అలా ఆర్య అలాగే విష్ణు అలాగే కిరణ్ వాళ్ళ అన్న రంగ మహా స్మశాన వాటిక కి వెళుతారు. అక్కడ సమాధి కోసం గుంతలు తవ్వే వారిని రంగా పిలుస్తాడు. అందులో ఒక సారి పేరు నాయక్
తరువాత రంగ కి అలాగే నాయక్ కి మధ్య సంభాషణ జరుగుతుంది.
( రంగ ) : చూడు బాబు ఇక్కడ ఉన్న సమాధిని తోవ్వాలి.
అని రంగ నాయక్ ని అడుగుతాడు.
( నాయక్ ) : తవ్వుదాం సార్ కానీ ఎందుకు తోవ్వాలి సార్ ఈ సమాధి చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంది. ఇప్పుడు హఠాత్తుగా మీరు ఏమో ఈ సమాధిని తవ్వు అంటున్నారు. ఎందుకు సార్ అని నాయక్ రంగ ని అడుగుతాడు.
( రంగ ) : ఇవన్నీ నీకు అనవసరం. ఈ సమాధి మా తమ్ముడు దే. మాకు కొంచెం అత్యవసరం వలన ఈ సమాధిని తొవ్వని అంటున్నాం. నేను చెప్పింది మాత్రమే చెయ్. నీకు ఇంత డబ్బుగా ఉన్న అంత డబ్బు ఇస్తాం.
అని రంగ నాయక్ తో చెప్పుతాడు.
రంగా ఎంత చెప్పినా నాయక్ వినడు.
దాని తో ఆర్య కి కోపం వస్తుంది.
( ఆర్య ) : రేయ్ ఎవరా నువ్వు చెప్పిన పని చేయకుండా ఎదురు సమాధానం అడుగుతున్నావ్. నేను ఎవరో నీకు ఇంతకీ తెలుసు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ( sp ) రా నేను ఇది నా id కార్డు అని నా పేరు ఆర్య రా
అని ఆర్య నాయక్ మీద చాలా కోపోపాడుతాడు.
అప్పుడు నాయక్ చాలా భయపడతాడు.
( నాయక్ ) : సార్ నన్ను క్షమించండి. అంటే ఎవరో తెలియదు కదా నాకు హఠాత్తుగా వచ్చి సమాధిని తొవ్వు అనేకల నాకు కొంచెం అనుమానం వచ్చింది. దానితో నేను మీతో ఇలా మాట్లాడాల్సి వచ్చింది. న నన్ను క్షమించండి సార్
అని నాయక్ఆ ర్య కి చెప్పుతాడు.
( ఆర్య ) : సరే కానీ సారీ ఏమి వద్దులే కానీ ముందు మేం చెప్పిన పని చెయ్. మా రంగా చూపించే సమాధిని తవ్వు తవ్వి శవాన్ని బయటికి తియ్
అని ఆర్య నాయక్ తో చెప్పుతాడు.
అలా నాయక్ అలాగే నాయక్స కి సంబంధించిన వాళ్ళు కిరణ్ శవాన్ని తవ్వి శవాన్ని బయటికి తీస్తారు. శవం చూస్తే కుళ్లిపోయి ఉండదు. ఎందుకంటే కిరణ్ శవాన్ని మంచి బలమైన చెక్కపేట లో పెట్టి కిరణ్ శవాన్ని సమాధి చేసి ఉంటారు.
తర్వాత ఆర్య నాయక్ కి అలాగే నాయక్ కి సంబంధించిన వాళ్ళకి కిరణ్ శవాన్ని తవ్వి బయటకు తీసినందుకు ఆర్య వారికి డబ్బులు ఇస్తాడు.
హలో ఆర్య అలాగే విష్ణు అలాగే రంగ కిరణ్ శవాన్ని ల్యాబ్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ కిరణ్ శవాన్ని విష్ణు పోస్టుమార్టం చేసాడు.
ఇలా ఆర్య కి అలాగే విష్ణు కి మధ్య సంభాషణ జరుగుతుంది.
( విష్ణు ) : చూడు ఆర్య నేను కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేస్తున్న పోస్టుమార్టం చేసిన ఒక గంట కి మన కి ఫలితాలు వస్తాయి.
అని విష్ణు ఆర్య కి చెప్పుతాడు.
( ఆర్య ) : అలాగే సార్ చెయ్యండి. కొంచెం నిదానమైన పర్వాలేదు సార్. బాగా పరిశీలించి చూడండి సార్. కిరణ్ ది ఆత్మహత్య నా లేదంటే హత్య నా అలాగే హత్య అయితే విజయవాడ లో రాజేష్ ని చంపిన వాడే మన కిరణ్ ని కూడా వాడే చంపెడా లేదా అని బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఫలితాలు నాకు చెప్పండి సార్
అని ఆర్య విష్ణు తో అంటాడు.
( విష్ణు ) : సరే అలాగే ఆర్య అని విష్ణు చెప్పి కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేసే పనులు మొదలుపెడతాడు.
అలా తరువాత కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేయడం అయిపోతుంది.
తర్వాత విష్ణు ఆర్య అని పిలుస్తాడు.
అలా ఆర్య కి అలాగే విష్ణు కి మధ్య సంభాషణ జరుగుతుంది.
( ఆర్య ) : చెప్పండి విష్ణు సార్ పిలిచారు.
అని ఆర్య విష్ణు ని అడుగుతాడు.
( విష్ణు ) : ఏం లేదు ఆర్య కిరణ్ శవాన్ని పోస్టుమార్టం చేయడం అయిపోయింది. ఫలితాలు రావడాని కి గంట నుండి మూడు గంటల సమయం పట్టొచ్చు. అంతలోపు మనం ఏమైనా తిని వద్దాం నాకు ఆకలిగా ఉంది.
అని విష్ణు ఆర్య అని అడుగుతాడు.
( ఆర్య ) : అలాగే సార్ వెళ్దాం పదండి. ఇక్కడ జైల్ ఫుడ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ఈ జైలు ఫుడ్ రెస్టారెంట్ మా హైదరాబాద్ లోనే చాలా ఫేమస్ సర్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సార్
అని ఆర్య విష్ణుతో అంటాడు.
( విష్ణు ) : సరే ఆర్య వెళదాం పదండి.
అని విష్ణు ఆర్య తో అంటాడు.
అలా రంగ అలాగే విష్ణు అలాగే ఆర్య ముగ్గురు కలిసి హైదరాబాద్ లో ఉన్న శ్రీనివాస్ నగర్ లో ఉన్న జైలు ఫుడ్ రెస్టారెంట్ కి వెళతారు. ఆర్య వెజ్ కావడం తో ఆర్య పన్నీరు రైస్ తింటాడు. అలాగే పుట్టగొడుగుల కూర అలాగే వెజిటేబుల్ రైస్ ఆర్య తింటాడు.
అలాగే విష్ణు నాన్ వెజ్ కావడం తో విష్ణు చికెన్ దమ్ బిర్యాని అలాగే చికెన్ లాలీఫఫ్ లు అలాగే చికెన్ 65 అలాగే చికెన్ వింగ్స్ అలాగే చేప పకోడా అలాగే చేప ఫ్రై విష్ణు కడుపు నిండా తింటాడు.
అలాగే రంగా కూడా నాన్ వెజ్ కావడం తో రంగా చికెన్ దమ్ బిర్యాని అలాగే రొయ్యల వేపుడు అలాగే రొయ్యల ఫ్రై అలాగే మటన్ కర్రీ అలాగే కంజు ఫ్రై అలాగే చికెన్ ఖైమలు రంగా కడుపు నిండా తింటాడు.
లాస్ట్ కి ముగ్గురు కలిసి కోకా కోల కూలింగ్ కూల్ డ్రింక్ తాగుతారు. ముగ్గురు కలిసి ఒక అరగంట జైల్ ఫుడ్ రెస్టారెంట్ లోనే విశ్రాంతి తీసుకుంటారు.
ముగ్గురు కలిసి విశ్రాంతి తీసుకున్న తరువాత
అలా లాస్ట్ కి ఆర్య బిల్ కట్టడానికి వెళ్తాడు. బిల్లు మొత్తం 4000 రూపాయలు అయ్యి ఉంటుంది.
అలా ఆర్య మొత్తం బిల్లు ని రెస్టారెంట్లు లో కడతాడు.
అలా తరువాత మళ్ళీ ముగ్గురు కలిసి ల్యాబ్ కి వెళ్తారు.
కిరణ్ శవం ది ఫలితాలు రావడానికి ఇంకో అరగంట సమయం పడుతుంది.
దానితో మళ్ళీ ముగ్గురు కలిసి బయట టీ తాగడాని కి వెళతారు.
అలా ముగ్గురు కలిసి టీ తాగిన తర్వాత ఈసారి విష్ణు ముగ్గురు తాగిన టీ బిల్లు ని కడుగుతాడు.
అలా ముగ్గురు కలిసి మళ్లీ ల్యాబ్ కి వెళ్ళిపోతారు.
ఇంత లో కిరణ్ శవం ఫలితాలు వచ్చి ఉంటాయి.
విష్ణు కిరణ్ శవం ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించాక విష్ణు కి ఒకటి అర్థం అవుతుంది. కిరణ్ ది ఆత్మహత్య కాదు. కిరణ్ ది హత్య అని విష్ణు కి అర్థం అవుతుంది.
దీంతో విష్ణు ఆర్య ని పిలుస్తాడు.
ఇలా ఆర్య కి అలాగే విష్ణు కి మధ్య సంభాషణ జరుగుతుంది.
( విష్ణు ) : చూడండి ఆర్య నేను చెప్పింది. వింటే మీరు కొంచెం ఆశ్చర్య పోవచ్చు. కానీ నేను చెప్పింది మాత్రం నూటి కి నూరు శాతం నిజం ఆర్య
అని విష్ణు ఆర్య తో అంటాడు.
( ఆర్య ) : సరే సార్ అది ఏంటో చెప్పండి. సార్
అని ఆర్య విష్ణు ని అడుగుతాడు.
( విష్ణు ) : అంటే ఆర్య అది మీరు అనుమాన పడింది. నిజమే కిరణ్ ది ఆత్మహత్య కాదు. కిరణ్ ది హత్య విజయవాడ లో రాజేష్ ని ఎలా అయితే unknown numbers నుండి కాల్ చేసి మొబైల్ రేడియేషన్ సౌండ్ విపరీతం గా పెంచి రాజేష్ ని ఎలా అయితే చంపారో కిరణ్ కూడా ఇలాగే unknown Numbers నుండి కాల్స్ చేసి మొబైల్ రేడియేషన్ సౌండ్ ని విపరీతం గా పెంచి కిరణ్ ని పక్క ప్లాన్ తో హత్య చేసి చంపేశారు.
అని విష్ణు ఆర్య తో అంటాడు.
ఈ విషయం వినగానే ఆర్య చాలా షాక్ అవుతాడు.
( ఆర్య ) : అవునా విష్ణు గారు అంటే విజయవాడ లోని రాజేష్ ని చంపిన వాడే మన కిరణ్ ని కూడా చంపాడా సార్ అంటే రాజేష్ చావు వెనుక అలాగే కిరణ్ చావు వెనుక ఉన్నది ఒకడేనా సార్
అని ఆర్య విష్ణు ని అడుగుతాడు.
( విష్ణు ) : నూటికి నూరు శాతం నిజం విజయవాడ లోని రాజేష్ ని చంపిన వాడే కిరణ్ కూడా హత్య చేసి చంపాడు.
అని విష్ణు ఆర్య తో అంటాడు.
ఈ మాట విన్న రంగా అయితే చాలా షాక్ అవుతాడు.
ఇలా ఈ విధంగా ఆర్య కి అలాగే రంగా కి మధ్య సంభాషణ జరుగుతుంది.
( రంగ ) : రేయ్ ఆర్య ఇంతకీ మా తమ్ముని చంపాల్సినా అవసరం ఎవరికి వచ్చింది రా. ఆర్య మా తమ్ముడు చాలా మంచోడు రా. ఆర్య అలాంటిది. వాడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది రా . మా తమ్ముని చంపి తే వాడికి ఇంతకీ ఏం వస్తుంది రా.
అని రంగ ఆర్య ని అడుగుతాడు.
( ఆర్య ) : చూడు రా రంగ కిరణ్ ని చంపి తే వాడికి ఏం వస్తుందో నాకు కూడా తెలియదు రా. కానీ నేను నీకు ఉన్నారా వాడు కిరణ్ ని ఎందుకు చంపాడు అని నేను తెలుసుకుంటాను రా. వాడు నా చేతిలో అసలు తప్పించుకోలేడు. రా నువ్వు ముందు దీని గురించి ఎక్కువ గా ఆలోచించి మనసు పాడు చేసుకోకు రా ఎలాగైనా వాడు కిరణ్ ని అలాగే విజయవాడ లో రాజేష్ ని కూడా ఎందుకు చంపాడు. అని నేను తెలుసుకుంటాను రా. నువ్వు ఏం భయపడకు అలాగే నువ్వు బాధపడకు రా నేను కచ్చితం గా వాడు ఇలా unknown numbers నుండి కాల్స్ చేసి మొబైల్ రేడియేషన్ సౌండ్ ని పెంచి అమాయక ప్రజలను ఎందుకు చంపుతున్నాడు. అని నేను కచ్చితంగా కనుక్కుంటాను రా.
( రంగ ) : కనుకో రా అసలు మా తమ్ముడు చాలా మంచి వాడు రా వాడు నిజం గా చెప్పాలంటే వాడు చిమ్మ కి కూడా వాడు హాని కలిగించాడు. రా అలాంటి వాడిని వాడు ఎందుకు చంపేడు. రా
అని రంగ ఆర్య కి చెప్పుతూ చాలా బాధ పడుతాడు.
( ఆర్య ) : చూడు రా రంగ నువ్వు ముందు బాధపడకు రా రంగ నీకు నేను ఉన్నాను రా రంగ వాడికి నా గురించి పూర్తి గా తెలియదు.రా రంగ
వాడు పద్మవ్యూహం వేస్తె నేను ఆ పద్మవ్యూహం లో చిక్కుకు పోయి బయటికి రాలేక అక్కడే చనిపోయిన అభిమన్యుడు అని వాడు నన్ను అనుకున్నాడు. రా కానీ వాడికి తెలియనిది. ఏమిటంటే నేను వాడు వేసిన పద్మవ్యూహం లో చిక్కుకు పోయే అభిమన్యుడు ని కాదు. రా నేను ఆ పద్మవ్యూహం ని చేదించా గలిగే అర్జునుడు ని రా. నాకు పద్మవ్యూహం వెయ్యడం తెలుసు అలాగే ఆ పద్మవ్యూహం ని చెడించడం తెలుసు అలాగే ఆ పద్మవ్యూహం ని సవరించడం తెలుసు అలాగే ఆ పద్మవ్యూహం ని ఖండించడం కుడా తెలుసు రా త్వరలో వాడు వేసిన పద్మవ్యూహం ని నేను ఖండిస్తాను. త్వరలో వాడు వేసిన పద్మవ్యూహం ని ఖండించిన మాత్రం ఖాయం.
అని ఆర్య రంగ తో అంటాడు.
( రంగ ) : సరే రా ఆర్య నాకు నువ్వు ఉన్నావు అనే దైర్యం ఉంది. రా ఆర్య మా తమ్ముడి కి ఎలా అయినా నువ్వే నాయ్యం చేసేలా జరిగేలా చూడు రా
అని రంగ ఆర్య తో అంటాడు.
( ఆర్య ) : నేను ఇప్పుడే నీకు చెప్పెను కదా రా నేను ఉన్నాను. నేను చూసుకుంటాను. అని నువ్వు ఎక్కువ గా దీని గురించి ఆలోచించకుండా దీని గురించి నాకు వదిలేసేయ్ రా నేను కొంచెం పని మీద విజయవాడ కి వెళుతున్నాను. నేను విజయవాడ కి వెళ్లి వచ్చాక నిన్ను కలిసి నీతో మాట్లాడుతాను.నువ్వు అయితే ఎక్కువ గా ఈ విషయం గురించి ఆలోచించకుండా నువ్వు దైర్యం గా ఉండు రా అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విషయం గురించి చెప్పకు రా
అని ఆర్య రంగ కి చెప్పుతాడు.
( రంగ ) : సరే రా జాగ్రత్త గా వెళ్లి రా రా నువ్వు విజయవాడ కి వెళ్లి వచ్చాక మనం మళ్ళీ కలుదాం రా
అని రంగ ఆర్య కి చెప్పుతాడు.
అలా ఆర్య సరే అని ఆర్య విష్ణు ని విజయవాడ లో డ్రాప్ చెయ్యడాని కి ఆర్య కార్ లో ఆర్య అలాగే విష్ణు ఇద్దరు కలిసి విజయవాడ కి వెళ్లుతారు.
ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 13 ముగిసింది.
డార్క్ నెట్ ఎపిసోడ్ 14 ఉంది.
ఆర్య విష్ణు ని విజయవాడ లో డ్రాప్ చెయ్యడానికి ఆర్య విజయవాడ కి వెళుతున్నాడు. కానీ ఆర్య కి విజయవాడ లో ముఖ్యమైన పని ఉంది.
ఆర్య కి విజయవాడ లో ఉన్న ముఖ్యమైన పని ఏమిటో అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే డార్క్ ఎపిసోడ్ 14 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.
కొనసాగుతుంది.