What is my fault? in Telugu Thriller by Lakshmi Prasanna books and stories PDF | నా తప్పు ఏంటి? - 3

Featured Books
Categories
Share

నా తప్పు ఏంటి? - 3

3

‘అందమైన జీవితం…

అందుకుంటే ఓ వరం…

లోకం అంతా ఆనందాలు నిండేలాగా నే చేస్తాను…’

పొద్దున్నే టిఫిన్ తింటూ పిల్లలతో కలిసి డోరేమాన్ చూస్తుంది శృతి…

“అక్క… ఇంకో దోస కావాలి…” టీవీ చూస్తూ వంటింట్లో ఉన్న సంజనని అడిగింది…

“శృతి…” పక్కన కూర్చుని పిలిచారు
నాన్న…

“ఈ అబ్బాయి బెంగళూరులోనే జాబ్ చేస్తున్నాడు అంట…”

“చాలా…”

“మంచి కుటుంబం… ఒకసారి మాట్లాడి చూద్దామా?” భయం భయంగా అడుగుతున్నారు నాన్న…

‘వినిపించనట్టు టీవీ చూస్తూ ఉండిపోయింది’

“రమ్మనండి మావయ్య… ఒకసారి చూసి
మాట్లాడితే అప్పుడు ఆలోచిద్దాం…” అన్నాడు కన్విన్సింగ్‌గా…

“బావ…” పళ్ళు బిగిస్తూ అంది కోపంగా చూస్తూ…

“పెళ్లి చేసుకోవడానికి కాదు లే… ఏదో వాళ్ల తృప్తి కోసం ఒకసారి మాట్లాడి చూడు… నచ్చకపోతే నచ్చలేదు అని చెప్దాం… మనకి అలవాటేగా...” వెటకారంగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు…

“హా అంతే నాన్న… మీరు పిలవండి తర్వాత చూద్దాం…” ఏం ఉంది లే అన్నట్టు ఒక చిలిపి సైగ చేసి ప్లేట్‌లో దోస వేసి వెళ్లిపోయింది సంజన…

‘వీళ్ళు ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు’ అనుకుంది శృతి కానీ ఏం అనలేదు…

‘సరేలే ఎప్పటిలా నో చెప్పేద్దాం లే…’ అనుకుని

“మీ ఇష్టం లే” అంది…

‘ఈసారి ఎవడు వస్తాడో…’ అనుకుంది…

చంటిపిల్లాడికి చాక్లెట్ దొరికినట్టు
లేచి ఫోన్‌లో నంబర్లు నొక్కుతూ బయటకు వెళ్లారు నాన్న…

“వాళ్లు ఇవాళ సాయంత్రమే వస్తున్నారంట…” ఫోన్ మాట్లాడి వస్తూ అన్నారు…

“అదేంటి అండి… ఇప్పటికిప్పుడా…” ఆశ్చర్యం, కంగారు కలిపి అడిగింది…

“రేపటి నుంచి ముహూర్తాలు బాగాలేవంట… పైగా అబ్బాయి మళ్లీ బెంగళూరు వెళ్లిపోతాడంట… అందుకే ఇవాళే వస్తాం అన్నారు… ఏం ఉంది లే ఏదో సింపుల్‌గా చేద్దాం...” మాట్లాడుకుంటున్నారు అంతా…

‘పోనీలే లాగ్ లేకుండా తేలిపోతుంది…’ అనుకుంటుంది శృతి…

‘ఇంటి నిండా జనం… మరో పక్క పిల్లల గోల…’

“శృతి… ఈ ఒక్కసారికి నో చెప్పే ముందు ఆలోచించు… ఆ అబ్బాయి గురించి తెలుసుకోవడానికి ట్రై చెయ్… తర్వాత నో చెప్పు...” రూమ్‌లో రెడీ అవుతున్న శృతికి వచ్చి చెప్పాడు బావ…

‘10 నిమిషాల పెళ్లిచూపుల్లో మహా అయితే
వాడి హైట్, వెయిట్ కూడా తెలియదు...’ అనుకుంటుంది లోపల…

“మీ బావ చెప్పింది అర్థమైందా?...” అడిగింది సంజన…

“తెలుసుకోవడానికి ఎలా ట్రై చేయాలి అక్క…”

“మాట్లాడి…”

“అడిగితే తెలిసేది వాడి క్రియేటివిటీనే… కానీ రియాలిటీ కాదు...” కమ్మలు పెట్టుకుంటూ చెప్పింది…

“సరే… వాడి గురించి తెలీదు…”

“కనీసం వాడు నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడేమో చూడు… అంత కంటే ఇంపార్టెంట్ క్వాలిటీ ఇంకోటి ఉండదు మగాళ్లలో...” తలలో పూలు పెడుతూ చెప్పింది…

‘అర్థం చేసుకోవడమా… నాకు నేనే అర్థం కాను… వాడికి ఏం అర్థం అవుతా’ అనుకుంది…

చిన్నగా నవ్వుకుని లేచి వెళ్లింది…

***

“మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా…” అడిగాడు ఇంట్రెస్టింగ్‌గా కాసేపు మెడ పైన మాట్లాడుకుని రండి అని పంపినప్పుడు మౌనంగా కూర్చున్న శృతి వచ్చిన పెళ్లికొడుకు వికాస్…

‘వీడికి ఎలా తెలుసు’ అనుకుంది మనసులో…

“అవును… ఇష్టం లేదు…” కాస్త మొహమాటంగా చెప్పింది… పక్కకి చూస్తూ…

“It’s ok… మీరే నాకు నచ్చలేదు అని ఇంట్లో చెప్పేస్తాలే… don’t worry…” కుర్చీలోంచి లేస్తూ అన్నాడు…

“హలో!...” వెళ్తున్నవాడిని పిలిచింది…

“మీ హెల్ప్ కావాలి అని నేను అడగలేదే…” కాస్త చిరాకుగా అంది…

“అడగలేదు కానీ…”

“చాలా మంది అమ్మాయిలు ఇంట్లో నో చెప్పడానికి భయపడతారు కదా… అందుకే అలా అన్నా…”

“మీరు ఫీల్ అయి ఉంటే సారీ…” అన్నాడు క్యూట్‌గా…

“హ్మ్… నేను ఏం నో చెప్పడానికి భయపడను…” కాస్త పొగరుగా నే చెప్పింది…

“ముందే నో అంటే ఏం తెలుసు అని నో అంటున్నావ్ అని వాదిస్తారు… ఒకసారి కలిసి నో అంటే… కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది అని…”

“మరి ఏం తెలియకుండానే నో అని ఎలా డిసైడ్ అయ్యారు…” కళ్ళు ఎగరేసి అడిగాడు…

హే… అన్నట్టు చూసింది…

“ముందు తెలుసుకుని అప్పుడు చెప్పండి…” అన్నాడు వెటకారంగా…

“ఏం తెలుసుకోవాలి…”

“మీరు పెళ్లి ఎందుకు వద్దు అనుకుంటున్నారో నాకు తెలీదు కానీ… నా గురించి అబద్ధాలు చెప్పి పెళ్లి వద్దు అంటే మాత్రం నేను ఒప్పుకోను చెప్తున్నా…” ఖచ్చితంగా చెప్పేశాడు…

‘ఆలోచనలో పడింది’

“అంత ఆలోచించడానికి ఏం ఉంది అండి… let’s know each other first, then decide yes or no...”


“నేను చాలా ప్రాక్టికల్ పర్సన్‌ని… అస్సంప్షన్స్‌తో, కన్ఫ్యూజన్స్‌తో కన్‌క్లూజన్‌కి రాలేను… మీరు ఎందుకు ఇష్టం లేదో రీజన్ చెప్పండి… I’ll think…”

“నాకు బంధాలుపైన నమ్మకం లేదు… పెళ్లి అనే కాన్సెప్టే ఇష్టం లేదు…” అటూ ఇటూ చూస్తూ చేతులు కట్టుకుని చెప్తుంది…

“Interesting… but relations ఏ ఇద్దరి మధ్య ఒకేలా ఉండవు… and relations stand on people not concept of love,
marriage, friendship…” అన్నాడు…

‘ఏంటి వీడు తేడాగా ఉన్నాడు’ అనుకుంటుంది…

“అయితే ఇప్పుడు ఏం అంటారు…”

“నా గురించి నువ్వు… నీ గురించి నేను… తెలుసుకుందాం… నచ్చితే పెళ్లి లేదా జస్ట్ మంచి ఫ్రెండ్స్‌గా ఉండిపోదాం…”

‘ఏంటి ఇలా అంటున్నాడు… అసలు వీడి ఉద్దేశ్యం ఏంటి..’

“బాబాయ్… కింద పిలుస్తున్నారు…” అంటూ వచ్చాడు వాళ్ల అన్న కొడుకు…

“ఓకే… జస్ట్ వన్ థింగ్, maybe I’m not that bad in relations… you can try observing…” పిల్లాడిని ఎత్తుకుని కిందకి వెళ్తూ చెప్పాడు…

***

‘I’m not that bad in relations’ పదే పదే అదే మాట తిరుగుతుంది బుర్రలో శృతికి…

“ఏంటి శృతి… అలా అటూ ఇటూ తిరుగుతున్నావ్… ఏం రీజన్‌తో రిజెక్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నావా…” అంది మెడ పైకి వస్తూ సంజన…

“లేదు అక్క… వాడు ఏంటో నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసేశాడు…” అంటూ సంజన భుజం పై వాలి తనని హత్తుకుంది పక్క నుంచి…

“Maybe నువ్వు చూడని ఆ రెండో మేల్ వెర్షన్ వీడే ఆ ఏమో…”

“ఛాన్స్ వచ్చింది అని కన్విన్స్ చేసేయకు…”

“అసలు ఏమైందే…”

“వాడు చాలా ప్రాక్టికల్ అంట… ప్రాపర్ రీజన్ లేకుండా వాడిని రిజెక్ట్ చేయకూడదంట…”

“Know me first, then reject అంటున్నాడు…”

“అదే గా మేము చెప్పింది కూడా…”

‘మీకేం ఉంది ఏదైనా చెప్తారు…’ అనుకుంటుంది కన్నీటిని దాచేస్తూ…

“శృతి…”

“మొండితనంతో రాంగ్ డెసిషన్స్ తీసుకోకు… ఇప్పటివరకు ఏ అబ్బాయి నిన్ను అర్థం చేసుకోలేదు… ఫస్ట్ టైమ్ ఒకడు ట్రై చేస్తున్నాడుగా… let him…”


“ఆలోచించుకో… ఇంకా నీ ఇష్టం…”


పక్కకి తిరిగి… కింది పెదవిని లోపలినుంచి
కొరుకుతూ నీళ్లు నములుతుంది…

‘సరేలే… వాడి గురించి తెలుసుకునే నో చెప్తా… ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మైనస్ ఉంటుందిగా… వెతికి పట్టుకుంటా’ అనుకుంది…

“సరే అక్క… ఆలోచిస్తాలే...” అనేసి కిందకి వెళ్లిపోయారు…

*****

శృతి వికాస్ ఏ కారణంతో రిజెక్ట్ చేస్తుంది అంటారు???