సారీ ప్రియా ఇదంతా ప్రేమ్ పల్లె జరిగింది " అని వెటకారంగా అంటూ తప్పంతా ప్రేమ్ మీద వేసేస్తాడు.

ఆదిత్య మాటలకి ప్రేమ్ కోపంగా" ఒరేయ్ నన్ను ఇలా ఇరికించావు కదూ,  పాపం ఊరికే పోదు రోయ్" అని అంటాడు  , ప్రియ నుంచి తప్పించుకుంటూ.

ప్రేమ్ దొరకపోవడంతో చేతికి దొరికిన వస్తువులన్నీ కూడా ప్రేమ్ వైపు విసురుతూ ఉంటుంది ప్రియా కోపంగా.
ప్రేమ్ మాత్రం వాటి అన్నిటిని కూడా కరెక్ట్ గా క్యాచ్ పడుతూ ఉంటాడు. 

అక్షయ మాత్రం కంగారు  పడిపోతూ " వదిలేయవే వాడిని ఏదో చిన్న మిస్ అండర్స్టాండింగ్ అంతే"  అని అంటుంది.

ప్రియా కోపంగా " ఒసేయ్ నేను మంచి తిక్కలో ఉన్నాను ప్రెసెంట్ , నువ్వు ఇపుడు వాడికి సపోర్ట్ ఇచ్చావనుకో వాడికి పడవలిసినవి నీకు పడతాయి మూసుకుని ఒక మూల కూర్చో "  అని అంటుంది.

ఆదిత్య మాత్రం " డోంట్ వర్రీ వాడు  హ్యాండిల్ చేసుకుంటాడులే వాడి వైఫ్ నీ ,  నువ్వు ఇటు రా"  అని అక్షయ అని సైడ్ కి తీసుకు వెళ్తాడు

ఆ మాటలకి ప్రేమ్ కి కోపం వస్తుంది ' ఒరేయ్ ఇదంతా నీ వల్లే కాదురా జరిగింది' అని అనుకుంటాడు.

ఇంతలో ప్రియా ఒక బాల్ తీసుకుని ప్రేమ్ మీదకి విసరగానే ప్రేమ్  తప్పించుకుంటాడు , కానీ ఆ బాల్ తిన్నగా వెళ్లి  ఆదిత్యా తలకి  తగులుతుంది దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది ఆదిత్య కి. లోకమంతా గిరున తిరుగుతుంది. 

**ఇది మాత్రం ప్రేమ్ కావాలనే చేసి ఉంటాడు ఆదిత్య మీద రివెంజ్ కోసం.**

అది చూసి అక్షయ " అయ్యో అధి గారు గట్టిగా తగిలిందా " అని అడుగుతుంది.

ఆదిత్య తిరుగుతున్న తన తలని పట్టుకొని "అక్షయ కొంచెం సేఫ్ ప్లేస్ కి వెళ్దామా , ఇక్కడ వాస్తు బాగోలేదు"  అని అంటాడు.

ప్రియా వైపు నుంచి తప్పించుకుంటూనే ఆదిత్యా ను చూసి నవ్వుకుంటాడు ప్రేమ్  ' నీకు ఇది కావాలి రా , నీవల్లేరా ఇప్పుడు నా బంగారం నామీద ఇంత కోపంగా ఉంది ' అని అనుకుంటాడు.
ఆదిత్య కి దెబ్బ తగిలినందుకు లోపల కొయ్య డాన్స్ వేస్తూ ఉంటాడు.

పెద్ద వాళ్ళందరూ పైకి వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి నోరు వెళ్ళబెడతారు.

ప్రియా అప్పటికే  ప్రేమ్ నీ సోఫా లో బోర్లా పడుకోబెట్టి , అతని వీపు మీద ఆటో కాలు ఇటో కాలు వేసి వీపు మీద  ఎక్కి , చెయ్యి వెనక్కి  మెల్లిపెట్టి వీపు మీద గుద్దుతూ ఉంటుంది.

ఊర్మిళాదేవి గారు గట్టిగా " ఏం చేస్తున్నావే వాడిని" అని అరుస్తుంది.

ప్రియా మాత్రం కోపంగా ప్రేమ్ నీ కొడుతూనే " నువ్వు ఉండవే , ఈరోజు వీడు నా చేతిలో చచ్చాడు" అని ఇంకా గట్టిగా కొడుతూ ఉంటుంది.

ప్రేమ్  గాయత్రి గారి వైపు చూసి "మా.. సేవ్ మీ "  అని అరుస్తాడు.

గాయత్రి గారు ముందుకు వెళ్ళిబోతుంటే  గుర్దీప్ గాయత్రి గారిని  ఆపి "నువు ఆగు మన వల్ల ఎలాగో కాదు,  ఇంకొద్దిసేపు తన్నులు తినని వాడిని అప్పుడైనా దారిలోకి వస్తాడు "  అని అంటాడు. ఆయన కళ్ళల్లో ఒక రకమైన ఆనందం. 

గుర్దీప్ మాటలకు గాయత్రి గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే .
ఊర్మిళాదేవి గారు జగదీష్ చంద్ర వీపు మీద ఒకటి వేసి " ఏంటి రా శోధ్యం చూస్తున్నావు వెళ్లి నీ కూతురిని వెనక్కి లాగు"  అని అరుస్తుంది.

" అబ్బా.. అమ్మ ఏంటే ఇలా కొట్టావ్"  అని ఏడుపు గొంతులో అడుగుతాడు జగదీష్ చంద్ర దెబ్బ గట్టిగా తగలడంతో.

" ముందు నీ కూతురిని ఆపకపోతే ఇంకా నాలుగు పడతాయి " ఊర్మిళాదేవి గారి గట్టిగానే చెప్తుంది. 

జగదీశ్ చంద్ర నెప్పి పెడుతున్న వీపు ని రుద్దుకుంటూ  వెళ్లి ప్రియ నీ  వెనక్కి లాగడానికి ట్రై చేస్తాడు కానీ అతని వల్ల కావట్లేదు , ఇక అతని ఒకడి వల్ల కాదు అని ఆదిత్య వైపు చూస్తాడు ఆదిత్య వెంటనే సహాయానికి వస్తాడు.

జగదీష్ చంద్ర , ఆదిత్య ఇద్దరు కలిసి ప్రియా రెక్కలు పట్టుకొని వెనక్కి లాగుతారు .
ప్రియా వాళ్ల చేతుల్లో గుంజుకుంటా "  వదలండి నన్ను అయిపోయాడు వీడు నా చేతిలో,  వదలండి" అని అరుస్తుంది.

ప్రేమ్  , ప్రియ అతని మీద నుంచి దిగగానే  ఏడుపు మొహం పెట్టుకొని ఊర్మిళాదేవి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి " చూసావా నానమ్మ నీ మనవరాలు నన్ను ఎలా కొట్టిందో"  అని కంప్లైంట్ చేస్తాడు.

ఊర్మిళాదేవి గారు మాట్లాడక ముందే గాయత్రి గారు మాట్లాడుతూ " ముందు నువ్వు దాన్ని ఏమన్నావో అది చెప్పు , దానికి అంత కోపం వచ్చేలాగా ఏం చేశావు " అని అడుగుతుంది.

ప్రేమ్ కి ఏమి చెప్పాలో అర్థం కాక వేరీ నవ్వులు నవ్వుతూ ఉంటాడు " ఆది ...మమ్మీ... అది.. " .

జగదీష్ చంద్ర ప్రియా వైపు చూసి ఏదో అనే లోగా ఆదిత్య జగదీష్ చంద్ర గారి చేతిలో " మావయ్య ఈ మ్యాటర్ వెంటనే క్లోజ్ చేస్తే బెటర్,  లేకపోతే మీరు ప్రియా గదిలో దాచిన వైన్ బాటిల్స్ అని  బయటికి వస్తాయి" అని అంటాడు.

ఆ మాట వినగానే జగదీష్ చంద్ర కళ్ళు పెద్దవి అవుతాయి. భయంగా ఊర్మిళాదేవి  గారి వైపు చూస్తాడు. 

కొనసాగుతుంది...

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.